Asianet News TeluguAsianet News Telugu

వయసు 14... టార్గెట్ కామన్వెల్త్ మెడల్! భారత బృందంలో స్పెషల్ అట్రాక్షన్‌గా అనాహత్ సింగ్...

కామన్వెల్త్ గేమ్స్ 2022 భారత బృందంలో ఉన్న అతి పిన్న వయస్కురాలిగా స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్... 14 ఏళ్ల వయసులో ప్రపంచవేదికపై...

Commonwealth Games 2022: 14 Years Young Squash Player Anahat Singh makes good start
Author
India, First Published Jul 30, 2022, 9:40 AM IST

కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి భారత్‌కి మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఆస్ట్రేలియా వుమెన్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు పరాజయం పాలైంది. వెంటవెంటనే వికెట్లు తీసి ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్, ఆఖరి మూడు వికెట్లను తీయలేక ఓటమి చవిచూసింది...

పూల్ ఏలో ఘనాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ టీమ్ పూర్తి డామినేషన్ చూపించి 5-0 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలో గోల్ సాధించిన భారత వుమెన్స్ హాకీ టీమ్, మిగిలిన మూడు క్వార్టర్లలోనూ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గోల్స్ చేసి వన్‌సైడెడ్‌గా మ్యాచ్‌ని ముగించింది... 

భారత బృందంలో ఉన్న అతి పిన్న వయస్కురాలు, స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్, కామన్వెల్త్ టూర్‌ని విజయంతో ఆరంభించింది. వుమెన్స్ సింగిల్స్ రౌండ్ 64లో సెయింట్ వింన్సెట్ అండ్ ది గ్రెనడైన్స్‌కి చెందిన స్క్వాష్ ప్లేయర్ జడా రోస్‌పై 11-5, 11-2, 11-0 తేడాతో సునాయస విజయం సాధించింది అనాహత్ సింగ్...

‘ఇది నా మొట్టమొదటి సీనియర్ టోర్నమెంట్. తొలి మ్యాచ్‌లో గెలుస్తానని కూడా అనుకోలేదు, అయితే ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలో దిగాను. ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చింది... మా అమ్మనాన్నలు, చెల్లెల్లు ఇక్కడే ఉన్నారు. వాళ్లు అరుస్తూ సపోర్ట్ చేస్తుంటే నాకు కొండంత బలం వచ్చినట్టు అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది అనాహత్ సింగ్... 

అండర్ 15 లెవెల్‌లో ఆసియా జూనియర్ స్క్వాష్, జెర్మన్ ఓపెన్ గెలిచిన అనాహత్ సింగ్, తన పర్ఫామెన్స్‌తో కామన్వెల్త్ గేమ్స్‌కి అర్హత సాధించింది. మరో సింగిల్స్ పురుషుల స్క్వాష్ ప్లేయర్ అభయ్ సింగ్, బ్రిటిష్ వర్జిన్ ఐస్‌లాండ్‌కి చెందిన జో ఛాంప్‌మన్‌తో జరిగిన మ్యాచ్‌లో 11-5, 11-5, 11-5 తేడాతో విజయం అందుకున్నాడు... 

బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు, దాయాది పాకిస్తాన్‌ని 5-0 తేడాతో చిత్తు చేసింది. టేబుల్ టెన్నిస్‌లోనూ భారత జట్టుకి వరుస విజయాలు దక్కాయి. వుమెన్స్ టీమ్ ఈవెంట్‌లో ఫిజిని 3-0 తేడాతో చిత్తు చేసింది భారత టీటీ వుమ్స్ టీమ్...

మెన్స్ టీమ్ గ్రూప్ స్టేజీలో సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో విజయం అందుకుంది భారత పురుషుల టీటీ టీమ్. లాన్‌బాల్ ఈవెంట్‌లోనూ భారత జట్టుకి విజయం దక్కగా స్విమ్మింగ్‌లో మెన్స్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో పోటీపడిన భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్, సెమీ ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచి (ఓవరాల్‌గా ఏడో స్థానంలో) ఫైనల్‌కి అర్హత సాధించాడు.

జిమ్నాస్టిక్స్‌లో భారత జట్టుకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. మెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ క్వాలిఫికేషన్స్ రౌండ్‌తో భారత ప్లేయర్ల యోగేశర్ 16వ స్థానంలో, సత్యజిత్ 9వ స్థానంలో, సైఫ్ 9వ స్థానంలో నిలిచి నిరాశపరిచారు. 

బర్మింగ్‌హమ్‌లో భారత జట్టు మొట్టమొదటిసారి త్రిఅథ్లాన్ ఈవెంట్‌లో పోటీపడింది. ఈ ఈవెంట్‌లో భారత జట్టు తరుపున బరిలో దిగిన సంజన జోషీ 26వ స్థానంలో, ప్రజ్ఞా మోహన్ 28వ స్థానంలో నిలిచారు.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios