Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్: ఫైనల్స్ కి చేరిన బోపన్న, శరన్ జోడి...కాంస్యంతో సరిపెట్టుకున్న అంకిత రైనా

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ క్రీడల్లో 17 పతకాలు( 5 స్వర్ణం, 3 సిల్వర్, 10 కాంస్యం) తన ఖాతాలో వేసుకున్న భారత ఆటగాళ్లు మరో పతకాన్ని ఖాయం చేసుకున్నారు. ఇప్పటికే మహిళా టెన్నిస్ విభాగంలో ఓ కాంస్య పతకం భారత్ ను వరించగా, పురుషుల డబుల్స్ లో కూడా స్వర్ణం లేదా రజత పతకం ఖాయమైంది.  

Bopanna-Sharan enter tennis mens doubles final
Author
Jakarta, First Published Aug 23, 2018, 2:37 PM IST

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ క్రీడల్లో 18 పతకాలు( 5 స్వర్ణం, 3 సిల్వర్, 10 కాంస్యం) తన ఖాతాలో వేసుకున్న భారత ఆటగాళ్లు మరో పతకాన్ని ఖాయం చేసుకున్నారు. ఇప్పటికే మహిళా టెన్నిస్ విభాగంలో ఓ కాంస్య పతకం భారత్ ను వరించగా, పురుషుల డబుల్స్ లో కూడా స్వర్ణం లేదా రజత పతకం ఖాయమైంది.  

భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా అద్భుతమైన ఆటతీరుతో మహిళా సింగిల్స్ విభాగంలో సెమిఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్ క్రీడాకారిణిపై 6-4, 6-1 తేడాతో అంకిత ఘనవిజయాన్ని సాధించినప్పటికి సెమిఫైనల్లో మాత్రం ఆ జోరు చూపించలేకపోయింది. చైనా క్రీడాకారిణితో  సెమిఫైనల్లో తలపడ్డ అంకిత ఓటమిపాలై కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.  

అదేవిధంగా టెన్నిస్ పురుషుల డబుల్స్ సెమిఫైనల్లో రోహన్  బోపన్న, దివిజ్ శరన్ జోడీ కూడా చక్కటి ఆటతీరుతో ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. జపాన్ క్రీడాకారులు ఉసుంగ్, షమాబుకురో పై గెలుపొంది ఫైనల్ కు చేరారు. ఫైనల్లో ఈ భారత జోడి గెలుపొందితే భారత ఖాతాలో మరో స్వర్ణం చేరనుంది. అయితే ఫైనల్లో  విఫలమైనా రజతం మాత్రం ఖాయం. 

Follow Us:
Download App:
  • android
  • ios