నిద్రపోతున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు ఓ క్రికెటర్ ని అరెస్టు చేశారు. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. క్రికెట్ లో స్టార్ గా ఎదగాలని దేశం కాని దేశానికి వచ్చి.. తప్పుడు దారి పట్టాడు. కామ క్రీడపై ఆసక్తి పెంచుకోని కెరీర్ ని నాశనం చేసుకున్నాడు. చివరకు జైల్లో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే...పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన 23 ఏళ్ల అలెక్స్‌ హెప్‌బర్న్‌ క్రికెట్‌ కెరీర్‌ అన్వేషణలో భాగంగా 2013లో ఇంగ్లండ్‌ వచ్చాడు. వర్సెస్టర్‌షైర్‌ తరపున ఆల్‌రౌండర్‌గా ప్రాతినిధ్యం వహించాడు. కాగా.. అక్కడ తొటి స్నేహితులతో కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ లో చేరాడు. దాంట్లో సెక్స్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలను చూసి వాటికి ఎట్రాక్ట్ అయ్యాడు.

గ్రూప్ లో స్నేహితులతో పందేలు పెట్టుకొని చాలా మంది అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడు. చివరకు పందెంలో భాగంగా నిద్రపోతున్న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతని క్రికెట్ కెరీర్ కూడా అక్కడితో పులిస్టాప్ పడిపోయింది.