భారత మహిళా అథ్లెట్ స్వప్నా బర్మన్ షాకింగ్ నిర్ణయం... గాయాలతో వేగలేక రిటైర్మెంట్...
వరంగల్‌లో జరిగిన 60వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన స్వప్నా బర్మన్... ఆ విజయం తర్వాత 24 గంటల్లోనే రిటైర్మెంట్ ప్రకటన
భారత మహిళా అథ్లెట్ స్వప్నా బర్మన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వరంగల్‌లో జరిగిన 60వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన స్వప్నా బర్మన్, ఆ విజయం తర్వాత 24 గంటల్లోనే రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానిరి గురి చేసింది.
‘నా శరీరం ఏ మాత్రం సహకరించడం లేదు. మానసికంగా, శారీరకంగా నేను బాగా అలసిపోయాను. డిప్రెషన్‌తో బాధపడుతున్నా... నిజానికి నేను ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకోలేదు. అయితే రైల్వే కమిట్‌మెంట్స్ కారణంగా ఇష్టం లేకపోయినా ఆడాల్సి వచ్చింది...’ అంటూ కామెంట్ చేసింది స్వప్నా బర్మన్.
1996లో పశ్చిమబెంగాల్‌లోని గోస్‌పరా అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన స్వప్నా బర్మన్, అనేక కష్టాలను అధిగమించి అథ్లెట్‌గా ఎదిగింది. వేసుకోవడానికి బూట్లు కూడా లేని పరిస్థితి నుంచి వచ్చిన స్వప్నా బర్మన్, 2018 ఆసియా క్రీడల్లో గాయంతో బాధపడుతూనే బరిలో దిగి... అత్యంత క్లిష్టమైన హెప్తథ్లాన్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా చరిత్ర క్రియేట్ చేసింది...
ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్ 2017లో స్వర్ణం సాధించిన స్వప్నా బర్మన్, 2019లో రజతం సాధించింది. ఫెడరేషన్ కప్‌లోనూ స్వర్ణం సాధించిన స్వప్నా బర్మన్‌కి ఆర్థిక సాయం ఇవ్వడం ఆపేసింది కేంద్రం. అయితే తన ఇంట్లోనే శిక్షణ తీసుకుంటూ వచ్చిన స్వప్నా బర్మన్, 25 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం...