వరల్డ్ కప్ కి సమయం ఆసన్నమైంది. ఈ నెల 30వ తేదీన ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ కప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో...కోహ్లీ సేన.. ఇంగ్లాండ్ పర్యటనకు పయనమైంది. బుధవారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి కోహ్లీసేన ఇంగ్లాండ్‌ పయనమైంది. 

కెప్టెన్ కోహ్లీ, ధోనీ సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బౌలర్లు బుమ్రా, చాహల్‌, హార్ధిక్‌ పాండ్యా కూడా ఫొటోలు ట్వీట్‌ చేశారు. 

ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా ఈ నెల 30వ తేదీ నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 5వ తేదీన దక్షిణాఫ్రికాతో టీం ఇండియా తలపడనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో కోహ్లీసేన రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.