మేము దూరంగా వెళ్తున్నామంటూ.. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మౌంట్ మాంగనీ వేదికగా న్యూజిలాండ్ మీద ఐదువన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఐదు వన్డేల సిరీస్ ని ఇప్పటికే టీం ఇండియా కైవసం చేసుకుంది. ఇప్పటికి మూడు వన్డే మ్యాచ్ లు జరగగా.. చివరు రెండు వన్డేల నుంచి కోహ్లీ తప్పుకుంటున్నాడు.

కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. దీంతో.. కోహ్లీ కి కొద్దిపాటి విశ్రాంతి లభించినట్లు అయ్యింది. అంతే.. తన భార్య, బాలీవుడ్ బామ అనుష్కశర్మతో సమయం గడిపేందుకు రెడీ అయిపోయాడు. భార్యతో కలిసి విమానం పక్కన దిగిన ఫోటోని కోహ్లీ షేర్ చేశాడు. ‘‘ మేము దూరంగా వెళ్తున్నాం’’ అనే క్యాప్షన్ జత చేసి దానికి ట్రావెల్స్ విత్ హర్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. విదేశీగడ్డపై భారత్ వరస విజయాలను ఎంజాయ్ చేస్తున్నానని ఇప్పటికే కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే.