Asianet News TeluguAsianet News Telugu

చరిత్రలో తొలిసారి: రోహిత్ శర్మ సహా 5గురికి ఖేల్ రత్న

రోహిత్‌ శర్మతో పాటు టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ మనిక బత్రా, 2016 పారాలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మరియప్పన్‌ తంగవేలు, రెజ్లర్ వినీష్ ఫోగట్, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ లు సైతం ఖేల్‌రత్న అందుకోనున్నారు.ఇలా ఒకేసారి  ఐదుగురికి ఖేల్రత్న అవార్డు అందించడం ఇదే తొలిసారి. 

For The First Time: Rohit, Vinesh, Rampal among five Khel Ratna awardees
Author
New Delhi, First Published Aug 19, 2020, 7:21 AM IST

వైట్‌ బాల్‌ క్రికెట్‌ సూపర్‌ హీరో, భారత వన్డే, టీ20 జట్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోనున్నాడు. 2019 ఏడాదిలో కండ్లుచెదిరే ప్రదర్శన చేసిన రోహిత్‌ శర్మ రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం దక్కించుకోనున్నాడు. 

భారత క్రికెట్‌ జట్టు మాజీ వైస్‌ కెప్టెన్‌ వీరెందర్‌ సెహ్వాగ్‌, హాకీ ఇండియా మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌లతో కూడిన క్రీడా అవార్డుల కమిటీ మంగళవారం స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా భవనంలో సమావేశమైంది. సచిన్‌ టెండూల్కర్‌, ఎం.ఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లిల తర్వాత రాజీగ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు అందుకోనున్న నాల్గో క్రికెటర్‌గా నిలువనున్నాడు రోహిత్. 

రోహిత్‌ శర్మతో పాటు టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ మనిక బత్రా, 2016 పారాలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మరియప్పన్‌ తంగవేలు, రెజ్లర్ వినీష్ ఫోగట్, మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ లు సైతం ఖేల్‌రత్న అందుకోనున్నారు.ఇలా ఒకేసారి  ఐదుగురికి ఖేల్రత్న అవార్డు అందించడం ఇదే తొలిసారి. 

2006 వరకు ఒక సారి కేవలం అత్యధికంగా 2006 లో ఇద్దరికి ఈ అవార్డును అందిస్తే... 2016 ఒలింపిక్స్ తరువాత పీవీ సింధు, సాక్షి మాలిక్, దీప కర్మాకర్, జీతూ రాయి లకు అందించారు. నలుగురికి ఒకేసారి అందించడమే రికార్డు. ఈ సారి ఏకంగా ఐదుగురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.  

ఈ మేరకు అవార్డుల కమిటీ క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. 29 మంది అథ్లెట్లను అర్జున అవార్డుకు సిఫారు చేశారు. 2019 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ ఐదు సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేశాడు. 

2019లోనే ఓపెనర్‌గా అరంగ్రేటం చేసిన రోహిత్‌ శర్మ 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. వన్డేల్లో 57.30 సగటుతో 1490 పరుగులు కొట్టాడు. వన్డేల్లో మూడు ద్వి శతకాలు సాధించిన రోహిత్‌ శర్మ అనితర సాధ్య రికార్డును నెలకొల్పాడు. ' ఎంతో డేటా, ఎన్నో కొలమానాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుల నామినీలను ఎంపిక చేశారు. 

బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ నూతన ప్రమాణాలను నెలకొల్పాడని, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అసాధ్యమనుకున్న ఇన్నింగ్స్‌లను రోహిత్‌ అలవోకగా బాదేశాడని, రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న పురస్కారం అందుకోవడానికి రోహిత్‌ శర్మ అర్హుడని తాము భావించామని,. ప్రవర్తన, నిలకడ, నాయకత్వ లక్షణాలతో రోహిత్‌ శర్మ నిబద్ధతను చాటుకున్నాడని గతంలో అవార్డుల కమిటీకి నామినేట్‌ చేస్తూ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నాడు. 

ఇషాంత్‌ శర్మకు అర్జున అవార్డు 

భారత సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అర్జున అవార్డుకు సిఫారసు చేయబడ్డాడు. అవార్డుల కమిటీ 29 మందితో కూడిన జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. 31 ఏండ్ల ఇషాంత్‌ శర్మ 97 టెస్టులు, 80 వన్డేల్లో 400 పైచిలుకు వికెట్లు పడగొట్టాడు. 

రికర్వ్‌ ఆర్చర్‌ అటాను దాస్‌, మహిళల హాకీ క్రీడాకారిణి దీపిక ఠాకూర్‌, కబడ్డీ ప్లేయర్‌ దీపక్‌ హుడా, టెన్నిస్‌ ప్లేయర్‌ దివిజ్‌ శరణ్‌లు సైతం అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. స్టార్‌ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ మీరాబాయి చానులను సైతం అర్జున అవార్డుకు సిఫారసు చేశారు. కానీ ఈ ఇద్దరూ గతంలో ఖేల్‌రత్న అందుకున్నారు. దీంతో వీరికి అర్జున అవార్డులను అందించటంపై క్రీడా మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios