రాజమౌళి గ్రీన్ ఛాలెంజ్... మొక్కలు నాటిన పుల్లెల గోపిచంద్

badminton coach gopichand accepted green challenge
Highlights

దర్శకధీరుడు రాజమౌళి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన గోపిచంద్...తాజాగా మొక్కలను నాటారు. 

ప్రస్తుతం మనదేశంలో గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ‘ఫిట్ నెస్’ ఛాలెంజ్ పేరిట సెలబ్రెటీలు వ్యాయామాలు చేసి దానిని వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్. మొక్కని నాటి సోషల్ మీడియాలో వాటి ఫోటోలను షేర్ చేయాలి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్ ని స్వీకరించారు. తాజాగా.. ఈ జాబితాలోకి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా చేరారు.

 

దర్శకధీరుడు రాజమౌళి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన గోపిచంద్...తాజాగా మొక్కలను నాటారు. వాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి రాథోడ్, అభినవ్ బింద్రా, అక్షయ్ కుమార్ లకు కూడా సవాల్ విసిరారు.
 

loader