Asianet News Telugu

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
టెక్ ప్రపంచంలో యాపిల్ కంపెనీని ప్రపంచ దిగ్గజ సంస్థగా నిలబెట్టిన వ్యక్తి టిమ్ కుక్. ఆయన తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మక గ్యాడ్జెట్ లు ప్రజల జీవితాల్లో భాగం అయ్యాయి. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన ప్రఖ్యాత కంపెనీకి సీఈవోగా ఎదిగారు. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలో పుస్తకాలు బాగా ప్రభావితం చేశాయని తరచూ చెబుతుంటారు. ఆయన  సిఫార్సు చేసిన  కొన్ని లైఫ్ ఛేంజింగ్ పుస్తకాలను తెలుసుకోండి. ఇవి వ్యక్తిగత ఎదుగుదల, నాయకత్వం, సక్సెస్​కు స్ఫూర్తినిస్తాయి.

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తన నాయకత్వానికి, కొత్త ఆవిష్కరణలకే కాదు.. పుస్తక పఠనంపై ఆయనకున్న ప్రేమకు కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన పుస్తకాల నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు.

నైక్ సహ వ్యవస్థాపకుడు రాసిన ఈ పుస్తకం ఒక గ్లోబల్ బ్రాండ్‌ను నిర్మించడంలో ఎదురైన కష్టాలు, విజయాల గురించి చెబుతుంది. ఇది వ్యవస్థాపకులకు, అంకుర సంస్థలు ప్రారంభించాలనుకునేవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది.

టెర్మినల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక న్యూరోసర్జన్ తన జీవితంలోని అనుభవాలను ఇందులో పంచుకున్నారు. ఇది సక్సెస్ అంటే ఏమిటో తెలియజేస్తుంది. దాని కోసం ఎలా తపించిపోవాలో తెలియజేస్తుంది.

రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ సామాజిక న్యాయం కోసం ఎలా పోరాడారో ఈ పుస్తకం వివరిస్తుంది. ఇందులో సమగ్రత, దయ, నాయకత్వం గురించి తెలుసుకోవచ్చు. గొప్ప నాయకుడిగా పేరు గాంచిన కెన్నెడీ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో చెప్పారు.

4. ట్రిలియన్ డాలర్ కోచ్ (ఎరిక్ స్మిత్ రాశారు)

ఈ పుస్తకం బిల్ కాంప్‌బెల్ గురించి చెబుతుంది. ఆయన చాలా మంది టాప్ లీడర్లకు మెంటార్‌గా ఉన్నారు. టీమ్‌వర్క్ గురించి ఇందులో తెలుసుకోవచ్చు.

5. మార్చి (జాన్ లూయిస్ రచయిత)

పౌర హక్కుల నాయకుడు జాన్ లూయిస్ రాసిన ఈ పుస్తకం సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని తెలియజేస్తుంది. ధైర్యం గురించి తెలుసుకోవచ్చు.

ఇది మహాత్మా గాంధీ స్వీయ చరిత్ర. ఇందులో ఆయన తన గురించి, శాంతియుత నిరసనల గురించి వివరించారు. గాంధీ తత్వం స్ఫూర్తినిస్తుంది. టిమ్ కుక్ సైతం ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందారు.

7. కంపీటింగ్ ఎగైనెస్ట్ టైమ్ (జార్జ్ స్టాక్ జూనియర్ రాసినది)

సమయం ఆధారిత పోటీ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే బిజినెస్ క్లాసిక్ ఇది. కార్పొరేట్ ప్రపంచంలో ఇది ఉపయోగపడుతుంది.

అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం
అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ, ద్వారవతీచైవ సప్తయితే మోక్షదాయక:.. అని పురాణ ప్రవచనం...
మన దేశంలోని ఏడు మోక్ష పట్ణణాలివి.
ఈ ఏడింటిలోనూ అగ్రతాంబూలం దక్కింది అయోధ్యకే.
రామనామం తలచుకుంటే చాలు రామరాజ్యంతో పాటు అయోధ్య గుర్తుకొస్తాయి. ఆ వెంటనే విదేశీ దండయాత్రలు.. శతాబ్దాల వివాదం.. దశాబ్దాల పోరాటం మదిలో మెదులుతాయి. రాముడు పుట్టిన గడ్డపైనే ఆయనకు ఆలయం లేకపోవడం ఎన్నో శతాబ్దాలుగా హైందవ జాతిని కుంగదీసింది. సరిగ్గా ఏడాది క్రితం ఈ కల సాకారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా పండగ చేసుకున్నారు .
భరత జాతి ఆత్మగౌరవం మళ్లీ తలెత్తుకు నిలిచిన వేళ అది.
చరిత్ర తెలియని చాలామందికి ఈ క్రతువు అంత గొప్పదిగా అనిపించకపోవచ్చు.. భరతజాతి హననానికి.. ఈ గడ్డ మీద ఎంతోమంది పూర్వీకుల అణచివేతకు కొన్ని శతాబ్దాల పాటు జరిగిన దండయాత్రలు, దారుణాలు, కిరాతకాలు, అత్యాచారాలు.. వీటన్నింటి గురించి తెలుసుకుంటే నేటి రామాలయ నిర్మాణం ఎంత గొప్పదో.. దేశ చరిత్రలో ఎంత సమున్నతమైనదో అర్థమవుతుంది.
ఒకసారి గత చరిత్రను.. శతాబ్దాల పాటు సాగిన అణచివేతను, హిందూ జాతిపై, దేవాలయాలపై జరిగిన దాడులను, దోపిడీలను గుర్తు చేస్తూ. . సీనియర్ జర్నలిస్టు  MSR వెంకట రమణ (వెంకూ) రాసిన పుస్తకం.. "అపరాజిత - అయోధ్య"
మీరు చదవండి.. మీ స్నేహితులకు షేర్ చేయండి..ఈ పుస్తకాన్ని ఈ లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తపనతో కథలు రాస్తున్నాను... ! 'సీతంబాయి పొలం' కథల సంపుటి ఆవిష్కరణలో అయోధ్యారెడ్డి
తెలంగాణకు చెందిన ప్రముఖ కథా రచయిత, సీనియర్ పాత్రికేయుడు ఏయం. అయోధ్యారెడ్డి తాజా కథల సంపుటి 'సీతంబాయి పొలం' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం గచ్చిబౌలిలోని గోపన్ పల్లి జర్నలిస్టు కాలనీకి చెందిన సొసైటీ కార్యాలయం హాలులో జరిగింది. ప్రముఖ కథా రచయిత, సీనియర్ పాత్రికేయుడు, పూర్వ 'నవ్య' వీక్లీ సంపాదకుడు ఏ.ఎన్.జగన్నాథశర్మ కార్యక్రమానికి హాజరై తన చేతుల మీదుగా కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్థానిక 'జర్నలిస్టుల ఫోరం' ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశానికి ఆత్మీయ అతిథిగా హాజరైన అయోధ్యారెడ్డి కథా రచయితగా తన సుదీర్ఘ కథా రచన ప్రయాణంలోని విశేష అనుభవాలను వెల్లడించారు.

ఈ స్పీడ్ యుగంలో కథలు చదివే పాఠకులు కరువయ్యారనీ, మరీ ముఖ్యంగా ఈతరం యువత, పిల్లలు తెలుగు సాహిత్యానికి దూరమవుతున్నార‌ని పేర్కొన్న ఆయ‌న అప్పట్లో ఇటువంటి పరిస్థితి లేదని అయోధ్యారెడ్డి అన్నారు. కథలు రాసేవాళ్ళు కూడా ఇప్పుడు కరువయ్యారని తెలిపారు. అప్పటి గొప్ప, పెద్ద రచయితలు, కవులను ఇప్పటి తరం అసలు గుర్తు ప‌ట్టడమే లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇది సమాజానికి మంచి పరిణామం కాదనీ, మారాలని అన్నారు. జగన్నాథ శర్మ మాట్లాడుతూ, సాహిత్యానికి, కథా వస్తువులకు ఎప్పుడూ మరణం వుండదనీ, కాకపోతే కాలంతోపాటు పరిణామాత్మక మార్పు వుంటుందని గుర్తు చేశారు. అందువల్ల మనం బాధ పడాల్సిన పని లేదని చెప్పారు.

తనకు కథలు అంటేనే ఎంతో ఇష్టమనీ, ఎంతో తపనతోనే ఇప్పటికీ రచనలు చేస్తున్నానని అయోధ్యారెడ్డి అన్నారు. నిజ జీవిత సంఘటనలే తన కథలకు ఇతివృత్తాలని చెప్పారు. యదార్థ జీవన స్పర్షతోనే కథలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. 'సీతంబాయి పొలం' తన నాలుగో కథల పుస్తకమని చెప్పారు. అప్పట్లో పత్రికల్లో కథలు అచ్చయితే ఎంతో కొంత గౌరవ రుసుము ఇచ్చేవారనీ, అలా కొంత డబ్బు సంపాదించుకోవచ్చునన్న ఆశ,  ఆలోచనతోనే కథలు రాశానని తెలిపారు. ఆ తర్వాత నుంచీ డబ్బుకు అతీతంగా కథా సాహిత్యాన్ని, రచనా ప్రక్రియను నిజాయితీగా ప్రేమించడం మొదలుపెట్టి అంకితభావంతో రాస్తున్నానని తెలిపారు. తపన లేకపోయినా, పాఠకుల ఆదరణ పొందకున్నా ఎవరూ ఇన్నేసి కథలు రాయరని చెబుతూ, తన పరిస్థితీ అంతేనని అన్నారు. ఎంతో తపనతో ప్రతీ కథనూ సృష్టిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజల యధార్థ, వ్యధార్థ ఆర్ద్ర జీవన అనుభవాలే తనకు కథా వస్తువులు అయ్యాయనీ, ఏదో టైమ్ పాస్ కోసం తాను కథలు రాయనని అయోధ్యారెడ్డి చెప్పారు. నాలుగు దశాబ్దాల క్రితం మొదలైన తన సుదీర్ఘ కథల అక్షర సాగు కొన్నేళ్ల తర్వాత వృత్తిరీత్యా జర్నలిజంలోకి రావడం వల్ల కొన్నాళ్ళపాటు నిలిచి పోయిందని తర్వాత 'దక్కన్ క్రానికల్' సంస్థలో 'న్యూస్ ఎడిటర్'గా రిటైర్ అయ్యాక మళ్ళీ సీరియస్ గా రాయడం ప్రారంభించానని చెప్పారు. ఇప్పటికి సుమారు వంద కథలు, రెండు నవలలు రాసిన అయోధ్యారెడ్డి, నలభై విదేశీ కథలు, ఒక విదేశీ నవల అనువదించారు.

అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సీనియర్ కవులు, రచయితలు, కార్టూనిస్టులు, జర్నలిస్టులలో పరాంకుశం వేణుగోపాల స్వామి, కాసుల ప్రతాప్ రెడ్డి, గురువారెడ్డి, లక్ష్మణ్ రావు, రమణజీవి, సురేంద్ర, నర్సిమ్, తల్లావజ్జుల లలితాప్రసాద్, తిరుమలగిరి సురేందర్, పెద్దిరాజు, జగన్ (జగన్మోహన్ రావు), వై.హనుమంతరావు, దోర్బల బాలశేఖర శర్మ ఉన్నారు.

సాహితి కిరణం:ఉగాది కవితల పోటీ ఫలితాల విడుదల
హైదరాబాద్: శ్రీ కార్తీక డెవలపర్స్, సాహితీ కిరణం మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర జాతీయస్థాయి ఉగాది కవితల పోటీ ఫలితాలను సాహితీ కిరణం సంపాదకులు  పొత్తూరి సుబ్బారావు  ప్రకటించారు.

విజేతల వివరాలు ...
1.  ప్రథమ బహుమతి  రూ.2,500/-
పరిమి వెంకట సత్యమూర్తి, హైదరాబాద్.  కవిత - నిశ్శబ్ద సౌందర్యం.

2.ద్వితీయ బహుమతి: రూ. 2,000/-
పొత్తూరి సీతారామరాజు,  కాకినాడ . కవిత - మళ్లీ వాడు ఒకసారి నవ్వుతాడు.

3.తృతీయ బహుమతి : రూ.1,500/-
షేక్ కాశీం బీ, గుంటూరు. కవిత - అల్ట్రా మోడరన్

రెండు ప్రత్యేక బహుమతులు ఇద్దరికీ రూ.1,000/-  చొప్పున
కళా గోపాల్, నిజామాబాద్. కవిత : దయచేసి మా చీరెల వెల అడక్కండి

కోనేటి నరేష్ , ఏ.బీ. పల్లి.   కవిత - నవభారతంలో సామాన్యుడి జీవితం

బహుమతి ప్రధానోత్సవం  ఏప్రిల్ 2024 లో  సాహితీ కిరణం  కార్యాలయం పొత్తూరులో (గుంటూరు దగ్గర ) నిర్వహించే "ఉగాది సంబరాలు"  కార్యక్రమంలో ఉంటుందని
సంపాదకులు పొత్తూరి సుబ్బారావు  ఒక ప్రకటనలో తెలిపారు.

l

నాగలి కూడా ఆయుధమే - సమీక్ష
సాహిత్య హాలికుడు కొమ్మవరపు విల్సన్ రావు కవితా సంపుటి 'నాగలి కూడా ఆయుధమే' పైన విశాఖపట్నం నుంచి డాక్టర్ కె.జి. వేణు రాసిన సమగ్ర సమీక్ష ఇక్కడ చదవండి :

కవిత్వంలో నిబద్ధతను కొలతబద్ధగా ఆచరించి, తరించే కవుల సమూహాన్ని నేను దర్శించుకున్నప్పుడు, అందులోనుంచి “నేను నేనుగా నాలుగు దేహాలై / నాలుగు జీవితాలు సంచరిస్తాను..." అంటూ ఆకాశం ప్రతిధ్వనించేలా ఉచ్ఛరిస్తున్న ఒక స్వరం నాకు వినిపించింది.  కవిత్వంలో తాను ఇంకా ఒక విద్యార్థిగానే కొనసాగుతున్నానంటూ ప్రకటించుకుంటున్న ఆ స్వర సాహితీమూర్తి ఎవరోకాదు, అక్షరాలనే నైవేద్యంగా, తెల్లకాగితమనే విగ్రహానికి భక్తిపూర్వకంగా నిత్యం సమర్పించుకునే అతిసాధారణ జీవిత ప్రేమికుడు, సాహిత్య హాలికుడు 'కొమ్మవరపు విల్సన్ రావు'.

నా పలకరింపుకు ప్రతిఫలంగా తాను పండించిన 'నాగలి కూడా ఆయుధమే' కవితా సంపుటిని ఒక అపురూపమైన కానుకగా నా చేతులకందించాడు. ప్రాతః సమయాన ఆ పుస్తకానికి నమస్కరించి, ముఖచిత్రాన్ని చూశాను. ఎదురుగా నాగలి. ఆయుధంగా మెరుపులతో తళుక్కుమంది. మెల్లగా సంపుటి ద్వారాలు తెరిచాను. కవిత్వం వేదికగా సరికొత్త రూపంలో 69 నాగలి రూపాలు, సహస్ర భావాలతో సాహిత్య స్నేహానికి చేతులు సాచి ఆహ్వానించాయి. సుగంధ పరిమళాలతో ఆత్మీయంగా అక్షరాలు ఆలింగనం కోసం స్వాగతిచ్చాయి.

ఇంతలో నన్నెవరో తాకారు. ఉలిక్కిపడి చూశాను. అది "తాళాలులేని వేకువ దేహం".  అందులో వున్న వ్యక్తి ఎవరో కాదు, నాగలిని అక్షరాలతో ఆయుధంగా మార్చిన కవి. బతుకు వ్యాకరణంలో క్రియావాక్యాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వెళ్లి ఎదురుగా నిలబడ్డాను. అతని కళ్లలోకి కాలం జారిపోతోంది. తననుతాను నిర్దయగా ఖననం చేసుకుంటున్నాడు. పొరలు, పొరలుగా విప్పుకొని సొక్కి సోలిపోతున్నాడు. ఉన్నట్టుండి అతని చుట్టూ స్వేదనది. అందులో నిండుగా మునుగుతున్నాడు... ఒక్కసారిగా ముఖంనిండా చిరునవ్వు, తాళాలులేని వేకువ దేహాన్ని కలగంటూ...రాసింది పదునుగా, ప్రతిభావంతంగా రాయాలన్న కోరికను తన కలానికి గాఢంగా నేర్పుతున్న ఈ కవి, మౌనంగా కళ్లతో ఆదేశిస్తూ నన్ను తనతో ముందుకు నడవమన్నాడు. నాకెందుకో అదంతా చాలా కొత్తగా వుంది. అప్పుడప్పుడే తెల్లవారుతూ వుంది. నడుస్తున్న నా దేహాన్ని ఎవరో తట్టిన చప్పుడు. ఇంతలో నా మనసు వాకిళ్లను తెరిచి, తూరుపుగాలిని నా గుండెల్లోకి వొంపుతున్న ఒక పచ్చని ఆత్మీయ వాక్యం. అంతే నేనొక సజీవ జలపాతంగా మారిపోయాను. కాలంతోపాటు పరుగెత్తే నమ్మకాన్ని నా సొంతం చేసినప్పుడు నా పెదాలపై ఎప్పుడూ చూడని చిరునవ్వు పూయటం ఆశ్చర్యం కలిగించింది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే చెమటపూల పరిమళాల విలువలను మరింతగా తెలుసుకునేందుకు నా వెంటనున్న కవి నడిపే సాహిత్య పాఠశాలలో విద్యార్థిగా చేరిపోయాను.

