తాను ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానని... ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని మహిళా క్రీడాకారిణి ద్యుతి చంద్ పేర్కొన్నారు. కాగా... ఆమె చేసిన కామెంట్స్ పలువురిని షాకింగ్ కి గురి చేశాయి. తాను స్వలింగ సంపర్కురాలినని, ఓ అమ్మాయితో మూడేళ్లుగా బంధంలో ఉన్నానని చెప్పింది. 

తన గ్రామానికే చెందిన  ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోనున్నట్లు వెల్లడించింది. తమ మనసులు కలిశాయని, జీవితాంతం కలిసుంటామని.. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ అనంతరం ఇరు కుటుంబాల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటామని ద్యుతి మీడియాతో తెలిపింది.

అయితే.. ద్యుతీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆమె కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. ద్యుతితో బంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆమె తల్లి అకుజి చంద్ తెలిపారు. ద్యుతి పెళ్లాడాలనుకుంటున్న అమ్మాయి తనకు మనవరాలు అవుతుందని, మనవరాలితో కూతురి వివాహం జరిపించడం ఎలా కుదురుతుందని ప్రశ్నించింది. కాగా.. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.