Asianet News TeluguAsianet News Telugu

రికార్డుల వెనుక రసాయనాలు: షాట్‌పుటర్ మన్‌ప్రీత్‌ కౌర్‌పై నిషేధం

ఆసియా ఛాంపియన్‌గా గెలిచి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినందుకు ఆమెపై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది.

Champion shot putter Manpreet Kaur banned for 4 years for dope flunk
Author
New Delhi, First Published Apr 10, 2019, 10:39 AM IST

ఆసియా ఛాంపియన్‌గా గెలిచి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడింది. డోపింగ్‌కు పాల్పడినందుకు ఆమెపై జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది.

2017లో మన్‌ప్రీత్ నాలుగు సార్లు డోపింగ్ పరీక్షలో విఫలమైంది. దీంతో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ క్రమంలో జూలై 20, 2017 నుంచి తాజా శిక్ష అమల్లోకి వస్తుంది. 2017లో ఆసియా గ్రాండ్‌ప్రి, ఫెడరేషన్ కప్, ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్, ఇంటర్‌స్టేట్ ఛాంపియన్‌షిప్‌‌లలో ఆమె ఏకంగా నాలుగు సార్లు ‘పాజిటివ్’గా తేలింది.

వీటిలో ఒకసారి మెటనోలెన్, మరో మూడు సార్లు డైమిథైల్ బుటిలమైన్ వంటి నిషేధిత ఉత్ప్రేరకాలను మన్‌ప్రీత్ తీసుకున్నట్లుగా బయటపడింది. శాంపుల్ సేకరించిన నాటి నుంచి ఆమె అన్ని ఫలితాలు చెల్లవంటూ నాడా తీర్పునివ్వడంతో 2017లో మన్‌ప్రీత్ గెలుచుకున్న ఆసియా ఛాంపియన్‌షిప్ స్వర్ణంతో పాటు జాతీయ రికార్డును కూడా కోల్పోనుంది.

షాట్‌పుట్‌లో 18.86 మీటర్ల రికార్డు ఆమెపైనే ఉంది. అయితే తనపై నిషేధాన్ని సవాల్ చేస్తూ యాంటీ డోపింగ్ అప్పీల్ ప్యానెల్‌కు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని మన్‌ప్రీత్‌కు కల్పించారు.     
 

Follow Us:
Download App:
  • android
  • ios