Asianet News TeluguAsianet News Telugu

జకోవిచ్ కి షాక్.. యూఎస్ ఓపెన్ లో విజేతగా డానిల్ మెద్వెదెవ్

వరుస సెట్లలో ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు జకోవిచ్‌ను మట్టికరిపించాడు. ఆర్థర్‌ ఆషే స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో డానిల్  6-4, 6-4, 6-4 తేడాతో తిరుగులేని విజయం సాధించాడు. 

Daniil Medvedev Stuns Novak Djokovic In Straight Sets, Wins Maiden Grand Slam Title
Author
Hyderabad, First Published Sep 13, 2021, 8:18 AM IST

ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన యూఎస్‌ ఓపెన్‌లో వరల్డ్ నెంబర్ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్ నొవాక్‌ జకోవిచ్‌ జోరు కి కళ్లెపడింది.  అందరూ జకోవిచ్ గెలుస్తారని అనుకున్నారు. అయితే.. జకోవిచ్ కి ఊహించని షాక్ ఇచ్చి.. రష్యా ఆటగాడు డానిల్  విజయం సాధించాడు. యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ పోరులో రష్యా ఆటగాడు డానిల్ సంచలనం సృష్టించాడు. 

వరుస సెట్లలో ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు జకోవిచ్‌ను మట్టికరిపించాడు. ఆర్థర్‌ ఆషే స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో డానిల్  6-4, 6-4, 6-4 తేడాతో తిరుగులేని విజయం సాధించాడు. 

దీంతో మొదటిసారిగా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన సొంతం చేసుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ఒక్కసెట్‌లో మాత్రమే ఓడిపోయి టైటిల్‌ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. మెద్వెదెవ్‌కు ఇది మూడో గ్రాండ్ స్లామ్‌ ఫైనల్‌ కావడం విశేషం. గతంలో యూఎస్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios