Asianet News TeluguAsianet News Telugu

అమ్మాయి అందంగాలేదని పారిపోయా.. కోహ్లీ, నెటిజన్ల ట్రోలింగ్

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ట్రోలింగ్ బారినపడ్డాడు. కోహ్లీ తన కెరిర్ ప్రారంభించిన తొలిరోజుల్లో ఓ ఛానల్ ఇచ్చిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Aussie Journo Tries Trolling Kohli With Old Video, After Pandya, Rahul Suspensions
Author
Hyderabad, First Published Jan 16, 2019, 11:52 AM IST


టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ట్రోలింగ్ బారినపడ్డాడు. కోహ్లీ తన కెరిర్ ప్రారంభించిన తొలిరోజుల్లో ఓ ఛానల్ ఇచ్చిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... ఇటీవల టీం ఇండియా యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు కాఫీవిత్ కరణ్ షోకి హాజరై.. మహిళలపట్ల అగౌరవంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వారిపై మండిపడ్డ బీసీసీఐ.. వారిద్దరినీ సస్పెండ్ కూడా చేసింది. వీళ్లలాగే కోహ్లీ కూడా గతంలో ఓ అమ్మాయిపై ఇలాంటి కామెంట్స్ చేశారంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో.. తన తొలిడేటింగ్ అనుభవం గురించి కోహ్లీ అందులో వివరించారు. తాను తొలిసారి డేటింగ్ కి వెళ్లినప్పుడు.. అమ్మాయి కొంచెం కూడా అందంగా లేదని..దీంతో.. వెంటనే అక్కడి నుంచి పారిపోయానంటూ కోహ్లీ అందులో పేర్కొన్నారు. కాగా.. ఆ కామెంట్స్ పై కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటం గమనార్హం. ఆ వీడియో దాదాపు 11ఏళ్ల క్రితంది కావడం విశేషం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios