Asianet News Telugu

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
న్యూఢిల్లీ:స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన  తెలుగు వైద్యురాలు  అస్ట్రేలియాలో  మృతి చెందారు. ఈ విషయాన్ని  స్థానిక అధికారులు  కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

కృష్ణా జిల్లాకు చెందిన  వేమూరు ఉజ్వల  అస్ట్రేలియా  గోల్డ్ కోస్ట్ లోని బాండ్ యూనివర్శిటీలో  ఎంబీబీఎస్ పూర్తి చేశారు.అస్ట్రేలియాలోని  రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో ఆమె పనిచేస్తున్నారు. స్నేహితులతో  సరదాగా గడిపేందుకు ఈ నెల  2వ తేదీన ట్రెక్కింగ్ కు వెళ్లారు ఉజ్వల. అయితే ట్రెక్కింగ్ కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఉజ్వల భౌతిక కాయాన్ని  ఇవాళ  టంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  ఉజ్వల పేరేంట్స్  కూడ అస్ట్రేలియాలోనే  స్థిరపడ్డారు.చిన్ననాటి నుండి వైద్యురాలు కావాలనే కలను ఉజ్వల నెరవేర్చుకుంది.  అయితే  ట్రెక్కింగ్ కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు మరణించడంతో  కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు డెడ్ బాడీ వచ్చింది. అక్కడి నుండి ఉంగుటూరు మండలంలోని ఎలుకపాడు గ్రామానికి పార్థీవదేహన్ని తరలించారు. ఈ గ్రామంలోనే ఉజ్వల అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఉజ్వలను కడసారి చూసేందుకు స్థానికులు  పెద్ద ఎత్తున వచ్చారు.

షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..
వాషింగ్టన్ : అమెరికాలో భారతీయులపై దాడులు, భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యేడాది కాలంలో ఇప్పటికే ఐదుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా మరణించగా... హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని అతని అపార్ట్ మెంట్ ముందే నలుగురు వ్యక్తులు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్, వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో మరొకరు చేశారు. ఓ  భారతీయ-అమెరికన్ మృతి చెందాడు. ఈ వారం ప్రారంభంలో వాషింగ్టన్ రెస్టారెంట్ వెలుపల జరిగిన పోరాటంలో ప్రాణాంతక గాయాలతో చికిత్స పొందుతున్న వర్జీనియాకు చెందిన వివేక్ తనేజా మరణించాడు.

నిందితుడు, బాధితుడు ఇద్దరూ ఘటన జరిగిన ఫిబ్రవరి 2న రెండు జపనీస్ రెస్టారెంట్లలో ఉన్నట్లు పోలీసు గుర్తించినట్లు తెలిపారు. బాధితుడిని "అనుమానితుడు నేలపై పడేశాడు. తలను పేవ్‌మెంట్‌ కేసి కొట్టాడు" అని వాషింగ్టన్ పోస్ట్ పోలీసులు తెలిపారు. యుఎస్‌లో భారతీయులు, భారతీయ-అమెరికన్‌లపై అనేక దాడుల క్రమంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

అమెరికాలో మరో భారతీయ సంతతి విద్యార్థి మృతి.. ఈ యేడాది ఐదో ఘటన..

తనేజా, 41, తెల్లవారుజామున 2 గంటల సమయంలో రెస్టారెంట్ల నుండి బయలుదేరాడు. సమీపంలోని వీధిలో గొడవ జరిగిందని.. గొడవ ఎందుకు జరిగిందో వివరించకుండా.. పోలీసుల నివేదిక పేర్కొంది. దాడిలో బాధితుడు స్పృహ కోల్పోయాడు.  పోలీసులు అక్కడికి వచ్చేసరికి ప్రాణాపాయ గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడి ఫొటోను పోలీసులు షేర్ చేశారు.  సీసీటీవీలో కనిపించిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడిని ఇంకా గుర్తించలేదు. అతని ఆచూకీ తెలిపిన వారికి, లేదా ఘటనకు సంబంధించి ఏదైనా క్లూ ఇచ్చేవారికి 25,000 డాలర్ల రివార్డ్‌ను ప్రకటించారు.

ఈ వారం ప్రారంభంలో, చికాగోలో దొంగలు దాడి చేయడంతో ఒక భారతీయ విద్యార్థి ముక్కు, నోటి నుండి రక్తస్రావం అయిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే వ్యక్తి దాడికి గురయ్యాడు. ఈ ఏడాది అమెరికాలో మరో నలుగురు భారతీయ సంతతి విద్యార్థులు మరణించినట్లు సమాచారం.అమెరికా పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్న 19 ఏళ్ల విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగెర్ గత వారం చనిపోయినట్లు గుర్తించారు, అయితే అధికారులు దీనిని నిర్ధారించారు.

అమెరికాలో మరో భారతీయ సంతతి విద్యార్థి మృతి.. ఈ యేడాది ఐదో ఘటన..
న్యూఢిల్లీ : అమెరికాలో భారత సంతతికి చెందిన మరో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఏడాది ఇలా మృతి చెందిన ఐదవ ఘటన ఇది. సమీర్ కామత్ అనే భారత సంతతి విద్యార్థి అమెరికా, ఇండియానాలోని పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ చదువుతున్నారు. సోమవారం సాయంత్రం నేచర్ రిజర్వ్‌లో కామత్ మృతజీవిగా ఉండడం గుర్తించారు. ఈ మేరకు వారెన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ఒక ప్రకటనలో ధృవీకరించింది.

23 ఏళ్ల కామత్ 2023 ఆగస్టులో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. కామత్ కు యుఎస్ పౌరసత్వం ఉందని ప్రకటన పేర్కొంది. కామత్ తన డాక్టరల్ ప్రోగ్రామ్‌ను 2025లో పూర్తి చేయబోతున్నాడు. కామత్ మృతిపై ఫోరెన్సిక్ శవపరీక్ష నిర్వహించిన అనంతరం నివేదికను  విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి.. వీడియోలు వైరల్...

పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి నీల్ ఆచార్య చనిపోయిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. నీల్ ఆచార్య తల్లి మిస్సింగ్ రిపోర్టుతో అతని మృతి వెలుగు చూసింది. నీల్ ఆచార్య మృతదేహం  క్యాంపస్ గ్రౌండ్ లో లభ్యమైంది.

గత వారం, 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి ఓహియోలో శవమై కనిపించాడు. ఈ కేసులో ఏదైనా ఫౌల్ ప్లే లేదా ద్వేషపూరిత నేరం జరిగే అవకాశం లేదని అధికారులు తోసిపుచ్చారు.

జార్జియాలోని లిథోనియాలో ఎంబీఏ చదువుతున్న వివేక్ సైనీ జనవరి 16న నిరాశ్రయుడైన వ్యక్తి దాడి చేయడంతో మరణించాడు. ఈ సంఘటనలు యునైటెడ్ స్టేట్స్‌లో భారతీయ విద్యార్థి సంఘం ఆందోళనకు కారణం అయ్యింది. దీంట్లో 300,000 కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉన్నారు.

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి.. వీడియోలు వైరల్...
హైదరాబాద్ : అమెరికాలో భారతీయ విద్యార్థుల మీద దాడులు ఆగడం లేదు. గతవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. తాజాగా చికాగోలో ఓ భారతీయ విద్యార్థి దొంగల దాడికి గురయ్యాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా.. సహాయం కోసం అర్థిస్తున్న వీడియో వైరల్ గా మారింది. నలుగురు దుండగులు అతనిని వెంటాడడం.. ఆ తరువాత రక్తం కారుతూ సహాయం కోసం అర్థించడానికి సంబంధించిన వీడియోలు వెలుగు చూశాయి.

ఈ ఘటన వైరల్ అవ్వడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న ఆయన కుటుంబసభ్యులు తీవ్రంగా కంగారు పడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన భార్య, తన పిల్లలతో భర్త దగ్గరికి వెళ్లేందుకు అనుమతించాలని యూఎస్ అధికారులకు లేఖ రాశారు. అతనికి సరైన చికిత్స అందేలా చూడాలని ఆయన భార్య సయ్యదా రుకులియా ఫాతిమా రిజ్వీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు.

ఆమె రాసిన లేఖలో.. "అమెరికాలోని చికాగోలో ఉన్న నా భర్త భద్రత గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందించడంతో సహాయం చేయండి. వీలైతే నేను నా ముగ్గురు మైనర్ పిల్లలతో కలిసి అమెరికాకు నా భర్త దగ్గరికి వెళ్లడానికి దయచేసి అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అనిరాసింది.

అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థి అనుమానాస్పదమృతి.. వారంలో మూడో ఘటన...

సయ్యద్ మజాహిర్ అలీ ఇండియానా వెస్లియన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ విద్యార్థి. ఆయనపై దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగు చూసింది. చికాగో ఇంటి సమీపంలో అతనిపై దాడి జరిగింది. దీనికి ముందు ముగ్గురు వ్యక్తులు అతనిని వెంబడిస్తున్నట్లు కనిపిస్తుంది.

దీనిమీద అలీ మాట్లాడుతూ.. "ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నలుగురు వ్యక్తులు నాపై దాడి చేశారు. వారినుంచి పారిపోయే క్రమంలో కింద పడ్డాను. వెంటనే వాళ్లు నన్ను పట్టుకుని కొట్టారు. దయచేసి నాకు సహాయం చెయ్యండి బ్రో, దయచేసి నాకు సహాయం చెయ్యండి" అని అలీ వీడియోలో వేడుకోవడం కనిపిస్తుంది.

ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ సంతతి విద్యార్థులు మృతి చెందారు. ఈ క్రమంలో అలీపై దాడి సంచలనం కలిగించింది. గత వారం అమెరికన్ పాస్‌పోర్ట్‌ ఉన్న 19 ఏళ్ల విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ చనిపోయి కనిపించాడు. నీల్ ఆచార్య అనే మరో విద్యార్థి ఆ వారం ప్రారంభంలో పర్డ్యూ యూనివర్శిటీ క్యాంపస్‌లో చనిపోయి కనిపించాడు.

హర్యానాకు చెందిన 25 ఏళ్ల విద్యార్థి వివేక్ సైనీ జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో నిరాశ్రయుడైన వ్యక్తి కొట్టడంతో చనిపోయాడు. మరో భారతీయ విద్యార్థి అకుల్ ధావన్ జనవరిలో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ వెలుపల శవమై కనిపించాడు.

.@DrSJaishankar Sir, One Syed Mazahir Ali from Hyderabad, Telangana pursuing Masters in IT from Indiana Weslay University was robbed & attacked on 4th Feb by four persons in Chicago, Since this attack Syed Mazahir Ali is under mental shock and is in need of help.Ask… pic.twitter.com/Cf2jeMAvPw
— Amjed Ullah Khan MBT (@amjedmbt) February 6, 2024

అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థి అనుమానాస్పదమృతి.. వారంలో మూడో ఘటన...
న్యూఢిల్లీ : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. ఇది ఈ ఏడాది నాలుగో ఘటన, ఈ వారంలో మూడో ఘటన. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి బెనిగర్ ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థి. శ్రేయాస్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారని, అయితే అతని వద్ద అమెరికా పాస్‌పోర్ట్ ఉందని అధికారులు మీడియాకు తెలిపారు.

ఈ కేసులో ఏదైనా ఫౌల్ ప్లే లేదా ద్వేషపూరిత నేరం జరిగే అవకాశం లేదని అధికారులు తోసిపుచ్చారు. దీనిమీద న్యూయార్క్‌లోని ఇండియన్ మిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రేయాస్ మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

"ఓహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసు విచారణ కొనసాగుతోంది. ఈ దశలో, ఫౌల్ ప్లే అనుమానించబడలేదు. కాన్సులేట్ కుటుంబంతో సన్నిహితంగా ఉండి కావాల్సిన సహయాసహకారాలు అందిస్తోంది. వారికి అన్ని విధాలుగా సహాయం చేయండి" అని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ X లో పోస్ట్ చేసింది.

రంగారెడ్డి జిల్లా రైతు అదృష్టం:లక్కీ డ్రాలో కిలో బంగారం

ఈ వారం ప్రారంభంలో పర్డ్యూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి , నీల్ ఆచార్య శవమై కనిపించాడు. ఆచార్య అదృశ్యమైనట్లు అతని తల్లి ఆదివారం ఫిర్యాదు చేసింది. కొన్ని గంటల తర్వాత, యూనివర్సిటీ క్యాంపస్‌లో ఒక మృతదేహం వెలుగు చూసింది. అది నీల్ ఆచార్యగా గుర్తించారు. అంతకు ముందు నీల్ ఆచార్య కనిపించడం లేదని.. అతని తల్లి గౌరీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ చేసింది. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తెలపాలని కోరింది. ఆ తరువాత ఆమెకు నీల్ ను చివరిసారిగా ఉబెర్ డ్రైవర్ చూశాడని, క్యాంపస్ దగ్గర వదిలేసినట్టు తేలింది.

మరో కేసులో, హర్యానాలోని పంచకుల నివాసి అయిన వివేక్ సైనీని జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో ఓ వ్యక్తి వ్యక్తి కొట్టి చంపాడు. జార్జియాలోని లిథోనియాలో ఎంబీఏ డిగ్రీ చేస్తున్న వివేక్ సైనీ, ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేశాడు. సైనీ మీద దాడి చేసిన వ్యక్తి నిరాశ్రయుడు. అతనికి సైనీ అప్పుడప్పుడు చిప్స్, నీరు, జాకెట్ కూడా ఇచ్చినట్లు నివేదించబడింది.

జనవరి 16న, 25 ఏళ్ల సైనీ.. అతనికి ఉచిత ఆహారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో నిందితుడు సైనీ మీద దాడి చేసి, 50 సార్లు కొట్టాడని పోలీసులు తెలిపారు. మరో భారతీయ విద్యార్థి అకుల్ ధావన్ జనవరిలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్  వెలుపల శవమై కనిపించాడు.

18 ఏళ్ల యువకుడి శవపరీక్షలో అతను అల్పోష్ణస్థితితో మరణించాడని సూచించింది.అయితే, అకుల్ ధావన్ కనిపించకుండా పోయిన తర్వాత యూనివర్సిటీ పోలీసు విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ధావన్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

అమెరికాలో 300,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. గత రెండు సంవత్సరాలలో, కోవిడ్ తర్వాత 200,000 మంది విద్యార్థులకు అమెరికా వీసాలు జారీ చేయబడ్డాయి. మానసిక ఒత్తిడి, ఒంటరితనం, మాదకద్రవ్య దుర్వినియోగానికి గురికావడం చాలా సందర్భాలలో ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

Ayodhya Ram Mandir Inauguration : ఇంట్లో ఐదు దీపాలు వెలిగించనున్న ఇండో అమెరికన్లు...
అమెరికా : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే హిందూ అమెరికన్లు ఆ రోజు తమ ఇళ్లలో ఐదు దీపాలను వెలిగించాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంఘం వివిధ నగరాల్లో కార్ ర్యాలీలు నిర్వహించడం, గ్రాండ్ ప్రారంభోత్సవ వేడుక యొక్క ప్రత్యక్ష ప్రదర్శన, కమ్యూనిటీ సమావేశాలు మరియు పార్టీలను వీక్షించడం వంటి కార్యక్రమాల శ్రేణిని ప్లాన్ చేసింది.

Year Ender World 2023 : ప్రపంచాన్ని కుదిపేసిన భూకంపాలు, అగ్నిపర్వతాలు, యుద్ధాలు.. ఇంకా...

"మనందరికీ కల నిజమైన సందర్భం. ఈ రోజును చూడగలమని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఆ అద్భుత క్షణం రానే వచ్చింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుపుకునే సమయం" అని చికాగోకు చెందిన ఇండో అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు భరత్ బరాయ్ పీటీఐకి చెప్పారు.

జనవరి 22న ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఆలయ అధికారులు ఆహ్వానించిన వారిలో డాక్టర్ భరత్ బరాయ్ మాట్లాడుతూ, రామజన్మభూమి ఉద్యమంలో పెద్ద సంఖ్యలో హిందూ అమెరికన్లు పాల్గొన్నారని చెప్పారు.

విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా (VHPA) విభాగం ఇక్కడ ఉత్సవాల్లో ముందంజలో ఉంది. ఈ వేడుకల్లో 1,000 కంటే ఎక్కువ దేవాలయాలు, వ్యక్తులు పాల్గొనేందుకు వీలుగా -- https://rammandir2024.org - వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

భారతదేశంలో జరిగే అసలు వేడుక నుండి అన్ని నమోదిత దేవాలయాలకు ప్రసాదాలు అందుతాయని వీహెచ్ పీఏకు చెందిన అమితాబ్ మిట్టల్ తెలిపారు. "అమెరికన్ హిందువులు వర్చువల్ గా వేడుకలో పాల్గొనడానికి, ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగం కావడానికి ఏర్పాట్లు చేశాం" అని ఆయన చెప్పారు.

మిట్టల్ తెలిపిన వివరాల ప్రకారం, వేడుక ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆలయంలో పవిత్రోత్సవాన్ని జరుపుకోవడానికి హిందూ అమెరికన్లందరికీ వారి ఇళ్లలో కనీసం ఐదు దీపాలను వెలిగించాలని వీహెచ్ పీఏ పిలుపునిచ్చింది.

"హిందూ అమెరికన్లు ఈ వేడుక కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు అయోధ్యకు వెళ్లాలని కోరుకుంటున్నారు" అని ఆయన అన్నారు.

అమెరికాలో తాత, మామలను హత్య చేసిన కేసులో 23 ఏళ్ల భారతీయ విద్యార్థి అరెస్ట్
అమెరికా : ఓ 23 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలో దారుణానికి పాల్పడ్డాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన అమ్మమ్మ,తాతయ్యలతో పాటు అంకుల్ కుటుంబాన్ని కాల్చి చంపాడు.  న్యూజెర్సీలోని ఓ అపార్ట్ మెంట్ లో ఈ హత్యలు జరిగాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి, హత్య అభియోగాలు మోపినట్లు పోలీసులు, యూఎస్ మీడియా నివేదికలు తెలిపాయి.

ఓం బ్రహ్మ్‌భట్‌ అనే ఆ విద్యార్థి  దిలీప్‌కుమార్ బ్రహ్మభట్ (72), బిందు బ్రహ్మభట్ (72), యష్‌కుమార్ బ్రహ్మభట్ (38)లను కాల్చిచంపారని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీసు విభాగం, మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

సోమవారం ఉదయం 9 గంటలకు సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లోని న్యూ డర్హామ్ రోడ్‌లోని ఓ ఇంట్లో హత్యలు జరిగినట్లు పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ అధికారులు ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు కనుగొన్నారు. వారిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరు తుపాకీతో కాల్చడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు.

పాక్‌లో వెంటిలేటర్‌పై 26/11 దాడుల సూత్రదారి సాజిద్ మీర్ .. విష ప్రయోగం అనుమానాలు, ఐఎస్ఐ పనేనా..?

రెండో అంతస్తులో ఉన్న అపార్ట్‌మెంట్‌లో దిలీప్‌కుమార్, బిందు బ్రహ్మభట్ చనిపోయి ఉండగా, మరో గదిలో కుమారుడు యష్‌కుమార్ బ్రహ్మభట్‌కు కూడా తుపాకీ గాయాలతో ఉండడం గుర్తించారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ అతను మరణించాడు.

సంఘటనా స్థలంలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించి అనంతరం కేసు నమోదు చేశారు. ఓమ్‌పై ఫస్ట్-డిగ్రీ మర్డర్, సెకండ్-డిగ్రీ.. ఆయుధాలను కలిగి ఉండడంతో పాటు మూడు అభియోగాలు మోపారు. గుజరాత్‌కు చెందిన ఓం, బాధితులతో కలిసి ఉంటున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఇంట్లోనే కనిపించాడు.

ఓం న్యూజెర్సీకి వెళ్లి రెండు నెలలే అవుతోంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన తుపాకీతో నేరం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం కోర్టుకు హాజరైన సమయంలో ఓం ప్రశాంతంగా కనిపించాడు. ఆ రోజు ఉదయం 911కి కాల్ చేసింది అతనేనని తేలింది. పోలీసులకు ఫోన్ ఎవరు చేశారనే విషయాన్ని అడిగితే, "అది నేనే కావచ్చు" అని ఓం చెప్పాడని అధికారులు చెప్పారు.

కాల్పులకు దారితీసిన విషయం స్పష్టంగా తెలియరాలేదు. వారి పక్కింటి వ్యక్తి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇలా జరగడం ఇదేం మొదటిది కాదు. కానీ ఈ ఘటన నాకు  గగుర్పాటు కలిగించింది అన్నారు. మృతుల కుటుంబం గురించి తనకు తెలియదని, పరిచయం లేదని అన్నారు.

భారత్ నుండి వలస వచ్చిన అనేక కుటుంబాలు ఈ ట్రెడిషన్స్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటాయి. విచారణలో వారు సహకరిస్తారని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన హింస కాదని నిర్ధారించారని ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.

అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి వరుణ్ రాజ్ మృతి ..
ఖమ్మం : అమెరికాలో ఓ జిమ్ లో గుర్తుతెలియని వ్యక్తి దాడిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి వరుణ్ రాజ్ మృతి చెందాడు. అక్టోబర్ 31న జరిగిన ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన వరుణ్ రాజ్ అప్పటినుంచి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  వెంటిలేటర్ మీద వరుణ్ రాజ్ కు చికిత్స అందించారు. అయినా, అతనికి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతను మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

దీంతో వరుణ్ రాజ్ ఇంట్లో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్ రాజ్ ఉన్నత చదువుల నిమిత్తం ఏడాదిన్నర క్రితం అమెరికాకు వెళ్ళాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31వ తేదీన అమెరికాలోని ఓ జిమ్ లో ఉండగా..అప్పుడే జిమ్ లోకి వచ్చిన ఓ వ్యక్తి అతని మీద కత్తితో దాడి చేశాడు.

అమెరికాలో కత్తిపోట్లు : ఇంకా విషమంగానే వరుణ్ రాజ్ ఆరోగ్యపరిస్థితి..

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వరుణ్ రాజ్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అపస్మారపు స్థితిలోకి చేరుకున్న వరుణ్ రాజ్ కు వైద్యులు అత్యవసరంగా చికిత్సను ప్రారంభించారు. తలకు బలమైన గాయం కావడం.. మెదడుకు దెబ్బ తగలడంతో.. వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. కానీ, అతని పరిస్థితి విషమంగానే ఉందని.. ఇందులో మంచి బయటపడినా జీవితకాలం అంగవైకల్యం బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. 8 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడి వరుణ్ రాజు మృతి చెందాడు. వరుణ్ రాజ్ తండ్రి  రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లాలో టీచరుగా పనిచేస్తున్నారు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 31న అమెరికాలో ఓ తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. జిమ్ లో ఉన్న వరుణ్ అనే యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. వరుణ్ తలమీద దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీనివల్ల మెదడుకు గాయం అయ్యింది. వరుణ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతనికి ఐసియులో చికిత్స చేస్తున్నారు. వరుణ్ స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాగా గుర్తించారు.

దాడికి పాల్పడింది జోర్డాన్ ఆండ్రేడ్ అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జిమ్ లో నిందితుడు ప్రవేశించే సమయానికి వరుణ్ మసాజ్ కుర్చీపై కూర్చుని ఉన్నాడు. వరుణ్ ను చూసి ఆండ్రేడ్ ఆందోళనకు గురయ్యాడు. తనమీద వరుణ్ దాడి చేస్తాడని భయపడి, జేబులోని కత్తితో దాడి చేసినట్లుగా పోలీసులకు తెలిపాడు. నిందితుడు ఆండ్రేడ్ ను కోర్టులో హాజరుపరిచారు.

మరోవైపు అమెరికాలో తెలుగు విద్యార్థిపై దాడి కేసులో తెలంగాణ మంత్రి కేటీఆర్ నవంబర్ 1న స్పందించారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని తెలిపారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహకారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని.. కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు.

వరుణ్ కుటుంబసభ్యులతో తన టీం టచ్ లో ఉంటారని, కావాల్సిన సహాయం అందిస్తారని చెబుతూ..వరుణ్ పరిస్థితిపై మానసా కాపురి అనే డాక్టర్ చేసిన ట్వీట్ ను షేర్ చేశారు మంత్రి కేటీఆర్.

అమెరికాలో కత్తిపోట్లు : ఇంకా విషమంగానే వరుణ్ రాజ్ ఆరోగ్యపరిస్థితి..
అమెరికా : తెలంగాణకు చెందిన వరుణ్ రాజ్ అనే విద్యార్థిపై అమెరికాలో మూడు రోజుల క్రితం దాడి జరిగింది. జిమ్ లో ఉన్న అతనిపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తలకు తీవ్రగాయాలయ్యాయి. మెదడుకు గాయాలైనట్లుగా పోలీసులు తెలిపారు. మూడు రోజులు గడుస్తున్నా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.

కంప్యూటర్ సైన్స్ విద్యార్థి పి వరుణ్ రాజ్‌ను ఆదివారం ఉదయం పబ్లిక్ జిమ్‌లో జోర్డాన్ ఆండ్రేడ్ (24) అనే దుండగుడు కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు.

"మూడు రోజుల చికిత్స తర్వాత, వరుణ్ లైఫ్ సపోర్టు మీద ఉన్నాడు. అతడికి తీవ్రమైన నరాల బలహీనత ఉంది. బతికినా జీవితాంతం శాశ్వత అంగ వైకల్యంతో ఉంటాడు. కంటిచూపు పాక్షికంగా దెబ్బతినొచ్చు. శరీరం ఎడమ వైపు బలహీనంగా, పనిచేయకుండా అవ్వొచ్చు’’ అని తెలిపాయి.

అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తులతో దాడి.. స్పందించిన మంత్రి కేటీఆర్..

ఈ సంఘటన తరువాత, దాడి చేసిన, జోర్డాన్ ఆండ్రేడ్ (24)ను అరెస్టు చేశారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో వరుణ్‌ని ఇప్పుడు ఫోర్ట్ వేన్‌లోని లూథరన్ ఆసుపత్రికి తరలించారు.

జోర్డాన్ ఆండ్రేడ్ ను పోర్టర్ సుపీరియర్ కోర్ట్ జడ్జి ముందు హాజరుపరిచారు. నిందితుడు నేరం అంగీకరించినట్టుగా సమాచారం.  న్యాయమూర్తి అతనికి 500,000 డాలర్ల నగదు బాండును, మరో 500,000 డాలర్లు ష్యూరిటీగా విధించారు.

వరుణ్ రాజ్ చదువుకుంటున్న యూనివర్శిటీ ప్రెసిడెంట్ తమ విద్యార్థిపై జరిగిన పాశవిక దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “వరుణ్ రాజ్‌పై జరిగిన దాడితో మేము దిగ్భ్రాంతి చెందాం. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ త్వరగా కోలుకుని రావాలని ప్రార్తిస్తున్నామని చెప్పడంతప్ప ఏమీ చేయలేం’ అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.

వరుణ్ రాజ్ చికిత్స కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) GoFundలో నిధులు సమీకరిస్తోంది. బుధవారం రాత్రి నాటికి 38,000 డాలర్లకు పైగా సేకరించింది. "ప్రస్తుతం, వరుణ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కోమాలో పోరాడుతున్నాడు. అతని వైద్యానికి అయ్యే ఖర్చులు, అతని తల్లిదండ్రులు అమెరికా రావడం కోసం అయ్యేప్రయాణ ఖర్చులను భరించేందుకు మా మద్దతును కోరుతున్నారు ”అని నాట్స్ తెలిపింది.

అమెరికాలో తెలుగు విద్యార్థి పై కత్తితో దాడి...
ఖమ్మం : అమెరికాలో ఓ తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది.  జిమ్ లో ఉన్న వరుణ్ అనే యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. ఐసియులో చికిత్స చేస్తున్నారు. వరుణ్ స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాగా గుర్తించారు. దాడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి దుర్మరణం..
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువతి మృతిచెందింది. ఉన్నత చదవుల కోసం అమెరికాకు వెళ్లిన యువతి.. అక్టోబర్ 15వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్ష కున్వర్ హైందవి కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లింది. కాన్సాస్‌లోని ఓ యూనివర్సిటీలో చదవుతుంది. అక్టోబర్ 15వ తేదీ రాత్రి ప్రతీక్ష, తన సోదరి ప్రియాంక, స్నేహితుడు సాయి తేజ, డ్రైవర్ వరుణ్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రతీక్ష ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సాయితేజ, ప్రియాంకలకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ప్రతీక్ష అక్కడికక్కడే మృతి చెందింది. కారు నడుపుతున్న మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ప్రతీక్ష కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ప్రతీక్ష మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం లేదా సోమవారాల్లో ప్రతీక్ష మృతదేహాన్ని హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఇక, హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రతీక్ష కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సాధ్యమైన సహాయం అందజేస్తున్నారు.

చంద్రబాబుతోనే మేమంతా...పోరాటంలో తోడుంటాం..:కెనడాలో ప్రవాసీల భారీ నిరసన
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు వ్యతిరేకంగా కెనడాలోని టొరంటో పట్టణంలో ప్రవాసీయులు నిరసన చేపట్టారు.

టొరంటో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ ను టిడిపి నాయకులు ఖండిస్తుండగా వైసిపి ప్రభుత్వం, నాయకులు మాత్రం సమర్ధిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టిడిపి ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజూ ఏదోఒక రూపంలో నిరసన తెలియజేపస్తున్నారు.

కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు పొరుగు రాష్ట్రాలు, చివరకు విదేశాల్లోనూ చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా కెనడాలో స్థిరపడిన తెలుగువారు చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు.  సెంట్రల్ టోరంటో నగరంలో దాదాపు 500 మంది తెలుగుదేశం పార్టీ జెండాలు, చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.

ఇరు తెలుగు రాష్ట్రాలకు (ఏపీ, తెలంగాణ) చెందినవారు చంద్రబాబుతో వుంటామంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తే టోరంటోలో నిరసనకు దిగారు. ఇలా చంద్రబాబుకు మద్దతుగా వివిధ రకాలుగా నిరసన తెలిపారు. కొందరు మహిళలు చిన్నారులను సైతం తీసుకువచ్చి ఈ నిరసనలో పాల్గొన్నారు.

ఇటీవల ఇలాగే అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగు ప్రజలు నిరసనలు చేపట్టారు. న్యూజెర్సీలో టిడిపితో పాటు జనసేన జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తాము ఇలా విదేశాల్లో స్థిరపడగానికి కారణం చంద్రబాబేనని... ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే చూస్తూ వుండలేకపోతున్నామని ప్రవాసులు అంటున్నారు. అందవల్లే దేశం కాని దేశంలో నిరసనకు దిగినట్లు ప్రవాసులు చెబుతున్నారు.

ఇక హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఐటీ రంగం ఇంతలా అభివృద్ది చెందడానికి చంద్రబాబే కారణమని... అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం తమనెంతో కలచివేస్తోందని అన్నారు. ఇలా చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వస్తున్నారు. టిడిపి కూడా వివిధ రూపాల్లో ఆందోళనలకు పిలుపునిస్తోంది.

సౌదీలో ఘోర అగ్నిప్రమాదం... తెలంగాణ వ్యక్తి సజీవదహనం...
సౌదీ అరేబియా : సౌదీ అరేబియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రవాసీలు మృతిచెందగా అందులో ఒక తెలుగు వ్యక్తి ఉన్నాడు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్  మండలానికి చెందిన 39యేళ్ల మహమ్మద్ జావిద్ ఈ అగ్నిప్రమాదంలో మృతి చెందాడు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న ఓ కుటుంబం దగ్గర అతడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

అతను ఓ వసతి గృహంలో బంగ్లాదేశ్ కు చెందిన మరో ఇద్దరు కార్మికులతో కలిసి ఉంటున్నాడు. వారి గదిలో ఏసీ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జావిద్ తో పాటు ఇద్దరు బంగ్లాదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ముగ్గురు ఆ మంటల్లోనే సజీవ దహనం అయిపోయారు.

20మంది ప్రయాణికులతో కూడిన ఆర్టిసి బస్ యాక్సిడెంట్... తప్పిన పెను ప్రమాదం

ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునేసరికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. జావీద్ బంధువులు సౌదీలో ఉన్నారు. వారికి సమాచారం తెలిసి వెంటనే తెలంగాణలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మహమ్మద్ జావీద్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మీద ఆధారపడిన తల్లి కూడా ఉంది. వీరందరికీ జావిద్ ఒక్కడే ఆధారం. ఆరేళ్ల క్రితం జీవనోపాధి కోసం జావీద్ సౌదీకి వెళ్ళాడు. తండ్రి ఇటీవలే క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి పెద్దదిక్కు లేకపోవడంతో భారత్ తిరిగి రావాలని అనుకుంటున్నాడు. అంతలోనే అగ్ని ప్రమాదం రూపంలో ఘోరం జరిగిపోయింది.

జావీద్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబం అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ ఎంబసీని, సౌదీ అరేబియాలోని ఇండియన్ కమ్యూనిటీ కార్యకర్తల సహాయం చేయాలని కోరుతున్నారు.

దుబాయ్ లాటరీ లక్కీ డ్రాలో రూ. 8కోట్లు గెలుచుకున్న భారతీయుడు..కానీ...
దుబాయ్ : ఓ భారతీయ వ్యక్తి దుబాయిలో మిలియనీర్ రాఫెల్ లాటరీలో వన్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ లాటరీలో జాక్ పాట్ కొట్టాడు. ఇండియన్ కరెన్సీ లో ఈ మొత్తం రూ.8.22 కోట్లు. ఆ భారతీయ వ్యక్తి పేరు సయ్యద్ అలీ బాతుషా తివంశ. ఈ లాటరీలో జాక్ పాట్ కొట్టడంతో రాత్రికి రాత్రే సయ్యద్ అలీ కోటీశ్వరుడు అయిపోయాడు.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ టు దగ్గర  బుధవారం నిర్వహించిన లక్కీ డ్రాలో సయ్యద్ అలీకి ఈ జాక్పాట్ దక్కింది. సయ్యద్ అలీ యూఏఈలో ఉంటాడు. ఇతను ఆగస్టు 30వ తేదీన 4392 నెంబర్ గల లాటరీ టికెట్ను ఆన్లైన్ లో కొన్నాడు. సరదాగా కొన్న లాటరీ టికెట్ ఇప్పుడు అతడిని కోటీశ్వరుడిని చేసింది.

చెన్నైలో మానవ అవయవ అక్రమ వ్యాపారం రాకెట్‌.. ఆఫ్రికన్‌లతో సహా ఐదుగురి అరెస్ట్...

బుధవారం తీసిన డ్రాలో ఆన్లైన్లో కొన్న టికెట్ కు లాటరీ తగలడంతో నిర్వాహకులు సయ్యద్ అలీ ఫోన్ నెంబర్ కు కాంటాక్ట్ చేశారు. కానీ, అతని నెంబర్ కలవలేదు. దీంతో అతనిని కాంటాక్ట్ చేయడానికి వేరే మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకులు ఈ మేరకు తెలిపారు.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ 1999లో ప్రారంభమైంది. ఈ టికెట్ల కొనుగోలులో ఇప్పటివరకు ఒక మిలియన్ డాలర్ గెలుచుకున్న భారతీయుల్లో సయ్యద్ అలీ 25వ వ్యక్తిగా నిర్వాహకులు తెలిపారు. ఈ లాటరీ టికెట్ను కొనుగోలు చేసేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

యాక్సిడెంట్‌లో భారతీయ విద్యార్థి మృతి.. నవ్వుతూ, హేళనగా మాట్లాడిన పోలీసుఅధికారి... షాకింగ్ వీడియో..
అమెరికా : ఈ ఏడాది జనవరిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని ఓ భారతీయ సంతతికి చెందిన మహిళ అమెరికాలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి.. ఓ పోలీసు అధికారి నవ్వుతూ, హేళనగా మాట్లాడటం అతని బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో సీటెల్ పోలీసు యూనియన్ లీడర్లపై దర్యాప్తు ప్రారంభించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

సోమవారం విడుదల చేసిన ఈ వీడియోలో, ఆఫీసర్ డేనియల్ ఆడెరర్ జనవరి 23న తన సహోద్యోగి, ఆఫీసర్ కెవిన్ డేవ్ పెట్రోలింగ్ వాహనంతో హత్యకు గురైన గ్రాడ్యుయేట్ విద్యార్థి జాహ్నవి కందుల మృతికి సంబంధించిన ప్రమాద దర్యాప్తు గురించి చర్చిస్తున్నట్లు వినిపిస్తుంది. 23 ఏళ్ల జాహ్నవి కందుల నార్తీస్ట్రన్ విశ్వవిద్యాలయం, సీటెల్ క్యాంపస్‌లో మాస్టర్స్ విద్యార్థి.

ఫ్లైట్‌లో టాయిలెట్‌లో శృంగారం.. డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికులు షాక్.. వీడియో వైరల్

క్లిప్‌లో, సీటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరర్, గిల్డ్ ప్రెసిడెంట్‌తో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఆయన నవ్వుతూ, మృతురాలి గురించి మేళనగా మాట్లాడారు. ఆమె ఒక "సాధారణ వ్యక్తి" అని, ః"ఆమె చనిపోయింది" అని చెప్పడం వినిపిస్తుంది. దీంతోపాటు నవ్వుతూ, పదకొండు వేల డాలర్లకు ఒక చెక్కు రాయండి" అనడం వినిపిస్తుంది.

క్లిప్ లో చివరకు అతను అన్న మాటలు మరింత విషాదకరంగా ఉన్నాయి.. "ఆమెకు 26 సంవత్సరాలే, ఆమె విలువ పరిమితమే’’ అనడం షాకింగ్ కు గురి చేస్తుంది. సీటెల్ కమ్యూనిటీ పోలీస్ కమీషన్  వీడియో విడుదలైన తర్వాత సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది, ఆడెరర్, అతని సహోద్యోగి మధ్య జరిగిన సంభాషణ "హృదయ విదారకమైనది, దిగ్భ్రాంతికరమైనది" అని పేర్కొంది.

''సమాజంలో విశ్వాసాన్ని పెంపొందించడం, ప్రజా భద్రతకు భరోసా కల్పించే బాధ్యత కలిగిన పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉండడానికి సీటెల్ ప్రజలు అర్హులు’’ అని రాశారు. ఇందులో భాగంగానే "పారదర్శకత కోసం"
సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ వీడియోను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి సౌత్ లేక్ యూనియన్‌లో సియాటెల్ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించింది, జాహ్నవి కందుల సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థిని. ఈ డిసెంబర్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకునేది.

ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన తెలంగాణ మహిళ.. తొలి భారతీయ సంతతి మహిళగా గుర్తింపు....
హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ డిప్యూటీ మేయర్ గా. ఎన్నికయ్యారు. గురువారంనాడు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీనగరంలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ గా కర్రి సంధ్యారెడ్డి అనే మహిళ ఎన్నికయ్యారు. ఆమెను శాండీ రెడ్డి అని కూడా పిలుస్తారు. సంధ్యారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాద్ కు చెందిన వ్యక్తి.

ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా పదవి చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగా సంధ్యారెడ్డి గుర్తింపు పొందారు. శాండీ రెడ్డి హైదరాబాదులోని స్టాన్లీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లా పట్టా తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏంఏ పూర్తి చేశారు.

సెప్టెంబర్ 17న తెలంగాణలో పొలిటికల్ హీట్.. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీల బహిరంగ సభలు

1991లో సంధ్యారెడ్డి వివాహం కర్రీ బుచ్చిరెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో జరిగింది. తల్లిదండ్రులు పట్లోళ్ల సారా రెడ్డి, శంకర్ రెడ్డి. వివాహమైన తర్వాత ఆమె భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడ కూడా తన చదువును కొనసాగించారు. ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్ లా లో డిగ్రీ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ఇమిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేశారు.

ఆస్ట్రేలియాలోని ఆమె స్థానికంగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను భర్తతో కలిసి చేశారు. స్ట్రాత్ ఫీల్డ్ లోని హోమ్ బుష్ కమ్యూనిటీ సెంటర్ లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంలో సంధ్యారెడ్డి ఎంతో చొరవ చూపించారు.  ఆమె చొరవతోనే ఇది జరిగిందని చెప్పుకోవచ్చు.

2020లో ఆమె సేవలకుగాను సిటిజన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం గుర్తింపుగా లభించింది. సంధ్యారెడ్డి స్ట్రాత్ ఫీల్డ్ లో ఉంటారు. స్ట్రాత్ ఫీల్డ్ లో 2021లో పురపాలక సంఘం ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో సంధ్యారెడ్డి చురుకుదనం, సేవా కార్యక్రమాలలో గుర్తుపెట్టుకున్న అక్కడి తెలుగువారు.. ప్రవాస భారతీయులు… ఆస్ట్రేలియా వాసులు కూడా ఆమెను పోటీ చేయాల్సిందిగా కోరారు.

అలా ఆమె స్థానికంగా ఉన్న లేబర్ పార్టీ, లిబరల్ పార్టీల అభ్యర్థుల మీద స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ ఎన్నికల్లోఆమె విజయం సాధించారు. స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీకి ప్రతి ఏడు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. అలా తాజాగా ఈ ఏడు జరిగిన ఎన్నికల్లో సంధ్యారెడ్డి ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.

ఈ అవకాశం తనకు దక్కడం మీద సంధ్యారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సంధ్యా రెడ్డికి నీల్ రెడ్డి, నిఖిల్ రెడ్డి అని ఇద్దరు కుమారులున్నారు. వీరిలో నిఖిల్ ఆస్ట్రేలియా జాతీయ చదరంగం ఛాంపియన్ గా ఈ ఏడు గెలిచాడు. ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళా శక్తిని చాటిన సంధ్యారెడ్డికి బీఆర్ఎస్ ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేష్, ఇతర నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె స్ట్రాత్ ఫీల్డ్  డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడంపై అభినందనలు చెప్పారు.  తెలుగు రాష్ట్రాలకు ఆమె గర్వకారణం అన్నారు.

చంద్రుడిపై ఊపందుకున్న రియల్ ఎస్టేట్.. రెండెకరాలు కొన్న కృష్ణా జిల్లా వాసి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో ) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ తర్వాత చంద్రుని రహస్యాలపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి కలుగుతోంది. భవిష్యత్తులో చంద్రునిపై మనిషి ఆవాసం ఏర్పరచుకునేలా ప్రయోగాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో చంద్రునిపై భూమిని కొనేవారు పెరుగుతున్నారు. కొన్ని సంస్థలు కూడా ఈ రకమైన వ్యాపారాన్ని మొదలపెట్టాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్ఆర్ఐ బొడ్డు జగన్నాథరావు తన ఇద్దరు కుమార్తెల కోసం రెండెకరాల భూమిని కొన్నారు. న్యూయార్క్‌లోని లూనార్ పబ్లిక్ సొసైటీ ఆఫీసుకు కుమార్తెలతో కలిసి వెళ్లిన ఆయన.. మానస, కార్తీకల పేరుతో చెరో ఎకరం భూమి కొన్నారు. దీనికి ఆ సంస్థ రిజిస్ట్రేషన్ క్లెయిమ్ డీడ్ ఇచ్చింది.

ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన జగన్నాథరావు.. 2005లోనే ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ  గురించి తెలుసుకున్నారు. అలా చంద్రునిపై భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ క్లెయిమ్ డీడ్‌ను నిర్వహిస్తున్న సంస్థ నుంచి భూమిని కొనుగోలు చేశాడు. 2005లోనే కుమార్తెలు ఇద్దరు పేరుతో చంద్రుడిపై ల్యాండ్ కొన్నాడు. అక్షాంశాలు, రేఖాంశాల మధ్య భూమిని కొనుగోలు చేసినట్లు జగన్నాథరావు వెల్లడించారు. ల్యాండ్ పార్సిల్ నంబర్లు, చంద్రునిపై అంతర్జాతీయ పరిశోధన సంస్థలు గుర్తించిన ప్రాంతాల పేర్లను రిజిస్ట్రేషన్ పత్రంలో ముద్రించి ఇచ్చినట్టు తెలిపారు.

చంద్రునిపైన ఉపరితలానికి సంబంధించిన వీడియో సీడీ, కొనుగోలు చేసిన ల్యాండ్ మ్యాప్‌ను ఈ సంస్థ తనకు అందజేసినట్లు జగన్నాథరావు వెల్లడించారు. ఏయే అక్షాంశాలు, రేఖాంశాల మధ్య కొనుగోలు చేసిన భూమి ఉందో.. లూనార్ ల్యాండ్స్ స్పష్టంగా పేర్కొంటూ జగన్నాథరావుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే చంద్రునిపై భూమిని కొనుగోలు చేసేందుకు వెచ్చించిన మొత్తాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

జార్జియాలో ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లి గుండెపోటుతో ఏపీ విద్యార్థి మృతి.. తీవ్ర విషాదంలో ఫ్యామిలీ..
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ ఏపీ యువకుడు అక్కడే మరణించాడు. జార్జియాలోని టీబ్లీసీలో ఎంబీబీఎస్ చదువుతున్న అతడికి గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీంతో ఏపీలోని ఆ యువకుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పూజారి బండలో నివాసం ఉంటున్న రావూరి శ్రీనివాస్, భాగ్యలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు రావూరి గిరీష్. శ్రీనివాస్ దంపతులు తమ  కుమారుడిని ఉన్నత  చదువులు చదివించాలని భావించారు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు పంపించారు.

గిరీష్ జార్జియ టీబ్లీసీలోని యూరోపియన్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అయితే శనివారం ఉదయం గిరీష్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. డాక్టర్ అయి వస్తాడని అనుకున్న కొడుకు ఇలా కన్నుమూయడంతో శ్రీనివాస్, భాగ్యలక్ష్మి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ నెల 20వ తేదీన స్వదేశానికి వచ్చేందుకు గిరీష్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడని.. అయితే ఈలోగా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని అతని బంధువులు తెలిపారు.

తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని గిరీష్ కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.‘‘మేము న్యూ ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఒక లేఖ పంపాము. విద్యార్థి మృతదేహాన్ని రాయచోటిలోని అతని స్వగ్రామానికి తిరిగి తీసుకురావడంలో వారి సహాయం కోరాము. గిరీష్ మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం కోసం టీబ్లీసీలోని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడానికి అర్మేనియాలోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించాం’’ అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీష తెలిపారు.

ఆస్ట్రేలియా అధికారులు కక్ష కట్టారు.. తాగే నీళ్లలోనూ విషం కలిపారు... ఎన్నారై మహిళ ఆత్మహత్య కేసులో ట్విస్ట్....
కర్ణాటక : కర్ణాటకలో ఓ ఆస్ట్రేలియన్ ఎన్నారై మృతి కలకలం రేపింది. ఆస్ట్రేలియా నుంచి కర్ణాటకకు వచ్చిన ఓ మహిళ మృతి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్.. కర్ణాటకలోని బెలగావిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య వెనుక కారణం.. తన పిల్లల కస్టడీ ఆస్ట్రేలియా అధికారులకు  వెళ్ళిపోవడమేనని తెలుస్తోంది. దీంతో పిల్లల దూరమై తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

ఆస్ట్రేలియా నుండి నేరుగా కర్నాటకలోని బెంగళూరుకు వచ్చిన ప్రియదర్శిని బస్సులో అక్కడి నుంచి బెళగావి వెళ్ళింది. బెలగావి నుంచి గోర్వాన కొల్ల గ్రామం సమీపంలో ఉన్న మలప్రభనది దగ్గరికి వెళ్లి… అందులోకి దూకి ప్రియదర్శిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె ఓ సూసైడ్ నోట్ రాసింది.

హిందూ’ అనే మతం లేదు.. అది ఒక బూటకం - సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య

అందులో తన ఆత్మహత్యకు కారణం ఆస్ట్రేలియా అధికారులు అని..  వారితో పాటు ఇంకొంతమంది సిడ్నీ ప్రాంత వాసులు కూడా తన మృతికి కారణమని పేర్కొంది. వీరంతా గత కొంతకాలంగా తన కుటుంబాన్ని,  తనని తీవ్రంగా వేధిస్తున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…

కర్నాటక నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి స్థిరపడిన ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ కు ఇద్దరు పిల్లలున్నారు. అందులో ఓ కుమారుడి పేరు అమర్త్య.  ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో స్థానికంగా ఉన్న  ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అమర్త్యకు చికిత్స అందిస్తున్న సమయంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ప్రియదర్శిని వెంటనే ఆస్పత్రి అధికారులకు తెలిపింది. కానీ వారు పట్టించుకోలేదు.

దీంతో ఆమె అధికారుల నిర్లక్ష్యం మీద, ఆసుపత్రి పై ప్రియదర్శిని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి ప్రియదర్శినికి ఆస్ట్రేలియా అధికారులకు మధ్య వార్ మొదలయ్యింది. అది ఎక్కడివరకు దారి తీసిందంటే ప్రియదర్శిని తన పిల్లలిద్దరిని సరిగా చూసుకోవడం లేదంటూ ఆస్ట్రేలియా అధికారులు వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.

దీంతో వివాదం సద్దుమనగకపోగా... మరింత ముదురుతుండడంతో ప్రియదర్శిని తాను ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని వదిలేసుకుంటానని తెలిపింది. స్వదేశానికి వెళ్ళిపోతానని తన పిల్లలకు అక్కడే చికిత్స చేయించుకుంటానని వేడుకుంది. దీనికి ఆస్ట్రేలియా అధికారులు ఒప్పుకోలేదు. దీంతో మానసిక వేదనకు గురై ఆమె అనారోగ్యం బారినబడింది.

ఈ నేపథ్యంలోనే ఇండియాకు తిరిగి వచ్చి, ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రియదర్శిని తన సూసైడ్ నోట్ లో.. నా పిల్లలు,  భర్త లింగరాజుల బతుకుతెరువు కోసం నా జీవితాన్ని ముగించుకోవాల్సిన పరిస్థితి. మా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. నా కుటుంబం బాగుకోసం నేను నా మరణాన్ని ఒప్పుకుంటున్నాను. ఆస్ట్రేలియా కమ్యూనిటీస్ అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ 2021 నుండి ఈరోజు వరకు నా కుటుంబాన్ని నాశనం చేసింది.

దీంతోపాటు సిడ్నీలోని వెర్లీ స్ట్రీట్ నివాసితులు కూడా మమ్మల్ని తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. అలాగే ఒక పోలీస్ అధికారి కుటుంబం కూడా మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు’  అని  ఆ లెటర్ లో పేర్కొంది. చివరికి వేధింపులు ఎంతవరకు వెళ్లాయి అంటే తన ఇంటికి సరఫరా అయ్యే నీటిని కూడా విషపూరితంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరుతో విసిగిపోయి… తన అనారోగ్య సమస్యలు తట్టుకోలేక.. ప్రియదర్శిని ఆత్మహత్య చేసుకుంది... అని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు పేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కువైట్ లో కారు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు మృతి...
అన్నమయ్య జిల్లా : కువైట్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి కు చెందిన ఓ కుటుంబం మృత్యువాత పడింది. కువైట్ లో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన వారవడంతో  వారి స్వస్థలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..  మృతుడు గౌస్ బాషా (35), అతని భార్య (30)..  ఇద్దరు కొడుకులు ఈ ప్రమాదంలో మరణించారు. గౌస్ బాషా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట పట్టణంలోని ఎగువగడ్డ లో ఉన్న అవ్వ తాతల దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత స్వగ్రామమైన మదనపల్లెకి వెళ్ళాడు.

బాలుడిని డాబా మీదినుంచి తోసేసిన వాలంటీర్.. కాలు, చెయ్యి విరిగి..తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరి...

అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి… వివాహం చేసుకొని సెటిల్ అయ్యాడు. కొంతకాలానికి బెంగళూరు నుంచి కువైట్ కి వెళ్ళాడు. భార్య పిల్లలను కూడా తనతో పాటు తీసుకువెళ్లాడు. అక్కడ కారులో వెడుతుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడింది.  ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు, గౌస్ బాషా మృతి చెందారు.

దీనిమీద గౌస్ బాషా సమీప బంధువులు మాట్లాడుతూ.. వారి మృతి విషయంలో అనుమానాలున్నాయన్నారు. రోడ్డు ప్రమాదం మాత్రం వాస్తవమేనని చెప్పారు. మృతి చెందినట్లు చెబుతున్న వ్యక్తికి ఫోన్ చేస్తే... అతను అందుబాటులోకి రావడం లేదు. దీంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. వారి మృతదేహాలను చూసేవరకు ఏమీ చెప్పలేమని అన్నారు.

అమెరికాలో కన్నడ కుటుంబం అనుమానాస్పద మృతి... ఇంట్లోనే దంపతులు, ఆరేళ్ళ కొడుకు మృతదేహాలు
మేరీల్యాండ్ : ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో లేక మరేదైనా ఘోరం జరిగిందో తెలీదుగానీ దేశంకాని దేశంలో ఓ భారతీయ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. ఉపాధి నిమిత్తం కర్ణాటకకు చెందిన దంపతులు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయితే హఠాత్తుగా ఏమయ్యిందో గానీ ఆరేళ్ళ కొడుకుతో సహా దంపతులు మృతిచెందిననట్లు కర్ణాటకలోని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వారు ఆత్మహత్య చేసుకున్నారని అమెరికా పోలీసులు సమాచారం ఇచ్చినా కుటుంబసభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా జగళూరు సమీపంలోని హలేకల్లు గ్రామానికి చెందిన యోగేష్(37) దంపతులకు మంచి ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లారు. యోగేశ్ తో పాటు భార్య ప్రతిభ కూడా సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. వీరికి ఆరేళ్ల యశ్ సంతానం. మేరీ ల్యాండ్ లోని బాల్టిమోర్ లో ఈ కుటుంబం నివాసం వుండేది. ఇలా యోగేశ్ దంపతులు సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ గత తొమ్మిదేళ్లుగా అమెరికాలోనే వుంటున్నారు.

అయితే ఏమయ్యిందో తెలీదు శనివారం యోగేశ్ కుటుంబం మరణవార్త ఇండియాలోని కుటుంబసభ్యులకు అందింది. బాలిమోర్ట్ పోలీసులు వీరిది ఆత్మహత్య అని చెబుతున్నారని... కానీ భార్యాబిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిన సమస్యలేవీ తన కొడుకుకు లేవని తల్లి శోభ అంటోంది. గత గురువారమే తనకు కొడుకు ఫోన్ చేసాడని...  ఎంతో బాగా మాట్లాడాడని అన్నారు. ఇంతలోనే కొడుకు కుటుంబం మరణవార్త రావడంపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More  దోమల నివారణ యంత్రంతో చెలారేగిన మంటలు.. ముగ్గురు మనుమరాలతో సహా నాన్నమ్మ మృతి..

కొడుకు, కోడలు, మనవడిని తలచుకుని శోభ కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. త్వరగా వారి మృతదేహాలను తరలించేందుకు సాయం చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)

సింగపూర్ క్రూయిజ్ నుండి దూకి 64 ఏళ్ల భారతీయ మహిళ మృతి
సింగపూర్ : సింగపూర్ జలసంధి గుండా వెళుతున్న రాయల్ కరేబియన్ క్రూయిజ్ నుంచి దూకి  ఓ భారతీయ మహిళ మృతి చెందినట్లు సమాచారం.  64 ఏళ్ల తప్పిపోయిన ఆ మహిళ కుమారుడు తన తల్లిని కనిపెట్టడంలో సహాయపడాలని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సహాయం కోరాడు. క్రూయిజ్ కంపెనీ ఆ మహిళ కనిపించడంలేదని సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపాడు.

తన నిరంతర ప్రయత్నాలతో తన తల్లి చనిపోయిందని తెలిసిందని అపూర్వ్ సహాని ఆ తరువాతి ఒక ట్వీట్ లో పేర్కొన్నాడు. క్రూయిజ్ లైనర్ నిఘా ఫుటేజీలో అది తేలిందన్నారు. తల్లి మృతదేహం కోసం అన్వేషణ జరుగుతోందని తెలిపారు. తనకు సహాయం చేసినందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పిఎంఓ, సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.

భారత్ లో ఉన్న బావతో హిందీలో ఫోన్ మాట్లాడాడని.. ఉద్యోగం నుంచి తొలగించిన అమెరికా కంపెనీ..

భారతీయ హైకమిషన్ కుటుంబంతో టచ్ లో ఉంది. ఈ ఘటనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సింగపూర్ అధికారులతో కాంటాక్ట్ లో ఉంది. చట్టపరమైన ప్రక్రియలను సులభతరం చేస్తోంది. అపూర్వ్ సహానికి అన్ని రకాల సహకారాన్ని అందించడానికి రాయల్ కరేబియన్ క్రూజ్ ఇండియన్ హెడ్ ని కూడా సంప్రదించారు.

అయితే, అంతకు ముందు సహానీ ఈ ఘటన గురించి చెబుతూ.. తన తల్లి ఓడ నుండి దూకిందని సిబ్బంది తనకు సమాచారం ఇచ్చారని అన్నారు.  అయితే సిబ్బంది ఎలాంటి నిఘా ఫుటేజీని చూపించలేదని, తన తల్లిని గుర్తించడానికి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ కూడా చేయలేదని.. ఆమెతో పాటు వచ్చే తండ్రిని కూడా దించేశారని అతను ముందుగా చెప్పాడు.

అపూర్వ్ సహాని అయిన రీతా సహానీ, తన భర్త జాకేశ్ సహానీతో కలిసి 'స్పెక్ట్రమ్ ఆఫ్ ది సీస్' క్రూయిజ్ షిప్‌లో ఎక్కింది. ఈ షిప్ సింగపూర్‌కు వెళుతున్నప్పుడు ఓడ నుండి దూకినట్లు స్ట్రెయిట్ టైమ్స్‌ పత్రికా కథనాలు చెబుతున్నాయి.

అంతకు ముందు స్ట్రెయిట్ టైమ్స్‌తో సహాని మాట్లాడుతూ, "మా అమ్మ మిస్సింగ్ అని తెలియడంతో సీసీ టీవీ ఫుటేజీని చూడమని అడిగాం. కానీ, ఇప్పటివరకు వారేమీ ఇవ్వలేద’ని అన్నారు. ఆమె దూకిందని ఓడ సిబ్బంది అనుకుంటున్నారు..అన్నారు.

"చివరికి, నా తండ్రిని కూడా ఓడ నుండి దించారు. ఎందుకంటే మరొక క్రూయిజ్ కూడా వస్తోంది. అందులో ఉండొచ్చని అనుకున్నారని తెలిపారు.  తన తల్లికి ఈత రాదని, అతని తండ్రిని పోలీసులు గంటల తరబడి ఇంటర్వ్యూ చేశారని సహానీ చెప్పారు.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. చివరికి వీధుల వెంట , పేరు కూడా గుర్తులేక .. హైదరాబాద్ యువతి దీనగాథ
ఉన్నత చదవులు చదివి జీవితంలో గొప్పస్థాయికి చేరుకోవాలని అమెరికా వెళ్లిన ఓ హైదరాబాద్ అమ్మాయి దేశం కానీ దేశంలో అష్టకష్టాలు పడుతోంది. కనీసం తన పేరు కూడా చెప్పుకోలేని స్థితిలో ఫుట్‌పాత్‌పై గడుపుతోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మౌలాలీ ప్రాంతానికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి మాస్టర్స్ చదివేందుకు 2021 ఆగస్టులో అమెరికా వెళ్లారు. డెట్రాయిట్‌లోని ట్రైన్ యూనివర్సిటీలో చేరిన ఆమె.. విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. చదువు, ఇతర కార్యక్రమాల్లో ఎంత బిజీగా వున్నప్పటికీ ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేది. కానీ ఏమైందో ఏమో కానీ రెండు నెలలుగా జైదీ నుంచి ఫోన్ రావడం లేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు అమెరికాలో తెలిసినవాళ్లకు ఫోన్ చేసి తమ కుమార్తె క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు.

ఈ నేపథ్యంలో కొందరు తెలుగువారికి జైదీ చికాగోలోని రోడ్లపై తిరుగుతూ కనిపించింది. దీనిపై ఆమెను ప్రశ్నించగా.. తన వస్తువులను ఎవరో చోరీ చేశారని జైదీ వారితో చెప్పింది. అప్పటికే మతి చలించడంతో రోడ్లపై తిరుగుతూ ఎవరైనా ఏమైనా పెడితే తినడం లేనిపక్షంలో పస్తులుంటూ వస్తోంది. తన పేరు తనకు కూడా గుర్తులేని స్థితికి జైదీ చేరుకుంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీని గురించి తెలుసుకున్న జైదీ తల్లిదండ్రులు.. కూతురి దీనావస్థ చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డను క్షేమంగా భారతదేశానికి తీసుకురావాలని జైదీ తల్లి కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఆయన ఆమెను భారత్‌కు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

అమెరికా వీధుల్లో ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ మహిళ.. కేంద్ర మంత్రి జై శంకర్ సాయం కోరిన తల్లి..
అమెరికాలోని వీధుల్లో హైదరాబాద్‌కు చెందిన  ఓ మహిళ అకలితో అలమటిస్తుంది. డిప్రెషన్‌తో పోరాడుతున్న ఆమె.. తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తూ చికారో రోడ్లపై తిరుగుతున్నట్టుగా చెబుతున్నారు. దీంతో ఆ మహిళను తిరిగి భారత్‌కు తీసుకొసురావాలని ఆమె కుటుంబ సభ్యులు  కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ నేత ఖలీకర్ రెహమాన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ.. డెట్రాయిట్‌లోని TRINE విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదివేందుకు వెళ్లారని.. అయితే ఆమె చికాగోలో దీన స్థితిలో కనిపించిందని పేర్కొన్నారు. మిన్హాజ్ జైదీని తిరిగి స్వదేశానికి తీసురావాలని కోరుతూ ఆమె తల్లి కేంద్ర మంత్రి జై శంకర్‌కు లేఖ రాసినట్టుగా పేర్కొన్నారు.

ఇక, లేఖలో “తెలంగాణలోని మౌలాలీ నివాసి అయిన నా కుమార్తె ససైదా లులు మిన్హాజ్ జైదీ 2021 ఆగస్టులో డెట్రాయిట్‌లోని ట్రినే విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదివేందుకు వెళ్లి మాతో తరచుగా టచ్‌లో ఉండేది. కానీ గత రెండు నెలలుగా ఆమె నాతో టచ్‌లో ఉండడం లేదు. అయితే నా కూతురు డిప్రెషన్‌లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని, దీంతో ఆమె ఆకలితో అలమటించిందని ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా మాకు తెలిసింది. అమెరికాలోని చికాగో రోడ్లపై నా కూతురు కనిపించింది’’ మహిళా తల్లి లేఖలో పేర్కొంది.

Ms.Syeda Lulu Minhaj Zaidi from Hyd went to pursue MS from TRINE University, Detroit was found in a very bad condition in Chicago, IL. Her mother has appealed @DrSJaishankar to bring back her daughter. Would appreciate the immediate help. @HelplinePBSK @IndiainChicago… pic.twitter.com/dh4M4nPwxZ
— Khaleequr Rahman (@Khaleeqrahman) July 25, 2023

వాషింగ్టన్ డీసీ లోని భారత రాయబార కార్యాలయం, చికాగోలోని భారత కాన్సులేట్ జోక్యం చేసుకుని తన కుమార్తెను తిరిగి తీసుకురావాలని ఆమె అభ్యర్థిస్తోంది. మహ్మద్ మిన్హాజ్ అఖ్తర్ సహాయంతో తన కుమార్తెను గుర్తించవచ్చని ఆమె పంచుకున్నారు. సోషల్ యాక్టివిస్ట్ మహ్మద్ మిన్హాజ్ అఖ్తర్ సహాయంతో తన కుమార్తెను గుర్తించవచ్చని ఆమె వివరాలను లేఖలో పొందరుపరిచారు.

కెనడాలో భారతీయ విద్యార్థి మృతి.. దుండగుల దాడిలో తీవ్రగాయాలపాలై...
కెనడా : ఓ భారతీయ విద్యార్థిపై కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో అతను మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గురువిందర్ నాథ్ (24) అనే యువకుడు ఒంటరియో ఫ్రాన్స్ లో పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. జులై 9 వ తేదీన మిస్సిపాగా ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు అతని మీద దాడి చేసి, బైక్ లాక్కోడానికి ప్రయత్నించారని స్థానిక మీడియా కథనాలు.

ఆ వ్యక్తులు చేసిన దాడిలో గురువిందర్ తల, శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స తీసుకుంటూ జులై 14 వ తేదీన మృతి చెందాడు. ఈ మేరకు  టొరంటోలోని భారత క్యాన్సిలేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. గురువిందర్ మృతి మీద కాన్సులేట్ జనరల్ సిద్ధార్థ్ నాథ్ మాట్లాడుతూ.. ‘ గురువిందర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.  ఆయన మృతి ఎంతో బాధాకరం’  అన్నారు.

మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్.. నెలవారీ ₹ 1,000 సహాయం అందించే పథకం ప్రారంభం

ఆయన మృతికి కారణమైన వారిని  త్వరలోనే గుర్తిస్తామని..  గురివిందర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని  సిద్ధార్థ నాథ్  హామీ ఇచ్చారు. స్థానిక పోలీసు అధికారి ఫిల్ కింగ్ మాట్లాడుతూ ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే, గురువిందర్ బండిని  దొంగతనం చేయాలనే ఆలోచనతోనే.. అతని మీద దాడి చేసిన నిందితులు పిజ్జా ఆర్డర్ చేసినట్లుగా విచారణలో తేలిందన్నారు పోలీసు అధికారి.

గురువిందర్ మీద దాడి తర్వాత అతని వాహనాన్ని నిందితుల్లో ఒకరు తీసుకెళ్లారని గుర్తించినట్లుగా తెలిపారు. అతని వాహనాన్ని తీసుకుని పరారైన నిందితుడు ఘటన జరిగిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ వాహనాన్ని విడిచిపెట్టాడని దాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని.. ఆ రిపోర్టు వచ్చిన వెంటనే.. వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

కాగా, కెనడాలో మృతి చెందిన గురువిందర్ మృతదేహాన్ని జూలై 27వ తేదీన భారత్ కు తరలించనున్నారు. కెనడాలో సొంతంగా పిజ్జా అవుట్ లైట్ ఓపెన్ చేయాలని గురువిందర్  అనుకున్నాడని.. ప్రస్తుతం అతను లాస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతలోనే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుందని స్నేహితులంటున్నారు.  కెనడాలోని 200 మంది భారతీయ విద్యార్థులు గురువిందర్ పై దాడిని ఖండిస్తూ, క్యాండిల్ లైట్ మార్చ్ తో నివాళి అర్పించారు.

అమెరికాలో బియ్యం కోసం ఎగబడుతున్న ఎన్నారైలు.. భారీగా క్యూ లైన్లు.. అసలు కారణమిదే..!!
బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఒక నోటిఫికేషన్‌లో నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. నోటిఫికేషన్‌కు ముందే ఓడలో బాస్మతియేతర బియ్యాన్ని లోడ్ చేయడం ప్రారంభించినట్లయితే లేదా షిప్పింగ్ బిల్లు ఉంటే మాత్రమే మినహాయింపులు ఇవ్వబడతాయని తెలిపింది. దీంతో అమెరికాలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దీంతో అమెరికాలోని చాలా మంది ఎన్నారైలు వెంటనే సూపర్ మార్కెట్‌లకు క్యూ కట్టారు.  కొందరైతే సెలవులు పెట్టి మరి  బియ్యం కొనుగోళ్లకు పరుగులు తీశారు.  భవిష్యత్తులో బియ్యానికి ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో పెద్ద ఎత్తున బియ్యం కొనుగోళ్లు చేయడం ప్రారంభించారు. దీంతో సూపర్ మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున  క్యూలు కనిపించాయి. ఇదిలా ఉంటే, ఓ స్టోర్‌లో బియ్యం కొనుగోలు చేయడం కోసం జనాలు ఎగబడిన దృశ్యాలు కూడా దర్శనమిచ్చాయి.

Rice demand and Madness in USA..after India Govt Imposes Ban on Non-Basmati Rice Exports!

People are taking breaks from work and lining up at grocery stores,buying maximum allowed quantities.

Desi stores in US have already increased the price of rice bags..🤔#USA #RiceDemand pic.twitter.com/Wwx5JFAK9B
— Venugopal Reddy Chenchu (NRI TDP, USA) (@venuchenchu) July 22, 2023

Rice export stopped from India and massive panick hit the Indians in USA. Hoarding has started across the states. There has been multiple food shortages here, hoping rice shortage doesn’t get added to the list. pic.twitter.com/vdP6NBwrN6
— The Thinking Hat 🇮🇳 (@ThinkinHashtag) July 21, 2023

ఈ క్రమంలోనే అనేక సూపర్ మార్కెట్లలో బియ్యం స్టాక్ నిండుకోవడంతో నో స్టాక్ బోర్డు కనిపించింది. అయితే ఈ క్రమంలోనే  స్థానికంగా కొన్ని ఇండియన్ స్టోర్‌లు బ్లాక్ మార్కెట్ దందాకు తెరదీసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 15 డాలర్ల బియ్యం బస్తాను.. 50 డాలర్లకు కూడా విక్రయిస్తున్నారని అమెరికాలోని కొందరు భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు కూడా పెంచినట్టుగా అక్కడి సూపర్ మార్కెట్ యజమానులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ టూ అమెరికా .. డైరెక్ట్ ఫ్లైట్ నడపండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎన్ఆర్ఐల విజ్ఞప్తి
హైద‌రాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి అమెరికాలో స్థిరపడిన తెలుగు ఎన్నారైలు వినతిపత్రం స‌మ‌ర్పించారు. ప్రస్తుతం అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న కిష‌న్ రెడ్డిని ప్రవాస భారతీయులు కలిశారు. ఢిల్లీ , ముంబై వంటి అనేక భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్‌లను కలిగి ఉన్నాయ‌ని ఎన్ఆర్ఐలు తెలిపారు. అమెరికా నుండి హైదరాబాద్‌కు నేరుగా విమానాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇతర పెద్ద పట్టణాలకు సమాంతర అభివృద్ది సాధ్యమౌతుందని ప్రవాసులు అన్నారు.

వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటక రంగాలకు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణను పెంచుతుంద‌న్నారు. అమెరికా నుండి హైదరాబాద్‌కు నేరుగా విమాన మార్గం ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పర్యాటక శాఖ పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఆర్ఐలు కేంద్ర మంత్రిని విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతో పాటు, కొత్త రూట్లలో విమాన సర్వీసులను తెచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ALso Read: బీజేపీలో మూడు ముక్కలాట? నేనే సీఎం క్యాండిడేట్ అంటూ ఈటల, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం!

మరోవైపు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలో ఉన్న ప్రవాస తెలంగాణ వాసులు, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులైనందుకు వారు కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణ వాసులు, ముఖ్యంగా టీడీఎఫ్ పోషించిన పాత్రను  కిషన్ రెడ్డి అభినందించారు.

ఆస్ట్రేలియాలో బోనాల పండుగలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
భారత జాగృతి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అంతకుముందు సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాలకు చెందిన భారత జాగృతి నేతలు కవితకు స్వాగతం పలికారు.

భారత జాగృతి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బోనాన్ని తీసుకెళ్లే కలశాన్ని అలంకరించారు కవిత.

కల్వకుంట్ల కవిత రాక విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, బ్రిస్బేన్‌ తదితర ప్రాంతాలకు చెందిన భారత జాగృతి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ఇటీవల సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో కవిత పాల్గొన్నారు. బంగారు బోనంతో ఆలయానికి చేరుకున్న కవిత ఆలయ అధికారులు , అర్చకులు స్వాగతం పలికారు.

జూలై 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో భారత జాగృతి ఆస్ట్రేలియాశాఖ ఆధ్వర్యంలో, 16న న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో తెలంగాణ సెంట్రల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు స్థిరపడిన ప్రతి ప్రాంతంలోనూ బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. ఎన్ఆర్ఐ సంఘాలు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఇక బోనాల పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

షాకింగ్.. కేబుల్‌తో బంధించి, కళ్లకు గంతలు గట్టి.. యువతిని సజీవంగా పూడ్చిపెట్టిన మాజీ ప్రియుడు..
ఆస్ట్రేలియాలో ఫ్లిండర్స్ రేంజ్‌లో 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆమెను కేబుల్‌తో బంధించి.. సజీవంగా పాతిపెట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది ఆమె మాజీ ప్రియుడేనని  నిర్దారణ అయింది. వివరాలు.. జాస్మిన్ కౌర్‌ నర్సింగ్ విద్యార్థిని. జాస్మిన్‌ను నార్త్ ప్లింప్టన్‌లోని ఆమె వర్క్ ప్లేస్‌ నుంచి మార్చి 5వ తేదీన కిడ్నాప్  చేసిన మాజీ ప్రియుడు తారిక్‌జోత్ సింగ్.. ఫ్లిండర్స్ రేంజ్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను హత్య చేశాడు. కేబుల్స్‌తో బంధించి సజీవంగా పూడ్చిపెట్టాడు.

ఈ నేరం బయటకు రాకుండా తారిక్‌జోత్ జాగ్రత్తపడ్డాడు. అయినప్పటికీ.. కౌర్‌ను కిడ్నాప్ చేసి చంపినట్లు సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జాస్మిన్ హత్యకు సంబంధించిన నేరాన్ని తారిక్‌జోత్ అంగీకరించాడు. దీంతో పోలీసులు పాతిపెట్టిన చోటు నుంచి జాస్మిన్ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే జాస్మిన్‌ను ప్రేమించిన తారిక్‌జోత్ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించినట్టుగా తెలిసింది.

అయితే తాజాగా సౌత్ ఆస్ట్రేలియన్ సుప్రీంకోర్టులో శిక్షా సమర్పణల సందర్భంగా తారిక్‌జోత్ నేరానికి సంబంధించిన భయంకరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. తారిక్‌జోత్.. జాస్మిన్‌ను కిడ్నాప్  చేసి టేప్, కేబుల్ టైలతో బంధించి, కళ్లకు గంతలు గట్టి స్పృహతో సజీవంగా పాతిపెట్టిన తర్వాత ఆమె ‘‘అసాధారణ స్థాయి క్రూరత్వాన్ని’’ అనుభవించిందని పేర్కొనబడింది.

ప్రతీకార చర్యగా జరిగిన హత్యగా  చెప్పబడింది. హత్యకు కొన్ని గంటల ముందు, తారిక్‌జోత్ హార్డ్‌వేర్ స్టోర్ నుంచి చేతి తొడుగులు, కేబుల్ టైలు, పార కొనుగోలు చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో నమోదయ్యాయి. వారి బంధం విచ్చిన్నం కావడం వల్లే అతడు హత్యకు ప్లాన్ చేసినట్లు కోర్టు పేర్కొంది. ఇక, జాస్మిన్ 2021 మార్చి 6న మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక చూపించింది. ఇక, శిక్షా సమర్పణలను వినడానికి జాస్మిన్ తల్లితో సహా ఆమె కుటుంబం కోర్టుకు వచ్చారు.

ఇక, తారిక్‌జోత్ తప్పనిసరి జీవిత ఖైదును ఎదుర్కొవాల్సి వస్తోంది. కోర్టు వచ్చే నెలలో పెరోల్ లేని వ్యవధిని విధించింది. అయితే అతని న్యాయవాది మరింత దయగల శిక్ష విధించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే, జస్మిన్ కౌర్ తల్లి రష్‌పాల్ మాట్లాడుతూ.. సింగ్ తన కుమార్తెను తారిక్‌జోత్ వేధించాడని.. వందసార్లు నిరాకరించిన వెంటపడటం మానుకోలేదని అన్నారు. తన కుమార్తె ఆమె చివరి క్షణాల్లో ఎంత బాధ భరించిందనే దాని గురించి తలుచుకుంటే వేదన కలుగుతుందని జాస్మిన్ కుటుంబ సభ్యులు గతంలో చెప్పారు.జాస్మిన్ ఎక్కడైతే పూడ్చిపెట్టబడిందో.. అక్కడే సమాధి నిర్మించిన ఆమె కుటుంబం నివాళులు అర్పిస్తోంది.

లండన్ లో 'దశాబ్ది దగా సమాలోచన'.. తెలంగాణ 9 ఏండ్ల పాలనపై శ్వేతపత్రం విడుదలకు కాంగ్రెస్ డిమాండ్
'Dasabdi Daga Program' in London: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు లండన్ లో టీపీసీసీ ఎన్నారై సెల్  ఆధ్వర్యంలో "దశాబ్ధి దగా సమాలోచన" కార్యక్రమం నిర్వహించారు. చ‌ర్చా వేదికలో 9 ఏండ్ల పాలన లో వివిధ రంగాల్లో కేటాయించిన నిధులు, ఖర్చుల పై  శ్వేతపత్రం విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 9 ఏండ్ల కు దశాబ్ది  ఉత్సవాల పేరిట, తెలంగాణ‌ప్రభుత్వ ధనంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేసుకోవడం శోచనీయమనీ, గత 9 ఏండ్ల లో విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ కల్పన.. ఇలా అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేద‌ని టీపీసీసీ ఎన్నారై సెల్ ఆరోపించింది. కాంగ్రెస్ నాటిన  విత్తనాల ఫలితాలే  కాల క్రమేణా పెరిగిన  అభివృద్ధి పై కేసీఆర్ తన పేరు చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమ‌ర్శించింది.

2014 తెరాస మేనిఫెస్టోలో ఎన్నారై సెల్ ఏర్పాటు చేసి, రూ. 500 కోట్ల నిధులతో  గల్ఫ్ బాధితులకు బాసటగా ఉంటామని  నమ్మబలికి, నేడు 9 ఏండ్లకు కూడా ఎలాంటి చర్యలకు ఉపాక్రమించలేదని, ఇదే కేసీఆర్ దశాబ్ది దగకు చక్కని ఉదాహరణగా పేర్కొన్నారు. అలాగే, 2014 లో అధికారం లోకి వచ్చిన 3 నెలల్లోనే ముస్లిం మైనారిటీ వర్గాలకు 4% ఉన్న రిజర్వేషన్ల‌ను 12% చేస్తామని చెప్పి 9 సంవ‌త్స‌రాలుగా నీరు గార్చి దగా చేసిన మరో ఉదాహరణ పేర్కొన్నారు. కేజీ టూ పీజీ అంటూ అధికారంలోకి ఈ 9 ఏండ్ల లో కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థ ని ధ్వంసం చేశారని విమ‌ర్శించారు. ప్రభుత్వ బడుల్లో నియామకాలు లేవు, ఖాళీలు భర్తీలు లేవు, ప్రాధమిక విద్య దాదాపు పూర్తిగా ప్రయివేటుపరం చేశారు. ఇంటర్ మార్కుల్లో గోల్మాల్, వివిధ ఎంట్రెన్స్ లలో ప్రశ్న పత్రాల లీకేజ్, యూనివర్సిటీలలో ఖాళీల భర్తీ చేయకపోవడం, ప్రయివేటు యూనివర్సిటీ లు ఏర్పాటు చేయడం, ఐఐఐటీలో కూడా విద్యార్థుల ఆత్మ హత్యలు.. ఇలా పూర్తి విద్యా వ్యవస్థ ని ధ్వంసం చేసి దగా చేశార‌ని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ పేర్కొన్నారు.

ధర్నాచౌక్ ఎత్తి వేత, ఉద్యోగ నేతల అరెస్ట్, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత పై నిరసన కార్యక్రమాల పై ఉక్కుపాదంతో అణిచివేత, రైతులకు బేడీలు, తమ ప్రజా విధానాలని  ఎత్తి చూపుతున్న జర్నలిస్ట్ లపై దౌర్జన్యం, వేధింపులు, అణిచివేతలు కొన‌సాగుతుండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఇలా ఈ  9 ఏండ్ల పాలన లో ఎన్నో ఏండ్ల కల తెలంగాణ వస్తే సాకారం అవుతుందని  భావించిన  ప్రజలు  అన్ని రంగాలలో ద‌గాకు గుర‌య్యార‌ని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, వివిధ పంటలకు  మద్దతు ధర ఇవ్వకుండా, కల్తీ విత్తనాలు అరికట్టడం లో విఫలమై, ఎరువులు, ఫెస్టిసైడ్ ధరలు నియంత్రణ చేయకుండా, రైతు బంధు పేరుతో  దగా చేస్తూ, రైతులకు వ్యవసాయం ద్వారా రాబడి, లాభాల్లో  వాటా తగ్గే విధంగా కేసీఆర్ ప్రభుత్వ విధానాలు  ఉన్నాయని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ పాలనకు ముగింపు పలికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో సామాజిక న్యాయాన్ని పొంది, సమూలాభివృద్ధి  పొందుతామనే  ఆశాభావం వ్యక్తం చేశారు.  టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్, కో కన్వీనర్ రంగుల సుధాకర్, కార్యదర్శి నీలా శ్రీధర్, మహిళా విభాగం కో ఆర్డినేటర్ మేరీ, సయ్యద్ అక్బర్ హుస్సేన్, శీలం శ్రీనివాస్ రెడ్డి, అవినాష్ గౌడ్ మరుపల్లి, గంగం మధుకర్ రెడ్డి, జవ్వద్ అయాన్, నరేష్ కుమార్, ఆదర్శ రెడ్డి, జవహర్ రెడ్డి,మధుకర్ అలవల,రోహిత్ రెడ్డి చందుపట్ల, సాయినాథ్  తదితర 22 మంది ఎగ్జిక్యూటివ్ మెంబెర్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.