ఫిఫా వరల్డ్ కప్ 2022: ఫ్రాన్స్‌కి షాక్ ఇచ్చిన కరీం బెంజెమా... గాయంతో వరల్డ్ కప్ నుంచి అవుట్...

ప్రాక్టీస్ సెషన్స్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కరీం బెంజెమా ఎడమ కాలికి గాయం... ఫిఫా వరల్డ్ కప్ 2022 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కరీం బెంజెమా...

FIFA World cup: Big shock for France, Karim Benzema ruled out due to injury

ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభానికి ముందు ఫ్రాన్స్‌కి ఊహించని షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ కరీం బెంజెమా గాయంతో ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దోహాలో ఫిఫా వరల్డ్ కప్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్న కరీం బెంజెమా ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. దీంతో అతను వరల్డ్ కప్‌లో పాల్గొనడం లేదని ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరెషన్ తెలియచేసింది.  

2021 ఏడాదికి గానూ యూఈఎఫ్‌ఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన కరీం బెంజెమా, 2022లో ‘బెస్ట్ ప్లేయర్’ (బెలూన్ డీ‌ఓర్) అవార్డు దక్కించుకున్నాడు. 34 ఏళ్ల 302 రోజుల వయసులో బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్న బెంజీమా, అతి పెద్ద వయసులో ఈ అవార్డు పొందిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు...

ఆల్‌ టైం బెస్ట్ స్ట్రైయికర్స్‌లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న కరీం బెంజెమా, ఇప్పటిదాకా 23 ఫుట్‌బాల్ టైటిల్స్ గెలిచాడు. రియల్ మాడ్రిడ్‌ క్లబ్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన రెండో ప్లేయర్‌గా ఉన్నాడు బెంజెమా. తన కెరీర్‌లో 324 గోల్స్ సాధించిన కరీం బెంజెమా లేకపోవడం, ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది...

‘కరీం బెంజెమా గాయపడడం నిజంగా చాలా నిరుత్సాహపరిచే విషయం. అతను లేకపోవడం మాకు లోటే. అయితే బెంజెమా లేకపోయినా వరల్డ్ కప్ గెలిచే సత్తా మాకు ఉంది. ముందున్న ఛాలెంజ్‌లను ఫేస్ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’ అంటూ కామెంట్ చేశాడు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్ డిడియర్ డెస్చాంప్స్...

‘నేను ఎప్పుడూ దేనికీ కృంగిపోలేదు, అయితే ఈ రాత్రి నా ఆలోచనంతా టీమ్ గురించే... నా దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. వరల్డ్ కప్ గెలవడానికి ఉపయోగపడే ఎవ్వరికైనా నా ప్లేస్ ఇవ్వండి... నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు...’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు కరీం బెంజెమా...

2014 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఫ్రాన్స్ తరుపున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు కరీం బెంజెమా. రష్యాలో జరిగిన 2018 ఫిఫా వరల్డ్ కప్ టైటిల్‌ని ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో క్రోటారియాని 4-2 తేడాతో ఓడించి రెండో టైటిల్ గెలిచింది. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో కరీం బెంజెమాకి చోటు దక్కలేదు.

ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్లేయర్ మతియు వాల్బెనాతో కలిసి సెక్స్ టేప్ స్కాండల్‌లో ఇరుక్కున్నాడు కరీం బెంజెమా.  ఈ సమయంలో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌ నోయల్ లె గ్రెట్‌పై జాతి వివక్ష ఆరోపణలు చేశాడు కరీం బెంజెమా... ‘మిస్టర్ లె గ్రేట్.. ఇప్పటికైనా నిశ్శబ్దాన్ని వీడండి. మీ నిజమైన ముఖాన్ని ప్రపంచానికి చూపించండి. అతను నన్ను ఎప్పుడూ మెచ్చకోలేదు, ఇప్పుడు టీమ్ సెలక్షన్ విషయంలోనూ నాతో మాట్లాడింది లేదు...’ అంటూ కామెంట్ చేశాడు కరీం బెంజెమా...


ఈ వివాదం నుంచి బయటపడిన తర్వాత 2021లో యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు కరీం బెంజెమా. ఆ టోర్నీలో ఇచ్చిన ప్రదర్శన కారణంగా ఫిఫా వరల్డ్ కప్‌కి ఎంపికయ్యాడు. 34 ఏళ్ల కరీం బెంజెమాకి ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios