హార్దిక్ పాండ్యా ట్రెండీ లుక్.. నెటిజన్ల ఫైర్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 18, Aug 2018, 10:44 AM IST
ENGvIND: Went to leave practice, hearty Pandya, Fans listened to falsehood
Highlights

ఇంత హాట్ హాట్ గా ఉన్న సమయంలో పాండ్యా అంత ట్రెండీ ఫోటో దిగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఫోటో పెట్టడం అభిమానులకు నచ్చలేదు. దీంతో.. ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేశారు. 

టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ ప్యాండ్య పై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆయన ట్రెండీ గా రెడీ అయ్యి.. ఫోటోని సోషల్ మీడియాలో పెట్టడమే అందుకు కారణం. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా  హార్దిక్‌ పాండ్య తన ఇన్‌స్టాగ్రాంలో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌తో ఉన్న పాండ్య ఎంతో స్టైల్‌గా కనిపించాడు. ఈ ఫొటోను చూసిన అభిమానులు పాండ్య ఫ్యాషన్‌పై కాదు మ్యాచ్‌పై దృష్టి పెట్టు, ఇంగ్లాండ్‌లో బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లు ఉన్నావుగా; లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత ఎన్ని ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నావో చెప్పు’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడం కారణంగానే అభిమానులు ఇలా ఆటగాళ్లపై ఆగ్రహంగా ఉన్నారు. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది.

ఈ టెస్టులో భారత్‌ గెలిస్తేనే పోటీలో నిలుస్తుంది. లేదంటే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ వశమవుతుంది. ఎడ్జ్‌బాస్టన్‌, లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో భారత్‌ ఓటమి మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లోనూ పాండ్య ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. అతడిపై ఉన్న ఆల్‌రౌండర్‌ ట్యాగ్‌ తీసెయ్యాలని పలువురు మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు. ఇంత హాట్ హాట్ గా ఉన్న సమయంలో పాండ్యా అంత ట్రెండీ ఫోటో దిగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఫోటో పెట్టడం అభిమానులకు నచ్చలేదు. దీంతో.. ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేశారు. 
 

loader