Asianet News TeluguAsianet News Telugu

ఇబ్బందులు తప్పవు, సిద్ధంగా ఉండండి... ఒలింపిక్స్‌కి వెళ్లే అథ్లెట్లకి భారత ప్రభుత్వ సూచనలు...

జపాన్‌లో ఫ్లైట్ దిగిన తర్వాత ఒలింపిక్స్ విలేజ్ చేరేందుకు గంటల పాటు ఎదురుచూడక తప్పదు...

టోక్యోలో ఎమెర్జెన్సీ కారణంగా ఇబ్బందులు తప్పవన్న ఒలింపిక్స్ కమిటీ... అథ్లెట్స్ మానసికంగా అన్నింటికీ సిద్ధంగా ఉండాలని సూచన...

Athletes has to mentally prepared for regretted delays and inconvenience in Tokyo Olympics CRA
Author
India, First Published Jul 10, 2021, 11:43 AM IST

టోక్యో నగరంలో పెరుగుతున్న డెల్టా వేరియెంట్ కరోనా కేసుల ప్రభావం, ఒలింపిక్స్ పోటీలపై తీవ్రంగా పడనున్నాయి. ఇప్పటికే టోక్యో సిటీలో ఎమర్జెన్సీ విధించిన జపాన్ ప్రభుత్వం, ప్రపంచదేశాల నుంచి వచ్చే అథ్లెట్లలో పాజిటివ్ కేసులు ఉండకుండా కట్టుదిట్టమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటోంది.

దీంతో ఒలింపిక్స్ కోసం జపాన్ చేరుకుంటున్న అథ్లెట్లు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని భారత ఒలింపిక్స్ ఆర్గనైజేషన్ తెలియచేసింది... భారత్ నుంచి నేరుగా నరితా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునే అథ్లెట్లు, అక్కడ ఇమ్రిగ్రేషన్ ప్రాసెస్ ప్రారంభం అవ్వడానికి ముందు నాలుగు గంటల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.

అలాగే అక్కడి నుంచి టోక్యోలోని ఒలింపిక్ విలేజ్‌కి వెళ్లేందుకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కోసం మరో మూడు గంటలు వేచి ఉండడం తప్పనిసరి.. అదీకాక ఈ సమయంలో జపాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహారం కానీ, నీళ్లు కానీ అందచేయడం జరగదు. అలాగే వలెంటరీ సర్వీసులు ఉండవు.

కాబట్టి జపాన్ చేరినప్పటి నుంచి, ఒలింపిక్స్ స్పోర్ట్స్ విలేజ్‌కి చేరేవరకూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి రెఢీగా ఉండాలని సూచించారు భారత ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ నరిందర్ ధృవ్ బత్రా..

అయితే ఒలింపిక్స్‌ కోసం జపాన్‌కి వచ్చే అథ్లెట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తమ దృష్టికి వచ్చాయని, ప్రభుత్వంతో కలిసి ఇలాంటి మళ్లీ పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ ఒలింపిక్స్ ఆర్గనైజేషన్ తెలియచేసింది...

Follow Us:
Download App:
  • android
  • ios