టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని  ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ డేవిడ్ బంబర్ లాయిడ్ కించపరిచారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ పై ధోనీ అభిమానులు మండిపడుతున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే....గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న టీం ఇండియా కెప్టెన్ ధోనీ.. వెస్టిండీస్ టూర్ కి తనంతట తానే దూరమైన సంగతి తెలిసిందే. భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ లో శిక్షణ పొందేందుకు ఆయన వెస్టిండీస్ టూర్ కి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో  స్కై స్పోర్ట్స్ క్రికెట్ ధోనీని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది.

‘‘ధోనీ భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ లో పనిచేసేందుకు వెస్టిండీస్ టూర్ కి దూరయ్యాడు’’ అని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కి స్పందించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ బంబర్ లాయిడ్... కన్నీటితో నవ్వుతున్న ఎమోజీలను ట్వీట్ చేశాడు.  దీంతో... అతనిపై ధీని అభిమానులు మండిపడుతున్నారు.

ధోనీ చేసిన పని ఎంతో గౌరవించ దగిన విషయమని... అలాంటి విషయాన్ని గౌరవించకపోగా కించపరుస్తారా అంటూ మండిపడుతున్నారు. అసలు ధీనీ తీసుకున్న నిర్ణయంలో నవ్వడానికి ఏముందంటూ కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. మరి ధోనీ అభిమానుల కోపానికి ఆయన ఎలా బదులిస్తారో చూడాలి.