పారాలింపిక్స్‌లో భారత్‌కి ఐదో స్వర్ణం... బ్యాడ్మింటన్‌లో కృష్ణ నగర్ సంచలనం...
బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో కృష్ణ నగర్‌కి స్వర్ణం... టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కి రికార్డు స్థాయిలో ఐదు స్వర్ణాలు...
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఐదో స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో ఫైనల్ చేరిన కృష్ణ నగర్, హంగ్‌కాంగ్‌కి చెందిన షెట్లర్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కి ఇది 19వ మెడల్ కాగా... ఆఖరి రోజు రెండో పతకం.
పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన కృష్ణ నగర్‌కి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
అంతకుముందు బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్4 ఫైనల్ చేరిన భారత ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. వరల్డ్ నెం.1 ప్లేయర్, ఫ్రాన్స్‌కి చెందిన లూకస్ మజుర్‌తో హోరాహోరాగా జరిగిన ఫైనల్‌లో సుహాస్ 15-21, 21-17, 21-15 తేడాతో పోరాడి ఓడాడు...
తొలి సెట్ గెలిచి, వరల్డ్ నెం.1 ప్లేయర్‌కి షాక్ ఇచ్చిన సుహాస్ యతిరాజ్, మ్యాచ్ ఆద్యంతం మంచి పోరాటం కనబరిచాడు... పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు సుహాస్ యతిరాజ్.
భారత్ ఖాతాతో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు చేరాయి. పతకాల పట్టికలో 24వ స్థానంలో ఉంది టీమిండియా..