కామన్వెల్త్ గేమ్స్ 2022: జుడోకో సుశీలా దేవికి రజతం.. విజయ్ యాదవ్‌కి కాంస్యం...
వుమెన్స్ జుడో ఫైనల్‌లో ఓడిన భారత జుడోకా సుశీలా దేవి... కెరీర్‌లో రెండో కామన్వెల్త్ మెడల్ గెలిచిన సుశీలా దేవి... విజయ్ యాదవ్‌కి కాంస్యం..
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత పతకాల సంఖ్య 8కి చేరింది. వుమెన్స్ జుడో 48 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన భారత జుడోకా సుశీలా దేవి, సౌతాఫ్రికా ఛాంపియన్ ప్రిసిల్లా మోరాడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడింది. కామన్వెల్త్ గేమ్స్‌లో సుశీలా దేవికి ఇది రెండో పతకం.
ఇంతకుముందు 2014లో గ్లాగోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ రజత పతకం సాధించింది సుశీలా దేవి. 2022 టోక్యో ఒలింపిక్స్‌కి భారత్ నుంచి అర్హత సాధించిన ఏకైక జుడో ప్లేయర్‌గా నిలిచింది సుశీలా దేవీ.
పురుషుల 60 కేజీల విభాగంలో పోటీపడిన భారత జుడో విజయ్ యాదవ్, తొలి రౌండ్‌లో మార్షియస్‌కి చెందిన విన్ల్సీ గంగయాని ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. అయితే క్వార్టర్ ఫైనల్‌లో ఓడినా కాంస్య పతకం కోసం జరిగిన రౌండ్‌లో సిప్రస్‌ని ఓడించి కాంస్య పతకం సాధించాడు విజయ్ కుమార్ యాదవ్... కామన్వెల్త్‌లో భారత్‌కి ఇది 8వ పతకం...
పురుషుల హాకీలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని చేజేతులా చేర్చుకుని డ్రాతో సరిపెట్టుకుంది భారత హాకీ టీమ్. తొలి రెండు క్వార్టర్లలో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపించిన భారత పురుషుల హాకీ జట్టు, 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది...
అయితే మూడో క్వార్టర్‌లో ప్రత్యర్థికి ఓ గోల్ సమర్పించిన భారత పురుషుల జట్టు, ఒకే గోల్ చేయగలిగింది. ఆఖరి క్వార్టర్‌లో ఏకంగా మూడు గోల్స్ అందించింది. దీంతో 3-0 తేడాతో వెనకబడిన ఇంగ్లాండ్ జట్టు, 4-4 తేడాతో మ్యాచ్‌ని డ్రా చేసుకోగలిగింది...
భారత స్వ్కాష్ మెన్స్ ప్లేయర్ సౌరవ్ గోషల్, వరల్డ్ ర్యాంకర్ గ్రెగ్ లోబన్‌పై 3-1 తేడాతో విజయం అందుకుని సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. భారత వుమెన్స్ స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్పకి మాత్రం ఓటమి ఎదురైంది. హోలీ నాటన్‌తో జరిగిన వుమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 0-3 తేడాతో ఓడింది జోష్న...
భారీ అంచనాలతో కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భారత వుమెన్స్ జిమ్నాస్టిక్ ప్లేయర్ ప్రణతి నాయక్, ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చినా మెడల్ మాత్రం గెలవలేకపోయింది. వాల్ట్ ఫైనల్‌లో 12.699 స్కోరు సాధించిన ప్రణతి నాయక్, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది...
భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ లక్కీగా సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లాడు. 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో 54.36 సెకన్లలో టార్గెట్‌ని ఈదిన సజన్ ప్రకాశ్, టాప్ 19లో నిలిచాడు. టాప్ 16లో ఉన్నవాళ్లు మాత్రమే సెమీస్ చేరతారు. అయితే అర్హత సాధించిన వారిలో ముగ్గురు స్విమ్మర్లు, ఆరోగ్య సమస్యలతో విత్‌డ్రా చేసుకోవడంతో సజన్ ప్రకాశ్‌కి సెమీ ఫైనల్‌లో చోటు దక్కింది...
బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత పురుషుల జోడి సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడి, సింగపూర్‌కి చెందిన జోడిపై 21-11, 21-12 తేడాతో సునాయస విజయం అందుకున్నారు.