వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ ని ఇప్పటికే టీం ఇండియా కైవసం చేసుకుంది. ఇప్పటికి జరిగిన రెండు మ్యాచుల్లో టీం ఇండియా విజయం సాధించగా.. మూడో మ్యాచ్ మంగళవారం జరగనుంది. కాగా... ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ఇండియన్ క్రికెటర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

రెండో మ్యాచ్ లో తమ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచారని కోహ్లీ తెలిపాడు. సిరిస్ గెలవడమే తమ లక్ష్యంగా పెట్టుకొని ఆడినట్లు కోహ్లీ చెప్పాడు. ఎలాగూ సిరీస్ గెలిచాం కాబట్టి.. ఇప్పటి వరకు ఆడని వారికి అవాకశం ఇస్తామని కోహ్లీ చెప్పాడు.

కాగా ఈ సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌ ఇప్పటివరకు ఆడలేదు. కోహ్లీ చెప్పినట్లు కొత్తవారికి అవకాశమిస్తే ఈ ముగ్గురూ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వికెట్‌కీపర్ రిషబ్‌పంత్‌ రెండు టీ20ల్లో విఫలమైన సంగతి తెలిసిందే. ఒకవేళ అతడిని పక్కనపెడితే కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వస్తాడు.