టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయా..? అవుననే సమాధానమే వినపడుతోంది. ఇందుకు ఇన్ స్టాగ్రామ్ సాక్ష్యం అంటున్నారు నెటిజన్లు.ప్రపంచకప్ లో టీం ఇండియా కూర్పు విషయంలో కోహ్లీ, రోహిత్ ల మధ్య విభేదాలు తలెత్తినట్లు గతంలో వార్తలు వచ్చాయి. సెమీఫైనల్స్ లో ఓటమి తర్వాత ఆ విభేదాలు కాస్త ముదిరి గొడవలు గా మారాయి అని కూడా వార్తలు వచ్చాయి. అయితే... వాటికి ఆధారాలు లేకపోవడంతోఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.;

జట్టులో ఏదైనా విషయం మీద అభిప్రాయ భేదాలు సహజమే అని, అంతకుమించి గొడవంటూ ఏమీ లేదని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ ఈ విషయాన్ని పెద్దది కాకుండా చేశాడు. అక్కడితో వివాదం ముగిసిందని అందరూ భావించారు. అయితే... వివాదం ముగిసిపోలేదని ఇప్పటికీ కోహ్లీ, రోహిత్ ల మధ్య మనస్పర్థలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఇందుకు రోహిత్ ప్రవర్తనే సాక్ష్యం.

తాజాగా... రోహిత్ శర్మ... తన ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ, అతని భార్య , బాలీవుడ్ నటి అనుష్క శర్మలను అన్ ఫాలో అయ్యారు. ఇది అభిమానులను సైతం షాకింగ్ కి గురిచేసింది. ఇన్నాళ్లూ కోహ్లి, అతడి భార్య అనుష్కలను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్న రోహిత్‌.. ఒక్కసారిగా ఇద్దరినీ అన్ ఫాలో చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ మాత్రం.. రోహిత్, అతని భార్య రితికలను ఫాలో అవుతుండటం విశేషం. మరి దీనిపై రోహిత్ ఎలా స్పందిస్తారో చూడాలి.