తాను అడుగుపెట్టిన మొదటి మ్యాచ్‌ని గుర్తు చేసుకున్న మెక్ కల్లమ్ తన కెరీర్‌లో ఇంత సాధిస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. కల్లంగ్ పార్క్ నుంచి లార్డ్స్ వరకూ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన క్షణాలు, జ్ఞాపకాలు ఉన్నాయన్నారు.క్రికెట్‌లో దిగ్గజంగా ఎదగాలి అంటే ఎన్నో త్యాగాలు చేయాలన్న మెక్‌కల్లమ్.. తాను ప్రతినిధ్యం వహించిన అన్ని టీంలకు కృతజ్ఞతలు తెలిపారు
న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్... షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కి వీడ్కోలు చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. 20 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో జీటీ20 కెనెడా లీగ్ ముగింపు తర్వాత తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన రిటైర్‌మెంట్ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తాను యూరో టీ20 తాను ఆడట్లేదని.. అందుకు నిర్వాహకులకు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. తాను అడుగుపెట్టిన మొదటి మ్యాచ్‌ని గుర్తు చేసుకున్న మెక్ కల్లమ్ తన కెరీర్‌లో ఇంత సాధిస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. కల్లంగ్ పార్క్ నుంచి లార్డ్స్ వరకూ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన క్షణాలు, జ్ఞాపకాలు ఉన్నాయన్నారు.క్రికెట్‌లో దిగ్గజంగా ఎదగాలి అంటే ఎన్నో త్యాగాలు చేయాలన్న మెక్‌కల్లమ్.. తాను ప్రతినిధ్యం వహించిన అన్ని టీంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆటలో ఎన్నో నిజాలను వెలికి తీసి తెలిసుకున్నానని అన్నారు.
గతంలోకి చూసుకుంటే తాను సాధించిన ఘనతలు చూసి చాలా గర్వంగా ఉందని మెక్ కల్లమ్ చెప్పారు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో ఎన్నో సరిహద్దులు దాటుకొని ప్రపంచ క్రికెట్‌కి కొత్త రకం క్రికెట్‌ని పరిచయం చేశామని చెప్పారు. టీ-20 క్రికెట్‌లో తనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని... అవన్నీ తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పారు.
ఎటువంటి నిరుత్సాహం లేకుండా ఆట నుంచి తప్పకుంటున్నానని అన్నారు. భవిష్యత్తులో కోచింగ్, మీడియా మీద దృష్టి సారిస్తానని తెలిపారు. ఆట నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా ఉన్నా.. భవిష్యత్తులో సాధించే విషయాలు గుర్తు చేసుకొని సంతోషపడుతున్నట్లు చెప్పారు. ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు ఈ సందర్భంగా దన్యవాదాలు తెలిపారు.
2002లో అంతర్జాతీయ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన ఈ కివీస్ దిగ్గజం .. తన కెరీర్‌లో 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టీ-20లు ఆడారు.మెక్‌కల్లమ్ వన్డేల్లో 6,083, టీ-20ల్లో 2,140 పరుగులు చేశారు. రిటైర్‌మెంట్ ప్రకటించిన మెక్‌కల్లమ్‌కు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు, కివీస్ క్రికెట్ బోర్డు అభినందనలు తెలిపారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 6, 2019, 7:55 AM IST