బతుకు బలవంతంగా శిలువ ఎక్కినప్పుడు, కోరికలు చంపుకుని జీవించటం, ఎంతకష్టమో... సంపూర్ణంగా తెలిసిన మనిషి ఈ కవి. ఆకాశంలో మేఘాలు కదులుతూ వుంటే నన్ను ఓ చెట్టుక్రింద కూర్చోపెట్టి, కాలం చప్పట్లు కొట్టే ఒక ఘనమైన  మాటను నాతో పంచుకుంటూ... "తన ప్రేమతో గాలిగొంతును, మధురమైన పాటగా మలిచేవాడొక్కడే గొప్పవాడు...” అన్నాడు. కోటి వీణలు మ్రోగితే ఎలా వుంటుందో ఆ అనుభూతిని, ఆ మాటల్లో మొదటిసారి నా ఖాతాలో రాసుకున్నాను. అంతే ఒక్కసారిగా జీవనదులు నాలో ప్రవహించాయి. మంచుపూలు పరిమళించాయి. నెమలిపింఛంలా పురివిప్పిన పాటలు, తోటనిండా పండుగలు చేసుకున్నాయి. రమ్మని కవి సైగచేస్తే ఒక పువ్వు దగ్గరికి వెళ్లి నిలబడ్డాను. అది పారిజాతంకంటే గొప్పగా పరిమళిస్తోంది. తీరా పరిశీలనగా చూస్తే, ఆ పువ్వు కొమ్మకు పూయలేదు. ఒక పద్యానికి పూసిన కుసుమం అది. దాని కర్త ఎవరని రెమ్మల్మి అడిగితే... మెల్లగా, నా ముందు నడుస్తున్న కవిని చూపించి, ఆయనే అంటూ గుస, గుసలాడాయి. శీతాకాలమయినా పువ్వుచుట్టూ మంచుబిందువులు లేవు. ఆశ్చర్యంగా ఆ పువ్వు చెమటముత్యాల్లో మెరిసిపోతోంది. కారణం, కవి గుండె చెమ్మనుండి మొలకెత్తిన పుట్టుక ఆ పువ్వుది కాబట్టి.

ఉన్నట్టుండి కవి చాలా గంభీరంగా మారిపోయాడు. దగ్గరికెళ్లి మూసిన అతని కనురెప్పల మీద కదలాడుతున్న దృశ్యాలను చూశాను. 'భూమి పొరల్ని చీల్చుకుంటూ, దాస్యవిముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న దళిత యోధులు, చిర్రా చిటికెనపుల్లలై, డప్పు వాయిద్యాలై, జనం గుండెల్లో మొలుస్తున్నారు. మాకోసం మేమై,అందరికోసం మేమై...' అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ నినాదాల శబ్దాల్లో అణగారిన ఉద్యమాలు అగ్నివర్షం తాకిడిని తట్టుకుని, వెలుగుల వేలుపు చూపుడువేలు చూపిస్తున్న వైపుకు, బాటలు పరుస్తూ, చైతన్యవంతమైన భూమి బిడ్డలు, భ్రమలలోకం విడిచి, పిడికిళ్లనెత్తి ఆచరణశీలురై, దేశ ముఖచిత్రానికి కంటిపాపలద్దుతున్న దృశ్యాలు, చరిత్రలోని నిజాలను తెలుసుకునేలా చేస్తున్నాయి. సూర్యుడ్ని కళ్లల్లో వేసుకుని నిష్క్రమించటం తెలిసిన ఈ కవి, ఒక్కసారిగా రైతు సోదరుల సమూహల మధ్య నిలబడ్డాడు. అందర్ని మనసారా కౌగిలించుకున్నాడు. కర్షకుల నుదుటిమీద రాలుతున్న చెమట చుక్కల్ని ముద్దాడుతూ, భుజాలమీద చేయివేసి 'చీడపీడల నుండి చేనుకు రక్షణ కల్పించటానికి, ఇంద్రధనుస్సును తిరగేసి, సాంబ్రాణితో పైరుకు పొగవేస్తా, వర్తమానంపై నిర్ణయ సంతకం చేసి, మట్టికి ప్రాణం పోస్తా...” అంటూ... "చీకటి మేఘాలపై పోరుమంటల మెరుపుపాటై, నూతన యుగ ద్వారాలు తెరుస్తూ, ప్రశ్నించే తత్వాన్నై తోడుంటా..." అంటూ భరోసాను రైతుల భుజాలమీద కండువాలా కప్పటమే కాదు, ఒక శక్తివంతమైన చైతన్యాన్ని రైతుల రక్తంలో ఎక్కిస్తూ.. 'దుక్కి దున్నటమంటే, యుద్ధక్షేత్రంలో పరాక్రమించడం అని తెలిసిన నేలతల్లి బిడ్డడా! అవసరమైనప్పుడు నాగలికూడా ఆయుధమై శత్రుసంహారం చేస్తుంది కదూ!...' అంటూ ఉరుములా నినదించిన కవి కంఠంనిండా, కర్షకుడి దుఃఖాన్ని పసిగట్టడం తెలియని రాజ్యంమీద వెలిబుచ్చిన తన ఆగ్రహం, ఏకంగా నాగలి పదునుకు ఆకురాయిలా మారటం ఒక సాహిత్య ప్రయోజనానికి హారతులిచ్చినట్లుగా వుంది.

ఇంతలో నిత్యం కత్తుల వంతెనపై నడుస్తున్న వాళ్ల ఆకలి కేకలు ప్రపంచాన్ని కుదిపేస్తూ వినిపించాయి. పోరాటాన్ని నమ్ముకున్న జనమంతా క్షణాల్లో కవి చుట్టూ చేరిపోయారు. కవికి తెలుసు, నిత్య పోరాటాల బతుకెప్పుడూ పరిమళభరితం కాదని, "భయపడకండి... భయపడకండి...” అంటూ కవి తన గొంతును సవరించుకుని... “ధైర్యం, నమ్మకాలే కవచ కుండలాలుగా పుట్టిన మనుషులంతా కొత్తగా శ్వాసిస్తూ, తమను తాము పచ్చని చెట్టులా మలచుకుంటారు..." అన్నాడు, జనాన్ని చూస్తూ. ఈ మాటలు వినగానే జనం పిడికిళ్లు బిగుసుకున్నాయి. “పండిన తమ ఆకుల్ని తామే రాల్చుకుంటూ, రక్షణ కవచమై నిత్యం కొత్తగా చిగురిస్తూ వుంటారు. జయహెూ అజేయుడా... నిజమైన మనుషులంతా సరికొత్త విత్తనాలై మొలకెత్తుతారు...” అన్నాడు అందరీకీ చైతన్యాన్ని కలిగిస్తూ కవి. అంతే ఒక్కసారిగా అక్కడ చేరిన వాళ్లంతా ఎవరి బతుకు స్వరాల్ని వాళ్లే సరిచేసుకుంటూ, జీవితపు పగుళ్ల గుండె చప్పుళ్లను శృతి చేసుకుంటూ, పాల నవ్వుల్ని ఆరబెట్టుకుంటూ, శ్రమ విలువల్ని మోసే మెరుపు కత్తుల్లా నిలబడ్డ దృశ్యానికి సంతోషపడిన ఆకాశం కొత్తచీర కట్టుకుని మురిసిపోయింది. మబ్బులు కమ్మి మసకేసిన సూర్యుడు, ఒక్కసారిగా పూసిన తంగేడులా ప్రకాశిస్తున్నాడు. ఇంతలో మెరుపు మెరిసింది. ఉరుము ఉరిమింది. "చలిచీమలు బారులుతీరి మగమృగాల అహాన్ని గెలిచే రోజులు ఎదురుగానే వున్నాయంటూ...” నాలుగు దిక్కులు కలిసి సామూహిక గీతాలు పాడటం మొదలు పెట్టాయి. మట్టిమనుషుల కలలకు, బంగారు కిరీటాలు తొడగాలంటూ... భూమి తన గుండె చప్పుడు చేయటం మొదలు పెట్టింది. "పాడు, ఇంకా పాడు, కొత్తపాటలుపాడు, మానవత్వం పరిమళించి, విశ్వమంతా విస్తరించే పచ్చని చెట్టులాంటి పాటలు పాడు..." అంటూ ఎక్కడ్నుంచో ఎగురుకుంటూ వచ్చిన కోయిల, జనం మధ్య నిలబడి మాట్లాడుతోంది. సాక్ష్యంగా నా కనురెప్పలు, కాలం కాగితం మీద సంతకాలు పెడుతున్నాయి.

రోజంతా హెూరెత్తి సొమ్మసిల్లిన సముద్రపుటలలు, అలసట తీర్చుకుంటున్నాయి. నేను, కవి ఇసుక తిన్నెలమీద కూర్చున్నాం. ఒక్కసారిగా తనవైపుకు నన్ను త్రిప్పుకున్నాడు. ఆతురతగా అతని కళ్లల్లోకి చూశాను. ఆ కళ్లల్లో ఉవ్వెత్తున్న ఎగిసి పడుతున్న ఎర్రసముద్రాల అలలు కనిపించాయి. ఆయన మాటల్లో ధ్వని పిడుగులా మారింది. 'బతుకంటే ఇప్పుడు కన్నీటి నదుల ప్రవాహం, చివరి శ్వాసలో పురుడోసుకున్న మట్టివాసన, ఇదే వేదభూమి సోదరా! ...' అంటూ నా భుజాలను గట్టిగా నొక్కాడు. ఆ వెంటనే 'మన తలరాతలు స్వార్థ వైద్య నారాయణుల స్టెతస్కోపుల చేతులతో రాయబడుతున్నాయి...' అన్నాడు లేచి నిలబడుతూ కోపంగా.  కవి పాదముద్రల్ని గమనిస్తూ... నేనూ, ఆయన వెనకే నడుస్తున్నాను. సముద్రానికి దగ్గరగా వెళ్తున్నాం. అలల అల్లరి మెల్లగా మాకు వినిపిస్తోంది. “సుగంధ పరిమళ నదీతీరంలో, కవితా పతాకాన్ని ఎత్తి, తడి ఆరని జీవితాన్ని ప్రవాహంలా మోస్తూ, ఎప్పటికీ నిజాలే మాట్లాడుకుంటూ సాగిపోదామా!..." అంటూ ప్రేమగా కాలాన్ని అడుగుతున్నాడు కవి. కాలానికి బాగా తెలుసు, ప్రేమంటే పొంగిపోయే ఈ కవి తత్వం గురించి. ఇప్పుడు ఆయన కళ్లముందు సముద్రమూ లేదు, అలలూ లేవు. ఆకాశం ఎప్పుడో మాయమైపోయింది. ఉన్నది ఒక ప్రేమమూర్తి స్వరూపం. అప్రయత్నంగా “నువ్వు పరిచయమయ్యాకే కదా! స్నేహమంటే ఎప్పటికీ ముగియని వాక్యమని తెలిసింది..." అన్నాడు మెల్లగా, నన్ను చూడకుండానే. అంతటితో ఆగలేదు. ఆయన మాటలు విందామని నేను మరింత దగ్గరగా ఆయనతో నడుస్తున్నాను. మళ్లీ చెప్పటం మొదలుపెట్టాడు.... "నువ్వు పరిచయమయ్యాకే కదా! ఈర్ష్యాద్వేషాలు వదిలేసి, తాదాత్మ్యపు అంచున నిలబడి, ఇంత ఆనందంగా, ఇంత ఆహ్లాదంగా, ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్తేజంగా నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను...” అంటూ రెండు చేతులు పైకెత్తి దిక్కులకు వినిపించేలా చెప్పుకుపోతున్నాడు. కవి ప్రాణాన్ని తన ప్రాణంలో కలుపుకున్న ఆ సుందరమూర్తి, ఆ ప్రేమమూర్తి ఎవరో కాదు. ఆయన రాస్తున్న 'కవిత్వమేనని' ఆ రహాస్యాన్ని నా మనసు, మెల్లగా నా చెవిలో గుస, గుసలాడింది.

మరుసటిరోజు మళ్లీ కవిని కలిశాను. కల్మషం ఎరుగని చంటిబిడ్డలా స్వచ్ఛంగా నవ్వుతూ కనిపించాడు. నన్ను కూర్చోమని ఆసనం చూపిస్తూ... "రోజుకు ఒక్కసారైనా నవ్వుతూ కనబడకపోతే, ఒళ్లు చిత్తడిచిత్తడిగా ఉంటుంది..." అన్నాడు. వెంటనే నేను నా నవ్వులకు స్వాగతం పలికాను. ఆకాశంలోకి ఆయన దీర్ఘంగా చూస్తున్నాడు. నా మనసు కారణాన్ని అడగబోతోందని గ్రహించాడు కవి. "చీకటిని తరిమేసే వెలుగుకోసం ఎదురుచూస్తున్నాను...' అన్నాడు చాలా గంభీరంగా. అంతటితో ఆగలేదు. ఏదో బాధ, ఏదో వేదన ఆయన కంఠంనుంచి వెలువడ్డాయి. ఆయన చెప్తున్నాడు, నేను వింటున్నాను. “పసుపు కుంకుమలకు దూరమైన అంచుల్లేని చీరలన్నీ, ముక్కులు చీదుకుంటూ, గడపలముందే తమను తాము చిదిపేసుకుంటున్నాయి. ఒంటరిపోరు అనివార్యమై, రెప్పలకింద కన్నీటి కడవల్ని మోస్తున్న మహా సౌందర్యవంతులు వారు..." అన్నాడు. అనుకోకుండా ఆయన గొంతు సన్నగా జీరబోయింది. మరో విషయం గుర్తుకొచ్చి, గంభీరంగా చెప్పటం మొదలుపెట్టాడు. “ఉడుకునెత్తురుపారే కాళ్ళన్నీ, జ్ఞానసముద్రాల్లో ఉద్యమ గీతాలు పాడుకుంటూ, కుప్పలు తెప్పలుగా కొత్త చివుళ్ళేసి నవనవలాడుతున్నాయి..." అన్నాడు. ఈమారు ఆయన ముఖంలో ఏదో కొత్త వెలుగు కనిపించింది. ఇంతలో దూరంగా అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ వైపుకు నాలుగు అడుగడుగులు వేశాడు కవి. రెండు చేతులు పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ "ఆశలు మొలిచిన స్వప్న శిశువొకటి, జీవనోత్సాహంతో మహాశ్వాసను తొడుక్కొని, పరమ నిశ్శబ్ద క్షణాల్ని బద్దలు కొడుతోంది..." అంటూ గట్టిగా కేకలేశాడు. రెక్కలతో ఆయన్ని అభినందిస్తూ ఆకాశంలో పక్షుల వరుస ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ దృశ్య మనోహరతను నా మనఃఫలకం మీద చాలా గట్టిగా ముద్రించుకున్నాను.

ఈమారు కవి తన డైరీని తెరిచాడు. అందులో తాను రాసింది నన్ను చదవమన్నాడు. అక్షరాలు ఇంకా కన్నీటి తడిని మోస్తూనే వున్నాయి. దృశ్యాలు, దృశ్యాలుగా విషయం నా చుట్టూ చేరిపోయింది. “అవి కరోనా విలయతాండవం చేస్తున్న రోజులు. దేశంకాని దేశంనుంచి, ఇరవైనాలుగు గంటలు ప్రయాణం చేసి అమెరికానుంచి కవి ఆత్మమిత్రుడు ఇండియా వచ్చాడు. మిత్రుడు ఎప్పుడు ఇండియా వచ్చినా, ఆట, పాటలతో సంతోషపెట్టేవాడు, సంతోషమే సర్వస్వమై జీవితాన్ని పంచేవాడు...", డైరీ చదువుతూ సరిగ్గా నేను అక్కడ ఆగిపోయాను. ఇప్పుడు కవి మనసు నా ముందుకు వచ్చి మాట్లాడుతోంది. అప్పటి బాధ, ఏడుపు మళ్లీ ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిజంగానే కవి మనసు ఏడుస్తోంది. నా చేతులు పట్టుకొని అప్పటి దృశ్యాలను నా అరచేతుల్లో చిత్రీకరిస్తోంది. ఆ దృశ్యాలలోకి తొంగిచూశాను. "నువ్వు రాగానే ఎదురేగి నిన్ను హత్తుకోలేని, అలసిన నీ నుదుటిపై ముద్దెట్టుకోలేని, కనీసం నీ శ్వాసను తాకలేని దుష్ట క్షణాలివి. విరబూసిన నీ మౌనంముందు నేనోడిపోతున్నాను. కళ తప్పిన నీ సంతోష క్షణాలను చూడలేక పోతున్నాను. పద్నాలుగు రోజులు, పద్నాలుగు ఘడియలుగా గడిపి, సంపూర్ణారోగ్యంతో తిరిగివస్తావనే ఆశతో..." ఆ వాక్యాలు చదివి వెనక్కి తిరిగి చూశాను. "వాడు ఆరోగ్యంతో తిరిగి వచ్చాడు...” అంటూ కవి కనుబొమ్మలు పిల్లాడిలా ఎగురుతూ మాట్లాడాయి. సంభాషణను కొనసాగిస్తూ, తన మిత్రుడి గురించి చెప్పుతూ “నా ఆత్మలో అతడింకిపోయాడో, అతని ఆత్మలో నేనింకిపోయానో గాని, ఏదో తెలియని ఊహ ఒకటి నాలో ఊపిరిపోసుకొని మౌనినైనప్పుడు నా మౌనానికి మాటలు కూర్చిన నాయకుడు అతడే... అతను నా ప్రక్కనుంటే చాలు, ఆ దినమంతా నాకు వెలుగుల పండగే..." అంటూ మిత్రుడ్ని మళ్లీ, మళ్లీ గుర్తు చేసుకుంటూ కవి ముగించాడు. దూరంగా ఆకాశంలో సూర్యుడు ఆ రోజుకు వీడ్కోలు తీసుకుంటూ, పడమటి వైపుకు వెళ్లిపోయాడు.

ఆ రోజు తెల్లారకుండనే నేను కవిని దర్శించుకున్నాను. అప్పుడే ఆయన లేచి, నడి మంచంమీద కూర్చున్నాడు. లేత గోధుమవన్నె సూర్యకిరణాలు, కిటికీలోంచి చేతులు చాచి, ఆయన ముఖాన్ని లాగి, ముద్దు పెట్టుకుంటున్నాయి. కవి, తనను తాకిన కిరణాలను దగ్గరగా తీసుకుని "ఆకురాయితో నా మనసు కొడవలికి పదునుపెట్టి, చీకటికొండల్ని పగలగొడుతూ, మాటలకందని కలల ప్రపంచంలోకి నేను ప్రయాణిస్తాను. రాగాల రెక్కలపై నిత్యనూతన నిశాగీతాల్ని రచిస్తూ, చూపుల చౌరస్తాలో నిలబడి, నాణ్యమైన మనిషితనాన్ని అన్వేషిస్తూ సాగిపోతాను.. ." అన్నాడు. ఆ మాటలకు పరవశించిన కిరణాలు తల్లిలా ఆశీర్వదించి గదినిండా వెలుతుర్ని పంచాయి. కవి పైకిలేచి ఎదురుగా గోడకు వ్రేలాడుతున్న ఫోటోవైపుకు తిరిగి "తాతా! కలలు చెదిరి తాత్కాలిక కలతపడ్డావేమో గాని, నీవు రగిలించిన చైతన్య జ్వాలల్లో నిత్యం రగులుతూనే వున్నాం, నీవెత్తిన చేతన ధ్వజానికి శిరస్సువంచి ప్రమాణం చేస్తున్నాం..." అంటూ ఆ ఫోటోకు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. అందులో నా నమస్కారాన్ని కూడా భక్తిపూర్వకంగా కలిపేశాను.

ఇంతలో ఒక విద్యార్థి బృందం వచ్చి గదిలో కవి ముందు కూర్చున్నారు. ఏదో ఒకటి చెప్పమన్నట్లు అందరూ చేతులు జోడించారు. అప్పుడు కవి కంఠస్వరం గుడిలో గంటలా మ్రోగింది. అందర్నీ చూసి, చిరునవ్వుతో పలకరిస్తూ... "మీరు కాలిడితే చాలు, ఈ ఇల్లు పచ్చని ఆత్మీయ పరిమళంతో జీవం పోసుకుంటుంది, ఒక్కసారి ఆప్యాయంగా పలకరిస్తే మా దేహాలు ఎగిసిపడే కెరటాల్లా కొత్తగా శ్వాసిస్తాయి...' అన్నాడు. అప్పుడు నాకర్థమయింది. పదే, పదే ఈ పిల్లలు ఏందుకు ఈ ఇంటికి వస్తున్నారో. వాళ్లు వచ్చిన ప్రతిసారీ.. కవి తన మనసులోని మాటలు చెప్పుతూ వుంటాడు. ఈ రోజుకూడా కొన్ని మాటల్ని పోగేసుకుని చెప్తున్నాడు... "మారకపు విలువ చూడని తల్లి ప్రేమకు నోచుకున్న అదృష్టవంతులు మీరు, ఆదాయ వ్యయాలు చూడని తండ్రి ఆప్యాయతలు పొందిన ధన్యులు మీరు..." అని ఆయన చెప్పగానే ఒక్కసారిగా అందరి కళ్లల్లో జన్మనిచ్చిన తల్లిదండ్రులు దర్శనమిచ్చారు. అప్రయత్నంగానే అందరూ చేతులు జోడించారు. మాటలన్నీ అయ్యాక తిరిగి వెళ్లటానికి పిల్లలు లేచి నిలబడ్డారు. కవికూడా లేచి, దగ్గరున్న వాళ్లను ముద్దాడుతూ... "అపుడపుడు పలకరించి మా నొసటన ఒక తీపి ముద్దిచ్చి, తనివితీరా మా గుండెల్లో దూరి మమ్మల్ని హత్తుకోండి..." అంటూ పిల్లల్ని కౌగిలించుకున్నాడు. కవికి, తన ఎదురుగా వున్న పిల్లలు దేవతల్లాగా కనిపిస్తున్నారు. వరాలు కోరే భక్తుని రూపంలోకి కవి మారిపోయి... “గుప్పెడు మెతుకుల కోసం ఎదురుచూడని ఈ వయసుడిగిన పావురాలపై, కొన్ని దయాపూరిత వాక్యాల తేనెల సొనలు చిలకరించండి..." అన్నాడు. భోరుమని పిల్లలు ఒక్కసారిగా ఏడ్చేశారు. కవి కాళ్లమీద పడిపోయారు. నేను కూడా వాళ్లల్లో కలిసిపోయాను. అందరినీ లేవనెత్తి తన గుండెకు హత్తుకుంటూ... “ఒక్క నిజం కోసం, శుద్ధమైన నిజం కోసం చెప్పేది, చేసేది ఒకటే కావాలిప్పుడు, దేహాలకు దివిటీలు కట్టి, వెతుకులాటలో మీరంతా పదునెక్కాలి. మీ ఆలోచన కాంతిపుంజమై, చూపు కాగడాలా వెలగాలి, సరేనా...' అన్నాడు కవి. కళ్లు పెద్దవి చేసి, హామీ సంతకాల్లా కవిని ఒక్కసారిగా అందరూ చూశారు. ఆ గదికి దగ్గరలో వున్న చెట్టుమీద ఒక కోయిల కీరవాణి రాగంలో ఒక పాటను శ్రావ్యంగా పాడటం మొదలు పెట్టింది.

చాలా రోజులుగా నేను కవిని గమనిస్తున్నాను. సూర్యుడు రోజూ ఆయన్ని తాకనిదే, గోధూళి వేళను తన కడుపులో వేసుకోవటం లేదు. చంద్రుడూ అలాగే, అతి సున్నితంగా ఆయన్ని తడమందే నిశ్శబ్దపు సముద్రాల్లోకి నిష్క్రమించడం లేదు. ఎక్కడ్నుంచి వస్తాయో తెలియదు గాని, రెండు శాంతికపోతాలు సరిగ్గా నిర్ణయించిన వేళకు ఎగిరివచ్చి కవి రెండు భుజాలమీద వాలిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కవికి వేరే చిరునామా అక్కరలేదు. ఈ దృశ్యాలే శాశ్వత చిరునామాలా నిలిచి పోతున్నాయి. కవి తన పెరట్లోని మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. గేటును నెట్టుకుంటూ ఓ వ్యక్తి వచ్చి కవిముందు నిలబడ్డాడు. మనిషి వొంట్లో రక్తమాంసాలకంటే, నిరాశ, నిష్పృహలే అధికంగా వున్నట్లు కనిపిస్తున్నాడు. వచ్చీరాగానే... "నన్ను నేను కోల్పోయి ఎన్నేళ్ళయిందో, అశాశ్వత సంపదపై మక్కువను తొలిగించే రోజుకోసం ఎదురుచూస్తున్నాను...' అన్నాడు. వెంటనే కవి తన ప్రక్కనే వున్న మొక్కనుంచి ఒక పుష్పాన్ని త్రెంచి చేతికందించాడు. ఆ పుష్పం చాలా పరిమళంగా వుందతనికి. తన ఆశ నెరవేరుతుందన్న నమ్మకం, ఆ పూవులోని ప్రతి రెక్కలోనూ కనిపించింది. ఇప్పుడు అతడి రక్తంనిండా చెప్పలేనంత ఉత్సాహం. కవికి నమస్కరించి పెద్ద, పెద్ద అంగలతో బయటికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఒకరోజు కవిత రాస్తూ, మధ్యలో ఆపి నాతో కవి ఇలా సంభాషించాడు... "నన్ను నేను పూర్తిగా మార్చుకొని చిన్నపిల్లాడిలా మారిపోవాలని వుంది. వెలుగు సుగంధాలు వెదజల్లుతూ సూర్యుడు మన ఇంటిలోంచే లోకాన్ని చూడాలనే వెర్రి ఆశ నాది..." అన్నాడు. తిరిగి కవిత రాయటానికి ఉపక్రమించాడు. ఆయన కవితల్ని నేను చాలా చదివాను. అవి ఎలా ఉంటాయంటే, కొన్ని పదాలను చనుబాలలో తడిపి, గుదిగుచ్చి మాలకట్టి, పాటకు శ్వాసనూది ఆకాశంలోకి ఎగిరేసినట్లుగా వుంటాయి. కవిత పూర్తయ్యాక చదివితే, ఆ పంక్తులన్నీ మానవతావనమై వికసిస్తున్న ఓ కమ్మని పాటగా విశ్వ హృదయాన్ని తాకుతూ స్పృసిస్తుంది. ఇంతలో కవి నావైపు చూశాడు. తాను రాస్తున్న కవిత పూర్తయినట్లుంది. ఎప్పుడు ఏ కవిత పూర్తి చేసినా ఆయన ముఖంలో పచ్చని పంట విచ్చుకున్నట్లుగా వుంటుంది. ఈ రోజు తాను రాసిన కవితపట్ల కవి చాలా సంతృప్తిగా కనిపిస్తున్నాడు. ఆయన్ని చూస్తూవుంటే 'యుద్ధభూమిలో ఆయుధాలు లేని సైనికుడిలా, ఒక్క నెత్తురుచుక్క నేల రాలకుండా విజయం సాధించిన వీరుడిలా కనిపిస్తున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి చేసే మానవసంతతి సమూహంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవటానికి నిత్యం శ్రమిస్తూనే వుంటాడు ఈ కవి. ఆయన్ని సమీపంగా చూసినప్పుడల్లా మనిషి అజేయుడు, మనిషి ఒక్కడే అజేయుడన్న మాట, మళ్లీ, మళ్లీ నాతో కరచాలనం చేస్తూనే వుంటుంది.

ఆకాశంలో సూర్యుడు మండిపోతున్నాడు. అంతకంటే చాలా కోపంగా వున్నాడు కవి. ఎవర్నో గుమ్మం దగ్గరే నిలబెట్టి కేకలేస్తున్నాడు. “నీ పేరు ఉచ్ఛరించటానికే నాకు మనసొప్పటం లేదు. నువ్విప్పుడొక చెల్లని 'నోటు'వి మాత్రమే కాదు, 'నోటా'వి కూడా. మా కంటి చూపుల్ని పొట్టనబెట్టుకొని ఆకలి తీరిన రాక్షసుడిలా బ్రేవ్ మని త్రేన్పుతున్నావు. యుద్ధానికి, అణుయుద్ధానికి నువ్వే కారణమైతే మా కాశ్మీరీల కుంకుమ సాక్షిగా చెబుతున్నాం... ఎదుగుతున్న నీ స్వప్నాల్ని ధ్వంసం చేసి మీ శ్వాసల్ని దిష్టిబొమ్మను చేసి, మెలుకువతో మా కాలి బాటలు సరిచేసుకుంటాం మొహమాటాలే లేకుండా... వెళ్లు..." అంటూ వాడి చొక్కా పట్టుకొని గట్టిగా విసిరేశాడు. వాడు నేరుగా భారతదేశ సరిహద్దులు దాటి హిమాలయాలకు ఆవల పడిపోయినట్లుంది. వాడు వెళ్లిపోయాక చుట్టూవున్న వాళ్లందరిని చూస్తూ... "వాడేదో పంట పొలమైనట్లు, మనమేదో కలుపుమొక్కైనట్లు మనలో కొందరిని బాహాటంగా లొంగదీసుకుంటున్నాడు. ప్రతిఘటన ఎదురైనప్పుడే శక్తిని కూడగట్టుకొని విస్తరిస్తూ పోవాలి. ఇప్పుడు ఎవరికి వాళ్లం నిట్టనిలువునా చీల్చుకుని, ఒక్కటిగా బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది. దారులన్నీ సుగమం చేయండి. పర్వతాలు ప్రవహిస్తున్నాయి నదుల్లా, నక్షత్రదీపాలు వెలిగించి, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టి, ఆకుపచ్చని జెండాలు ఎగరేస్తూ స్వాగత గీతాలు పాడండి. జయహెూ అజేయుడా!...' అంటూ ఆయన గట్టిగా నినాదాలు చేశాడు. ఆయన మాటలు అక్కడ విన్నాక, కవులంటే కణకణమండే అగ్నికణాలని, కవితో మాట్లాడటమంటే సూర్యుడితో మాట్లాడటమని తెలిసింది. ఆయన పదాల అస్త్రాలకు నమస్కరించకుండా ఉండలేకపోయాను.

రెండురోజుల తరువాత మళ్లీ నేను ఆయన దగ్గరికి వెళ్లాను. ఏదో రాసుకుంటున్నాడు. నన్ను చూసి కూర్చోమన్నాడు. ఎప్పటిలాగే ఆయనకు ఎదురుగా కూర్చున్నాను. ఆయన రాయటం ఆపకుండనే మాట్లాడుతున్నాడు. ఏం రాస్తున్నారని చనువుగా అడిగాను. ఆయన తలపైకెత్తి, సూటిగా నా కళ్లల్లోకి చూస్తూ "అట్టడుగు పొరల్లో ఇంకిపోతూ పేదరికంలో మగ్గుతూ నిత్య మరణానికి చేరువయ్యే నల్లమొగ్గల కోసం నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకుంటూ కొత్త చిరునామా రాసుకుంటున్నాను . ఇలా రాసుకుంటున్నప్పుడు కొత్త వాసనేదో ముక్కుపుటాలు తాకి, పరవశమైన ఒకానొక మార్మిక రసానుభూతి నా పంచన చేరుతోంది. ఈ క్షణం నాలో జీవనదులు ప్రవహిస్తున్నాయి, మంచుపూలు పరిమళిస్తున్నాయి. నెమలిపింఛంలా పురివిప్పిన పాటలు, పండుగలు చేసుకుంటున్నాయి. యుద్ధరహిత ప్రపంచం కోసం స్వాగత గీతం పాడుతున్నాను విను"... అన్నాడు కవి. ఆ మాటలు విశ్వాసపు ఆకాశాన్ని వెలిగించే మెరుపు తీగల్లా అనిపించాయి. తాదాత్మ్యం చెందిన నా మనసు ఒక్కసారిగా పులకరించిపోయింది.

ఆయన జీవన సరళిని అధ్యయనం చేసిన నాకు తెలిసిందేమిటంటే, ఏ జామున లేస్తాడో గాని, నొసటిన అక్షరసూర్యుడ్ని మోస్తూ, ఆకలిపాటను నిశ్శబ్దంగా పాడుకుంటూ వుంటాడు. పిడికెడు ఆత్మీయ వెలుగు కిరణాల్ని పంచుతూ అక్షర వీరులతో చేతులు కలిపి వారసత్వపు జెండాను మోస్తూ, ప్రశ్నించే గొంతులకు చైతన్యపు శ్వాసనిస్తూ, వెన్నెల వెలుగుల్ని పంచుతూ వుంటాడు. కవికి నమస్కారం చేసి వీడ్కోలుకు సిద్ధమయ్యాను. ఒక్కమాట! అంటూ దగ్గరికి పిలిచి రేపు ఉదయం కొంచెం తొందరగా రమ్మన్నాడు. ఇద్దరం కలిసి ఒక పర్ణశాలకు వెల్దామన్నాడు. వివరాలు నేను అడిగేలోపలే ఆయన లోపలికి వెళ్లిపోయాడు.

తెల్లారింది. అనుకున్న సమయానికి ముందే ఆయన ముందు హాజరయ్యాను. ఇద్దరం కలిసి పర్ణశాల చేరాం. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, తెలుగుదనానికి ప్రతీకగా వుంది. ప్రతి కుటీరం ముందు తెలుగు అక్షరమాల చాలా అందంగా అలంకరించబడివుంది. ఆ ప్రాంగణంలో విస్తారంగా విస్తరించిన వృక్షాలకన్నింటికీ తెలుగు మహాకవుల పేర్లను పెట్టటం నాకు చాలా ఆశ్చర్యాన్ని, మరింత రెట్టింపు ఆనందాన్ని కలిగించింది. అక్కడ ఏవో హెూమాలు జరుగుతున్నాయి. అవన్నీ సాహిత్య హెూమాలంటూ కవి నాకు పరిచయం చేశాడు. మొదట సందర్శించిన కుటీరంలో పచ్చటి వేపచెట్టులాంటి మనిషి, పసిబిడ్డ నవ్వుతో కనిపించాడు. ఆయన మునివేళ్లనుంచి ఏవో వాక్యాలు రాలుతున్నాయి. చూస్తే, పొద్దుటే పలకరించే వసంత మేఘాల్లా మిలమిలలాడుతున్నాయి. "నిత్యం నా ఆలోచనలకు చమురైనవాడు ఆయనే..." అంటూ కవి, నన్ను ఆయన సమీపానికి తీసికెళ్లాడు. “దేహఖడ్గాన్ని ధరించిన సహజ సంతకం, నిత్యం కొత్తతరం నుంచి నేర్చుకుంటున్నానంటూనే, నాలుగు తరాలను ప్రభావితం చేసిన సరికొత్త నిర్వచనాల ప్రతీక ఈ మహానుభావుడే...' అంటూ ఆయన్ని నాకు పరిచయం చేశాడు కవి. దగ్గరికెళ్లి నమస్కారం పెట్టాను. ఒక కవిత్వ చరణంతో నన్ను ఆశీర్వదించిన ఆ తెలుగు కవి ఎవరో కాదు, అక్షరాలను ఆకాశంలోకి ఎగరేసి, వాటిని కవితలుగా పుష్పింపజేసే అసాధారణ సాహితీవేత్త కె. శివారెడ్డి.

మరో కుటీరం సాదరంగా ఆహ్వానించింది. లోపలికి అడుగుపెట్టగానే ఒక చంటిబిడ్డ నవ్వు వినిపించింది. ఆ చంటిబిడ్డ ఎక్కడా? అంటూ నేను వెతుకుతూ వుంటే, ఆ నవ్వు ఆయనదే అంటూ తెల్లటి మేఘంలా ఎదురుగా నిలబడ్డ ఒక మహా సాహిత్య శిఖరాన్ని నాకు పరిచయం చేశాడు కవి. ఆ మహానుభావుడ్ని చూడగానే 'మరణం ఎవరికైనా ఒకటేననే వేదాంత జీవన సత్యసూత్రం...' ఆ గదినిండా ప్రతిధ్వనించింది. "కీర్తికోసం ఆరాటపడని పచ్చి పల్లెటూరి పెద్ద మనిషి ఆయన, సామాజిక న్యాయసూత్ర స్ఫూర్తి ప్రదాత, నిలువెత్తు జీవితంగా నడిచే సృజనల మొదటి వరుసలో మొదటి వారు ఆయనే..." అంటూ నా చేత నమస్కారం చేయించాడు కవి. "కడిగిన ముత్యమంటి కథలతో సాహిత్యాన్ని రక్తికట్టించిన బహుముఖీన సాహిత్య సృజనకారుడు, గుర్రం వారసుడు...” అంటూ ఆయన చుట్టూ నా చేత ప్రదక్షిణలు తనతోపాటు చేయించాడు కవి. అస్తిత్వ స్పృహ, అస్తిత్వ ధిక్కారం, సామాజిక వేదనలే వస్తువులుగా, తెలుగు మాగాణంలో నల్లరేగడి గింజలు పండించి, వందకు పైగా అతి శక్తివంతమైన గ్రంథాలు వెలువరించిన నిత్య సత్వాన్వేషి ఆచార్య కొలకలూరి ఇనాక్  దర్శనం ఒక భాగ్యంగా భావించి, ఆనందంగా ఇద్దరం బయటికి వచ్చాం.

బయటికి వస్తూనే “నమూనా మనిషిని చూశావా?" అంటూ అడిగాడు కవి. లేదని తల ఊపాను. “అయితే పదా చూద్దువు గాని...' అంటూ నన్ను మరో కుటీరంలోకి తీసికెళ్లాడు. ఎదురుగా సాహితీమూర్తి యం. నారాయణశర్మని చూపిస్తూ... "అదిగో ఆయనే అక్షర పరుసవేది. అయినా బతుకంతా నిత్య సంఘర్షణ. ఎప్పుడూ పదాలను నాలుక మీద నాట్యం చేయిస్తూ, బతుకు దారిలో కొత్త మలుపులు తిరుగుతూ కొత్తకొత్త కలలుకంటూ వుంటాడు...” అన్నాడు కవి. ఇద్దరం వెళ్లి ఆయన ముందు నిలబడ్డాం. "రాగద్వేషాలకతీతుడు, ఆధునిక సాహిత్య విమర్శకు ఆశాకిరణం, విశ్వభావనకు ప్రతీక అతడు...” అంటూ, "మేమిద్దరం ఒకరికొకరం మాటలతో యుద్ధాలు చేసుకునేవాళ్ళం. ఒక్కవారం కలవకపోతే నన్ను నేను కోల్పోయి, మోయలేని విషాద భారంగా తయారయ్యేవాడ్ని. అతడితో కరచాలనం ఎన్నటికీ ముగియని పదిలమైన స్నేహకావ్యం.  మనిషితనానికి అతడొక నమూనా. ఎంతపంచినా తరగని జ్ఞాన ఖజానా..." అంటూ కవి పలికిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క గజమాలగా మారి శర్మ కంఠాన చేరింది  “సాయంకాలమవుతోంది, తొందరగా మరొకర్ని కలవాలంటూ..." కవి నన్ను మరో కుటీరంలోకి ప్రవేశించేలా చేశాడు.

ఆ ప్రక్కగా కొంచెం దూరంగా చుట్టూ రకరకాల పూలమొక్కల పొదలతో చాలా రమణీయంగా మరికొన్ని కుటీరాలు కనిపించాయి. వడివడిగా అడుగులేసి వాటిని చేరుకున్నాం. లోపలికి వెళ్లితే అక్కడ మనుషులు లేరు. చిత్రపటాలు మాత్రం సజీవంగా దర్శనమిచ్చాయి. "ఆకాశమంత కనికరపు ఆయుధాన్ని నా దేహక్షేత్రం మీద నిలబెట్టి, కాలంతోపాటు పరుగెత్తే నమ్మకానిచ్చి, నన్ను సచేతనం చేసింది ఆ మహానుభావుడేనంటూ...” ఎదురుగానున్న దాశరథి రంగాచార్య తైలవర్ణపటం దగ్గరికి కవి నన్ను తీసికెళ్లాడు. ఆ ముఖంమీద చిరునవ్వుకు తోడుగా, నుదుట మూడు నామాల తిలకం, ఆ కనురెప్పల మీద సాహితీవేత్తగా, తెలంగాణ సాయుధ పోరాట యోధుడుగా కీర్తించబడిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఏదో అడగబోయి ప్రక్కనున్న కవివైపు తిరిగాను. ఆయన నేత్రాలనిండా నీరు. నేను మౌనంగా నిలబడి పోయాను. ఆయనే చెప్పటం మొదలు పెట్టాడు. మాటలు ఎక్కడో నూతిలోనుంచి, కన్నీటి తడిని మోసుకొస్తున్నట్లుగా వున్నాయి. మరింత దగ్గరగా చేరి ఆ మాటలు వింటున్నాను. "స్వచ్ఛమైన బీజాలను నాలో నాటి, ఆకుపచ్చకాంతులు వెదజల్లుతూ, మళ్లీ రేపు కలుద్దామని చెప్పి, జీవితపు పల్లవులు పాడుకుంటూ వెళ్లిపోయారు. ఇంతవరకు తిరిగి రాలేదు..." అంటూ కవి పలికిన ఆ చివరి మూడు మాటలు దుఃఖాన్ని మోసుకొస్తూ ఆయన మనసునుంచి బయటికొచ్చాయి. ఇంతలో చల్లటి గాలి ఒకటొచ్చి కవిని తన ఒడిలోకి తీసుకొని తల్లిలా ఓదార్చింది.

నాచేత మరో కుటీరంలోకి అడుగులు వేయించాడు కవి. లోపలికి వెళ్లి వెళ్లగానే "విశ్వ భాషను ఆవిష్కరించిన అక్షరం అతడే..." అంటూ గులాబీ పూలమాలతో వ్రేలాడుతున్న ఒక చిత్రపటాన్ని చూపించాడు కవి. "రన్నింగ్ కామెంట్రీ పునర్జన్మ పొంది తిరిగొస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి..." ఎక్కడో ఆకాశంలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు కవి. రక్తం బదులు కవి వొంట్లో  దుఃఖం ప్రవహిస్తున్నట్లుగా వుంది. “మాటి మాటికి మాటలు ఖర్చు చేయని 'గాలిరంగు' కొయ్యకాలుతో లోకాన్ని చూడలేక మూగబోయింది...” అంటూ బాధతో నిలబడలేక కుర్చీ ఆసరాగా కూర్చుండిపోయాడు కవి. ప్రతిభావంతమైన వర్ణనలతో, పుష్టికరమైన సాహిత్య సంపదతో 'అమ్మచెట్టు', 'నీటిపుట్ట', 'తుఫాను తుమ్మెద', 'చేప చిలుక', 'గాలిరంగు'... ఇత్యాది గ్రంథాల సృజనకారుడు 'దేవిప్రియ' చిత్రపటానికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి, మరో కుటీరంలోకి అడుగుపెట్టాం.

“అదిగో అతడే నిద్ర ఎరుగని మొనగాడు...' అంటూ వెళ్లి వెళ్లగానే అగరవత్తుల్ని వెలిగించి, 'అయిల సైదాచారి'  చిత్రపటాన్ని చూపిస్తూ “పల్లె సుగంధాలను ఏరుకొచ్చి, మాయమైపోతున్న మానవత్వానికి సకల మెళుకువలతో గొప్ప ఆశాగీతాన్ని రచించిన కలం యోధుడతడే..." అన్నాడు. దగ్గరికెళ్లి ఆయనను దర్శించుకున్నాను. కవి, నేనూ ఒకచోట సేదతీరుతూ కూర్చున్నాం. ఒక్కసారిగా గతించిన ఆయన మిత్రుడి జ్ఞాపకాలు కవి చుట్టూ చేరిపోయాయి. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ..." తనూ నేనూ అనేక కవిసమయాలను పంచుకుంటూ, కాలపు బరువులను మోసుకుంటూ, ఆకలి డొక్కలకోసం కవిత్వం రాశాం. పల్లెమట్టిని మనసారా స్పర్శించి పులకరించిపోయాం..." అంటూ భారంగా కళ్లు మూసుకున్నాడు కవి. రెండు కన్నీటిచుక్కలు నా చేతిమీద రాలిపోయాయి. కన్నీళ్లు తుడుచుకొని “నా మిత్రుడికోసం కవితా జలపాతాల్లో మునిగి తేలుతూ, చిరకాలం గుర్తుండిపోయే చిక్కటి స్నేహగీతమొకటి రాస్తాను..." అంటూ పైకిలేచి మరోసారి ఆ చిత్రపటానికి ఇద్దరం నమస్కారం చేసి, వెన్నెల్లో నడుచుకుంటూ పర్ణశాలనుంచి బయటికి వచ్చాం.

నేను తిరిగి నా నివాసానికొచ్చాక, అసలు నిద్ర రావటం లేదు. కవిని, ఆ కవి తత్వాన్ని గురించే ఆలోచిస్తున్నాను. అనేకానేక సందర్భాలలో ఆయనతో పంచుకున్న సంభాషణలన్నీ గుర్తుకొస్తున్నాయి. విశ్రాంతి ఎరుగని హృదయపు కదలికల్ని ఆయనలో నేను గమనించాను. నాలుగు గోడలమధ్య గాలిని బంధించి శూన్యంలో నఖచిత్రాలు గీస్తాడు. నాలుగు మొక్కజొన్న పొత్తులను ముందేసుకొని ఏ పొత్తులో ఎన్నెన్ని గింజలు ఉన్నాయో లెక్కిస్తూ,  కాలాన్ని మైనపుబొమ్మలా కరిగిస్తాడు. ఒకసారి మీ ఆనందానికి మూలమేమిటని ఆయన్ని అడిగాను. తడుముకోకుండా వెంటనే "కవిత్వం నా ఆశ, కవిత్వం నా శ్వాస, కవిత్వం నా అనిర్వచనీయమైన ఆనంద రహస్యం..." అంటూ చిరునవ్వును జతచేసి చెప్పాడు. వెంటనే నా వైపుకు తిరిగి “నేను నిజంగా బ్రతుకుతున్నది కవిత్వం నా ఊపిరి అయ్యాకే. కవిత్వాన్ని అవగాహన చేసుకోవటం నేర్చుకున్నాకే, ఈ ప్రపంచం మొత్తం నాకర్థమై పోయింది...' అన్నాడు. పరిశీలిస్తే ఈ కవి జీవితం చాలా వైవిధ్యంగా వుంటుంది. ఆయనకు జీవితమంటే చెమట చుక్కతో మొలిచిన పాటకు బాణీ, కన్నీటి చెమ్మతో పదునెక్కిన ఓ ఋతుసంగీతం. అందుకేనేమో ఋతువులన్నీ వరుసలో వచ్చి ఆయన వాకిలిముందు ఆహ్వానం పలుకుతూ వుంటాయి. నిన్నటిరోజు జరిగిన సంఘటనను నేను తప్పకుండా మీతో పంచుకోవాలి. పర్ణశాలను దర్శించుకొని తిరిగి వస్తున్నప్పుడు, నన్ను ఆగమని చెప్పి, ఒక నాగలి నమూనాను నా చేతికందించాడు. “ ఇకనుంచి నీ కలం ఇదే...” అన్నాడు. చూస్తే నాగలి చాలా పదునుగా వుంది. ఆయుధంలా వుంది. దాని ఒంటినిండా తెలుగు అక్షరాలే. కళ్లకద్దుకుని ఇంటికి తెచ్చుకున్నాను.

కొమ్మవరపు విల్సన్ రావు 'నాగలి కూడా ఆయుధమే...' కవితా సంపుటిని, దాని పేజీలు, దేనికవే విడిపోయేదాకా ఎన్నిసార్లు చదివానో నా కనురెప్పలకు గుర్తులేదు. పుస్తకంలోని సారాన్ని పూర్తిగా జీర్ణం చేసుకున్నాక నాకే తెలియని, ఇంతకుముందెన్నడూ నా అనుభవంలోకి రాని ఒక విచిత్రమైన తాదాత్మ్యం ప్రపంచంలోకి విసిరేయబడ్డాను. పడింది సాహిత్యపు సముద్రంలో. ఈదుతూ, ఈదుతూ ఆ కవిత్వాన్ని సంతృప్తిగా ఆస్వాదిస్తూ, మనసును తాళపత్రాలుగా మార్చి, అనుభూతుల్ని ఇలా దృశ్యాలు, దృశ్యాలుగా ఒక రూపంలో నిక్షిప్తం చేసుకున్నాను.

ఈ. వెంకటేష్ కవిత : పంచభూతాలు
సూర్యుడు జీవితంపై విరక్తితో
గిలగిలా తన్నుకొని
ఆత్మహత్య చేసుకున్నాడు
పోస్టుమార్టం మొదలైంది
డాక్టర్లు చెప్పిన కారణం
"కాలుష్యం"

చెట్లు చిగురించడం మానేశాయి
నీడనివ్వడానికి అలిగాయి
మనుషులు బతకడానికి
ఆక్సిజన్ ఇవ్వడానికి
దానికి మనసు రావడం లేదు.

చంద్రున్ని ఇప్పుడు
ఎవరైనా "మామా" అని పిలిస్తే
అతని  కనులు కోపంతో
బుస కొడుతున్నాయి
ఎప్పుడైనా తన పైకి స్వార్థ
మానవులు దండయాత్ర చేస్తారని

మలయమారుతం
ఇప్పుడు చల్లగా వీచడం లేదు
సుడిగాలి వలయాన్ని సృష్టించి
పెట్టుబడిదారులను అందులో
ఎత్తుకెళ్లాలని కసిగా ఉంది

భూమాతకు సహనం నశించి
అసహనం తారాస్థాయికి చేరింది
ఇన్ని కోట్ల స్వార్ధ మానవులను
ఏమీ ఆశించకుండా భరిస్తున్నందుకు

నిప్పు ఇప్పుడు
వంటకు బదులు
ప్రాణాలు తీయడానికి మాత్రమే
అని ప్రతిజ్ఞ చేసింది

ఆకాశం ఈ దయలేని
మానవున్ని చూసి
ఒక్క వర్షపు చుక్కను కూడా
విదల్చడం లేదు
పైగా పైనుంచి నిర్వికారంగా
నవ్వుతూ ఉంది

రేడియమ్ కవిత : ఆటమొదలు
దేశం మట్టి మనిషి వేరుకాదబ్బ విడిపోతే పడి పాడైపోతావు అంటూ రేడియమ్ రాసిన కవిత  ' ఆటమొదలు ' ఇక్కడ చదవండి :

చేపల చెఱువు
గొఱ్ఱెల మండి
కొంగల గుంపు
నక్కల గుంపు

దొంగ తపస్సు
ధూర్త వినయం
పాతకథలవి
కొత్త రూపంగా అవి

మళ్లి కులం పోట్లు
మళ్లి కరెన్సీ నోట్లు
మళ్ళి ఓట్ల జాతర
గద్దె కోసం తండ్లాట

బుద్ధి డబ్బు మేసిన
బుద్ధి మత్తులో తూలిన
ఉనికి తారుమారు
అస్తిత్వం మంటపాలు

యుద్ధాలు చరిత్ర చెబుతాయి
జీవించె తీరులో నాగరికతలు
కులం తగదాలు తగ్గుతున్నాయి
మతాల జోరు అంతగా కానరావు

ఓట్ల పేరుతో ఏకతా సూత్రనికి దెబ్బ
దేశం మట్టి మనిషి వేరుకాదబ్బ
విడిపోతే పడి పాడైపోతావు
నిప్పు గాలి వానలా ఉండి పోవాలి

రేపు తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ సభ
రేపు అనగా 24-3-2024 ఆదివారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉదయం 10గంటలకు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ ఒక రోజంతా  సాహిత్య సభలను మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నది.

మొదట ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ సభలను ప్రారంభిస్తారు. తర్వాత కవి కందుకూరి శ్రీరాములు రాసిన ' పలకల నుంచి పలుకుల వైపు '  కవితా సంపుటిని   ముఖ్య అతిథి  శివారెడ్డి గారు ఆవిష్కరిస్తారు.  విశిష్ట అతిథులుగా నందిని సిద్ధారెడ్డి , దేశపతి శ్రీనివాస్, ఆత్మీయ అతిథులుగా నాళేశ్వరం శంకరం, విరహత్ అలీ పాల్గొని ప్రసంగిస్తారు. వివిధ జిల్లా శాఖల తెరసం అధ్యక్షులు కొత్త అనిల్ కుమార్, పొట్లపల్లి శ్రీనివాస్, బిల్లా మహేందర్, పానుగంటి రామ్మూర్తి , ముత్తిగారి కవిత, పొన్నాల బాలయ్య, గణపురం దేవేందర్ సందేశాలు ఇస్తారు. కొండపల్లి నిహారిణి ఆహ్వానంపలుకగా బెల్లంకొండ సంపత్ కుమార్ కార్యదర్శి నివేదికను సమర్పిస్తారు.

రెండో విభాగంలో ' సాహిత్యం సమకాలీనత ' అంశంలో కవిత్వం మీద దర్భశయనం శ్రీనివాసాచార్య ,  కథ- నవల మీద ఎన్ .రజని,  విమర్శ -పరిశోధన మీద లక్ష్మణ చక్రవర్తి ప్రసంగిస్తారు. వి శంకర్, రూప్ కుమార్ డబ్బీకార్, తూర్పు మల్లారెడ్డి సభలకు అధ్యక్షత వహిస్తారు.

మూడో విభాగంలో  38 కవులు పాల్గొంటున్న కవిసమ్మేళనానికి గండ్ర లక్ష్మణరావు అధ్యక్షతవహిస్తారు. ఇందులో కందాళై రాఘవాచార్య,వేణుశ్రీ, అహోబిలం ప్రభాకర్ , తిరునగరిశ్రీనివాస్ , ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, దేవనపల్లి వీణావాణి, దాసరిమోహన్ , ధూళిపాళ అరుణ, గజేందర్ రెడ్డి , నరేశ్ చారి, నల్లగొండ రమేశ్ మొదలైన వారు పాల్గొంటారని తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్ కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

‘మంచి కవిత్వం సంఘర్షణలో నుంచే జనిస్తుంది’
డా. బండారి సుజాత పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిన్న హన్మకొండలో జరిగింది. ఆమె కవితా సంపుటి వేకువ పుష్పం, కథా సంపుటి వెలుతురు చూడని యెన్నియలు ఆవిష్కరించారు. శ్రీలేఖ సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ టీ శ్రీరంగస్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకురాలు, రచయిత్రి కాత్యాయని విద్మహే పుస్తకాలని ఆవిష్కరించి మాట్లాడారు. కవిత్వంలో సాంద్రత, వ్యక్తీకరణతోపాటు సాధారణ వాక్యానికి భిన్నంగా కవిత్వం ఉండాలని, లోతైన భావాలతో కవి నిరంతరం సంఘర్షణకు గురైనప్పుడే మంచి కవిత్వం వస్తుందని అన్నారు. డా. బండారి సుజాత రచనలలో సామాజిక అంశాలు ఎక్కువగా చోటుచేసుకోవడం విశేషణమని పేర్కొన్నారు.

కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ పుస్తకాన్ని సమీక్షిస్తూ సుజాత ఉపాధ్యాయురాలుగా, పరిశోధకురాలుగా, కవిగా, రచయితగా కొనసాగుతూనే పలు ప్రజాస్వామిక సంస్థలతో కలిసి విలువల కోసం నిరంతరం కృషిని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. తన రచనలలో మహిళలపై జరుగుతున్న వివక్షతలను ప్రశ్నించడంతోపాటు మగవాడి దౌర్ఙన్యాలనుండి స్త్రీ విముక్తి పొందేవిధంగా ధైర్యంగా అడుగులు ముందుపడాలని సూచిస్తారు. మరో సమీక్షకురాలు సింగరాజు రమాదేవి మాట్లాడుతూ సుజాత కథలు మానవీయకోణంలో కొనసాగాయని అన్నారు.  కార్యక్రమంలో అతిథులుగా అన్నవరం దేవేందర్, రాపోలు సత్యనారాయణ, అనిశెట్టి రజిత, పొట్లపల్లి శ్రీనివాసరావు, రాపోలు సత్యనారాయణ పాల్గొని మాట్లారు.  కవులు పి.చందు, నాగిళ్ళ రామశాస్త్రి, పల్లె నాగేశ్వరావు, కోడం కుమారస్వామి, మంథిని శంకర్, కార్తీకరాజు, గట్టు రాధిక, బాలబోయిన రమాదేవి, ఉదయశ్రీ ప్రభాకర్, వల్సపైడి, వందన, లీల, విద్యాదేవి, సోమన్న, సంపత్ రెడ్డి, ఆశయ్య తదితరులు  పాల్గొన్నారు.

‘జడిగం’ కవితా సంకలనం ముఖ చిత్రం ఆవిష్కరణ
జిల్లా రచయితల సంఘం, అనంతపురం ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా త్వరలో  వెలువడనున్న"జడిగం" కవితా సంకలనానికి సంబంధించిన
ముఖచిత్రం ఆవిష్కరించారు.

అనంతపురం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా త్వరలో వెలువడనున్న కవితా సంకలనానికి సంబంధించిన ముఖచిత్రాన్ని ఆ సంఘం ఆవిష్కరించింది. స్థానిక అనంతపురం టవర్ క్లాక్ సెంటర్లో సీనియర్ రచయిత,కథకులు, నవలాకారులు, వైయస్సార్ లైవ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత డాక్టర్ శాంతి నారాయణ  జడిగం కవితా సంకలనం ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. మరో అతిధిగా సీనియర్ రచయిత, కవి తూముచర్ల రాజారాం హాజరై మాట్లాడారు. వర్తమాన అనంత కవిత్వాన్ని సంకలనం చేయాలనే జిల్లా రచయితల సంఘం ప్రయత్నాన్ని వారు అభినందించారు.

ఈ సంకలనాన్ని "జడిగం" పేరుతో తీసుకురావడం పట్ల శాంతి నారాయణ హర్షం వ్యక్తం చేశారు.  అనంత రైతుకు సంకేతంగా ఈ పేరు కనిపిస్తోందని వారన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ జన్నె ఆనంద్ కుమార్, కొత్తపల్లి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వర్తమాన కవులు మధుర శ్రీ, సురగౌని రామకృష్ణ, నానీల నాగేంద్ర, కోటిగారి వన్నప్ప, గోసల నారాయణస్వామి, మిద్దె మురళీకృష్ణ, విధురా రెడ్డి, చేగువేరా హరి, ఈరన్న,  వలస రమేష్, లక్ష్మి శ్యామ్, శంకర నారాయణ, కిషోర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

ఒబ్బిని కవిత: బరువు
సూర్యుడికి ముచ్చెమటలు పడుతున్నాయి
మహా నగరాల్లోని శిఖరాల గూళ్ళ పెండికట్టులో
తన కిరణాలు దూరడానికి సందు దొరక్కపోవడం చేత !
మనుష్యులకి  కూడా ముచ్చెమటలు పడుతున్నాయి
కట్టెల మోపుల బరువుల కంటే కూడా బరువైన
మానసిక బరువులని మోయలేక
మనుషులకి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి !

లోకానికి బతకలేనితనం
ఓ మహా పర్వతాల బరువులా మారింది !
భూగోళం బొంగరంలా తిరుగుతుంది శిరస్సుల మీద !
నెత్తిమీద పాము పడగై బుసగొడుతుంది బతకలేనితనం!

అరచేతుల మీద ఖాళీ అన్నం గిన్నెలు
నిరతం ఆకలి గొంతు చించుకుంటూనే ఉన్నాయి !
మనిషి స్నానాల గదిలో
నీళ్ళతో కాకుండా కన్నీళ్లతో స్నానం చేస్తున్నాడు !
తులాభారాల పాలనలు
మనిషి బరువుని దించలేకపోతున్నాయి !

ఆకాశం రక్త విభూతి రేఖలు దిద్దుకుంటుంది !
మంచు దుప్పట్లు
వృక్షాల  ఊతకోసం ఎగబడుతున్నాయి !
బరువు ఎరువుతో పెరుగుతున్నాడు మనిషి !

చేతులు కాళ్ళు మట్టిలో ముంచకుండా
జతల జతల చేతులు , జతల జతల కాళ్ళు
వలలా అల్లుకుంటున్నాడు !
ఓ పుష్పాన్ని , ఓ ఫలాన్ని వరంలా కోరుకోవడం లేదు !
బతకలేనితనంతో బావురుమంటున్నాడు మనిషి !
క్షణాలన్నిటినీ ఈటెల బరువుగా  మార్చుకుంటున్నాడు !

ధిక్కార స్వరానికి ప్రతీక "గద్దెనెక్కినంక"
హైదరాబాద్: పాలమూరు యువకవి కె.పి లక్ష్మీనరసింహ రచించిన " గద్దెనెక్కినంక '' దీర్ఘ కవితా సంపుటి ఆవిష్కరణ  మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది. పాలమూరు యువకవి కె.పి లక్ష్మీనరసింహ రచించిన " గద్దెనెక్కినంక '' దీర్ఘ కవిత ధిక్కార స్వరానికి ప్రతీక అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పాలమూరు సాహితి, పాలమూరు యువకవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 17 న మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో గల లుంబిని హైస్కూలులో " గద్దెనెక్కినంక " పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా విచ్చేసిన ప్రముఖ కవి వల్లభాపురం జనార్దన మాట్లాడుతూ లక్ష్మీనరసింహ రచించిన "గద్దనెక్కినంక" పుస్తకంలో కవి మనువు సృష్టించిన చాతుర్వర్ణ వ్యవస్థలోని లోపాలను ఆవిష్కరిస్తూ రచన చేశారన్నారు. వచన కవిత నుంచి దీర్ఘ కవితలోకి అరంగేట్రం చేసిన లక్ష్మీనరసింహను అభినందించారు.

సభకు అధ్యక్షత వహించిన పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ లక్ష్మీనరసింహ కవిత్వం సమకాలీనతను ప్రతిబింబిస్తుందన్నారు. సమాజంలోని రుగ్మతలను అంశాలుగా తీసుకుని రచనలు చెయ్యడం అభినందించదగ్గ విషయమన్నారు. కాలంతో పాటు నడుస్తున్న కవియని ప్రశంసించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కె. లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ సమసమాజాన్ని కాంక్షించి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కొందరు భ్రష్ఠుపట్టించడం దురదృష్టకరమన్నారు.  మరొక అతిథి డా. పరిమళ్ మాట్లాడుతూ లక్ష్మీనరసింహ కవిత్వంలో ఆవేదన, ఆక్రోశం కనిపిస్తుందన్నారు. సమాజంలో మనుషులు కుల, మతపరంగా విభజన రేఖలు గీసుకుని జీవిస్తుండబం దురదృష్టకరమన్నారు. సమాజంలో మనుషులంతా ఒకటేననే భావనను వ్యక్తపరిచారు.

పుస్తక సమీక్ష చేసిన విఠలాపురం పుష్పలత మాట్లాడుతూ మనువు సృష్టించిన చాతుర్వర్ణ వ్యవస్థలో ఇంకా బతుకుతున్నామన్నారు. నేటి కంప్యూటర్ యుగంలోనూ మనుషులు మారలేకపోవడం సమాజ దైన్యాన్ని తెలియజేస్తుందన్నారు. గ్రంథ స్వీకర్త, ప్రముఖ న్యాయవాది బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలోనూ ఇంకా మనుషులు కుల, మత చట్రంలో బతుకుతుండడం  బాధేస్తుందన్నారు. మూడు శాతంలేని వారే ప్రజాస్వామ్యాన్ని పరిపాలిస్తుండడం శోచనీయమన్నారు.  కార్యక్రమ సమన్వయకర్త, యువకవి బోల యాదయ్య మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ కవిత్వంలో ప్రధానంగా గాఢత కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి ప్రభాకర్, ఖాజా మైనుద్దీన్, పులి జమున, కె.ఎ.ఎల్. సత్యవతి, రావూరి వనజ, గుడిపల్లి నిరంజన్, వహీద్ ఖాన్, ఎదిరేపల్లి కాశన్న, ముచ్చర్ల దినకర్ తదితరులు పాల్గొన్నారు.

రుద్రమ దశమ వార్షిక సమావేశాలు:ఓరుగల్లు రచయిత్రుల ఐదు గ్రంథాల ఆవిష్కరణ
హైదరాబాద్:  రుద్రమ ప్రచురణల దశమ వార్షిక సమావేశాలలో భాగంగా  ఓరుగల్లు రచయిత్రుల ఐదు గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం  వరంగల్ లో జరిగింది.

రుద్రమ ప్రచురణల దశమ వార్షిక సమావేశాలలో భాగంగా ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాల, వరంగల్  నందు ఓరుగల్లు రచయిత్రుల ఐదు గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఐదు గ్రంథాల ఆవిష్కరణ ఐదు సమావేశాలుగా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా అనిశెట్టి రజిత,  నిర్వాహకులుగా కొమర్రాజు రామలక్ష్మి  వ్యవహరించారు.

మొదటి సమావేశంలో చిమమండ న్గోజి అడిచె గ్రంథాన్ని ఆవిష్కరించిన
డా.అంపశయ్య నవీన్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మొదటి స్త్రీవాద రచయిత చలమంటూ,అన్నివిషయాలలో స్త్రీలు, పురుషులు సమానమన్న అభిప్రాయం కలగాలని, అందరూ ఇలాంటి పుస్తకాలు చదివితే స్త్రీల విషయంలో అభిప్రాయాలు మారుతాయని అన్నారు. మెట్టు రవీందర్  పుస్తకాన్ని పరిచయం చేస్తూ చిమమండ న్గోజి అడిచె నైజీరియన్  అమెరికన్ రచయిత్రి అడిచె చేసిన రచనలు గూర్చి ప్రస్తావించారు.

రెండవ సమావేశంలో తమ్మెర రాధిక " హవేలీ దొరసాని" కథా సంపుటిని బివిఎన్ స్వామి  ఆవిష్కరించి మాట్లాడుతూ రాధిక కథలో ప్రత్యేకత కనిపిస్తుందని విభిన్న వస్తువులతో  వాస్తవిక దృక్పథం ఉంటుందని అన్నారు. పుస్తకాన్ని పరిచయం చేసిన మాలతీలత మాట్లాడుతూ రాధిక కథలలో ముగింపు వాక్యాలు బాగుంటాయని చెప్తూ ఆయా కథలను సమీక్షించారు .

మూడవ సమావేశంలో "భారతదేశంలో వితంతు వ్యవస్థ "అనే గ్రంథాన్ని ఆవిష్కరించిన తిరునగిరి దేవకీదేవి భారతదేశంలోని వితంతు దుర్భర పరిస్థితులను వివరించారు.  పుస్తక పరిచయం చేసిన తెన్నేటి విజయచంద్ర మాట్లాడుతూ స్త్రీలను దోపిడీకి గురి చేస్తే నష్టపోయేది పురుషులేనని అన్నారు. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుందన్నగురజాడ మాటల్ని గుర్తు చేశారు.

నాలుగో సమావేశంలో తమ్మెర రాధిక మరొక గ్రంథం
"కాలం జాడలుతీస్తూ" కవితా సంపుటిని ఆవిష్కరించిన పొట్లపల్లి శ్రీనివాసరావు  మాట్లాడుతూ రాధిక కవిత్వంలో మానవ సంబంధాల ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.  పుస్తకాన్ని పరిచయం చేసిన చంద్రకళ మాట్లాడుతూ
కాలం అనే భావన తీరొక్కపువ్వులతో దండ అని, కాలమనేది అంతః సూత్రమని అన్నారు.

ఐదవ సమావేశంలో అనిశెట్టి రజిత " కాలం కాన్వాస్ మీద " కవితా సంపుటిని ఆవిష్కరించిన విఆర్ విద్యార్థి మాట్లాడుతూ అనిశెట్టి రజిత కాన్వాస్ పెద్దదని ఆమె కవిత్వంలోవస్తు వైవిధ్యం తాత్వికత ఉంటుందన్నారు. ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన సింగరాజు రమాదేవి రజిత కవిత్వంలో ఆచరణాత్మకత ఉంటుందని అంటూ ఆమె పుస్తకంలోని వివిధ కవితలను సమీక్షించారు.

ఈ సమావేశంలో నాగిళ్ళ రామశాస్త్రి , డి.ధర్మయ్య ,నిధి, పల్లె శ్రీను, బి. రమాదేవి, వల్లంపట్ల నాగేశ్వరరావు, పల్లేరు వీరాస్వామి, బిల్లా మహేందర్, నేరెళ్ల శ్రీనివాస్ సౌహార్ద్ర సందేశాలు ఇచ్చారు.ఈ సమావేశాలకు బండారి సుజాత, బిట్ల అంజనీదేవి, మురాడి శ్యామల, కొలిపాక శోభారాణి, మడూరి అనిత సమన్వయకర్తలుగా వ్యవ హరించారు. కొమ్మరాజు రామలక్ష్మి ముగింపు వాక్యాలు పలికిన ఈ సమావేశాలలో కవులు, రచయితలు, సాహితివేత్తలు కళాకారులు,  విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వారాల ఆనంద్ కవిత : నా కన్నీ గుర్తే..
వరమో శాపమో ఎందుకోమరి
నాకన్నీ గుర్తుంటాయి
అలలు అలలుగా లోనెక్కడో ప్రవహిస్తాయి
సుళ్ళు తిరుగుతాయి
ఉప్పొంగుతాయి సల్లబడతాయి

సుఖాలూ దుఃఖాలూ
అభినందనలూ అవమానాలూ
ఆదరణ నిరాదరణ
అన్నీ అన్నీ మెదుళ్తూనే వుంటాయి
మనసులో మెసుళ్తూనే వుంటాయి

నిజమే మరి
నేనేమీ పిల్లాడి చేతిలో
‘పలక’ను కాను
అ..ఆ.. లు దిద్ది
పాత బట్టతో తుడిచేస్తే మలిగి పోవడానికి

మరుపు ఒక వరం కదా అన్నారెవరో
జ్ఞాపకం ఒక శిక్ష అని కూడా అన్నారు
కానీ ,
వర్షానికి చెత్తా చెదారం కొట్టుకు పోయినట్టు
కాలప్రవాహానికి ఏదీ చెరిగిపోవడం లేదు
కనీసం
ధారగా పారే కన్నీళ్ళకీ కరగడం లేదు
శిలలమీద చెక్కిన పురా రాతల్లా
నిలబడే వుంటున్నాయి
అవును మంచీ చెడూ
గెలుపూ ఓటమీ
మనసు పొరల్లో మరుగున పడడమే లేదు
నాకన్నీ గుర్తే వుంటున్నాయి

కవిత్వం సాంస్కృతిక ఉనికిని నిలబెట్టుకోవాలి
వర్తన సాహితీ సంస్థ ఆధ్వర్యంలో   ' నెల నెలా ప్రత్యేక ప్రసంగం' కార్యక్రమంలో  భాగంగా ఈ రోజు 17.03.2024 న   కవి సిద్దార్థ  "కవిత్వ వాస్తవికత" అంశం పైన ప్రసంగించారు.  ఈ సమావేశానికి ప్రముఖ కవి, విమర్శకులు, అనువాదకులు డా. రూప్ కుమార్ డబ్బీకార్ అధ్యక్షత వహించారు. ఇది వర్తన రెండవ సమావేశం. సిద్ధార్థ  ప్రసంగంలో భాగంగా చెప్పిన విషయాలు కొన్ని క్లుప్తంగా:

వర్తమాన దశలో కవిత్వం సాంస్కృతిక ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం జేస్తుంది.  ఆ దిశలో అనేక రాజకీయ, సామాజిక సంఘర్షణలు, పరిస్థితులు కవిత్వంలో వ్యక్తమవుతున్నాయి.  కవి, కవి ప్రపంచం ఈస్తటిక్స్ తో కూడుకున్నది.  అందుకే కవి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే ముందుగా తన భాషను శుద్ధి చేసుకోవడమే గాక  తనను తాను సంస్కరించుకునే ప్రయత్నం కూడా చేయాలి అంటారు. 'కవిత్వ వాస్తవికత'  లక్షణాలుగా ప్రాథమిక అనుభవం జీవానుభవంగా వర్ణిస్తూ భౌతికం, అభౌతికం, విభౌతికం అనే లక్షణాలను కూడా ప్రస్తావించారు. కవిత్వంలోని వస్తువు కాని, సంవేదనలు కాని పాఠకుడికి  సంబంధింవినవి.  కనుక కవిత్వంలో కవి గాక కవిత్వం కనబడాలి  అంటారు. అందుకు గ్రీకు కథను, రంగుల ఉదాహరణను, bipolar విశేషణాలు ఉదాహరించారు. వాస్తవికతను దర్షింప జేసే కవితల ప్రస్తావన తీసుకు వస్తూ శ్రీ శ్రీ, గుల్జార్ ఇంకా ఇతర కవులను ప్రస్తావిస్తారు.

అధ్యక్ష స్థానంలో వున్న డా. రూప్ కుమార్ డబ్బీకార్ ' సిద్దార్థ  ప్రసంగ విశేషణాలు తెలిపారు.  ' కవిత్వ వాస్తవికత ' ను ఉద్దేశిస్తూ Poetic Realism గా వచ్చిన కవిత్వ లక్షణాలను తెలుపుతూ  ‘కవిత్వ వాస్తవికత’ literary movement గా వచ్చిన తీరు, రియలిజంకు ఆద్యుడైన ఫ్రెంచి నవలా రచయిత , విమర్శకుడు  హెన్రీ బెయిల్ కు సంబంధించిన విశేషాలు తెలిపారు. అలాగే తెలుగు సాహిత్యంలో ఈ లక్షణాలతో వచ్చిన కవుల కవిత్వాన్ని ప్రస్తావిస్తూ అమ్మంగి వేణుగోపాల్  కవితను చదివి వినిపించారు. అలాగే కందాళై రాఘవాచార్య, కoదుకూరి శ్రీ రాములు కవిత్వoలో కూడా ఈ లక్షణాలు స్పష్టంగా కనబడతాయి అన్నారు. మునిపల్లె రాజు  నవల 'అస్థిత్వానికి ఆవలి తీరాన ' లో వున్న మాంత్రిక వాస్తవికతను కూడా ఉదాహరించారు.

ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో  కవులు, రచయితలతో   చర్చా కార్యక్రమం కొనసాగింది.  ఈ సభలో గుడిపాటి,  అయోధ్యా రెడ్డి, కందుకూరి శ్రీ రాములు, బెల్లంకొండ సంపత్ కుమార్,  హనీఫ్, వేముగంటి మురళీ కృష్ణ , యరుకల యాదయ్య,  స్వాతి శ్రీపాద, అరుణ నారదభట్ల, గుండెల్లి ఇస్తారి, మోత్కురు శ్రీనివాస్, తిరునగరి శ్రీనివాస్ , సుతారపు వెంకటనారాయణ తదితరులు  పాల్గొన్నారు.

గుడిపల్లి నిరంజన్ కవిత : నలిపెడుతున్న భావమేదో..!
ఏమీ తోచని స్థితి
ఎప్పుడో ఒకసారి
అందరికీ వస్తుంది

అమ్మ పోయినప్పుడో
నాన్న ఊపిరి ఆగినప్పుడో
మనసు వెన్ను విరిగినప్పుడో
అనర్ధాలు ఎదురుపడ్డప్పుడో
అపార్థాలతో స్నేహాలు కూలినప్పుడో..
దారితప్పినప్పుడో...
ఎప్పుడో ఒకప్పుడు
ఊపిరాడని స్థితి
అందరికీ వస్తుంది

పూర్వజ్ఞాపకాలు రోదించినప్పుడో..
కయ్యాలు కురిసినప్పుడో
గింజలు మొలువనప్పుడో
కోసిన పంట తుఫాన్ లో కొట్టుకపోయినప్పుడో
ఆత్మకు నచ్చినవాళ్లు వెనక్కి గుంజి నప్పుడో..

అప్పుడే సొప్ప బెండులా
అల్కగా బరువు తగ్గిపోతాం
ఈనెపుల్లలా సన్నగా మారుతాం

ఒక్కోసారి మనసు లోపల
కసిబిసితో నలిపెడుతున్న భావమేదో
బయటికి ఉసులుతుంది
అప్పుడే ఏమీతోచని స్థితి
వేడి శ్వాసల రూపంతో బయటకు వస్తుంది

నిన్నటి దాక నవ్వినట్టున్న ముఖాల్ని
ఇవ్వాలే ఎవరో అపంహరించుకపోయాక..
కొన్నిసార్లు భలే ముసురుకుంటాయి
నలుపు మేఘాలు..!

బరువును పెంచే
మనుషులు ఎప్పుడూ ఉంటారు
కానీ ,
బరువు దించే మనుషులే
మహానుభావులై నిలిచిపోతారు.

కర్నూలులో ‘నాగలి కూడా ఆయుధమే..!’ కవితా సంపుటి పరిచయ సభ.
ప్రముఖ కవి విల్సన్ రావు కొమ్మవరపు రచించిన కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే..!’ పరిచయ సభ,సాహితీ స్రవంతి-కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలులోని సి క్యాంపు టిజివి కళాక్షేత్రం నందు జరుగుతుంది.  ప్రముఖ సాహితీవేత్త జంధ్యాల రఘుబాబు అధ్యక్షతన జరిగే ఈ సభకు ప్రముఖ సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజవుతారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ళ గోపాల్  పుస్తక పరిచయం చేస్తారు. ఈ సభలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు ఆవుల బసప్ప ,  ప్రముఖ కథకులు కెంగార మోహన్, పేరం ఇందిరాదేవి, మారుతి పౌరోహితం, డి.అయ్యన్న, ఆవుల చక్రపాణి, కవి కొమ్మవరపు విల్సన్ రావు పాల్గొంటారు

మార్చి 17న 'వర్తన' రెండవ సమావేశం
సాహిత్యరంగంలో నవీన ధోరణులు పాదు కొల్పాలన్న లక్ష్యంతో ఏర్పాటయిన వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో రెండవ సమావేశం 17 మార్చి  2024 ఆదివారం ఉదయం 10.30 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుది.  ఈ సమావేశంలో ' కవిత్వ వాస్తవికత ' అనే అంశంపై కవి సిద్ధార్థ  ప్రసంగిస్తారు.  కవి సిద్ధార్థ కలం నుంచి దీపశీల, బొమ్మలుబాయి, JASMINE WATER'S (English)  కవితా సంకలనాలు వెలువడ్డాయి.

కవి సిద్దార్థ గతంలో ఆంధ్రప్రభ  ' సాహితీ గవాక్షం' లో ప్రజంటెన్స్ - పాఠకుని వాచకం శీర్షికన సంవత్సరంన్నరపాటు రాసిన ‌సాహిత్య విమర్శనా వ్యాసాలు తెలుగు సాహిత్యంలో ఆరోగ్యకరమైన చర్చకు దారితీసి తెలుగు సాహిత్య పరిపుష్టకి దోహదపడ్డాయి.

ఈ  సమావేశానికి డా. రూప్ కుమార్ డబ్బీకార్ అధ్యక్షత వహిస్తారు. ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ సమన్వయకర్త గా వ్యవహరిస్తారు. కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులేన‌ని వ‌ర్త‌న కార్య‌ద‌ర్శి  ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ తెలిపారు.

డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : కొన్ని వైరస్ లు
కొన్ని వైరస్ లు
పైకి కనిపించవు ప్రభావం చూపిస్తవి
సమయానికి పసిగట్టి
చికిత్స చేయడమే సరైన వైద్యం

అన్నీ హాని కారకాలు కావు
కొన్ని మేలు కాంతుల
వికాస జండాలున్నవి
సమాజం మనుగడలో మనిషి
జీవకళల సరిగమల సన్నాయిలు

ప్రశ్నకు జవాబే  దారి
అన్నింటికీ దొరకదది ఎప్పుడూ
జవాబులేని ప్రశ్నల రువ్వి
కాలం తనంతతాను కదలడమే బతుకు

కోటం చంద్రశేఖర్ కవిత : మీరే రండి
ఇల్లుని వాకిలిని ఎడ్లని దూడలని చెట్లని చేలని
ఈ నడిచిన నేలని
వదలలేకపోతున్నా వదిలి రాలేకపోతున్నా
కొడుకా నీవు రమ్మంటున్నది నిజం కాదనలేని నిజం
నా శరీరం ఒప్పుకోవడంలేదు
ఇల్లంటే రాయి , రప్పని
వాకిలంటే దుమ్మూ , ధూళని అనుకోలేదు
పాతేసిన గుంజనో పైకిలేచే గింజనో నాకే ఎరుక
కష్టమో కామితమో నా ఏవుసం నాకే ఎరుక
నాలెక్కవేరు నాసుక్కవేరు
దూపైతే వాగుల సెలిమె దీసి నీళ్ళమీద బట్టేసి తాగుతా
కొట్టంలో ఆవులకు మేతేస్తూ వాటిని నీళ్లకు వదులుతా
గంగడోలు నిమురుతూ ఆనందపడ్తా
వరండాలో నుల్క మంచమేసుకొని మేకల గొతికల్ని
గోలికాయల్లా లెక్కబెడ్తూ సంతృప్తిపడ్తా
ఎక్కడెక్కడో తిరిగినా రాత్రికి నా కడుపుల తలపెట్టె
గారాల పిల్లి తోకని చూస్తూ సంబరపడ్తా
ఏం చెప్పను నా తీయని యెతలు
ఏం దాచను నా ఆత్మీయ కథలు
ఇప్పటివరకు ఎవరితోనూ వేలెత్తి చూపించుకోలేదు
వైరుధ్యాలు వైవిధ్యాలు కోరలేదు
హారంలో దారంలా వున్న
రయ్ మంటూ తిరిగే మోటర్లపట్నం రమ్మంటున్నావు నీవు
రహదారుల వెంట చూద్దామంటే రవ్వంత చెత్త కనపడని
అద్దంలాంటి రోడ్డులో గ్రామీణ గుభాళింపుల్ని ఆశించి
భంగపడతాను నేను రాను
అక్కడ
కోడలుపిల్ల జాగ్రత్త  నీ పిల్లలు భద్రం
కళ్లకి దూరంగా వున్నా మనసుకు చేరువగానే వున్నారు మీరంతా
వచ్చేనెల అమ్మది సంవత్సరీకం
మీరే రండి

చదువుల తల్లి సావిత్రి భాయి పూలే
ప్రసిద్ధి చెందిన పండితురాలు సామాజిక కార్యకర్త మహిళా హక్కుల ఉద్యమకారిని పండిత రమాబాయి పుట్టుకకు పదేళ్ల ముందుగానే శూద్ర  కులంలో జన్మించిన సావిత్రిబాయి పూలే మొదటి మహిళా టీచర్ గా తన కృషిని ప్రారంభించింది.

అట్టడుగు వర్గాలలో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆనాటి సమాజం కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు.  దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించిన సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 03-01-1831 న లక్ష్మి , ఖండోజి నేవసే పాటిల్ దంపతులకు జన్మించారు.  వాళ్ళ కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉన్నది. బోధన్ ప్రాంతం మున్నూరు కాపులు చట్టాలు.  తన తొమ్మిదో ఏటనే 13 ఏళ్ల జ్యోతిరావు పూలేను 1840లో వివాహమాడారు.  నిరక్షరాస్యులైన ఆమెకు భర్త జ్యోతి బాపూలే మొదటి గురువు.
పండిత వర్గాలలో చాలామందికి సావిత్రిబాయి పూలే కేవలం జ్యోతిరావు బాపులే భార్యగా మాత్రమే తెలుసు.  ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా, పేద ప్రజల విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉద్యమకారినిగా  స్త్రీ విముక్తి పోరాట నాయకురాలుగా, కులం -  పితృస్వామ్యం అనే శక్తులపై యుద్ధానికి పూనుకున్న సాహసిగా సావిత్రిబాయి ఒక స్వతంత్ర అస్తిత్వాన్ని నిర్మించుకున్న వ్యక్తి, సామాజిక విప్లవకారిని , సత్యాన్వేషి , క్రాంతి జ్యోతి, ఆధునిక విద్యాప్రదాయిని ,  సంస్కరణల కెరటం, సమధర్మ వేగుచుక్క , అణగారిన కులాల అక్షరమూర్తి , ప్రధమ స్త్రీ వాద సంస్కర్త.  స్త్రీలు అంటే అన్ని కులాల మహిళలు. శూద్రులు అంటే ఉత్పత్తిలో పాల్గొనే కులాల వారనీ , అతిశూద్రులు అంటే కుల వ్యవస్థకు వెలుపల శూద్రుల కన్నా కింది స్థానంలో ఉండే అస్పృశ్యులు అని అర్థం.  ప్రస్తుత కాలంలో శూద్రులను వెనుకబడిన కులాలని ,అతిశూద్రులను దళితులని వ్యవహరిస్తున్నారు.

సావిత్రిబాయి చదువుకోలేదు. జ్యోతి బా ప్రాథమిక విద్య నేర్పారు. ఆయన మిత్రులు సఖారాం యశ్వంత్ , పరాంజపే , కేశవ శ్రీరామ్ , బావల్కర్  ఉన్నత చదువులు చెప్పారు. తర్వాత రెండు ఉపాధ్యాయ శిక్షణలు పొందారు. శిక్షణ తర్వాత విప్లవోద్యమకారిని, జ్యోతిబా మార్గదర్శకురాలు సగునాబాయ్ , ఫాతిమా షేక్ లతో కలిసి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.  జ్యోతిబా ఆధ్వర్యంలో కలిసి భిదేవాడలో సొంతబడి ప్రారంభించారు. పూలే దంపతులు పూణేలో మూడు బాలిక పాఠశాలలు స్థాపించారు. బ్రాహ్మణ సాంప్రదాయవాదులు వీరిని అడ్డుకున్నారు.

పూణేలోని బుధవార్ పేటలో తాత్యాసాహెబ్ భిడే   ఇంట్లోనే  మొదటి బాలిక పాఠశాలను 1848 లో పూలే దంపతులు ప్రారంభించారు. 1848 లో పూణేలోని ఒక ఇంట్లో బాలిక పాఠశాల ప్రారంభమైంది .  9 మంది విద్యార్థునిలు అందులో చేరారు.   పాఠశాలకు వెళ్లే దారి పొడుగునా సావిత్రిబాయికి ప్రతిరోజు వేధింపులు ఎదురయ్యేవి.  వీధిలో నడిచి వెళ్తున్న ఆమె మీద జనం  రాళ్ళు , బురద , మట్టి విసిరేవారు. వ్యతిరేకులైన ఛాందస పురుషులు గుంపులుగా నిలబడి ఆమెను అసభ్య పదజాలంతో దూషించేవారు.  ఎన్నో వారాలపాటు ఆమె ఈ వేధింపులకు తట్టుకొని ధైర్యంగా నిలబడింది. బడికి వెళ్ళేటప్పుడు పాత చీర కట్టుకొని వెళ్లి దుమ్ము మురికి పడిన చీరను పాఠశాలలో మార్చుకొని  మళ్లీ ఇంటికి వచ్చేటప్పుడు అదే పాత చీర ధరించి రావచ్చని భర్త సలహా పాటించి బురదను, మట్టిని భరించింది. నా ధర్మాన్ని నేను నెరవేర్చుతున్నాను.   భగవంతుడు మిమ్మల్ని క్షమించి ఆశీర్వదిస్తాడు.   అని సహనంతో పలికేదామే. భర్తతోపాటు విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె తొలి యవ్వనంలోని బాలిక .  ఆ వయసులోనే ఆమె సంప్రదాయవాదులను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి స్త్రీలకు, దళితులకు పాఠశాలలు నడిపింది. ఆధిపత్య కులాల బెదిరింపులకు భయపడిన జ్యోతిరావు పూలే తండ్రి ఈ దంపతులను ఇంటి నుండి వెళ్లగొట్టే నాటికి సావిత్రిబాయి పూలేకు 18 ఏళ్లు ,  జ్యోతిరావుకు 22 ఏళ్లు మాత్రమే.

దేశంలో బహుజనులకు మొదటి పాఠశాలను ప్రారంభించిన నాలుగు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. అస్పృశ్యుల కోసం పూలే దంపతులు ప్రారంభించిన మొదటి పాఠశాల అహిల్యాశ్రమ్. దళితుల ,  స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే.  ఆమె జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో అనేక దాడులు, అవమానాలు ఎదుర్కోవడమే గాక 1849లో పూలే సావిత్రిబాయి దంపతులు గృహ బహిష్కరానికి గురయ్యారు. ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవా మండల్ పేరున మహిళా సంఘాన్ని స్థాపించింది. 1853 లో మానభంగ బాధితుల పిల్లల కోసం బాలహత్య ప్రతిబంధక గృహాన్ని స్థాపించింది. 1870 లో దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు చేసిన కృషి సాటిలేనిది. కరువువాత బడిన కుటుంబాల్లోని అనాధ బాలల కోసం వాళ్లు 52  పాఠశాలలను నిర్వహించారు.

1873 సెప్టెంబర్ 24 సత్యశోధక సమాజమనే సామాజిక ఆధ్యాత్మిక సంస్థను జ్యోతిరావు పూలే  ప్రారంభించగా ఈ సంస్థ మహిళా విభాగం సావిత్రిబాయి ఆధ్వర్యంలో నడిచేది. వివాహాల వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబర్ 25 న భార్యను కోల్పోయిన ఒక యువకుడికి సావిత్రిబాయి స్నేహితురాలు కూతురితో సత్యశోధక సమాజం ఆధ్వర్యంలో వివాహం జరిపించింది.  బ్రాహ్మణ పురోహితులు లేకుండా ఒక హిందూ వివాహం జరగడం అనేది చరిత్రలో అదే మొదటిసారి. అంతే కాదు ఒక వివాహ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి న్యాయ వ్యవస్థ ముందుకు రావడం అదే మొదటిసారి. అంటే మన దేశంలో భారతీయులైన వధూవరుల మొట్టమొదటి సామాజిక వివాహం ఇదే అన్నమాట. ఈ సంస్థ ద్వారా భర్త పూలేతో కలిసి బాల్యవివాహాలకు, మూఢనమ్మకాలకు,  సతీ సహగమనానికి వ్యతిరేకంగా బలమైన  ఉద్యమాన్ని నడిపి వితంతు పునర్విహాల కోసం కృషి చేసింది. బాల్యంలోనే వైధవ్యాని అనుభవించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించింది. గర్భవతులైన వారికి పురుడు పోసి వారి కళ్ళల్లో వెలుగు చూసింది. వితంతు స్త్రీలకు  శిరోముండనాన్ని తీవ్రంగా ఖండించి వాటిని నిరోధించింది.

గర్భవతి నైనానన్న భయంతో బ్రాహ్మణ వితంతువు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉండగా పూలే దంపతులు ఆమెను రక్షించి తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ఆమెకు కలగబోయే బిడ్డను తాము పెంచుతామని భరోసా ఇచ్చారు. ఈ విధంగా ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన పిల్లవాడిని 1874 లో పూలే దంపతులు దత్తపుత్రుడుగా స్వీకరించారు. పూలే దంపతులు పెంచిన ఈ దత్తపుత్రుడు  యశ్వంత్ వాళ్ళ కుమారుడుగానే  పెరిగి పెద్దవాడై డాక్టర్ అయ్యాడు. వితంతువులపై వివక్షకు,  అక్రమ సంతానమైన శిశువుల హత్యలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టింది. వితంతు పునర్వివాహల అవసరాన్ని గురించి చాటి చెప్పడమే గాక ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. అనాధలుగా మారుతున్న శిశువుల కోసం శరణాలయాన్ని స్థాపించింది. దిక్కులేని స్త్రీలకు , పిల్లలకు సావిత్రిబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారింది. వితంతువులకు శిరోముండనం చేసే ఆచారానికి సహకరించబోమంటూ క్షురకులు తిరుగుబాటు చేసేటట్టుగా ప్రోత్సహించింది .  ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులన్నింటినీ ఆమె  నిర్వహించింది.  మహారాష్ట్రకు చెందిన మహిళా ఉద్యమ నాయకులు డాక్టర్ ఆనంది భాయ్ గోపాల్ జోషి , పండిత రమాబాయి, తారాబాయి షిండే, రమాబాయి రనడే వంటి ఎంతోమంది సావిత్రిబాయి నుండి స్ఫూర్తి పొందినవారే.

1890 నవంబర్ 28న మహాత్మా ఫూలే మరణించాడు. ఆయన అంత్యక్రియల సమయంలోనూ సావిత్రిబాయి స్థిరచితంతో వ్యవహరించింది.   పూలేకి సోదరుడి వరుసయ్యే ఒక వ్యక్తి ఆయన ఆస్తికి తానే వారసుడినంటు అంత్యక్రియలను నిర్వహించేందుకు ప్రయత్నించగా పూలే దత్త పుత్రుడు యశ్వంత్ అడ్డుకున్నాడు.  ఈ వివాదాన్ని ఆపడానికి సావిత్రిబాయి ముందుకు వచ్చి తానే చితికి నిప్పు పెట్టింది.   భర్త చితికి భార్య నిప్పు పెట్టడం అనేది భారతదేశ చరిత్రలో అతి అరుదైన సంఘటన.

ఆధునిక మరాఠీ సాహిత్యంలో సావిత్రిబాయి కవిత్వం వేగుచుక్కగా నిలుస్తుంది.  ఆమె చేసిన మేధో కృషి మొత్తం కుల వ్యవస్థ, పితృస్వామ్యం అనే రెండు సమస్యల చుట్టూ కేంద్రీకృతమై ఉంది.  ఉన్నత లక్ష్యాలు గల వ్యక్తులు ఇతరులను ఎంత గాఢంగా ప్రభావితం చేయగలరు చెప్పడానికి ఆమె రచనలు సాక్ష్యంగా నిలుస్తాయి.
సావిత్రిబాయి పూలే రచనలు 1.కావ్య పూలే( కవితా సంపుటి)
2.పవన్ కాశి సుబోధ్ రత్నాకర్ ( కవితా సంపుటి) 3.జ్యోతిబా భాషణే (నాలుగు సంపుటాలు సావిత్రిబాయి సంపాదకత్వంలో)
4.సావిత్రిబాయి భాషణే వాగని( సావిత్రిబాయి ఉపన్యాసాలు, పాటల సంపుటి) మొదలైనవి ఉన్నాయి.

పేదలకు సాధికార కల్పన, జాతి నిర్మాణం వంటి పేర్లతో జరుగుతున్న సంపదల సమీకరణ అభివృద్ధి ప్రక్రియలు పేదలను మరింత పరాధీనులుగా మార్చి సమాజం అంచుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఆ ప్రజలు ఈనాటికి ఆహారం,  తాగునీరు, ఆరోగ్యం, విద్య వంటి  కనీస అవసరాల కోసం కటకట లాడుతున్న స్థితిలో ఉన్నారు. ఇంతకీ ఈ ప్రజలందరూ నూటికి 90 శాతం మంది ఆదివాసీలు దళితులు, ఓ బీసీలు, ముస్లింలు.  ఇలా వెనుకబడి ఉన్న వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకోవడంలో సావిత్రిబాయి పూలే  కృషి ఎంతో ఉంది. ఆధునిక భారతదేశంలో మొట్టమొదట కులతత్వ సంస్కృతి,  మతవ్యవస్థలపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు బాపూలే , ఆయన భార్య శ్రీమతి సావిత్రిబాయి. ఈ దంపతులు మొదటిసారిగా సమగ్రమైన కుల వ్యతిరేక సిద్ధాంతానికి రూపకల్పన చేసి ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా గొప్ప ప్రజా ఉద్యమాలను నిర్మించారు. వారి సామాజిక సాంస్కృతిక దృక్పథంలోని మౌలిక అంశం పీడితులందరినీ ఐక్యం చేయడమే. స్త్రీలు ,శూద్రులు, అతిశూద్రులు అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం ఈ దంపతుల ఉద్యమ లక్ష్యం.

1890 లో  ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం ఆమె వైద్య శిబిరాలను నిర్వహించింది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కూడా రోజుకు 2,000 మంది పిల్లలకు ఆమె భోజన వసతులను సమకూర్చింది.  చివరికి 1897 మార్చి 10న ప్లేగు వ్యాధి సోకిన పిల్లవాడికి (పాండురంగా గైక్వాడ్ కొడుకు) సేవ చేస్తుండగా ఆమెకు కూడా వ్యాధి సోకి మరణించడం అతి విషాదకరమైన సంఘటన. సావిత్రిబాయి పూలే  జ్ఞాపకార్థం 1997లో భారత ప్రభుత్వం తపాలా స్టాంపు విడుదల చేసింది.  2015లో ఈమె జ్ఞాపకార్థం పూణే విశ్వవిద్యాలయానికి Savithribai Phule Pune University పేరు పెట్టారు.

రాజేశ్వరరావు లేదాళ్ళ కవిత : తుమ్మ చెట్టూ, రెండు కొంగలు
నల్లతుమ్మ చెట్టంటే ప్రాణం కొంగలకి
చలి విరుచుకుపడుతున్న ఉదయాల్లో
పొగమంచును పోలిన దేహాలతో
నీళ్లు కట్టిన పొలాల మడుల్లో గింజలేరుకు తినేవి

భారంగా తమ శ్వేత దేహాల్ని మోసుకొని
నల్ల తుమ్మ చెట్టును గాఢంగా కౌగిలించుకునేవి

తుమ్మ చెట్టేమో
చిన్న ఆకుల పచ్చని పండ్లతో పకపకా నవ్వేది

ఇంత తెల్లని కొంగలకి
అంత నల్లని తుమ్మతో సాంగత్యమెందుకో ?
అర్థమయ్యేది కాదు నాకు

ఏ పచ్చని రావి చెట్టో,
గాలికి ఒయ్యారంగా నాట్యం చేసే మామిడి చెట్టో
దానికెందుకని నచ్చదు?

ఆకులన్నీ రాలిన ముళ్ల కొమ్మల సందుల్లోని
గూళ్ళలో నుంచి చిన్న కొంగలు కిచకిచలాడేవి

కొంగలు పూచిన నల్లతుమ్మ
దూరం నుంచి
కళ్ళను నమ్మలేనంత సంబరపరిచేది

కొమ్మలన్నీ ఎవరో నరికేశారు చెట్టువి
ఇప్పటికిది మూడోసారి ఆ దారిన వెళ్లడం
కొమ్మలు లేని పొడవాటి నల్లని కాండమ్మీద కూర్చుని
దీనంగా రెండు తెల్లకొంగలు
వాటినోదార్చే వారెవరు?

డా. ఉదారి నారాయణ కవిత : జింకల దూప
సముద్రాలు ఎడారులై
ఎడారులు సముద్రాలయ్యే కాలం
ఇసిరి కొడుతున్న వానలా వస్తుందని
వేపచేట్టుకింద తాత చెప్పిన కథ సత్య మైంది.

నరాలు తెగేట్టు నినాదాలిచ్చి
నెత్తురు చిమ్మేట్టు గాయాల
వాగులై పోరాడితే
ఇప్పుడేం మిగిలింది
కళ్ళముందు కుక్కలు నాకినంక
మిగిలిన విస్తరాకులు.

కొడుకు జైలుకెళ్ళినా
పాచి బువ్వతిన్నా
బతుకు బంగార మౌతదని,
పెయ్యి మీద లాఠీ ముద్రలు వెక్కిరిస్తున్నా
కండ్ల గిన్నెల్లోనే దుఃఖాన్ని దాసవెట్టి
ఎదురు సూస్తే
చేతికచ్చినయి సొంతింటి బేడీలు

పాలబర్రెను, పుస్తెల తాడును
మార్వాడి చేతులవెట్టి నీళ్ళారగిచ్చి
కొడుకును కోచింగుకై
పట్నం పంపించిన తల్లికి
నెత్తిమీద నిట్టాడి ఇరిగిపడ్డ  సప్పుడు.

రేపో మాపో అనే నానవ్వ
సావుదారిని సప్పరిస్తున్న  బాపుతండ్రి
వేసవి చెరువులా నెర్రెలిచ్చిన
చెట్టంత మనుమని మొఖంచూసి
దోతి శెంగులు నిండిన దుఃఖం
ఆరుపదుల  పురిటినొప్పులు భరించి
తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్రాన్ని  ప్రసవిస్తే
ఈడ్చు కెళ్ళ ఎదురు చూసే
నక్కల మంద.

చారెడు మెతుకుల కోసం
బతుకంతా పరుగు పందెంలో
అందని ఎండమావులకై
సొమ్మసిల్లిన అమాయక జింకల పరుగు

గండుపిల్లి మహా నటనకు
పక్షి పిల్లలు మోసపోవడం .
జిత్తుల నక్క సుతి మెత్తని పొగడ్తలకు
పిచ్చికాకి ముక్కను వదులుకోవడం
పుట్టను వదులుకుంటున్న చీమల బతుకు
కళ్ళంను దళారుల చేతుల వెట్టి
గుడ్లప్పగిచ్చి చూస్తున్న నాగలి దైన్యం

అందరూ ఒక్కసారిగా
నిద్ర మత్తు రెప్పల్ని దులిపి
కొత్త దారిపై ఉత్తేజపు చూపులు నాటుతూ
ఎదురెదురుగా నడుస్తూ నడుస్తూ....
ఉరుకుతూ ఉరుకుతూ…..

సమాజాన్ని ప్రతిబింబించేదే సాహిత్యం - నగ్నముని
జిల్లా రచయితల సంఘం, స్పందన అనంత కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయం సమావేశ మందిరంలో నిన్న జరిగిన  మువ్వా శ్రీనివాసరావు కవితాంతరంగ విశ్లేషణల సంపుటి "అనితరుడు" పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ దిగంబర కవి నగ్నముని సమాజాన్ని ప్రతిబింబించేదే ఉత్తమ సాహిత్యం అని అభిప్రాయపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన డా.శాంతి నారాయణ కమ్యూనిస్టు పార్టీ  భూమికగా ఎదిగి వచ్చిన మువ్వా శ్రీనివాసరావు ఖమ్మంకు చెందిన అనితరమైన కవి అని కొనియాడారు.

కవిని సమాజమే నిర్మించుకుంటుందని, ప్రపంచాన్ని హృదయంలో ముంచి రంగులద్దిన సృజనాత్మకతే  మువ్వా శ్రీనివాసరావు కవిత్వమని, ప్రేక్షకుల దగ్గరికి సాహిత్యాన్ని తీసుకువెళ్లిన సాహసి మువ్వా శ్రీనివాసరావు అని కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత  బండి నారాయణస్వామి తెలియజేశారు. మానవ అంతస్సంఘర్షణను ఒక అద్దాల సంచిగా మలచిన శ్రీనివాసరావు  కవిత్వం పై 366 మంది విమర్శకులు రాసిన వ్యాస సంపుటి "అనితరుడు" ఒక బృహత్తర వ్యాస సంపుటి అని కర్నూలుకు చెందిన విశిష్ట అతిథి వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అనితరుడు పుస్తకాన్ని చదవడం అంటే కవి మువ్వా శ్రీనివాస్ ను లోతుగా అధ్యయనం చేసినట్లేనని సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జాబిలి జయచంద్ర తెలియజేశారు.

విశిష్ట అతిథిగా పాల్గొన్న తూముచర్ల రాజారామ్ మాట్లాడుతూ కాలుస్తున్నప్పుడు కాగితం కూడా కాళ్లు, చేతులను కొట్టుకుంటుంది అని రాయగలిగిన విశిష్టమైన కవి అయిన మువ్వా శ్రీనివాసరావు కవిత్వ కాంతకు తొడిగిన ఒక వజ్రపు హారము "అనితరుడు" అన్నారు. తన కవిత్వం మీద వచ్చిన 366 విమర్శ వ్యాసాలను ఒక సంపుటిగా తెచ్చుకున్న మువ్వా శ్రీనివాసరావు నిజంగా అనితరుడైన కవి అని వక్తలు సిద్ధగిరి శ్రీనివాస్, కె. లక్ష్మీనారాయణ కవికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తే యువ కవులకు విజ్ఞానం వికసిస్తుందని ఆత్మీయ అతిథి జి.ర.సం అధ్యక్షుడు జెన్నే ఆనంద్ సూచించారు. నేను రాయాల్సిన వాక్యమే నన్ను వెతుక్కుంటూ వస్తుందని ధీమాగా చెప్పుకున్న మువ్వా శ్రీనివాసరావు బృహత్ వ్యాస సంపుటిని విశ్లేషించడం అంటే సముద్రం ముందు బృందగానం చేసినట్లు ఉంటుందని "అనితరుడు" పుస్తకాన్ని సమీక్షిస్తూ జి.ర.సం ప్రధాన కార్యదర్శి సురేశ్ అభిప్రాయపడ్డారు.

"నేను" అని అర్థం వచ్చేలా అనితరుడు అని నామకరణం చేసిన ఈ సంపుటి వాక్య నిర్మాణం, వ్యాస నిర్మాణం ఎలా ఉండాలో తెలియజేయడంతో పాటూ చక్కని పేరు పెట్టే విధానమును కూడా తెలియజేస్తోందని ఆప్త వాక్యం పలికిన "స్పందన" అనంత కవుల వేదిక ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరశాస్త్రి అభిప్రాయపడ్డారు. డా. బత్తల అశోక్ కుమార్ , డా. ఎ. ఎ నాగేంద్ర , కంబదూరు షేక్ నబీ రసూల్ ఆప్త వాక్యాలను పలుకుతూ రచయిత కృషిని, అతని కవిత్వ విశిష్టతను కొనియాడారు.

తన పుస్తకాన్ని విశిష్టమైన సాహితీవేత్తలు ఉన్న అనంతపురంలో ఆవిష్కరించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని "అనితరుడు" వ్యాస సంపుటి ముద్రించుకున్న కవి మువ్వా శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సభలో సాహితీవేత్తలు జెట్టి జైరాం, ఉప్పరపాటి వెంకటేశులు, గోవిందరాజులు, గుడిపల్లి విద్యావతి, గోసల నారాయణస్వామి, వన్నప్ప,చెగువేర హరి, వలస రమేష్, శీర్పి చంద్రశేఖర్ పలువురు యువ కవులు పాల్గొన్నారు.

దాసరాజు రామారావు కవిత : చిట్టిగుట్ట
పాప ఏడ్చింది-

ఇంట్లో బొమ్మలు అలిగినయి
ఏసీకి  గొంతు నులిమినట్లున్నది
వెండిగిన్నెలో పాలబువ్వ నీరు నీరైయింది
మొగులు దిగులుగా విషాద భైరవాన్నే ఎత్తుకొన్నది

కడుపు నొప్పా? కాదేమో!
కసురు మాట  తగిలిందేమో

పాప నవ్వింది-

ఆట వస్తువుల ఆట మొదలైంది
వెన్నెల ఉద్విగ్నమై, పరిమళం చిమ్మింది
గోరుముద్దలు మరింత తీపి కెక్కినయి
గగన మొగంలో హిందోళం చిందేసింది

నొప్పి తగ్గిందా?
గ్రైఫ్ వాటర్ పట్టారా!
లేదులే..
తాత వీపు గుర్రమెక్కింది గదా!!

ఏనుగు నరసింహారెడ్డి కవిత : స్వస్వరూపం
ఏ ఉన్ముఖీకరణ లేని నీతి వాక్యంలా
మాధ్యమాలు
మనోవీదుల వెంట
చల్లగాలని ప్రవహింపజేస్తాయి

రాజు మారిండు
రాజ్యం మారుతుందని
పవనాలెలా వీస్తున్నాయో చూడండని
గాలి భాషను
అందంగా అనువాదం చేసి పెడతాయి
పదేపదే మంత్రాంగ ప్రదక్షణం చేసేవాళ్లు
వెంటనే వేషాలు మార్చుకుంటారు
నటనలు వినూత్నంగా ప్రదర్శిస్తూ
కొలువు కూటాలు చేరుకుంటారు
రాజు వేషగాళ్లను అనుమానాస్పదంగానే ఆహ్వానిస్తాడు
మత్తు ఎక్కగూడదని కోరుకొని
మందు తాగిన వాడి పరిస్థితి రాజుది
అవును వాళ్ళ స్వభావం వాళ్ళదే
రాజ స్వభావం మెల్లమెల్లగా
అలాగే మారుతుంది
రాజ్యం మునప్పటి రూపాన్ని తొందర్లోనే సంతరించుకుంటుంది

పల్లపు స్వాతికి తెలుగు యూనివర్సిటీ గోల్డ్ మెడల్
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం వడ్డె కొత్తపల్లికి చెందిన పల్లపు స్వాతికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్ ప్రదానం చేసింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. (తెలుగు సాహిత్యం), ఎం.ఏ.(సామాజిక శాస్తం) చదివారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ.(అనువర్తిత భాషాశాస్త్రం), తెలుగు సాహిత్యంలో ఎం.ఫిల్.(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పరిశోధన చేశారు. ఆచార్య సి.మృణాళిని పర్యవేక్షణలో "విమల రచనలు - సామాజికార్థిక విశ్లేషణ" అంశంపై పరిశోధన సిద్దాంత వ్యాసం సమర్పించారు.

బుధవారం హైదరాబాద్ రవీంధ్ర భారతిలో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ డా. తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా స్వాతి గోల్డ్ మెడల్ అందుకున్నారు. విశ్వ విద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య తంగెడ కిషన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, ఆచార్య  సి. మృణాళిని, ఆచార్య కె. హనుమంతరావు, ఆచార్య రత్న శ్రీ, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు పల్లపు రేణుక, సమ్మయ్య, సహచరుడు డాక్టర్ శివరాత్రి సుధాకర్, పరిశోధక విద్యార్థులు, కోడం కుమారస్వామి తదితరులు పల్లపు స్వాతిని అభినందించారు.

డా. సూర్యా ధనంజయ్ రచించిన కొంగు బంగారం” గ్రంథాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క
గిరిజన కుంభమేళా “సమ్మక్క సారలమ్మ జాతర” చరిత్ర ప్రాశస్త్యం, ఆదివాసీ గిరిజన సంప్రదాయాలపైన పరిశోధనాదృష్టితో ఆచార్య సూర్యా ధనంజయ్ రాసిన  ' కొంగు బంగారం (సమ్మక్క, సారలమ్మ) ' గ్రంథాన్ని పంచాయత్ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు సీతక్క నేడు ప్రగతి భవన్ లో  ఆవిష్కరించారు .

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర ప్రాశస్త్యం, ఆదివాసీ గిరిజన సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతో  “ కొంగు బంగారం (సమ్మక్క, సారలమ్మ )” అనే పేరున గ్రంథాన్ని రచించిన ఉస్మానియా తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య సూర్యాధనంజయ్ ను అభినందించారు. ప్రకృతి ఆరాధకులైన ఆదివాసీల సంస్కృతికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన సమ్మక్క, సారలమ్మల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువనీ, వారి చరిత్రను, సంప్రదాయాలను రచించినట్లయితే ఆదివాసీల చరిత్రను, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసినట్లేనని మంత్రి తెలియజేశారు. ఇలాంటి రచనలు మరెన్నో రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ ఉత్సవంగా గుర్తించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ ఉత్సవంగా గుర్తింపుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని తెలియజేశారు. హైకోర్టు అడ్వకేటు, పూర్వ వాణిజ్యపన్నుల అసిస్టెంట్ కమీషనర్ డా. ధనంజయ్ నాయక్, నిజాం కళాశాల సహాయాచార్యుడు డా. రాజారాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సజీవ చేతన స్వరం బోల యాదయ్య కవిత్వం
సజీవ చేతన స్వరం బోల యాదయ్య కవిత్వమని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు పేర్కొన్నారు. ఫిబ్రవరి 27 న  మహబూబ్ నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బోల యాదయ్య రచించిన ' తండ్లాట ' నానీల పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లా మట్టి పరిమళం బోల యాదయ్య అని, సజీవమైనటువంటి కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న బోల యాదయ్య నిత్య చేతన స్వరమని ప్రశంసించారు. నిరంతరం కొత్త కొత్త అభివ్యక్తితో తనదైన శైలిలో పాలమూరు మాండలికాన్ని ఒడిసిపట్టి నిత్యనూతనంగా కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న బోల యాదయ్య కవితాపిపాసి అని కొనియాడారు. బోల యాదయ్య జీవితంలోని సంఘటనలను, జీవన సంఘర్షణను నానీల రూపంలో వెలువరించారన్నారు. పాలమూరు జిల్లాలో ఒకప్పుడు కరువు ఎలా ఉండేదో, వలసలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ తన నానీలో బలంగా ఆవిష్కరించారన్నారు.

విశిష్ట అతిథి వి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో యువకవులు చక్కటి కవిత్వం రాస్తున్నారన్నారు. యువకవులను నిరంతరం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు కూడా చక్కటి కవిత్వం రాస్తారన్నారు. సభాధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ యం. విజయ్ కుమార్ మాట్లాడుతూ కళాశాలలోని విద్యార్థినులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను చేపడతామన్నారు. అందుకోసం రైటర్స్ వింగ్ కూడా ఏర్పాటు చేశామన్నారు.

ఆత్మీయ అతిథులు కోట్ల వేంకటేశ్వర రెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ లు మాట్లాడుతూ పాలమూరు నుంచి చక్కని, చిక్కని కవిత్వం రాస్తున్న వారందరూ సమకాలీన సమస్యలను చిత్రిక పట్టాలన్నారు. పాలమూరు జిల్లా నుంచే అనేక సాహిత్య ప్రక్రియలు పురుడు పోసుకున్నాయన్నారు. ప్రముఖ యువకవి పొన్నగంటి ప్రభాకర్ పుస్తక సమీక్ష చేస్తూ బోల యాదయ్య కవిత్వంలో సజీవమైన కవిత్వం ఉంటుందని‌, ఏదీ కృతకంగా ఉండదన్నారు. తండ్లాట నానీల సంపుటిలో పాలమూరు వలస పక్షుల వేదనను చక్కగా ఆవిష్కరించారన్నారు.

పాలమూరు యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మన్నెమోని కృష్ణయ్య మాట్లాడుతూ బోల కవిత్వంలో జీవితపు అనుభవాలు తొంగిచూస్తాయన్నారు. అనుభవంలోంచి వచ్చిన కవిత్వం ఎల్లప్పుడూ నిలుస్తుందన్నారు. గౌరవ అతిథులు బెక్కెం జనార్దన్, ఎన్.పి.వెంకటేష్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, కె. లక్ష్మణ్ గౌడ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్, తెలుగు శాఖ ఆచార్యులు విఠలాపురం పుష్పలత, యువకవుల వేదిక ప్రధాన కార్యదర్శి కె.పి.లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.

డా. తిరునగరి శ్రీనివాస్ కవిత: అంగ‌డి...
చెమటోడ్చి కష్టంతో
శ్రమకోర్చి యంత్రంతో
రూపొందిన వస్తువులన్నీ
ఒకచోట చేరి కనిపించే
వినిమయ దృశ్య సంచయం
పట్నంలో పెద్ద అంగడి
అన్ని కొనేయాలనిపించినా
ఆర్ధికం సహకరించాలి కదా..!
వస్తువులేమో బోలెడు
కోర్కెలేమో బారెడు
స్థోమతేమో చారెడు
ఏదైనా కొనే స్థాయి
ఎప్పుడొస్తుందో ఈ చేతికి
కొనుగోలు ప్రపంచంలో
నా పేరుకొక అవకాశం ఎప్పటికో...!
ధరల ధరణిలో
వినియోగదారుడిగా నాకు
సముచిత స్థానం ఎప్పుడో..!
గుండె మూలలో ఎప్పుడూ
ఒక ధీమా పోరాడుతూనే ఉంటుంది
మార్పు జరిగి తీరుతుంది
ధరాజ్యం సామాన్యుడి
వశమై మరో చరిత్ర ఆరంభమవుతుంది