పాక్ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డాడు. గతంలో విరాట్ కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేసి ట్రోలింగ్ బారిన పడిన తన్వీర్.. ఇప్పుడు సీనియర్ క్రికెటర్లపై కామెంట్స్ చేసి నెటిజన్ల కోపానికి కారకుడయ్యాడు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో పనిచేసేందుకు మాజీ ఆటగాళ్లుకు అవకాశం లభించడం లేదని.. కనీసం అక్కడ టాయ్ లెట్లు శుభ్రం చేసే పనిలో చేరడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు అంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు. అయితే.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

కాగా.. తన్వీర్ కామెంట్స్ పై అభిమానులు మండిపడుతున్నారు. తన్వీర్ కి పిచ్చి పట్టిందని.. పెద్దవారంటే కనీసం గౌరవం కూడా లేదని అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలాఉండగా.. పాక్‌ మాజీ కెప్టెన్‌, పీసీబీ చీఫ్‌ సెలెక్టర్‌ ఇంజమాముల్‌ హక్‌పై కూడా తన్వీర్‌ కామెంట్‌ చేసి వార్తల్లో నిలిచాడు. ఇంజమామ్‌ తన బంధువులకు, అయినవాళ్లకు జాతీయ జట్టులో చోటు కల్పించి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు పీసీబీలో దుమారం రేపాయి.