Asianet News TeluguAsianet News Telugu

క్వారెంటెన్ రోజులలో రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి

రోజు కనీసం రెండు లేదా మూడు తులసి ఆకులను నమిలి తినడం, తులసీ రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, కిస్ మిస్‌లు ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

How To boost  Your Immunity In Quarantine period
Author
Hyderabad, First Published Apr 9, 2020, 8:47 AM IST

How To boost  Your Immunity In Quarantine period - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

 

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలంటే వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.  ముఖ్యంగా ఖాళి కడుపుతో ఉండరాదు. రోజు సూర్యరశ్మి శరీరానికి తాకేలా చూసుకోవాలి. ఏ.సి వాడకపోవడం ఉత్తమం. గొంతు ఎప్పుడు తడిగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. ముక్కులో  ఆవానూనె చుక్కలు ఆరు వేసుకుంటూ ఉండాలి. రోజు గోరువెచ్చని నీళ్లు తాగాలి. అలాగే తులసీ దళాలను నీటిలో వేసి ఆ నీటిని త్రాగడం ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి మాయమవుతుంది. 

రోజు కనీసం రెండు లేదా మూడు తులసి ఆకులను నమిలి తినడం, తులసీ రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, కిస్ మిస్‌లు ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే ఉసిరికాయను రోజూ ఒకటి చొప్పున తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడం ద్వారా కరోనాలాంటి వ్యాధులు దరిచేరవు ఆయుర్వేద నిపుణులు ఇలాంటి చిట్కాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వ్యాయాయం చేయడం, యోగా చేయడం వంటివి మరిచిపోకూడదు. శరీరం ఫిట్‌గా వుంటే అనారోగ్య సమస్యలు వాటంతట అవే పటాపంచలవుతాయి. ఒకవేళ చేరినా వాటి నుంచి తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజూ కనీసం 30 నిమిషాలపాటు ప్రాణాయామం, ధ్యానం చేయాలి. 

ఇంట్లో వుండి పనిచేస్తున్నవారు :- ఇంట్లో వుండి పనిచేస్తున్నారా? అయితే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి, లేని పోని కొత్త జబ్బులు వచ్చి చేరతాయి. ఇంట్లో ఉండి వర్క్ చేసేటప్పుడు డైట్ కూడా కాస్త మార్చుకుంటే మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు శరీరానికి శ్రమ ఎక్కువ ఉండదు. కాబట్టి దానికి తగ్గట్టు డైట్‌‌లో మార్పులు చేసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తింటుండాలి. రాత్రి పూట పెరుగు అస్సలు తినకూడదు. ప్రతి కూరలలో అల్లం, శొంటి వాడాలి, ఉదయం పరిగడుపున అల్లం కాల్చుకుని తింటే చాలా మంచిది. 

ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు తీపి పదార్ధాలు, ఆల్కహాల్, అధిక కొవ్వును కలిగించే ఆహార పదార్ధాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అప్పుడప్పుడు స్నాక్స్ కోసం పల్లీల లాంటివాటివి తీసుకోవడం చేయవచ్చు, ఉడికిన పల్లీలు మరీ మంచిది. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రతీ అరగంటకొకసారి నీళ్లు తాగడం మర్చిపోకూడదు. దాంతో పాటు వారానికొకసారి బరువు చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమే. ఏదైనా తింటూ వర్క్ చేసే అలవాటును మానుకుంటే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే ఫ్రూట్స్, ఓట్స్ లాంటివి తింటే మంచిది. 'టి' కి బదులుగా పాలల్లో చిటికెడు పసుపు, మిరియాలు వేసి కాచుకుని త్రాగండి.  

ఇంట్లో ఉంటూ బరువు పెరగకుండా  గుర్తుంచుకోవాల్సిన ముఖ్య సూచనలు, బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. నీళ్లు తాగడం మర్చిపోవద్దు. వ్యాయామం చేయడం మరిచిపోకూడదు. ఇంట్లో ఉంటూ పని చేసేటప్పుడు ఎప్పుడూ కూర్చునే ఉండకుండా మధ్యలో ఫిట్‌‌నెస్ బ్రేక్స్ ఇస్తుండాలి. అంటే మధ్య మధ్యలో శరీరానికి ఏదైనా యాక్టివిటీ ఇస్తుండాలి. వర్క్ మధ్యలో కాఫీ బ్రేక్ తీసుకుని అటు ఇటు నడుస్తుండాలి. యోగాకు రోజూ ఉదయం లేదా సాయంత్రం కొంత టైం కేటాయించాలి. ఇంట్లోనే కూర్చోకుండా గార్డెన్ లేదా ఆరుబయట కాసేపు నడవడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా రిలాక్స్ అవుతుంది.

