ఈ విషయంలో అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రవిశాస్త్రి మళ్లీ టీం ఇండియా కోచ్ గా ఎంపికయ్యారన్న విషయాన్ని ఐసీసీ ట్విట్టర్ లో పోస్టు చేయగా... అభిమానులు తమ అసంతృప్తినంతటినీ.. ట్వీట్ల ద్వారా వెళ్లగక్కారు.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియ ముగిసింది. కపిల్‌దేవ్ నేతృత్వంలోని త్రి సభ్య క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రికే తిరిగి పట్టం కట్టింది. 2,021 వరకు అవకాశం ఇచ్చింది. టీమిండియా మేనేజర్, జట్టు డైరెక్టర్, కోచ్‌గా ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.
వరల్డ్ కప్ సమయంలోనే రవిశాస్త్రి కంట్రాక్ట్ ముగిసింది. అయితే ఆ వెంటనే వెస్టిండీస్ పర్యటన ఉండటంతో... ఆయనను ఈ పర్యటన వరకు కోచ్ గా కొనసాగించారు. ఆ సమయంలోనే ప్రధాన కోచ్ కోసం బీసీసీఐ వేట ప్రారంభించింది. నోటిఫికేషన్ విడుదల చేయగా... రవిశాస్త్రి మరోసారి అప్లై చేసుకున్నారు. వచ్చిన అన్ని నోటిఫికేషన్లను పరిశీలించిన కపిల్ దేవ్ కమిటీ... చివరకు మళ్లీ రవిశాస్త్రినే నియమించింది.
అయితే... ఈ విషయంలో అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రవిశాస్త్రి మళ్లీ టీం ఇండియా కోచ్ గా ఎంపికయ్యారన్న విషయాన్ని ఐసీసీ ట్విట్టర్ లో పోస్టు చేయగా... అభిమానులు తమ అసంతృప్తినంతటినీ.. ట్వీట్ల ద్వారా వెళ్లగక్కారు. శాస్త్రి మార్గనిర్దేశంలోనే 2015, 2019 వన్డే ప్రపంచకప్ సెమీసుల్లో జట్టు నిష్ర్కమణపై ఇప్పటికే విమర్శలు ఎదురౌతున్నాయి. అలాంటి సమయంలో మరోసారి ఆయనకు కోచ్ బాధ్యతలు అప్పగించడం అభిమానులకు నచ్చడం లేదు.
కోచ్ గా రవిశాస్త్రి ఉంటే... ఇతర దేశాల జట్టులకు ట్రోఫీలు, టోర్నమెంట్లు గెలిచే అవకాశం ఇచ్చినట్లే అంటూ కొందరు ట్వీట్లు చేయడం గమనార్హం. మరో మూడు, నాలుగు సంవత్సరాల వరకు టీం ఇండియా ఎలాంటి ట్రోఫీ గెలిచే అవకాశం లేదంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 17, 2019, 11:07 AM IST