భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా.. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. పాకిస్థాన్ కి చెందిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోవడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికీ.. ఈ విషయంలో ఆమెకు ప్రశ్నలు ఎదురౌతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటిదానిపై ఆమెను ఉద్దేశిస్తూ.. ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ కి ఆమె ఘాటు సమాధానం ఇచ్చారు.

ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నా పాకిస్థానీ అభిమానులు, మిత్రులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ భారతీయ వదిన నుంచి మీకు బెస్ట్‌ విషెష్‌, లవ్‌’ అని సానియా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ‘‘మీక్కూడా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే, మీ ఇండిపెండెన్స్ డే కూడా ఈ రోజే’’ అని ట్వీట్ చేశాడు. నెటిజన్ ట్వీట్‌పై స్పందించిన సానియా.. ‘‘కాదు, నాది.. నా దేశానిది రేపు. ఈ రోజు నా భర్తది, ఆయన దేశానిది. ఇప్పటికైనా స్పష్టత వచ్చిందనుకుంటా. మరి మీదెప్పుడు?.. ’ అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయింది.

ఇది చదవండి

మిథాలి రాజ్ పై మరోసారి ట్రోలింగ్.. రిప్లై