Asianet News TeluguAsianet News Telugu

క్రికేట్ కెప్టెన్‌పై ఐసీసీ మూడున్నరేళ్ల నిషేధం.. కారణం స్పాట్ ఫిక్సింగేనా.. ఎందుకో తెలుసా?

మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ ఇటీవల ఒక విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసాడు, అందులో తనకు జరిగిన సంఘటన గురించి వెల్లడించాడు. అదే సమయంలో  అతను ఐసిసికి ముందస్తుగా తెలియజేయని తప్పును కూడా అంగీకరించాడు.

Brendan Taylor Spot Fixing: ICC banned former Zimbabwe captain for three and a half years know why
Author
Hyderabad, First Published Jan 29, 2022, 2:17 AM IST

జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మూడున్నరేళ్ల నిషేధం విధించింది. 28 జూలై 2025 తర్వాత మాత్రమే బ్రెండన్ టేలర్  క్రికెట్ కార్యకలాపాలలో పాల్గొన వచ్చని తెలిపింది. నిజానికి స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఐ‌సి‌సికి ఆలస్యంగా సమాచారం అందినట్లు బ్రెండన్ టేలర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయంపై బ్రెండన్ టేలర్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు, అందులో తనకు జరిగిన సంఘటన గురించి చెప్పాడు. అదే సమయంలో అతను ఐసిసికి ముందస్తుగా తెలియజేయకపోవడం తన తప్పును కూడా అంగీకరించాడు. మరోవైపు శుక్రవారం నుంచి అతడిపై నిషేధం మొదలైంది.   

తనపై మోపిన ఆరోపణలను బ్రెండన్  టేలర్ అంగీకరించాడు. ఇందులో మూడు ఐసిసి అవినీతి నిరోధక కోడ్‌కు సంబంధించినవి కాగా, ఒక అభియోగం ఐసిసి యాంటీ డోపింగ్ కోడ్‌కు సంబంధించినది. బ్రెండన్ టేలర్ ఐ‌సి‌సి ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4.2, ఆర్టికల్ 2.4.3, ఆర్టికల్ 2.4.4,   ఆర్టికల్ 2.4.3, ఆర్టికల్ 2.4.7 ఉన్నాయి.

అంతేకాకుండా  బ్రెండన్  టేలర్ 8 సెప్టెంబర్ 2021న కొకైన్ సేవించినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు . యాంటీ డోపింగ్ కోడ్ కింద కూడా  అతను దోషిగా తేలింది. అలాగే డోపింగ్ టెస్ట్ కూడా పాజిటివ్‌గా తేలింది. అలాగే అతను సిరీస్ తర్వాత కొకైన్ సేవించినందుకు  శిక్ష కూడా పడింది. కొన్ని రోజుల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 

బ్రెండన్  టేలర్ ఇంగ్లీష్ వార్తాపత్రికతో కూడా మాట్లాడారు. గత రెండున్నరేళ్లలో తాను చాలాసార్లు డ్రగ్ టెస్టుల్లో ఉత్తీర్ణుడయ్యానని చెప్పాడు. అయితే అతను సెప్టెంబర్ 2021లో జరిగిన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో డ్రగ్ టెస్ట్‌లో  నెగటివ్ గా తేలింది. 2019 అక్టోబర్‌లో స్పాట్ ఫిక్సింగ్‌లో ఒక భారతీయ వ్యాపారవేత్త తనను సంప్రదించినట్లు బ్రెండన్  టేలర్ చెప్పాడు.  బ్రెండన్ టేలర్ కూడా ఈ సంఘటనపై  ప్రస్తావించడానికి ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు.

బ్రెండన్ టేలర్ పోస్ట్‌లో  
భారతీయ వ్యాపారవేత్తను కలిసినప్పుడు అతను భ్రమపడ్డాడని అలాగే డ్రగ్స్ (కొకైన్) కూడా సేవించాడని చెప్పాడు. ఆ వ్యాపారవేత్త బ్రెండన్ టేలర్ కొకైన్ తీసుకుంటున్నట్లు వీడియో కూడా తీశాడని  దాని ఆధారంగా  స్పాట్ ఫిక్సింగ్ చేయమని ఒత్తిడి చేశాడని ఇంకా ఈ మొత్తం సంఘటన వల్ల  తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని చెప్పాడు.

 మ్యాచ్‌ని ఎప్పుడూ ఫిక్స్ చేయలేదు
బ్రెండన్ టేలర్ తాను ఎప్పుడూ మ్యాచ్‌  ఫిక్సింగ్ చేయలేదని అలాగే  ఎలాంటి  బుకీతో  మాట్లాడలేదని చెప్పాడు.  ఈ సుందరమైన క్రికెట్ ఆట పట్ల నాకున్న ప్రేమ నాకు ఎదురయ్యే ఏ ప్రమాదానికైనా మించినది అన్నారు.

"నా కథ చాలా మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను,"
నా కథ చాలా మంది క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని ఇంకా ఇలాంటివి చేసే  వారిని ఆలోచించేలా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను వీలైనంత త్వరగా ఐసిసికి ఇలాంటి సంఘటనల గురించి నివేదించగలని నేను ఆశిస్తున్నాను అని పోస్ట్ చేశాడు.   నేను ఎందుకు ఇలా పోస్ట్ చేశానో ప్రజలు తెలుసుకోవాలని నేను  చెబుతున్నాను. నేను త్వరలో నా వల్ల బాధ కలిగించిన వారందరికీ, నా వల్ల అవమానంగా భావించే వారందరికీ నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు.

 క్రికెట్ కెరీర్ 17 ఏళ్ల పాటు 
జింబాబ్వే  వెటరన్ వికెట్-కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ టేలర్ 17 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ తర్వాత 2021లో రిటైరయ్యాడు. అతను ఐర్లాండ్‌తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. బ్రెండన్ టేలర్ తన కెరీర్‌ను 2004లో ప్రారంభి 204 వన్డేల్లో 6677 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు ఉన్నాయి. అలాగే  34 టెస్టుల్లో 2320 పరుగులు, 45 టీ20 మ్యాచ్‌లలో 934 పరుగులు చేశాడు. 2011 నుంచి 2014 వరకు జింబాబ్వే జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios