Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli : విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఖరీదు తెలిస్తే... మైండ్ బ్లాకే...

విరాట్ కోహ్లి...తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఈ నీళ్లు హైడ్రేటెడ్ గా ఉండడమే కాకుండా... పీహెచ్ అధికంగా ఉంటుంది. సాధారణంగా మనం తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు.. రూ.20 నుంచి ఆపై మరికాస్త ఖరీదు ఉండొచ్చు. మహా అయితే 100, 200 అంతకంటే ఎక్కువ పెట్టరు.

fitness freak virat kohli drinks black water and its price is 4000 per litre
Author
Hyderabad, First Published Aug 23, 2021, 9:05 AM IST

ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. కోహ్లి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే తన ఫిట్ నెస్ మీద బాగా శ్రద్ధ చూపెడుతుంటారు. ఆయన చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో తన అభామానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు కూడా.  ఇక తన ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విరాట్ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.

విరాట్ కోహ్లి...తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఈ నీళ్లు హైడ్రేటెడ్ గా ఉండడమే కాకుండా... పీహెచ్ అధికంగా ఉంటుంది. సాధారణంగా మనం తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు.. రూ.20 నుంచి ఆపై మరికాస్త ఖరీదు ఉండొచ్చు. మహా అయితే 100, 200 అంతకంటే ఎక్కువ పెట్టరు.

అయితే ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు రూ.3000నుంచి రూ.4000వరకు ఉంటుంది.  ఈ నీళ్లలో సహజసిద్ధమైన బ్లాక్ ఆల్కలన్ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది. బ్లాక్ వాటర్ లో పీహెచ్ (pH) ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ వాటర్ చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, బరువును కూడా అదుపులో ఉంచుతుంది. 

కరోనా నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా, మలైకా అరోరా, శ్రుతిహాసన్ ఫిట్ గా ఉండేందుకు బ్లాక్ వాటర్ తాగుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios