సెలబ్రెటీ కపుల్స్ లో విరుష్క జంటకు ఉన్న క్రేజ్ వేరు. ఒకరు సినిమా రంగంలో, మరోకరు క్రీడా రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. నిత్యం బిజీగా ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత  జీవితానికి కూడా చోటు కల్పించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో మ్యాచ్ సందర్భంగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

కాగా... భర్తతో గడిపేందుకు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి అనుష్క శర్మ కూడా  అక్కడికి చేరుకున్నారు. తాజాగా వీరిద్దరూ... మియామిలోని ఓ హోటల్ లో భోజనం చేశారు. ఆ భోజనం బాగా నచ్చడంతో... ఇద్దరూ కలిసి తమకు అంత మంచి భోజనం అందించిన చెఫ్ తో ఫోటో దిగారు. ఆ ఫోటోలో ఇద్దరి ముఖంలో స్పష్టంగా కనపడుతోంది. కాగా... ఈ ఫోటో నెటిజన్లు కు తెగ నచ్చేసింది.

ఇదిలా ఉంటే... ఇటీవల అనుష్క శర్మ బికినీలో బీచ్ లో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో నెటిజన్లతోపాటు... విరాట్ కి కూడా తెగ నచ్చేసింది. పెళ్లి తర్వాత అనుష్క శర్మ అంత హాట్ గా కనిపించడం ఇదే తొలిసారి. దీంతో... అందరూ ఫోటో బాగుందంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.