గెలవడానికి శాయశక్తుల ప్రయత్నించాం కానీ.. గెలవలేకపోయామంటున్నారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ లు ఓడిపోయి.. టీం ఇండియా సిరీస్ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై విరాట్ స్పందించారు.

ఆస్ట్రేలియా అసాధారణంగా ఆడటంతో మ్యాచ్ తోపాటు సిరీస్ చేజారిపోయిందని కోహ్లీ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్ ను గెలవడానికి ఆసీస్ కి పూర్తి అర్హత ఉందని కోహ్లీ అన్నారు. 190 పరుగులంటే మంచి స్కోరని.. దానిని కూడా ఆస్ట్రేలియా సులభంగా ఆడేసిందన్నారు.

మ్యాచ్ తమ చేతుల్లో నుంచి జారిపోవడానికి మ్యాక్ వెల్ దే కీలకపాత్ర అని కోహ్లీ అన్నారు. తాము ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినా.. మ్యాక్ వెల్ గేమ్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడన్నారు. గేమ్ గెలవడానికి తాము శాయశక్తులా ప్రయత్నించామని.. అయినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు.