ఫిఫా వరల్డ్ కప్ 2022: మెస్సీ, రొనాల్డో... చివరిసారిగా ప్రపంచ కప్ బరిలోకి దిగుతున్న స్టార్లు వీరే...
ఇప్పటిదాకా ఫిఫా వరల్డ్ కప్ గెలవలేకపోయిన లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో... ఫుట్‌బాల్ దిగ్గజాలకు ఆఖరి అవకాశంగా ఫిఫా వరల్డ్ కప్ 2022...
ఫిఫా వరల్డ్ కప్ 2022 మెగా సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వరల్డ్ కప్, కొందరు ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్లకు ఆఖరిది కానుంది...
ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకి ఆఖరి ప్రపంచకప్ సమరం కానుంది. 37 ఏళ్ల రొనాల్డో, ఇప్పటిదాకా ఐదు సార్లు ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డులు గెలుచుకున్నాడు. అయితే ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేకపోయాడు... నాలుగు వరల్డ్ కప్స్‌లో పాల్గొన్న రొనాల్డో, 17 మ్యాచుల్లో 7 గోల్స్ సాధించాడు...
35 ఏళ్ల లియోనెల్ మెస్సీకి కూడా వరల్డ్ కప్ గెలిచేందుకు ఇదే ఆఖరి ఛాన్స్. రికార్డు స్థాయిలో ఏడుసార్లు ‘బెస్ట్ ప్లేయర్’ అవార్డు గెలిచిన మెస్సీ, ఐదోసారి వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. వరల్డ్ కప్ టోర్నీలో 19 మ్యాచులు ఆడిన మెస్సీ, ఆరు గోల్స్ చేశాడు. వచ్చే ఫిఫా వరల్డ్ కప్ 2026లో జరగనుంది. అప్పటికి మెస్సీ వయసు 39 ఏళ్లు దాటుతుంది. కాబట్టి మెస్సీకి కూడా ఇదే ఆఖరి ఫిఫా వరల్డ్ కప్...
పోలాండ్ ప్లేయర్ రాబర్ట్ లెవాండోవ్స్కీ వయసు 34 ఏళ్లు. మెస్సీ, రొనాల్డో కారణంగా పోలాండ్ దిగ్గజానికి రావాల్సినంత క్రేజ్ రాలేదు. 134 మ్యాచుల్లో 76 గోల్స్ సాధించిన రాబర్ట్ లెవాండోవ్స్కీ... వరల్డ్ కప్‌లో మాత్రం ఇప్పటిదాకా ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. లెవాండోవ్స్కీ కెప్టెన్సీలో 2018 వరల్డ్ కప్ టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచి నిష్కమించింది పోలాండ్...
ఉరుగ్వే ఆల్-టైం హైయెస్ట్ గోల్ స్కోరర్ లూయిస్ సురేజ్‌కి కూడా ఇదే ఆఖరి వరల్డ్ కప్. 35 ఏళ్ల లూయిస్ సురేజ్, ఇప్పటిదాకా 134 గోల్స్ సాధించాడు. నాలుగో వరల్డ్ కప్ ఆడబోతున్న లూయిస్ సురేజ్, 2014 వరల్డ్ కప్ టోర్నీలో ఇటలీ డిఫెండర్ జార్జియో చెలినీని భుజంపై కొరికి నిషేధానికి గురయ్యాడు. పోర్చుగల్, ఉరుగ్వే మధ్య నవంబర్ 28న మ్యాచ్ జరగనుంది...
బ్రెజిల్ అటాకింగ్ ప్లేయర్ డానీ అలివ్స్ వయసు 39 ఏళ్లు. రెండు సార్లు వరల్డ్ కప్స్ ఆడిన డానీ అలివ్స్, ఈ ఏడాది టైటిల్ గెలిచి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రకటించాడు. వీరితో పాటు ఫ్రాన్స్ ప్లేయర్ కరీం బెంజెమా, క్రోకటియా ప్లేయర్ లూకా మార్డిక్, జర్మనీ గోల్ కీపర్ మాన్యూల్ నెవర్, జర్మనీ ప్లేయర్ థామస్ ముల్లర్ కూడా 2022 ఫిఫా వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు...