Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఎంపిక చేసే కమీషన్‌లో అభినవ్ బింద్రా

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఎంపిక చేసే కమీషన్‌లో అభినవ్ బింద్రా,  కోస్టారికా అధ్యక్షురాలిగా పనిచేసిన లారా చిన్చిల్లాలు స్థానం దక్కించుకున్నారు,  ఐవోసీ మెంబర్స్ ఎన్నికల కమీషన్‌‌కు బ్రిటన్ యువరాణి అన్నే ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 

Costa Rican President Laura Chinchilla and Abhinav Bindra joins IOC Members Election Commission
Author
New Delhi, First Published Nov 5, 2021, 9:42 PM IST

స్వీడన్‌కు (sweden) చెందిన 2004 ఏథెన్స్ ఒలింపిక్ (Athens 2004 ) హై జంప్ ఛాంపియన్ స్టెఫాన్ హోల్మ్ (Stefan Holm) ,  అమెరికాలో జరిగిన ఐస్ ఒలింపిక్ హాకీ గోల్డ్ మెడలిస్ట్ (us Olympic ice hockey ) ఏంజెలా రుగ్గిరోలు (Angela Ruggiero) ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ మెంబర్స్ ఎన్నికల సంఘం (IOC Members Election Commission) నుంచి తప్పుకున్నారు. వారిద్దరిలో స్థానంలో బీజింగ్‌ 2008లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన భారత షూటర్ అభినవ్ బింద్రా (Abhinav Bindra) , కోస్టారికా (CostaRica) మాజీ ప్రెసిడెంట్ లారా చిన్చిల్లా (Laura Chinchilla) చేరారు. 

టోక్యో ఒలింపిక్స్ (2020) (Tokyo 2020,) తర్వాత ఐవోసీ సభ్యునిగా హోల్మ్ పదవీకాలం ముగిసింది. ఇక రుగ్గిరో విషయానికి వస్తే ఐవోసీ అథ్లెట్స్ కమీషన్ ఛైర్, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా వ్యవహరించిన అనంతరం 2018 నుంచి సంస్థ కార్యకలాపాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. చిన్చిల్లా, అభినవ్ బింద్రాలు బ్రిటన్ యువరాణి అన్నే (Britain's Princess Anne)  ఛైర్‌పర్సన్‌గా వున్న ఐవోసీ మెంబర్స్ ఎన్నికల కమీషన్‌లో చోటు దక్కించుకున్నారు. 

2010 నుంచి 2014 వరకు చిన్చిల్లా కోస్టారికా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఐవోసీ మెంబర్స్ ఎన్నికల కమీషన్‌లో ఆమెతో పాటు అభినవ్ బింద్రా, ఐవోసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ జైకింగ్ యు (Zaiqing Yu) , అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ కమిటీస్ హెడ్ రాబిన్ మిచెల్ (Robin Mitchell), ఇథియోపియాకు చెందిన డగ్మావిట్ బెర్హానే‌లు (Dagmawit Berhane) వున్నారు. ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ( IOC Executive Board)కు సభ్యులను గుర్తించి సిఫారసు చేయడం ఈ మెంబర్స్  ఎన్నికల కమీషన్ బాధ్యత. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సంబంధించి అత్యంత ముఖ్యమైన కమీషన్‌లలో ఇది కూడా ఒకటి. విభిన్న నైపుణ్యాలు, జ్ఞానంతో కూడిన సభ్యులను సెషన్‌కు రికమండ్ చేసి.. లింగం, భౌగోళికపరంగా అవసరమైన సమతుల్యతను కాపాడటం ఈ గ్రూప్ బాధ్యత. 

Follow Us:
Download App:
  • android
  • ios