ఒకరు టీం ఇండియా కెప్టెన్.. ఎప్పుడూ మ్యాచ్ లతో, ప్రాక్టీస్ లతో విశ్రాంతి లేకుండా గడుపుతంటారు. మరొకరు స్టార్ హీరోయిన్.. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటారు. అలాంటి ఇద్దరిని ప్రేమ ఒక్కటి చేసింది. పెళ్లితో ఒక్కటైనా.. ఏకాంత గడపడానికి వీరికి పెద్దగా సమయం దొరకదు. అందుకే.. ఆ టైమ్ ఓ యాడ్ తో వెతుక్కున్నారు విరుష్క జంట.

తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలు ఓ యాడ్ లో నటించారు. ఇప్పటికే ఎన్నో యాడ్స్‌లో కలిసి నటించిన ఈ జంట.. తాజాగా ప్యూర్ లవ్ అంటూ ఓ స్టీల్ కంపెనీ యాడ్‌లో కనిపించారు. ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేసిన కోహ్లి.. ఈ యాడ్ షూటింగ్ చాలా ఆనందాన్నిచ్చిందని అన్నాడు. ఇదే స్టీల్ కంపెనీ కోసం గత డిసెంబర్‌లోనూ ఈ ఇద్దరూ కలిసి నటించారు. 

అందులో క్రికెట్ ఫీల్డ్‌లో తొలిసారి అడుగుపెట్టినపుడు కోహ్లి, కెమెరా ముందు తొలిసారి నటించినప్పుడు అనుష్క శర్మ తమకు కలిగిన అనుభవాలను పంచుకున్నారు. 2017, డిసెంబర్‌లో ఈ క్రికెట్, బాలీవుడ్ జంట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ యాడ్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.