Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణాలో 2400కు చేరిన రైతుల ఆత్మహత్యలు

  • Prof Kodandaram wants special agriculture policy in Telangana
  • Telangana separate state couldn't offer anything to the farmers
  • The OU Professor  to stage dharna with  farmers in protest  on Sunday
Kodandram to lead farmers protest Sunday

తెలంగణా పేద రైతుల బతుక్కు భద్రత కల్గించి, ఆత్మహత్యలకు పాల్పడకుండా వాళ్లలో ధైర్యం నూరిపోసేందుకు ఒక విధానం  తీసుకురావాలని  ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువచ్చేందుకు  పొలిటికల్ జెఎసి నేత ప్రొఫెసర్ కోదండ్ రామ్  అదివారం నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయబోతున్నారు.

 

 తెలంగాణా వచ్చాక కూడా కొనసాగుతున్న రైతుల ఆత్మ హత్యల నేపథ్యంలో అన్ని జిల్లాలలో రైతుల పరిస్థితిని  అధ్యయనం చేసి,  ఒక వ్యవసాయవిధానం అంటూ లేకపోవడం వల్లే  ఈ దారుణం జరిగి పోతున్నదని ఆయన చెబుతున్నారు. వ్యవసాయ విధానం కోసం ప్రభుత్వం ఉన్నతాధికారులతో చర్చలుజరిపి అనేక సూచనలిచ్చినా   పెద్దగా స్పందన లేకపోవడం వల్ల ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం మీద ఉద్యమానికి పూనుకున్నారు. ఇందులో భాగమే అదివారం నాటి దీక్ష.

 

అయితే, దీక్షకు వారం కిందటే అనుమతికోరినా శనివారం మధ్యాహ్నం దాకా పోలీసు అనుమతే రాలేదు.  ఆయననేమో సాయంకాలనికల్లావస్తుందని భావిస్తున్నారు.

 

ఈ సందర్భంగా ఆయన ’ఎషియానెట్- తెలుగు’ తో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రైతులలో గెండెనిబ్బరం కల్గించలేకపోయిందని అన్నారు. ’ తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక 2400 మంది పేద  రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్లకి మనం ఎలాంటి భరోసా కల్పించలేకపోయాం. ఆత్మహత్యల కేసు హైకోర్టులో విచారణలో ఉన్నపుడు మేం కూడా ఇంప్టీడ్ అయ్యాం. అపుడు కోర్టు మీరు-  ప్రభుత్వం చర్చించి ఒక విధానం తీసుకురావచ్చుగదా అని సూచించారు.

 

దేశంలో రైతు రుణభారానికి సంబంధించి తెలంగాణా అగ్రస్థానంలో  ఉందని,  అక్కడ తలసరి రుణభారం రు. 93 వేలని కోదండరాం చెప్పారు. ఈ భారం నుంచి రైతు విముక్తి కాకపోతే,  ఆత్మహత్యలే మార్గమవుతాయని ఆయన  ఆందోళన చెందారు.

 

దీని మేరకు మేం వ్యవసాయ శాఖముఖ్యకాదర్శితో 40 బృందాలుగా చర్చ లు జరిపాం. చాలా సూచనలు చేశారు.  అయితే, దీనిమీద పెద్దగా కదలిక లేదు. అందుకే మేధావులను, జర్నలిస్టులను, మాజీ శాసన సభ్యులను, మాజీఎంపిలను కూడా  రేపటి మా దీక్షకు ఆహ్వానించాం. దీక్షలో అన్ని జిల్లాల రైతులుపాల్గొంటున్నారు,’ అని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు.

 

తమ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా కేవలం పేద సన్నకారు రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఒక విధానం తీసుకురావాలనే డిమాండ్ తో చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios