టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్  అప్పుడే టెన్నిస్ బ్యాట్ పట్టాడు. తల్లి ఒడిలో కూర్చొని బ్యాట్ చేత్తో పట్టుకున్నాడు. ఆ ఫోటోని సానియా తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

పాకిస్థాన్ క్రికెట్ మాజీ క్రీడాకారుడు షోయబ్ మాలిక్ ను వివాహమాడిన సానియా ఇటీవల గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కుమారుడు ఇజాన్‌మీర్జా మాలిక్ తో కలిసి ప్రాక్టీసు కోసం టెన్నిస్ కోర్టుకు వచ్చిన సానియా టెన్నిస్ బ్యాట్ పట్టిన కుమారుడి ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

‘‘ఈ రాకెట్ మీ కోసం కొంచెం పెద్దది కావచ్చు ఇజ్జీ’’ అంటూ సానియా మీర్జా టెన్నిస్ బ్యాట్ పట్టిన తన కుమారుడి ఫోటోతో కామెంట్ ను జోడించి ట్విట్టర్ లో పోస్టు చేశారు. తన కుమారుడు టెన్నిస్ బ్యాట్ పట్టుకోవడంతో తల్లి సానియా మీర్జా మురిసింది. 

ఈ ఫోటో సానియా అభిమానులకు తెగ నచ్చేసింది. దీంతో.. లైక్ లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.