ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కి ఎంపిక చేసిన టీంలో తనకు చోటు దక్కకపోవడంపై టీం ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్ట్ సిరీస్ లో తనకి కచ్చితంగా చోటు దక్కతుందని భావించానని.. దక్కకపోవడంతో చాలా బాధగా అనిపించిందని ఆయన తెలిపారు. తనను జట్టు నుంచి తొలగించడం నిరాశ కలిగించిందని  తెలిపారు.

‘జట్టులో చోటు దక్కలేదని నిరాశగానే ఉన్నప్పటికీ.. సానుకూలంగా ముందుకు సాగాలనకుంటున్నాను. ఆటను మరింత ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే నా లక్ష్యం. ఈ ఖాళీ సమయాన్ని నా ఫిటెన్ ను పెంచుకోవడానికి ఉపయోగించుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఆసిస్ తో జరిగిన టీ20 సిరిస్ లో ధావన్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచి.. మ్యాన్ ఆఫ్ ది సిరిస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. డిసెంబర్ 6వ తేదీ నుంచి ఆసిస్ తో  టెస్టు సిరీస్ లో టీం ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా తన అద్భుతమైన ప్రదర్శన కనపరుస్తుందని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశారు.