Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2018లో భారత్ శుభారంభం: షూటింగ్ కాంస్యం కైవసం

ఏషియన్ గేమ్స్ ప్రారంభమైన మొదటిరోజే భారత క్రీడాకారులు బోణీ కొట్టారు.ఆసియా దేశాల మధ్య జరిగే  ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకాల వేటను భారత షూటర్లు మొదటుపెట్టారు. ఇవాళ జరిగిన 10 మీటర్ల షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారుల జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని శుభారంభాన్నిచ్చింది. 
 
Apurvi Chandela - Ravi Kumar win bronze medal in 10m Air Rifle Mixed Team event in asian games
Author
Jakarta, First Published Aug 19, 2018, 1:38 PM IST

ఏషియన్ గేమ్స్ ప్రారంభమైన మొదటిరోజే భారత క్రీడాకారులు బోణీ కొట్టారు.ఆసియా దేశాల మధ్య జరిగే  ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకాల వేటను భారత షూటర్లు మొదటుపెట్టారు. ఇవాళ జరిగిన 10 మీటర్ల షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారుల జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని శుభారంభాన్నిచ్చింది. 

తొలిరోజు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో పాల్గొన్న భారత షూటర్లు అపూర్వి చండేలా, రవి కుమార్ తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చారు. దీంతో ఫైనల్ రౌండ్ కు చేరుకున్న ఈ ఇండియన్ షూటర్లు అందులోనూ 429.9 పాయింట్లు సాధించారు. దీంతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. వీరికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చి తైపీ టీం 494.1 పాయింట్లతో కాంస్యం, చైనా టీం 492.5 పాయింట్లతో రజతం సాధించాయి.  

ఇక భారత్ కు చెందిన మనూభాస్కర్‌, అభిషేక్‌ వర్మల టీం ఇదే విభాగంలో ఫైనల్ కు చేరలేకపోయింది. ఫేలవ ప్రదర్శనతో గ్రూప్ ధశనుండే ఈ జంట వెనుదిరగాల్సి వచ్చింది.    

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తరపున దాదాపు 572 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ జంబో టీం భారీ సంఖ్యతో పతకాలు సాధించాలని పట్టుదలతో రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా మొదటిరోజే షూటింగ్ విభాగంలో కాంస్యంతో బోణీ అవడం మిగతా క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపనుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios