Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్: భారత్ ఖాతాలోకి మరో రెండు స్వర్ణాలు

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్ తో ప్రారంభమైన పతకాల వేట బాక్సింగ్, బ్రిడ్జ్ వరకు సాగింది. ఇవాళ జరిగిన బాక్సింగ్ మరియు బ్రిడ్జ్ విభాగంలో మరో రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి.
 
another two gold medals added in india account in asan games
Author
Jakarta, First Published Sep 1, 2018, 1:47 PM IST

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్ తో ప్రారంభమైన పతకాల వేట బాక్సింగ్, బ్రిడ్జ్ వరకు సాగింది. ఇవాళ జరిగిన బాక్సింగ్ మరియు బ్రిడ్జ్ విభాగంలో మరో రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి.

తొలిసారి ఆసియా క్రీడల్లో బాక్సర్ గా బరిలోకి దిగిన అమిత్ పంగల్ 49 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణం సాధించాడు. ఉజ్భెకిస్థాన్ క్రీడాకారుడు హసన్ బాయ్ దుస్మతోవ్ పై 3-2 తుడాతో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుతమైన పంచులతో ఒలింపిక్ విజేతను సైతం మట్టికరినించాడు పంగల్.

ఇక మరో విభాగంలో కూడా భారత్ కు స్వర్ణం లభించింది. ప్రణబ్ బర్దాన్, శిబ్ నాథ్ సర్కార్ ల జోడీ బ్రిడ్జ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు. దీంతో ఈ ఒక్కరోజే భారత్ కు రెండు స్వర్ణాలు లభించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios