పాకిస్థాన్ సూపర్ లీగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ ఇషాన్ మణి తాజాగా ప్రకటించారు. ఈ సూపర్ లీగ్ లో స్టార్ క్రికెటర్లు ఆడబోతున్నారని ఆయన వివరించారు. వచ్చే నెల ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 17 వరకు ఈ సూపర్ లీగ్ జరగనుంది. 

ఈ సూపర్ లీగ్ లో మొదటి దశ మ్యాచ్ లు అబుదాబీ, షార్జా, దుబాయిలో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. కీలక మ్యాచ్ లను మాత్రం పాకిస్థాన్ లోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  కరాచీ లోని మైదానం 5 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. లాహోర్ మూడు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ సూపర్ లీగ్ లో 6 పీఎస్ఎల్ ఫ్రాంఛైజీలు ఉండనున్నారు. వీరు స్టార్ క్రికెటర్స్ ని ఎంచుకోనున్నారు. గతంలో చాలా మంది క్రికెటర్లు పాకిస్థాన్ లో మ్యాచ్ ఆడేందుకు అనాసక్తి చూపించేవారు. కాగా.. ఇప్పుడు వారి ఆలోచన మారిందని  ఇషాన్ మణి తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలయర్స్ కూడా ఈ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడనున్నారు.