Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్: అతి పిన్న వయస్కుడికి అతిపెద్ద పతకం, భారత్ ఖాతాలొ మరో స్వర్ణం

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా షూటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పటివరకు షూటింగ్ విభాగంలో రెండు రజతం, ఓ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విభాగంలో స్వర్ణ పతకం లేని లోటు ఇవాళ తీరిపోయింది. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో సౌరభ్ చౌదరీ తన అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మరో షూటర్ అభిషేక్ వర్మ కాంస్యం సొంతం చేసుకున్నాడు.

16-yr-old Saurabh Chaudhary Clinches Gold asian games
Author
Jakarta, First Published Aug 21, 2018, 12:29 PM IST

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా షూటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇప్పటివరకు షూటింగ్ విభాగంలో రెండు రజతం, ఓ కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విభాగంలో స్వర్ణ పతకం లేని లోటు ఇవాళ తీరిపోయింది. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో సౌరభ్ చౌదరీ తన అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మరో షూటర్ అభిషేక్ వర్మ కాంస్యం సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఇండియా నుండి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న 500 పైచిలుకు క్రీడాకారుల్లో సౌరభ్ చౌదరీ అతి పిన్న వయస్కుల్లో ఒకడు. ఇతడు 16 ఏళ్ల వయసులోనే ఇతడు ఇండియా తరపున ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. అయితే అసలేమీ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇతడు స్వర్ణం సాధించడం విశేషం. ఫైనల్ లో జపాన్ మేటీ షూటర్ తొమయుకిపై పైచేయి సాధించిన సౌరభ్ 240.7 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు.

ఇక ఇదే 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ విభాగంలో షూటర్ అభిషేక్ వర్మ మూడో స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తంగా ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యంతో భారత్ కు మొత్తం 6 మెడల్స్ లభించాయి. ఇందులో రెజ్లింగ్ లో రెండు స్వర్ణాలు మినహా మిగతావన్నీ షూటింగ్ విభాగంలో వచ్చినవి కావడమే విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios