ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతావా అంటూ... అశ్విన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.ఇంతకీ మ్యాటరేంటంటే... తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో జట్టు విజయం కోసం ప్రయత్నించి అశ్విన్ ఇప్పుడు నెటిజన్ల కోపానికి బలయ్యాడు.

శుక్రవారం ఈ తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా దిందిగల్ డ్రాగన్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ జట్లు పోటీపడ్డాయి. కాగా... ఈ మ్యాచ్ లో డ్రాగన్స్ జట్టు 10 పరగుల తేడాతో విజయం సాధించింది. చెపాక్ సూపర్ గిల్లీస్ చివరి రెండు బంతులకు 17 పరుగులు చేయాల్సి ఉండగా.. దిందిగల్ డ్రాగన్స్ కెప్టెన్ అశ్విన్ విచిత్రంగా బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ముందు బంతిని ఉపయోగించకుండా... రాంగ్ ఫూట్ తో అతడు బంతిని విసిరాడు. అశ్విన్ విన్యాసంపై సోషల్ మీడియా లో క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. గెలుపు కోసం ఇలాంటి అడ్డదారులా అంటూ విమర్శిస్తున్నారు.ఇదిలా ఉండగా... ఐపీఎల్ లో కూడా మన్కడింగ్ కి పాల్పడి అశ్విన్ వివాదానికి తెరలేపిన సంగతి అందరికీ తెలిసిందే.