ఆసియా రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో అక్ష్‌దీప్ సింగ్‌కు స్వర్ణం..
Asian Race Walking Championship: జపాన్ వేదికగా జరుగుతున్న రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో భారత అథ్లెట్ అక్ష్‌దీప్ సింగ్ స్వర్ణం సాధించాడు.
భారత యువ అథ్లెట్ అక్ష్‌దీప్ సింగ్ జపాన్ లోని నోమి వేదికగా జరిగిన ఆసియా రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించాడు. 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ ను అక్ష్‌దీప్.. 1:20:57 గంటల్లో పూర్తి చేశాడు. గత నెలలో అక్ష్‌దీప్.. రాంచీ (జార్ఖండ్) వేదికగా ముగిసిన పదో నెషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచాడు. తద్వారా అతడు 2024 పారిస్ ఒలింపిక్స్ తో పాటు వరల్డ్ ఛాంపియన్షిప్స్ లోనూ అర్హత సాధించాడు. ఇప్పుడు ఏకంగా ఆసియా ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం గమనార్హం.
కాగా జపాన్ లో జరిగిన ఆసియా రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్స్ లో అక్ష్‌దీప్ తో పాటు భారత అథ్లెట్లు వికాస్ సింగ్, పరంజీత్ సింగ్ బిషత్ లు కూడా రాణించారు. తద్వారా ఈ ఇద్దరూ 2024 పారిస్ ఒలింపిక్స్ తో పాటు వరల్డ్ ఛాంపియన్షిప్ కూ అర్హత సాధించారు.
కాగా మహిళల కేటగిరీలో ప్రియాంక గోస్వామి కాంస్యం సాధించింది. ప్రియాంక.. 20 కిలోమీటర్ల దూరాన్ని 1:32:2 తో పూర్తి చేసింది. ప్రియాంక కూడా గత నెలలో నేషనల్ ఛాంపియన్షిప్స్ ల విజేతగా నిలిచి పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇవే పోటీలలో పాల్గొన్న మునిత ప్రజాపతి మాత్రం క్వాలిఫై కాలేకపోయింది.