Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ చేతికి గాయం... టెస్ట్ మ్యాచ్ కి దూరం...?

ఫిజియోతో ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి కోహ్లీ తన బ్యాటింగ్ కి కొనసాగించారు. తర్వాత సెంచరీ చేసి జట్టుు విజయానికి తోడ్పడ్డాడు.  అయితే గాయం కావడంతో విండీస్‌తో తొలి టెస్టుకు కోహ్లి దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.

"It's Not Broken": Virat Kohli Quashes Thumb Injury Scare After ODI Triumph Over West Indies
Author
Hyderabad, First Published Aug 15, 2019, 2:31 PM IST


టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ .. వెస్టిండీస్ తో జరగనున్న టెస్ట్ మ్యాచ్ కి దూరం కానున్నాడా..? అవునే ప్రచారం జరుగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో విరాట్‌ కోహ్లి గాయపడ్డాడు.  విండీస్‌ నిర్దేశించిన టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కీమర్‌ రోచ్‌ వేసిన 27 ఓవర్‌లో కోహ్లి కుడి చేతి వేలికి గాయమైంది.

 అయితే.. ఫిజియోతో ప్రాథమిక చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి కోహ్లీ తన బ్యాటింగ్ కి కొనసాగించారు. తర్వాత సెంచరీ చేసి జట్టుు విజయానికి తోడ్పడ్డాడు.  అయితే గాయం కావడంతో విండీస్‌తో తొలి టెస్టుకు కోహ్లి దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.

దీనిపై తాజాగా కోహ్లీ స్పందించారు. తన  వేలికి గాయమైన విషయం వాస్తవమేనని, కాకపోతే అది అంత తీవ్ర గాయం కాదని పేర్కొన్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో ఆడతానని స్పష్టం చేశాడు. ‘ అదృష్టవశాత్తూ వేలికి ఫ్రాక్చర్‌ కాలేదు. దాంతోనే నేను తిరిగి బ్యాటింగ్‌ కొనసాగించా. ఒకవేళ ఫ్రాక్చర్‌ అయ్యుంటే బ్యాటింగ్‌ చేయలేకపోయేవాడిని. అది చిన్నపాటి గాయమే. నేను బంతిని హిట్‌ చేసే క్రమంలో అది చేతి వేలికి తాకింది. తొలి టెస్టు ఆడటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అని కోహ్లి పేర్కొన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios