Asianet News TeluguAsianet News Telugu

క్వారంటైన్ లో బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ను 28 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండమని  అధికారులు ఆదేశించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆయన నేడు హైదరాబాద్ బయల్దేరి వచ్చారు. 

Badminton Coach Pullela Gopichand to be in compulsory Home Quarantine
Author
Hyderabad, First Published May 12, 2020, 3:52 PM IST

జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ను 28 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండమని  అధికారులు ఆదేశించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆయన నేడు హైదరాబాద్ బయల్దేరి వచ్చారు. 

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేడు హైదరాబాద్ బయల్దేరారు. సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించాక అధికారులు ఆయనకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాత ఆయనకు తప్పనిసరిగా 28 రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. 

ఇకపోతే... గత కొద్దిరోజులుగా తెలంగాణలో తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు సోమవారం ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 79 మందికి పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది. వీరితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 1,275కి చేరింది.

ఇవాళ నమోదైన 79 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. సోమవారం 50 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 444 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 

రోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని సిఎం కోరారు. జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశం ఉందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సోమవారం దేశంలోని అందరు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. 

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారు. కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios