హైదరాబాద్: పెనాల్టీ షూటౌట్ క్రొయేషియాను క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చింది. 3-2 తేడాతో డెన్మార్క్‌పై ఘన విజయాన్ని అందించింది. ఆదివారం ఒక్క రోజునే అటు రష్యా, ఇటు క్రొయేషియా పెనాల్టీ షూటౌట్‌తో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోవడం విశేషం. క్రొయేషియా ప్లేయర్ కేస్పర్ స్మయికెల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
 
ఆరంభంలో డెన్మార్క్ దాడికి తలొగ్గిన క్రొయేషియా ఆట చివరిలో ఇరు జట్లు 1-1 తో సమం చేసి డ్రా దిశకు చేర్చాయి. దీంతో ప్రకటించిన పెనాల్టీ షూట్ అవుట్‌ను అందిపుచ్చుకున్న క్రొయేషియా 3-2 ఆధిక్యంతో డెన్మార్క్‌పై గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బెర్తు ఖరారు చేసుకుంది. 

ఆట ఆరంభమైన తొలి నాలుగు నిముషాల్లోనే ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో గేమ్ టెన్షన్ క్రియేట్ చేసింది. క్వార్టర్ ఫైనల్స్ చేరడమే లక్ష్యంగా రెండు జట్లు ఆచి తూచి అడుగులు వేయడం వీక్షకులను నిరాశపరిచింది. కేవలం 57 సెకండ్ల వ్యవధిలో క్రొయేషియా డిఫెన్స్‌ను ఛేదించాలన్న జోర్గెన్‌సెన్ ప్రయత్నం విఫలమైంది.

మరో ఐదు నిముషాల్లో అదనపు సమయం ముగుస్తుందనగా ఆట ముగిసిపోవాల్సింది. కానీ లూకా మోడ్రికా పెనాల్టీని కేస్పర్ స్మయికల్ సేవ్ చేయడంతో అలా జరగలేదు. 
అయితే క్రొయేషియా కెప్టెన్ ఇనుమడించిన ధైర్యంతో పోస్ట్ మ్యాచ్ కిక్‌లు చేయడానికి తిరిగి రావడం, డెన్మార్క్ చేసిన మూడు ప్రయత్నాలను గోల్ కీపర్ డెనిజెల్ సుబాసిక్ సేవ్ చేయడంతో రష్యాతో శనివారం క్వార్టర్ ఫైనల్ ఆడటానికి క్రొయేషియాకు మార్గం సుగమమైంది.   
 

"