యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి వరల్డ్ కప్ లో ఆడే టీం ఇండియాలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ.. సెలక్టర్లు మాత్రం అనుభవానికి పీటం వేస్తూ.. పంత్ ని కాదని.. దినేష్ కార్తీక్ చోటు కల్పించారు. వరల్డ్ కప్ టీంలో చోటు దక్కకపోవడంపై పంత్ తొలిసారిగా స్పందించాడు.

సోమవారం ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా ఢిల్లీ చాలెంజర్స్.. రాజస్థాన్ రాయల్స్ తో  పోటీపడింది. ఈ మ్యాచ్ లో పంత్ విధ్వంసం సృష్టించాడు.  పంత్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ తట్టుకోలేకపోయింది. చేజారిపోవాల్సిన మ్యాచ్ ని... పంత్ తన ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం పంత్ మీడియాతో తన  ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టీంకి ఎంపిక కాకపోవడంపై కూడా స్పందించాడు.

‘క్లిష్ట పరిస్థితిల్లో జట్టును గెలిపిస్తే ఆ కిక్కే వేరు. నేను అబద్ధం చెప్పడం లేదు. ఇప్పటికీ.. ప్రపంచకప్ లో సెలక్టర్లు నన్ను ఎంపిక చేయలేదు అన్న విషయం ఇంకా నా మైండ్ లో ఉంది. ఏది ఎమైనప్పటికి ప్రపంచకప్‌ విషయం మాత్రం నన్ను వదలడం లేదు. కానీ నేను మాత్రం నా కెరీర్‌పై దృష్టి సారించాను. ఈ పిచ్‌ అద్భుతంగా ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆట ఆడాను.’ అని పంత్‌ పేర్కొన్నాడు.