మహిళలైతే ఇంటి పనికి, ఆఫీసు పనికి క్లాష్ కాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నా పురుషులు మాత్రం ఆఫీసు పనులకే పరిమితమవుతున్నారు. అలాంటివారు. ఎక్కువ తినకుండా డైట్ పాటించాలి. కానీ మహిళలు ఆఫీసు, ఇంటి పనిచేస్తూ ఒత్తిడికి లోనవుతున్నారు. అలాంటి మహిళలు ప్లాన్ ప్రకారం పనిచేసుకోవడం మంచిది. డైట్ ప్లాన్, వర్కు ప్లాన్ లకు టైం కేటాయించడం మరిచిపోకూడదు. ఇంట్లోని వారి సాయం తీసుకోవడం మంచిది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాంటి అంతరాయం లేకుండా సాగాలంటే ఆఫీస్‌‌లో ఉన్నట్టే ఇంట్లో కూడా వర్కింగ్ అవర్స్‌‌ను సెట్ చేసుకోవాలి. ఆ టైంలో ఎవరినీ దగ్గరకు రావొద్దని చెప్పాలి. ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులు పనిని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రపోయే టైమింగ్స్ కూడా ఎప్పటి లాగానే ఉండాలి. వాటిలో మార్పులొస్తే.. డైలీ రొటీన్ అంతా మారిపోతుంది. అది వర్క్‌‌కు ఇబ్బంది కలిగించొచ్చు. అలాగే వర్క్ కోసం డెడికేటెడ్‌‌గా ఒక ప్లేస్‌‌ను ఏర్పరచుకోవాలి. అలా చేస్తే.. ఆ ప్లేస్‌‌కు వెళ్లగానే ఆఫీస్ పనులు తప్ప ఇంకేవీ చేయకుండా ఉండే వీలుంటుంది.

ముఖ్యంగా దేశంలో ఏమౌతుందో అని టెన్షన్ పడుతూ చీటికి మాటికి సోషల్ మీడియా, వాట్సప్, ఫేస్ బుక్ మొదలగు వాటిని చూడకుండా దూరంగా ఉండాలి, అవసరమైతే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఓ పదినిమిషాలు, రాత్రి ఎనమిది లోపు ఓ సారి అలా చూసి పక్కన పెట్టాలి. ఫోన్ ను వాడకం ఎంత తక్కువ చేస్తే అంత ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా పడుకునే సమయంలో ఫోన్ తల దగ్గర పెట్టి పడుకోవద్దు, పిల్లలు ఇంట్లో ఊరికే ఉంటే అల్లరి చేయడం, పోట్లాడుకోవడాలు చేస్తుంటారు. అందుకే వారి మేధాశక్తి పెంపోదిచుటకు సనాతన సాంప్రదాయాలను అలవాటు చేస్తూ క్రియేటివిటికి సంబంధించిన పనులను అప్పగించండి.      

ఇల్లును రోజు డెటాల్ వేసి శుభ్ర పరచుకోవాలి. ఇంట్లో నిత్య దీప, దూపం సాంబ్రాణి , గుగ్గిలం, మైసాక్షి, లోబాన్ లాంటి వాటితో ఇల్లంతా దూపం సాయంత్రం సమయాలలో వేస్తూ ఉండాలి. అవకాశం ఉన్న వాళ్ళు నిత్య హోమం లాంటివి చేస్తే మరీ మంచిది. లేదా ఆవు పిడకతో దూపం వేసి అందులో కొంచెం పచ్చ కర్పూరం, రెండు లవంగాలు వేస్తే కూడా మంచిదే. ముఖ్యంగా సాయంసంధ్య సమయంలో గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించడం ద్వారా క్రిములను రాకుండా కాపాడవచ్చు. అప్పుడప్పుడు స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు, రెండు హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకుని స్నానం చేయాలి. చేతి, కాలి గోళ్ళను అస్సలు పెరగనివ్వకూడదు. బెడ్ షీట్స్ రెండు, మూడు రోజులకు ఒకసారి మార్చాలి. పిల్లలకు రాత్రి పూట ఇచ్చే పాలలో చిటికెడు పసుపు కలిపి త్రాగించాలి. ఇలా చేస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.            


 

Follow Us:
Download App:
  • android
  • ios