Asianet News TeluguAsianet News Telugu

ఆందోోళనలో ఉద్యోగులు

  • షెడ్యూల్ 9, 10 ఉద్యోగుల తొలగింపు
  • ఆందోళనలో ఉద్యోగులు
  • ఉద్యోగులకు జెఏసి మద్దతు
Emplyees problems

రాష్ట్ర విభజనతో 9, 10 షెడ్యూళ్ళలోని ఉద్యోగుల్లో వేలాది మంది త్రిశంకు స్వర్గంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య విడదీసినట్లుగానే హైదరాబాద్ లో పనిచేస్తున్న వందలాది సంస్ధల ఉద్యోగులను కూడా విభజించాల్సి వచ్చింది. సుమారు 240 సంస్ధల్లోని ఉద్యోగుల విభజన కోసం కేంద్రంలోని డిఒపిటి షీలాబిడే అనే అధికారిణి ఆధ్వర్యంలో ఒక కమిటిని కూడా నియమించింది.

సుమారు ఏడాదిన్నర పాటు కమిటి అనేక సమావేశాలు జరిపి, ఉద్యోగుల విభజనపై నివేదికను సిద్ధం చేసింది. అయితే, సదరు నివేదికను కూడా డిఒపిటి తాత్కాలికంగానే ఆమోదించింది. దాంతో 9, 10 షెడ్యూల్లోని ఉద్యోగుల విభజన కూడా ఆర్డర్ టు సర్వ్ పద్దతిలోనే అమలవుతోంది. హైదరాబాద్ లో పనిచేస్తున్న సుమారు 40 వేల మంది ఉద్యోగుల్లో ఏపికి 18 వేలమందిని కేటాయించారు. దాంతో వారంతా తాత్కాలికంగానే అయినా ఏపి ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నారు.

  ఇంతలో ఏపిలోని కొందరు ఉన్నతస్ధాయి ఉద్యోగులు తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకును ఉద్దేశ్యంతో పావులు కదపటం మొదలుపెట్టారు. విచిత్రమేమిటంటే ఏపికి కేటాయింపు జరిగిన ఉద్యోగుల్లో 99 శాతం మంది కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్నావారే. వారంతా గడచిన 15 సంవత్సరాలుగా పని చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా వారినెవరినీ శాస్వత ఉద్యోగులుగా మార్చలేదు. ఎప్పటికప్పుడు వారికి హామీలు ఇవ్వటం తర్వాత మరచిపోవటం రివాజుగా మారింది. ఇంతలో రాష్ట్రమే విడిపోవటంతో వారి కష్టాలు ఒక్క సారిగా పెరిగిపోయాయి.

  ఏపి సచివాలయంలో ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి నిర్వాకం వల్ల వేలాది మంది ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. ఏపి సాక్ (స్పేస్ అప్లికేషన్ సెంటర్) ఏపా సీడ్ కార్పొరేషన్, ఆయిల్ ఫెడరేషన్ లాంటి అనేక సంస్ధల్లో సుమారు ఆరు వేలమంది ఉద్యోగుల జీవితాలు ప్రస్తుతం గాలిలో దీపాల్లాగ తయారైనట్లు సమాచారం. పై సంస్దల్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఇప్పటికే దాదాపు 100 మందికిపైగా ఉద్యోగులను ఎటువంటి కారణాలు లేకుండానే తొలగించినట్లు సమాచారం.

  దాంతో మిగిలిన సంస్ధల్లో పనిచేసే ఉద్యోగుల్లో కూడా అభద్రతా భావం మొదలైంది. దాంతో వారంతా కలిసి ఏపి గెజిటెడ్ అధికారుల జెఎసికి మొరపెట్టున్నారు. అపుడు జెఎసి ఛైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జెఎసి సమావేశం జరిపి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. వారికందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ కూడా చేస్తోంది.

  ఇదే విషయమై కృష్ణయ్య ఏషియానెట్ తో మాట్లాడుతూ, పదిహేనేళ్ళుగా  పనిచేస్తున్న ఉద్యోగులను అర్దంతరంగా తొలగించటం అన్యాయమన్నారు. వారి సమస్యలను తాము ప్రభుత్వ దృష్టకి తీసుకెళుతున్నట్లు చెప్పారు. అవసరమైతే వారికి మద్దతుగా సమ్మె చేయటానికి కూడా వెనకాడేది లేదని స్పష్టం చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios