Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ బెట్టింగ్... ఇండియన్ క్రికెట్ మాజీ కోచ్ అరెస్ట్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలతోపాటు ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఐపీఎల్ అంటే ముందుగా గుర్తొచ్చేది బెట్టింగ్ లే. ఈ రోజు రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోందంటే  జట్టు గెలుపు మీద, ఒక్కో క్రికెటర్ మీద రూ.లక్షలు, రూ. కోట్లల్లో బెట్టింగ్ లు జరుగుతుంటాయి. 

Ex-India women's cricket coach Tushar Arothe arrested in connection with IPL betting
Author
Hyderabad, First Published Apr 3, 2019, 12:35 PM IST


ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలతోపాటు ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఐపీఎల్ అంటే ముందుగా గుర్తొచ్చేది బెట్టింగ్ లే. ఈ రోజు రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోందంటే  జట్టు గెలుపు మీద, ఒక్కో క్రికెటర్ మీద రూ.లక్షలు, రూ. కోట్లల్లో బెట్టింగ్ లు జరుగుతుంటాయి. కాగా ఈ బెట్టింగ్ వ్యవహారంలో భారత మహిళలల క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ అరెస్టు అయ్యారు.

వడోదరలోని ఓ కేఫ్ లో బెట్టింగ్ పాల్పడతున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేయగా.. తుషార్ పట్టుపడ్డారు. ఆయనతోపాటు మరో 19మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల మొబైల్‌ ఫోన్స్‌ ఆధారంగా మరో 19 మంది బెట్టింగ్‌ నిర్వాహకుల సమాచారం కూడా తెలిసినట్లు వివరించారు. మాజీ కోచ్ తుషార్‌ కూడా అక్కడే ఉండడంతో అరెస్ట్ చేసి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్లు వెల్లడించారు. 

బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న స్థలంలో నుంచి 82 సెల్ ఫోన్లు, రూ.54వేల డబ్బు, 4 టీవీలు, 6 ల్యాప్‌టాప్‌లు, వైఫై డాంగిల్, హార్డ్ డిస్క్‌తో పాటు క్యాలిక్యులేటర్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గతంలోనూ జైపూర్‌లో 15 మందితో కూడిన బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

తుషార్ ఆర్ధో 2017లో భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. బెట్టింగ్ ఆరోపణలపై మాజీ కోచ్ తుషార్ స్పందించారు. 'కేవలం 20 నిమిషాల ముందే ఆ కేఫ్‌లోకి వెళ్లాను. ఎలాంటి బెట్టింగ్‌కి పాల్పడలేదు. స్వయంగా నా ఫోన్‌‌ని పరిశీలించిన పోలీసులు ఎలాంటి బెట్టింగ్ యాప్‌‌ని గుర్తించలేదు' అని తెలిపాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios