Asianet News Telugu

eKYC: ఈకేవైసీ చేయించుకున్నారా... ఒక్కరోజే గడువు.. లేదంటే నష్టపోతారు!
రేష‌న్ కార్డుదారులంద‌రికీ ఈకేవైసీ న‌మోదు తప్పనిసరి అని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈకేవైసీ నమోదుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఏపీలో ఇటీవల పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రిత్వ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపిన ప్రకారం మరో 3 శాతం మంది లబ్దిదారులకు మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. వారి వివరాలు కూడా సచివాలయాల వారీగా సేకరించి, అవసరమైతే అధికారులను వారి ఇళ్లకు పంపి కేవైసీ నమోదు చేయిస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం తొలుత మార్చి 31వ తేదీలోగా ఈకేవైసీ చేసుకోక‌పోతే, ఏప్రిల్ నుంచి రేష‌న్ రాదని ప్రక‌టించింది. అందుక‌నుగుణంగా మార్గద‌ర్శకాలు కూడా విడుద‌ల చేసింది. అయితే ఈకేవైసీ న‌మోదు న‌త్తన‌డ‌క‌గా జ‌ర‌గ‌డం, న‌మోదులో సాంకేతిక స‌మ‌స్యలు రావ‌డం, అలాగే ఈకేవైసీ చేసేందుకు సిబ్బంది కొర‌త, ప‌ర్యవేక్షించే ఎంఎస్‌వోల‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల విధులు అప్పగించ‌డం వంటి కార‌ణాల‌తో ఈకేవైసీ న‌మోదు పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రజల డిమాండ్లు, విజ్ఞప్తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలు ఏప్రిల్‌ 30 వరకు గ‌డువు పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది.

ఈ మేర‌కు రాష్ట్ర ఆహార‌, పౌర స‌ర‌ఫ‌రాల మంత్రిత్వ శాఖ క‌మిష‌న‌ర్ సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈకేవైసీని పూర్తి చేయాల‌ని అన్ని జిల్లాల క‌లెక్టర్లు, అన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్‌వో) చర్యలు చేపట్టారు. ఈ-పోస్ పరికరాలు, గ్రామ స‌చివాల‌య‌, వార్డు స‌చివాల‌య‌ మొబైల్ యాప్ ద్వారా రేష‌న్ లబ్ధిదారుల ఈకేవైసీని దాదాపు పూర్తి చేశారు. ఈక్రమంలో ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోని వారు ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరో రెండు రోజులే అవకాశం ఉందని సచివాలయాలు, రేషన్‌ దుకాణదారులను సంప్రదిస్తే నమోదు చేస్తారని అధికారులు చెబుతున్నారు.

ఇలా నమోదు చేసుకోవచ్చు..
ఎఫ్‌పీ షాప్ డీలర్ లాగిన్, తహసీల్దార్ లాగిన్, డీసీఎస్‌వో లాగిన్, కలెక్టర్ లాగిన్‌ల‌లో ఈకేవైసీపీ యూనిట్లు అందుబాటులో ఉంచారు. గ్రామ స‌చివాల‌యం, వార్డు స‌చివాల‌యం (జీఎస్‌డ‌బ్ల్యూఎస్‌) మొబైల్ యాప్, ఎఫ్‌పీ షాపుల్లో ఈ-పోస్ పరికరాల ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్‌వో)లు ఫీల్డ్ అధికారులకు తగిన సూచనలు చేశారు. లబ్ధిదారులు (5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా) గ్రామ స‌చివాల‌యం, వార్డు స‌చివాల‌యం మొబైల్ యాప్ లేదా ఈ-పీవోఎస్‌ పరికరాల ద్వారా ఈకేవైసీపీ ప్రక్రియను పూర్తి చేయాల‌ని చెబుతున్నారు. ఈకేవైసీ చేయకపోతే, కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ind-pak: 107 మంది పాకిస్తానీయులు మిస్సింగ్‌.. ఇండియాకి వచ్చి ఎటు వెళ్లారో?
సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్తాన్‌తో సంబంధాలు తెంచుకునేందుకు భారత్‌ సిద్దమైంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేసింది. అయితే.. మహారాష్ట్ర సర్కార్‌ చెబుతున్న అధికారిక సమాచారం మేరకు.. భారత పౌరులను పెళ్లి చేసుకున్నవారు, లాంగ్‌ టర్మ్‌, రెన్యూవల్‌ వీసాలు, ఇతర వీసాలపై మొత్తం 5,023 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారట.

వారిలో అధికారిక లెక్కల ప్రకారం.. 250 మందిని వెనక్కి పంపారు అధికారులు. ఇక షార్ట్‌ టర్మ్‌ వీసాలపై వచ్చిన వారిని దేశం నుంచి బహిష్కరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలా సుమారు మహారాష్ట్రలో 250 మంది షార్ట్‌ టర్మ్‌ వీసాలపై ఉన్నట్లు గుర్తించి వారిని ఇప్పటికే పంపించేశారు.

107 మంది అడ్రస్‌ గల్లంతు.. ఇదే డేంజర్‌...
పాకిస్తాన్‌ నుంచి వచ్చిన 107 మంది పౌరుల జాడ తెలియడం లేదని మహారాష్ట్ర అధికారులు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వారి ఆచూకీ తెలియలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు.. వారందరూ తీవ్రవాదులేనా? ఇండియాకి వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందులో 34 మంది నకిలీ పత్రాలతో భారత్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించిడం షాక్‌కి గురిచేస్తోంది.

వీరి ఆచూకీ కోసం పోలీసులు, కేంద్ర సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో ముంబయి నగరంలో జరిగిన దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. అదృశ్యమైన పాకిస్తానీయుల కోసం క్షున్నంగా గాలింపు చేపట్టారు.

UPSC Civil Services: గొర్రెల కాపర్లు.. పంతంతో సాధించారు సివిల్‌ సర్వీసెస్‌ కొలువులు!
దేనికైనా అదృష్టం ఉండాలని అందరూ చెబుతుంటారు. కానీ కష్టపడితే అదృష్టం ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. ఇక మన చుట్టూ.. అనేక మంది చేరి .. ఏదైనా మనకు రాత లేదు, రాసిలేదు అని ఇలాంటి కాలక్షేపం మాటలు చెప్పేవారిని పట్టించుకోవద్దు. గెలుపు ఏ ఒక్కరి సొత్తు కాదు.. సాధించాలనే కసి, పట్టుదల, నిరంత శ్రమ ఉంటే చాలు.. ఏదైనా సాధించవచ్చు. సరిగ్గా దీన్ని నిజం చేస్తూ.. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరు కొడుకులు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకరు ఐపీఎస్ అధికారి కాబోతుండగా.. మరొకరికి సర్వీసెస్‌లో ఏదో ఒకదానికి వెళ్లనున్నారు.

కర్నాటక రాష్ట్రానికి చెందిన బీరప్ప ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 554 ర్యాంకు సాధించి ఐపీఎస్‌ కొలువుకు ఎంపికయ్యాడు. ఇతని తండ్రి సిద్దప్ప గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సిద్దప్పతోపాటు బీరప్ప కూడా అప్పుడప్పుడూ గొర్రెలు మేపేందుకు పొలానికి వెళ్తుంటారట. ఇక బీరప్ప  బిటెక్‌ వరకు చదువుకుని తన అన్నయ్యలా ఆర్మీలోకి వెళ్లాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ ఆ లక్ష్యం చేరుకోలేకపోయాడు. ఈక్రమంలో ఇండియన్‌ పోస్ట్‌లో ఉద్యోగం సాధించాడు. కొన్నాళ్లు ఆ ఉద్యోగమే చేశాడు.

ఇండియన్‌ పోస్టులో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే బీరప్పకు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు సన్నద్దం అయ్యాడు. రెండు సార్లు పరీక్షలు రాయగా.. కనీసం క్వాలిఫై కూడా కాలేదు. ఇక ఉద్యోగం చేస్తూ.. ప్రిపేర్‌ అవ్వడం కష్టమని భావించి వెంటనే ఇండియా పోస్టులో ఉద్యోగానికి రాజీనామ చేసి ప్రిపరేషన్‌ స్టార్ట్‌ చేశాడు. ఎక్కడా నిరాశ చెందకుండా..  మనకేమి వస్తుందిలే.. సివిల్స్‌ స్థాయి మనది కాదు అనే మాటలు తన దరికి రాకుండా నమ్మకంతో కష్టపడి అవివిరామంగా చదివాడు.

అలా గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో ఎట్టకేలకు ఉత్తీర్ణత సాధించాడు. కుగ్రామం నుంచి వచ్చిన బీరప్ప సివిల్స్‌ పరీక్ష ఉత్తీర్ణత సాధించడంపై అతని గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక గొర్రెలతో తన జీవితాన్ని సాగించే కుటుంబం నుంచి వచ్చి యూపీఎస్సీలో  551వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించిన బీరప్పను ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దారామయ్య ఫోన్‌ చేసి అభినందించాడు. మరో విశేషమేమిటంటే.. సెలవుల మీద బంధువుల ఇంటికి వెళ్లిన బీరప్ప.. బెళగావి సమీపంలోని నానావాడిలోని ఒక పొలంలో గొర్రెలను మేపుతున్న సమయంలో సివిల్స్‌ ఫలితాలు వచ్చాయని తెలుసుకుని, చెక్‌ చేసుకోవగా.. 551వ ర్యాంకు వచ్చినట్లు గుర్తించి ఎగిరి గంతేశాడు.

తండ్రి ఇచ్చిన బహుమతి అదే..
బీరప్ప ఐపీఎస్‌ కొలువు సాధించినందుకు తండ్రి సిద్ధప్ప, తల్లి బాలవ్వ, కుటుంబ సభ్యులు కలిసి హారతిచ్చి, పూలమాల వేసి సత్కరించారు. అనంతరం బీరప్పకు ఓ గొర్రె పిల్లను కూడా బహుమతిగా ఇవ్వడం విశేషం. ఈ సందర్బంగా బీరప్ప తండ్రి మాట్లాడుతూ.. తమ కుమారుడు కష్టపడే విధానం చూసి ఏదొక మంచి ఉద్యోగం వస్తుందని అనుకున్నానని, ఈక్రమంలో పోలీస్ అధికారి కొలువు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

తన కొడుకు మీద పూర్తి నమ్మకం ఉందని, చుట్టు పక్కన ఉన్నవారు కూడా తన కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని చెబుతుండేవారని సిద్దప్ప ఆనందంగా చెబుతున్నారు. పరీక్షలకు చాలా కష్టపడ్డాడని అన్నాడు.

మరో గొర్రెల కాపరి కుమారుడికి 910వ ర్యాంకు..

కర్నాటక సరిహద్దు బెళగావిలోని కోడ్లివాడ్‌కు చెందిన మరో గొర్రెల కాపరి కుమారుడు హనుమంతప్ప యల్లప్ప నంది సివిల్స్‌లో 910వ ర్యాంక్‌ సాధించాడు. ఇతనిదీ పేద కుటుంబమే. అయినా అడ్డంకులు అధిగమించి సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించాడు. నంది విజయం సాధించడంపై తల్లిదండ్రులు, భార్య, సోదరుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడు ఒకటి నుంచి 10 వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేశారు. ధార్వాడ్‌లోని కర్ణాటక కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెళగావిలోని గోగ్టే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GIT) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత సివిల్స్‌కు సిద్దమై మంచి ర్యాంకు సాదించి ఉద్యోగం తెచ్చుకున్నాడు.

DRDO: డీఆర్‌డీవో మిస్సైల్‌ పరీక్ష విజయవంతం... రక్షణ వ్యవస్థ బలోపేతం!
ఇండియన్‌ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్క్రామ్‌జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్‌ను 1,000 సెకన్ల నిర్వహించి కీలకమైన టార్గెట్‌ను చేరుకుంది. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక స్క్రామ్‌జెట్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీలో వద్ద సుమారు 1,000 సెకన్లకు పైగా వ్యవధిలో యాక్టివ్ కూల్డ్ స్క్రామ్‌జెట్ సబ్‌స్కేల్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్‌ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ పరీక్ష విజయవంతం కావడంతో  హైపర్‌ సోనిక్‌ వెపన్‌ టెక్నాలజీలో ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలిపారు. మండించడానికి వీలుండే ఇలాంటి వ్యవస్థలు దీర్ఘకాలిక క్రూయిజ్ లక్ష్యాలను నెరవేర్చేందుకు ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక స్క్రామ్‌జెట్ కంబస్టర్ పరీక్షతో హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి బలమైన పునాదికి నాంది పలికిందని డీఆర్‌డీవో పేర్కొంది.

ఇటీవల ఓ దఫాగ్రౌండ్ టెస్ట్ జనవరిలో నిర్వహించగా.. కేవలం 120 సెకన్ల పాటు పరీక్ష కొనసాగింది. రీసెంట్‌గా రూపొందించిన స్క్రామ్‌జెట్ కంబస్టర్‌తో దాదాపు వెయ్యి సెకన్లుపాటు పరీక్ష కొనసాగింది. ఇక దేశంలో ఈ రకమైన మొట్టమొదటి గ్రౌండ్ టెస్ట్‌గా గుర్తింపు తెచ్చింది. హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రొపల్షన్ కోసం గాలి తీసుకునే ఇంజిన్‌ను ఉపయోగించి మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో 6,100 కి.మీ.కు పైగా ఎగరగల ఒక రకమైన వెపన్ అని చెప్పవచ్చు.

తాజాగా విజయవంతమైన పరీక్షతో దేశంలో హైపర్‌సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకమైన మైలురాయిని చేరుకున్నట్లు డీఆర్‌డీవో ప్రకటించింది. సూపర్‌సోనిక్ కు మండి స్వభావం కలిగి ఉండటంతో దీర్ఘకాలికంగా కీలక పాత్ర పోషిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అద్భుతమైన విజయం" సాధించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. డీఆర్‌డీవో, పరిశ్రమ భాగస్వాములను పలు విద్యా  సంస్థలను ఆయన ప్రశంసించారు. దేశానికి కీలకమైన హైపర్‌సోనిక్ ఆయుధ సాంకేతికతలను సాకారం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ విజయం ఓ ఉదాహరణ అని అన్నారు.

"అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 1,000 సెకన్లకు పైగా సూపర్‌సోనిక్ మండేలా చేసినందుకు డైరెక్టర్ జనరల్ (క్షిపణులు వ్యూహాత్మక వ్యవస్థలు) రాజాబాబు, డిఆర్‌డిఎల్ డైరెక్టర్ జిఎ శ్రీనివాస మూర్తి మరియు మొత్తం బృందాన్ని రక్షణ శాఖ పరిశోధన మరియు అభివృద్ధి కార్యదర్శి మరియు డిఆర్‌డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ అభినందించారు.

India-Pakistan: బంకర్‌లోకి పాక్‌ ఆర్మీ ఛీప్‌.. పాకిస్థాన్‌ విడిచిపోతున్న ప్రముఖులు.. ఏ క్షణంలోనైనా యుద్దం!
India-Pakistan: జమ్మూకశ్మీర్‌ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే పాక్‌- ఇండియా ఎల్‌వోసీ వెంబడి భారీగా బలగాలను రెండు దేశాలు మోహరించాయి. ఇక భారత్‌ ప్రతికారం గట్టిగా తీర్చకోబోతుందని గమనించిన పాకిస్తాన్‌ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్మీ దళాలను బంకర్లలోకి వెళ్లిపోవాలని వాళ్ల ఆర్మీ చీఫ్‌ సూచించాడు.

ఇప్పటికే భారత్‌ ప్రతిదాడికి దిగుతుందన్న సమాచారంతో పాక్‌ ఆర్మీ చీఫ్‌ కూడా బంకర్లలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బంకర్ల నుంచే భారత్‌ సరిహద్దులను పాక్‌ సైన్యం గమనిస్తోంది. మరోవైపు యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ప్రముఖులు దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. ఇండియా-పాకిస్తాన్‌ మధ్య యుద్దవాతావరణం నెలకొనబోతోందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్‌కు గట్టి షాక్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం భద్రతను బలోపేతం చేసిందని, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వైపు దళాల మోహరింపును పెంచిందని తెలుస్తోంది. సైనికులు బంకర్లలోనే ఉండి ఎల్‌ఓసి వెంబడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆర్మీ చీఫ్‌ ఆదేశించారు.

న్యూఢిల్లీ నుంచి బలమైన ప్రకటన వెలువడిన నేపథ్యంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఘటనను తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పాక్‌లోని రావల్‌పిండిలో ప్రధాన కార్యాలయం ఉన్న పాకిస్తాన్ సైన్యానికి చెందిన 10వ కార్ప్స్‌ను అప్రమత్తంగా ఉండాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో, గుజ్రాన్‌వాలాలో ప్రధాన కార్యాలయం ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా ఉన్న సియాల్‌కోట్ డివిజన్‌ను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పాక్‌ - భారత్‌ మధ్య ఇప్పటికే అనేక ఒప్పందాలు రద్దయ్యాయి. సింధు జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలనే తన నిర్ణయాన్ని భారత్‌ పాకిస్తాన్‌కు తెలియజేసింది. భారత జల వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జల వనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజాకు రాసిన లేఖలో ఈ నిర్ణయం గురించి వివరించారు. "పాకిస్తాన్ కొనసాగించే సీమాంతర ఉగ్రవాదాన్ని మేము చూశాం" అని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాక్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది.  భారతదేశం చర్యకు ప్రతీకారంగా, పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని, ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసింది. పాకిస్తాన్ మంత్రులు అన్ని వాణిజ్యాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారత విమానయాన సంస్థలకు పాక్‌  గగనతలంపై రాకపోకలు సాగించవద్దని సూచించాయి.

ఇస్లామాబాద్ వాఘా సరిహద్దు పోస్టును కూడా పాక్‌ మూసివేసింది. సార్క్ వీసా మినహాయింపు పథకం (SVES) కింద భారతీయులకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. భారత హైకమిషన్‌లోని సైనిక సలహాదారులను వెళ్లిపోవాలని కోరింది. భారత్‌ కూడా అదేవిధంగా పాక్‌కు బదులిచ్చింది. ఇండియాకు వీసాపై వచ్చిన వారు 48 గంటల్లో తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది.

Kashmir terror Attack: భారత్‌ను వీడకుంటే క్రిమినల్‌ కేసులు.. పాకిస్తానీయులకు వార్నింగ్‌... ఇప్పటికే 180 మంది!
పాకిస్థాన్‌కు చెందిన సుమారు 180 మంది ఇండియాలో ఉన్నట్లు అధికారులు గుర్తించి వారిని వెనక్కి పంపించేశారు. ఇక భారత సరిహద్దు నుంచి వస్తున్న పాకిస్తానీయులను ఇప్పటికే నిలుపుదల చేసి వెనక్కి పంపిచేస్తున్నారు. మరోవైపు భారతీయులను సైతం పాక్‌కు వెళ్లేందుకు అనుమతించట్లేదు. ఇక పాక్‌ నుంచి 120 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

వీసాలపై ఆంక్షలు..
భారత్‌, పాక్ దేశాల మధ్య వీసాలపై రెండు దేశాలు ఆంక్షలను విధించాయి. ఇప్పటికే వీసాపై వచ్చి ఇండియాలో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో భారత్‌ను వదిలి వెళ్లిపోవాలని హోంమంత్రి అమిత్‌ షా ఆదేశించారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాక్‌ జాతీయులను గుర్తించి వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ముందుగా స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ డేటా కేంద్రానికి పంపాలని, అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక గతంలో సార్క్‌ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాకిస్తానీయులు భారత్‌లో పర్యటించే అవకాశం కల్పించారు. దీని కింద భారత్‌కు వచ్చి ఉంటే 48 గంటల్లో దేశాన్ని వీడాలని స్పష్టం చేశారు.

ఇక మెడికల్‌ వీసాతో భారత్‌కు వచ్చిన వారికి ఏప్రిల్‌ 29వ తేదీ వరకు గడువు ఇచ్చారు. పాక్‌ నుంచి పూర్తిగా రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దీంతోపాటు పాక్‌లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని భారత అధికారులు పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిల్లో పార్‌ దేశస్టులు ఇచ్చిన గడువులోపు వెళ్లిపోవాలని లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని భారత్‌ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల డీజీపీలు సైతం ఇవే ఆదేశాలు జారీ చేశారు.

పహల్గాం ప్రాంతంలో తీవ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితగా కాల్పులు జరిపి.. సుమారు 26 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఈ చర్యను భారత్‌ సీరియస్‌గా తీసుకుంది. తీవ్రవాదులకు పాక్‌ ఇంటెలిజెన్స్‌ సహకారం ఉందని సమాచారంతో ఆ దేశంలో సంబంధాలు పూర్తిగా తెంచేసుకుంది. ఇప్పటికే సింధూజలాల ఒప్పందం రద్దు చేసుకోవగా.. పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్‌ తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో పర్యాటకులు పూర్తిగా ఆయా ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 3 వేల మంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనేక మంది పర్యటను రద్దు చేసుకున్నారు. త్వరలో అమర్నాథ్‌యాత్ర జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇక కశ్మీర్‌లో ముష్కరులకు భద్రతాబలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

May 2025 Bank Holidays: మే నెల బ్యాంకు సెలవుల లిస్ట్‌ విడుదల.. ఆ రోజుల్లో మూతే!
మే నెల ప్రారంభానికి ముందే ఆ నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయో ఆర్‌బీఐ ప్రకటించింది. వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు ఖాతాదారులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎప్పుడు పనిచేస్తాయి. ఏ ఏ తేదీల్లో పనిచేయవు అనే వివరాలు తెలసుకోవడం మంచిది. ఏప్రిల్‌లో మొత్తం 15 రోజులపాటు సెలవుల కారణంగా బ్యాంకులు మూతబడ్డాయి. ఇక మేలో కూడా 12 రోజులపాటు బ్యాంకులకు ఆర్‌బీఐ సెలవులు ప్రకటించింది.

మే నెలలో బ్యాంకు సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి...

మే 1 -  (గురువారం) మే డే - కార్మికుల దినోత్సవం సందర్బంగా ఏపీ, తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

మే 9 - (శుక్రవారం), రవీంద్రనాథ్​ ఠాగూర్‌ జయంతి - కోల్​కతాలోని బ్యాంకులకు సెలవు.

మే 12 - (సోమవారం), బుద్ధ పూర్ణిమ - జమ్ము, కాన్పూర్​, కోల్​కతా, అగర్తలా, ఐజ్వాల్​, బేలాపూర్​, భోపాల్​, డెహ్రూడూన్‌, ​ఇటానగర్​, రాయ్​పూర్​, రాంచీ, శిమ్లా, లక్నో, ముంబై, నాగ్​పూర్​, శ్రీనగర్​, ఢిల్లీ లోని బ్యాంకలు పనిచేయవు.

మే 16- (శుక్రవారం), స్టేట్​ డే- గ్యాంగ్​టక్​లోని బ్యాంకులకు పనిచేయవు.

మే 26- (సోమవారం), కాజి నజ్రుల్​ ఇస్లామ్​- అగర్తలాలోని బ్యాంకులకు సెలవు.

మే 29- (గురువారం), మహారాణ ప్రతాప్​ జయంతి - సిమ్లాలోని బ్యాంకులు పనిచేయవు.

వీటితోపాటు బ్యాంకులకు వారాంతపు సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఇలా..

మేలో వారాంతపు సెలవులు..
మే 4 - ఆదివారం

మే 10 - రెండో శనివారం

మే  11- ఆదివారం

మే  18- ఆదివారం

మే  24- నాలుగో శనివారం

మే 25 - ఆదివారం

ఇక చెక్కులు, ప్రామిసరీ నోట్ల ఇష్యూకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరు. కాబట్టి ఖాతాదారులు సెలవు రోజుల్లో కాకుండా మిగిలిన వర్కింగ్‌ డేస్‌లో బ్యాంకులకు వెళ్లడం మంచింది. దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ పని అవ్వకుండా రావడం వల్ల సమయం వృథా అవుతుంది. పైన తెలిపిన తేదీలను మీ ప్రాంతాలు, బ్యాంకులకు అనుగుణంగా సేవ్‌ చేసుకుని పెట్టుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.

యథావిధిగా ఆన్​లైన్ సేవలు..
బ్యాంకులకు సెలవులు ప్రకటించినప్పటికీ ఆన్​లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు కొనసాగనున్నాయి. ఏటీఎం సెంటర్ల నుంచి నగదు బదిలీ, విత్‌ డ్రా వంటి సేవలను కొనసాగించవచ్చు.

Kashmir Encounter: లష్కరే కమాండర్‌ను మట్టుబెట్టిన ఇండియన్‌ ఆర్మీ.. దెబ్బ అదుర్స్‌.. వేట మొదలు!
దొరికిన వారిని తురుముదాం.. దొరకని వారిని తరుముదాం అన్నట్లు ఇండియన్‌ ఆర్మీ సిద్దమైంది. తీవ్రవాదులు బందీపొరా అనే ప్రాంతంలో నక్కి ఉన్నారన్న ఇంటెలిజెన్స్‌ సమాచారంతో... భారీగా అక్కడికి సైన్యం చేరుకుంది. ముందుగా ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకున్న ఆర్మీ- పోలీసులు.. ఒక్కొక్క ఇంటిని జల్లెడ పడుతూ.. అనుమానం వస్తే చాలు ఆ ఇంటిపై తుపాకులతో గర్జిస్తున్నారు. ఉగ్రవాదులను గుర్తించి ఎన్‌కౌంటర్‌ చేస్తున్నారు. మరోవైపు ముష్కరులకు ఆర్మీకి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈక్రమంలో భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటాలు తాకాయి. మరో తీవ్రవాదికి గాయాలయ్యాయి.

గురిపెట్టి కాల్చి.. ఏరివేసిన సైన్యం..
పహల్గాం దాడిలో కీలకంగా ఉన్న లష్కరే టాప్‌ కమాండర్‌ అల్తాఫ్‌ను గురిపెట్టి కాల్చి చంపారు. అనంతరం ఈవిషయాన్ని బయటకు వెళ్లడించారు. ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్‌లో అడుగుపెట్టిన గంటల వ్యవధిలోనే ముష్కరులపై ఎన్‌కౌంటర్‌ చేయడం ప్రారంభమైంది. ఇక పహల్గాంలో దాడి వెనక లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పాత్ర ఉన్నట్లు భద్రతా బృందాలు గుర్తించాయి. కశ్మీర్‌లో యాక్టివ్‌గా పనిచేస్తున్న వింగ్‌కి అతడే నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో అత్యధికులు విదేశీ ఉగ్రవాదులు, స్థానికులు కొందరే ఉండేలా వింగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. స్తానికులు వీరికి అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు ఆర్మీ గుర్తించింది.

పాక్‌ ఇంటెలిజెన్స్‌, మిలిటరీ సహకారంతోనే..
హఫీజ్‌ సయీద్‌, అతనికి అసిస్టెంట్‌ సైఫుల్లా వారి బృందానికి టార్గెట్‌లు సెట్ చేసేది, సలహాలు, సూచనలు అన్నీ పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ, పార్‌ ఆర్మీ నుంచే వస్తున్నాయని గుర్తించారు. పహల్గాంలో మొత్తం మూడు ప్రాంతాల్లో ముష్కరులు దాడులుచేశారు. ఇది కూడా పాక్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాన్‌ అని ఇండియన్‌ అధికారులు చెబుతున్నారు. మూడు ప్రదేశాల్లో అత్యధికగా ఉన్న పర్యాటకులను ఎంపిక చేసుకుని దాడికి దిగారు. మొదట ఐదుగురిని కాల్చగా.. ఇంకో ప్రాంతంలో మరో ఇద్దరి, ఇది పారిపోతున్న వారిపై విచక్షణా రహితంగా ఉగ్రవాడులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో పాల్గొన్న హషీమ్‌ ముసా, అలిభాయ్‌ అనే తీవ్రవాదులు పాకిస్తానీయులుగా గుర్తించారు. ఇక పర్యాటకులపై దాడికి పాల్పడిన వారిని గుర్తిస్తే ఒక్కొక్కరిపై రూ.20 లక్షల రివార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది.

రెండేళ్లుగా దాడులు చేస్తున్న తీవ్రవాదులు..
హఫీజ్‌ సయీద్‌, సైఫుల్లా కలిసి గత రెండేళ్లుగా జమ్మూలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సోనమార్గ్‌, బూటపత్రి, గందర్బాల్‌ ప్రాంతాల్లో హైప్రొఫైల్‌ దాడుల్లో కూడా వీరు పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్‌లో బూటపత్రిలో ఇద్దరు జవాన్లపై దాడి చేసి చంపారు. అదే నెలలో సోనమార్గ్‌ సొరంగంలో పనిచేస్తున్న ఆరుగురు కార్మికులను కాల్చి చంపారు. ఈ టీంలో ముఖ్య సభ్యుడైన జునైద్‌ అహ్మద్‌ భట్‌ డిసెంబర్‌లో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. ఆ తర్వాత మిగిలిన ఉగ్రవాదులు ఎవరికీ కనిపించకుండా చాలాకాలం అఘ్నాతంలోకి వెళ్లిపోయారు. ఇక ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీ సైన్యం ఒక్కొక్క తీవ్రవాదిని ఏరివేస్తోంది. కలుగుల్లో దాగి ఉన్నా బయటకు లాగి కాల్చి పడేస్తోంది.

India-Pakistan Border: భారత్‌, పాకిస్థాన్‌ బోర్డర్లలో ఉద్రిక్తతలు.. ఆర్మీపై పాక్‌ సైన్యం కాల్పులు..!
పహల్గాం ఉగ్రదాడితో నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే భారత్‌ పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లాలని ఆంక్షలు పెట్టింది. దీంతోపాటు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేసింది. దీనికి బదులుగా పాక్‌ కూడా భారత్‌ నుంచి విమానాలు తమ భూభాగం మీదుగా వెళ్లవదని ఆంక్షలు విధించింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతోపాటు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

బోర్డర్‌లో కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ ద్వివేది శ్రీనగర్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతోపాటు పర్యాటకులపై దాడులకు పాల్పడిన తీవ్రవాదుల కోసం పోలీసులు, ఆర్మీ జల్లెడె పడుతోంది. దీనిపై కూడా ఆయన పలు కీలక వివరాలు తెలుసుకున్నారు. ఇక బోర్డర్‌ పాక్‌ సైన్యానికి ధీటుగా ఆర్మీ బదులిస్తోంది. ఇప్పటి వరకు ఎవరికీ ఏ గాయం కాలేదని.. పాక్‌ దాడులను సమర్థంగా ఎదుర్కోంటోంది భారత్‌ ఆర్మీ. గురువారం అర్దరాత్రి నుంచే కాల్పులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

బందిపొరాలో కాల్పులు..

ఉగ్రవాదులు కశ్మీర్‌లోని బందిపొరాలో నక్కి ఉన్నారని గుర్తించిన ఇండియన్‌ ఆర్మీ.. ఆ ప్రాంతానికి చేరుకుంది. ఈక్రమంలో కుల్నార్‌ బజిపొరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు నిఘావర్గాలు చెప్పడంతో వెంటనో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. సైన్యాన్ని చూసిన తీవ్రవాదులు కాల్పులకు దిగారు. ఇక భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. అక్కడ రెండు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

ఇటీవల వరకు ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌గా మరోసారి బాంబులు, గన్‌ల శబ్దాలతో అట్టుడుకుతోంది. ఇప్పటికే దాదాపు 3వేల మంది పర్యాటకులు జమ్మూని విడిచి స్వస్థలాలకు వెళ్లిపోయారు. పూర్తిగా జనజీవనం స్తంభించింది. ఎప్పుడు ఎక్కడ కాల్పులు జరుగుతాయో అని భయాందోళనలు నెలకొన్నాయి. అటు ముష్కరులు సైతం భద్రతా సిబ్బందిపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఆర్మీని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారు.

India-Pakistan: పాక్‌కు ఊహించని షాక్‌ ఇవ్వబోతున్న భారత్‌.. సింధూ జలాలు అడ్డుకుని దెబ్బకొడుతున్నారు!
పాకిస్తాన్‌ ప్రజలకు అక్కడి వ్యవసాయానికి 80 శాతం వరకు నీటిని సింధూ నది, ఉప నదుల నుంచే వినియోగించుకుంటారు. అయితే.. ఈ నదులు అన్నీ భారత్‌ నుంచి వెళ్తుంటాయి. ఈ జలాలను ఒక్కసారి కనుక భారత్‌ అడ్డుకుంటే.. పాక్ ప్రజలు గొంతెండి చచ్చిపోతారు. ప్రస్తుతం అలాంటి ప్లాన్‌ భారత్‌ వేస్తోంది. గతంలో  ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా చూస్తూ ఉన్న భారత్‌.. తాజాగా జమ్మూలో జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకుంది. అందరూ ప్రతికారం తీర్చుకుంటారని అనుకోగా.. మరోరకంగా పాక్‌ను దెబ్బకొట్టేందుకు కేంద్రం సిద్దమైంది. ఉగ్రదాడి జరిగిన వెంటనే ఇండియా-పాక్‌ మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేసేంది.

పాకిస్తాన్‌కు నదీ జలాలే జీవనాడులు. 1960లో ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో భారత్‌-పాక్‌ మధ్య నదీ జలాల ఒప్పందం కుదిరింది.
మొత్తం ఆరు నదులు ఉండగా.. సమానంగా భారత్‌, పాక్‌ పంచుకున్నాయి. సింధూ, జీలమ్‌, చీనాబ్‌ నదుల నీరు పాక్‌కు కేటాయించగా.. దీంతోపాటు బియాస్‌, సట్లెజ్‌ నీరు కూడా అక్కడికే వెళ్తుంది. ఒప్పందం ప్రకారం.. ఇండియా ఈ జలాలను పాక్‌ అవసరాల మేర వాడుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేవలం జలవిద్యుత్‌ ఉత్పత్తికి మాత్రమే ఇండియా ఆ నీటిని వినియోగిస్తోంది. ఇది పూర్తిగా పాక్‌పై దయతోనే భారత్‌ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

పాక్‌లో సుమారు 23.7 కోట్ల మంది ప్రజలకు ఈ నదీ జలాల నీరు తాగుతున్నారు. కరాచీ, లాహోర్‌, ముల్తాన్‌ నగరాల ప్రజలు పూర్తిగా ఈ నదుల నీటినే తాగుతారు. అక్కడ వ్యవసాయానికి కూడా 80 శాతం ఇదే నీటిని వినియోగిస్తున్నారు. సుమారు 16 లక్షల హెక్టార్లు సాగు చేస్తున్నారు. పాక్‌ ఆర్మీ కార్యకలాపాలు సాగించే పంజాబ్‌ ప్రావిన్స్‌కు ఈ నీరే దిక్కు. సింధూ బేసిన్‌ నుంచి పాక్‌కు ఏటా 154.3 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని ఏటా సరఫరా చేస్తున్నారు. దీంతో ఆ దేశ ఆహారభద్రతకు కీలకంగా నీటి ఆవస్యకత ఉంది.

పాక్‌ ఇప్పటికే తీవ్రమైన సంక్షోభంలో ఉంది. రూపాయి విలువ పతనం అయ్యింది. ఆహారం కూడా దొరకని పరిస్థితి. వ్యవసాయం పూర్తిగా దివాలా తీసింది. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సింధూ జలాలను భారత్‌ అడ్డుకుంటే మాత్రం పాక్‌కు చుక్కలు కనిపిస్తాయి. కనీవిని ఎరుగని రీతిలో పాక్‌కు నష్టం వాటిల్లనుంది. తాగు,సాగు నీటితోపాటు.. పాక్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి కీలకమైన మంగల డ్యామ్‌ను జీలమ్‌ నదిపై నిర్మించారు. దీని నుంచి ఏటా 8 శాతం తయారీ జరుగుతోంది. సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్‌ 16 శాతానికి పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు సింధూ జలాల ఒప్పందంతో పాక్‌ సుమారు 24శాతం జల విద్యుత్తుపై ప్రభావం పడనుంది.

ఇక పాక్‌కు ఇప్పటి వరకు  నీటి నిల్వకు సరైన డ్యామ్‌లు లేవు. మంగలా, తర్బెల డ్యామ్‌లలో కేవలం 14.4 ఎమ్‌ఏఫ్‌ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇది పాక్‌ వినియోగించుకుంటున్న నీటిలో కేవలం 10 శాతం మాత్రమే.. మిగిలిన నీరు అంతా నిత్యం ప్రవహించే సిందూ నదుల నుంచే వినియోగించుకుంటున్నారు.

భారత్‌ ప్లాన్‌ ఇదే..

సింధూ నదికి ఎగువ భాగాన భారత్‌ ఉండటంతో నీటిపై అధిక హక్కులు ఆ దేశానికే ఉంటాయి. ఈక్రమంలో నీటి జాలల పంపిణీ ఒప్పందం ఇండియా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనిపై ఎవరి అభిప్రాయంతో పనిలేదు. అంతేకాదు.. సింధూ జలాల ఒప్పందం కింద కిషన్‌ గంగా ఇతర రిజర్వాయర్లు కీలకం. వీటిలోని నీటిని ఇప్పుడు ఖాళీ చేస్తే.. తిరిగి నీరు నింపేందుకు ఆగస్టు వరకు ఎదురుచూడాలి. ఇలా చేసినా నీటి కోసం పాక్‌ కటకటలాడాల్సిందే.. మరోరకంగా పాక్‌ వ్యవసాయ రంగంపై కూడా దెబ్బపడుతుంది. అంతేకాకుండా వర్షాకాలంలో భారత్‌లో జీలమ్‌ నది వల్ల వరదలు వస్తున్నాయని, రెండు మూడు డ్యాములు కట్టుకోవచ్చు. ఇలా చేసినా పాక్‌కు నీటి సరఫరా తగ్గిపోతుంది.

అయితే.. ఇండియా తీసుకుంటున్న నిర్ణయం వల్ల పాక్‌కి ఇప్పుడే నొప్పి తెలియకపోవచ్చని నిపుణులు అంటున్నారు. నెమ్మదిగా భారత్‌ సింధూ జలాలపై డ్యామ్‌లను ఏర్పాటు చేసుకుంటే.. భవిష్యత్తులో పాక్‌ను ఇబ్బందులకు గురిచేయవచ్చు. ప్రస్తుతం భారత్‌కు నీటిని ఆపే సామర్థ్యం లేదు... కానీ ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకోవడంతో ఇండియా యథేచ్చగా డ్యామ్‌లను నిర్మించుకోవచ్చు.. అదే జరిగితే పాక్ గొంతెండటం మాత్రం ఖాయమని నిపుణులు అంటున్నారు.

India US trade: అమెరికాతో భారత్‌ వ్యాపార సంబంధాలు.. సుంకాలు తగ్గించేందుకు రెడీ.. ట్రంప్‌ వెల్లడి!
ఈ నెల 23న ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు జరిగాయని ట్రంప్‌ తెలిపారు. ఇండియాతో ఒప్పందం వల్ల అమెరికా వస్తువులకు కొత్త మార్కెట్లు తెరచుకుంటాయని, రెండు దేశాల్లోని రైతులు, వ్యాపార వేత్తలు, ఉద్యోగులు అపార అవకాశాలు లభిస్తాయని అమెరికా చెబుతోంది. అమెరికా సైతం టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు అక్కడి ట్రేడ్‌ ప్రతినిధి అంటున్నారు.

ఇక ట్రంప్‌ టారిఫ్‌లు పెంచడంపై ఇతర దేశాలు ప్రతికార చర్యల గురించి ఆలోచిస్తున్న వేళ భారత్  మాత్రం అందుక భిన్నంగా వెలుతోంది. సుంకాలు పెంచడం కంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు బలపరుచుకోవడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా పీఎం మోదీ కూడా పర్యటనలో కూడా రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్య ఒప్పందాలకు అడుగులు పడిన సంగతి తెలిసిందే. ప్రతికార చర్యల కంటే.. సానుకూలధోరణితో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడమే తమకు ముఖ్యం అన్నట్లు రెండు దేశాల అధినేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల భారత్‌తో మూడు రోజుల పాటు జరిగిన వాణిజ్య చర్చల్లో.. భారత బృందానికి వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ అధ్యక్షత వహించారు. ఈ చర్చలతో టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్సెస్‌ కు రెండు దేశాలు ముందుకొచ్చాయి. దీంతోపాటు 90 రోజుల పాటు టారిఫ్‌ అమలుకు అమెరికా విరామం ప్రకటించింది. దీనిని బట్టి ఇండియా పక్కా వ్యూహంతోనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Kashmir Terrorist Attack: పెళ్లైన వారానికే నేవీ ఉద్యోగి మృతి.. తల్లడిల్లిన భార్య.. ఐడీ చూసి చంపిన ఉగ్రవాదులు!
వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉందామని నిశ్చయించుకున్నారు.. కలకాలం కలిసుండాలని కలలు కన్నారు. కానీ ఇద్దరూ కలిసి ఏడడుగులు వేసి.. ఏడు రోజులు కాకుండానే విధి దూరం చేసింది. జమ్మూకశ్మీర్‌లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో నేవీ ఉద్యోగి 26 ఏళ్ల వినయ్ నర్వాల్ చనిపోయాడు. ఇటీవలే ఇతనికి పెళ్లి కాగా.. భార్యతో కలిసి హనీమూన్‌ చేసుకోవడానికి కశ్మీర్‌ వచ్చారు. ఆక్రమంలో ఉగ్రమూకల దాడికి బలైపోయాడు.

వినయ్ నర్వాల్‌ రెండేళ్ల కిందటే నేవీ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. సరిగ్గా వారం కిందటే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి పహల్గామ్ వద్ద టారిస్ట్‌ప్లేస్‌ను పరిశీలిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారి దాడికి దిగారు. వినయ్ నర్వాల్‌ వద్దకు వచ్చిన ముష్కరులు నువ్వు ముస్లిమా కాదా అని అడిగారు. తను మాట్లాడే లోపే వెంటనే ఐడీ చూపించాలని అడిగారు. ఆర్మీ దుస్తులలో ఉన్న తీవ్రవాదులను గుర్తించలేని వినయ్.. వెంటనే తన ఐడీ కార్డును చూపించగా... పేరు వివరాలు చదివి వెంటనే అతనిపై నిర్దాక్షణంగా కాల్పులు జరిపారు.

వినయ్‌ పక్కనే ఉన్న భార్యను వదిలేసిన ముష్కరులు.. విగతజీవిగా పడిఉన్న వినయ్‌ని చూసి బోరున విలపించింది. మృతదేహం పక్కనే కూర్చుని ఆమె ఏడుండగా.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటో చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో ఎంత ఘోరం చేశారు.. అని మాట్లాడుకుంటున్నారు.

వివాహం జరిగిన కొద్ది రోజులకే ముష్కరుల దాడిలో మరణించడం అందరినీ కదిలించింది. రెండేళ్ల క్రితం నేవీలో చేరిన వినయ్ నర్వాల్ కొచ్చి లో లెఫ్టినెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 16న ఇతనికి వివాహం జరగగా.. ఈ నెల 19న వివాహ రిసెప్షన్ పూర్తయ్యింది. ఈక్రమంలో చిన్న ట్రిప్ కోసం పహల్గామ్ వెళ్లాడు. అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరాడు.

Pahalgam Terror Attack: ఏ ఉగ్రవాదినీ వదిలిపెట్టం.. ప్రతికారం తీర్చుకుంటాం.. ప్రధాని మోదీ, అమిత్‌షా ఫైర్‌!
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. దాడి తమను కలిచివేసిందని అన్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ ఉగ్రమూకల దాడి గురించి తెలిసిన వెంటనే  కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే శ్రీనగర్‌ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. దీంతో షా ఇప్పటికే శ్రీనగర్‌ చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు.

పహల్గామ్‌లో దాడులకు పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఇప్పటికే ప్రకటించింది. ఇది పక్కా ప్లానింగ్‌ ప్రకారమే జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే.. దాడి గురించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని షా అధికారులకు ఆదేశించారు. ఇక ఘటనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రమూకలను ఎవర్రినీ వదిలిపెట్టమని వార్నింగ్‌ ఇచ్చారు. వారి ఎజెండా ఎప్పటికీ విజయం కాదన్నారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం బలపడుతోందన్నారు.

ఇక ఘటనపై హోంమంత్రి అమిత్‌ షా కూడా స్పందించారు ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని అన్నారు. ఎంతటి వారినైనా కఠింగా శిక్షిస్తామన్నారు. ప్రతికారం తీర్చుకుంటామన్నారు. ఇక పర్యాటకులపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఏం జరుగుతుందో కూడా అక్కడి వారికి అర్తం కాలేదు. తీవ్రవాదులు అందరూ ఆర్మీ దుస్తులు ధరించి ఉండటం... అత్యంత సమీపం నుంచి వారు కాల్పులు జరపడంతో అనేకమంది మృతి చెందారని అధికారిక వర్గాల సమాచారం.

ఉగ్రదాడిలో తమ బంధు, మిత్రులను కోల్పోయినవారికి ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు.

Pahalgam Terror Attack: హనీమూన్‌కి వచ్చిన జంట.. శవమైన భర్త.. ముస్లిమా కాదా అని అడిగి మరీ కాల్చిపడేశారంట..!
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశం ఉలిక్కిపడేలా చేసింది. అమర్నాథ్‌యాత్రకు టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అతి దగ్గరి నుంచి కాల్పులు జరపడంతో అనేక మంది మృతి చెందారు. ఇప్పటికైతే మృతుల సంఖ్య లెక్కకు రాలేదు. అనేక మందికి గాయాలు అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఒక్కో ఘటన వెలుగులోకి వస్తుండటంతో ఆ దృశ్యాలు చూసిన వారు అయ్యో ఎంత ఘోరం జరిగిందోనని బాధపడుతున్నారు.

ముస్లిం కాదని తెలిసిన తర్వాత..
ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులలో అక్కడికి రావడంతో వారిని ఎవరూ గుర్తించలేదు. ఇక ఒక్కక్కరినీ ముస్లిమా కాదా అని కాల్పులు జరపడంతో అందరూ పరుగులు తీశారు. ఈక్రమంలో ఎడాపెడా కాల్పులు జరిపారు ఉగ్రావాదులు. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారం. పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చిన పర్యటకులే లక్ష్యంగా దాడులు జరిగాయి.

పక్కా ప్లానింగ్‌తోనే...

ఉగ్రవాదులు ఆర్మీదుస్తులతో ఉండటంతో.. పర్యాటకులను మభ్యపెట్టి.. అతి దగ్గరి నుంచి కాల్పలు చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ప్రకటించింది. ఇది పక్కా ప్లానింగ్‌ ప్రకారంమే జరిగిందని నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సౌదీలో ఉన్న ప్రధాని మోదీ వెంటనే హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే షా శ్రీనగర్‌ చేరుకుని అధికారులతో అత్యవసర భేటీ అయ్యారు.

కళ్ల ముందే భర్తను కోల్పోయి..
పహల్గామ్‌లో ప్రాంతంలో ఉన్న పచ్చిక మైదానాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడికి చేరుకున్నారు. అందులో ఓ జంట.. భేల్‌పురి తింటుండగా.. ఒక్కసారిగా కాల్పులు జరిపారని చెబుతున్నారు. ఈ ఘటనలో తన భర్తని కాల్చారని, ఆయన అక్కడికక్కడే మృతి చెందారని ఓ మహిళ ఆవేదనతో చెబుతోంది. తన భార్త ముస్లిం కాదని చెబుతూ టెర్రరిస్టులు కాల్చారని ఆమె తీవ్రంగా ఏడుస్తున్నారు. ముస్లిం కాని వారిని వారు టార్గెట్ చేశారని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

UPSC 2025 Results: తల్లి లేకపోయిన తండ్రి సపోర్టుతో సివిల్స్‌లో రెండో ర్యాంకు సాధించిన యువతి.. తెలుగోళ్ల హవా!
యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలల్లో మొదటి 25 ర్యాంకుల్లో అమ్మాయిలు ప్రతిభ కనబరిచారు. మొదటి 25 ర్యాంకుల్లో 11 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఇక తొలి అయిదు ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. తొలి ర్యాంకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శక్తి దూబే సాధించారు. రెండో ర్యాంకు హర్షిత గోయల్‌ కి వచ్చింది. డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంక్, షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకు, ఆకాష్ గార్గ్ 5వ ర్యాంకుల్లో నిలిచారు. అయితే.. రెండో ర్యాంకు సాధించిన గుజరాత్‌కు చెందిన హర్షిత గోయల్‌ కి తల్లిలేరు తండ్రి ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రిపరేషన్‌లో తన తండ్రి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. కుటుంబం నుంచి సివిల్‌ సర్వెంట్‌ కాబోతుంది తొలి వ్యక్తి తనేనని చెబుతున్నారు. ఈ విజయానికి తండ్రితోపాటు స్నేహితులూ మద్దతుగా నిలిచారని గోయల్‌ అంటున్నారు. మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నాను.

తెలుగు తేజాలు హవా.
సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చూపారు. తెలగు రాష్ట్రాలకు చెందిన ఈ.సాయి శివాని 11వ ర్యాంకు, బి.వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్‌ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్‌ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్‌ 68వ ర్యాంకులతో టాప్​ 100లో చోటు దక్కించుకున్నారు. ఇక ఎన్‌ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్‌ రెడ్డి 119, చల్లా పవన్‌ కల్యాణ్‌ 146, ఎన్‌.శ్రీకాంత్‌ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190, పోతురాజు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకులతో మొదటి మూడు వందల ర్యాంకుల్లో 13 మంది ప్రతిభ చూపారు.

మొత్తం 1,009 మందికి కొలువులు..
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మొత్తం 1000కి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ విభాగాల్లో ఖాళీలను ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ రాగా.. ఆ ఏడాది జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. దేశ వ్యాప్తంగా 9,92,599 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,83,213మంది పరీక్ష రాశారు. ఇందులో సెప్టెంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షకు 14,627మంది క్వాలిఫై  అయ్యారు. ముఖాముఖికి 2,845మంది సెలెక్టయ్యారు. తుది ఫలితాల్లో 1,009 మంది ఉద్యోగాలు సాధించారు. ఇందులో 725 మంది అబ్బాయిలు, 284 మంది మహిళలు ఉన్నారు. కేటగిరీల వారీగా జనరల్‌ 335 మంది, ఈడబ్ల్యూఎస్‌ 109, ఓబీసీ 318, ఎస్సీ 160, ఎస్టీ 87మంది ఎంపికయ్యారు. సివిల్స్లో సత్తా చాటిన టాప్ 25 ర్యాంకర్లలోని అభ్యర్థులు అంతా దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, వీఐటీ, జేఎన్జూ, దిల్లీ విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వ విద్యాలయాల, విట్ యూనివర్సిటీ వంటి విశ్యవిద్యాలయాలకు చెందిన వారే.

JD Vance: ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు.. వాన్స్‌ భార్య అచ్చ తెలుగమ్మాయి!
ఉషావాన్స్ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా సాయిపురంలో ఉండటం విశేషం.. ఉషా తల్లిదండ్రులు 1970లో అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో అమెరికా రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగింటి అల్లడు కావడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. వాన్స్ భార్య ఉష తెలుగు సంతతికి చెందిన అమ్మాయి.. ఉషా చిలుకూరిది విశాఖ వాసులకు బంధువు అంట.. గతేడాది వరకూ విశాఖలో సుపరిచిత సెంచూరియన్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్​గా పనిచేసిన శాంతమ్మ మనుమరాలే ఉషా. ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్‌ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన భార్య ఉషా పేరు ఊరు గురించి వెలుగులోకి వచ్చాయి.

చిలుకూరి ఉష వాన్స్‌కు వైజాగ్‌, కృష్ణా జిల్లాలో బంధువులు ఉన్నారు. మరి ఇండియా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వాన్స్‌ దంపతులు తెలుగు రాష్ట్రాలను కూడా సందర్శిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక జేడీ వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై శాంతమ్మ హ్యాపీగా ఉన్నారు. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని.. ఉష కూడా అమెరికాలో పుట్టి పెరగడంతో తనకు అంతగా పరిచయం లేదని శాంతమ్మ చెబుతున్నారు. వాన్స్‌ గెలిచిన తర్వాత ఫోన్‌లో ఉష తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపినట్లు శాంతమ్మ చెబుతున్నారు. ఇక చెన్నైలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఉష మేనత్త శారద ఉష, వాన్స్ వివాహానికి సైతం హాజరైనట్లు ఆమె అంటున్నారు. తమ బంధువులు చాలామంది అమెరికాలో స్థిరపడ్డారని అంటున్నారు శాంతమ్మ.

ఇక కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం ఉషా చిలుకూరి పూర్వీకులు ఉండేవారు. ఉషకు తాత వరుస అయ్యే రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటుండగా వారి వంశవృక్ష పటం లభించింది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా ఉష వరకు విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. అందరూ ఉన్నత విద్యావంతులే. వీరందరూ ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్లి స్థిరపడ్దారు. ఉష తండ్రి ఏరో నాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన రాధాకృష్ణ శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లాకు పామర్రుకు చెందిన లక్ష్మితో ఆయనకు వివాహం అయ్యింది. వీరు అప్పట్లోనే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.

ఇక మన తెలుగమ్మాయి ఉషకు ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్దమైంది. ఇండియన్‌ రైల్వే శాఖ ఉషకు అరుదైన కానుక రూపంలో మెమెంటో ఇవ్వనునుంది. దీన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆమెకు అందజేయనున్నారు.

India Justice Report: మహిళలు అన్నింటిలో సమానం.. పోలీసు దళంలో కాదు.. కిందిస్థాయిలోనే మిగిలిపోతున్నారట!
మన దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో కూడా సమాన హక్కులను చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా మహిళలకు ప్రత్యేక కోటా అమలు చేస్తున్నారు. కానీ పోలీసుశాఖలో ఉన్నత ర్యాంకుల్లో పనిచేసే మహిళల సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోందని సర్వే చెబుతోంది. దీంతోపాటు న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం ఇలా మొత్తం నాలుగు రంగాల్లో మహిళా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు అన్న వివరాలను ఇటీవల ఓ సంస్థ సేకరించింది. దీనిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

పోలీసు వ్యవస్థలో మహిళా పోలీసుల పాత్ర కూడా చాలా కీలకం. అయితే మన దేశంలో పోలీసు దళంలో డైరెక్టర్ జనరల్స్, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ వంటి సీనియర్ పదవుల్లో 1,000 కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారంట. పోలీసింగ్‌లో 90 శాతం మంది మహిళలు దిగువస్థాయిలో పనిచేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఈ వివరాలను టాటా ట్రస్ట్స్ ప్రారంభించిన అనేక పౌర సమాజ సంస్థలు, డేటా భాగస్వాముల సపోర్టుతో ఇండియా జస్టిస్ రిపోర్ట్ -2025 నివేదిక ప్రకారం.. పోలీసు, న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం అనే నాలుగు రంగాలలో మహిళా ఉద్యోగుల సంఖ్యను ట్రాక్ చేశారు.

పోలీసు శాఖలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల మంది మహిళా పోలీసులు ఉన్నారు. ఇందులో కేవలం 960 మంది మాత్రమే ఇండియన్ పోలీస్ సర్వీస్ ర్యాంకుల్లో ఉన్నారు. 24,322 మంది డిప్యూటీ సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్, నాన్-ఐపీఎస్ ఆఫీసర్ పదవుల్లో ఉన్నారు. ఇక ఇండియన్‌ పోలీసు సర్వీసుల్లో 5,047 మంది అధికారులు ఉన్నారు. పోలీసు కానిస్టేబుళ్లలో 2.17 లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. దీంతో కింది స్థాయిలోనే 90 శాతం మంది పనిచేస్తుండటం గమనార్హం. అత్యధిక సంఖ్యలో మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ 133 మందితో అగ్రస్థానంలో ఉంది.

మధ్యప్రదేశ్‌ తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక 2019 మరియు 2023 మధ్యకాలంలో దాదాపు 78 శాతం పోలీస్ స్టేషన్లలో మహిళా సహాయ కేంద్రాలు ఉన్నాయి, 86 శాతం జైళ్లలో వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు ఉన్నాయి. న్యాయ సహాయం కోసం తలసరి వ్యయం దాదాపు రెట్టింపు అయి రూ. 6.46 కు చేరుకుంది. అదే కాలంలో జిల్లా న్యాయవ్యవస్థలో మహిళల వాటా కూడా 38 శాతానికి పెరిగింది.

ఇక జిల్లా న్యాయవ్యవస్థలో షెడ్యూల్‌ తెగలు, షెడ్యూల్‌ కులాల వాటా వరుసగా 5 శాతం, 14 శాతం మందే మహిళలు ఉన్నారు. ఈ వర్గాలు పోలీసు దళంలో, ఎస్సీలు 17 శాతం, ఎస్టీలు 12 శాతం ఉన్నారు, వీరికి కేటాయించిన రిజర్వేషన్ల కంటే చాలా తక్కువ ఉన్నారని నివేదకలో పేర్కొన్నారు. చట్టపరమైన సహాయం పొందడానికి కీలకంగా ఉండే పారాలీగల్ వాలంటీర్లు ఐదు సంవత్సరాలలో 38 శాతం మంది మహిళలు తగ్గారట. ఇప్పుడు లక్ష జనాభాకు 3 పీఎల్‌వీలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దేశవ్యాప్తంగా జైళ్లలో 25 మంది మహిళా మానసిక వైద్యులు అందుబాటులో ఉన్నారని నివేదిక పేర్కొంది.

మహిళా ఉద్యోగాలు న్యాయవ్యవస్థలో అతి తక్కువగా ఉన్నారు. భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకు కేవలం 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. ఇది 1987లో లా కమిషన్ ప్రకారం.. 50 మంది కనీసం ఉండాల్సి ఉండగా.. అంతకంటే తక్కవ మంది ఉన్నారు. మహిళా ఉద్యోగులు హైకోర్టులు 33 శాతం, జిల్లా కోర్టులు 21 శాతం ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో అలహాబాద్, మధ్యప్రదేశ్ వంటి హైకోర్టులలో ఒక్కో న్యాయమూర్తికి 15,000 కేసులు వరకు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు సగటున ఒక్కొక్కరు 2,200 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

జైలులో ఖైదీల సంఖ్య పెరుగుతుండగా.. అందుకు తగ్గట్లు మహిళా ఉద్యోగులు అక్కడ లేని పరిస్థితి. జైళ్లలో వైద్య సిబ్బంది లేని పరిస్థితి, ఖైదీ-డాక్టర్ నిష్పత్తి 300:1కి ప్రస్తుతం 775:1 మంది ఉన్నారు. హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక పెద్దరాష్ట్రాల్లో ఈ నిష్పత్తి 1000:1 మించిపోయింది. ఇక 2022 మరియు 2025 మధ్య పెద్ద మరియు మధ్య తరహా రాష్ట్రాలలో బీహార్, ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశా అత్యధిక మెరుగుదల కనిపించింది.

ఇక 2030 నాటికి భారతదేశంలోని జైలు ఉండే ఖైదీలు 6.8 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో  వ్యవస్థాగత సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగాల్లో మహిళలను ప్రోత్సహించకపోతే న్యాయ వ్యవస్థ బలహీనులు, అణగారిన వర్గాలపై అసమాన భారాన్ని మోపనుంది. తాజా నివేదిక కోసం సర్వే టీం.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ, నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ మరియు ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా వంటి అధికారిక పోర్టల్‌ల నుంచి కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది.

Kochi Water Metro: కొచ్చి వాట‌ర్ మెట్రోలో ఎలక్ట్రిక్-హైబ్రిడ్ బోట్లు.. 23 బోట్ల నిర్మాణానికి ఒప్పందం!
మొత్తం 23 ఎలక్ట్రిక్-హైబ్రిడ్ బోట్ల నిర్మాణం..

కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ త‌న స‌ర్వీసుల‌ను విస్త‌రిస్తోంది. ఇందుకోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మరో నౌకను నిర్మించే ప‌నిలో ప‌డింది. దీంతోపాటు మొత్తం 23 ఎలక్ట్రిక్-హైబ్రిడ్ బోట్లను నిర్మించడానికి షిప్‌యార్డ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్ర‌కారం ఇప్పటివరకు 18 బోట్లను అంద‌జేయ‌గా.. మిగిలినవి అతి త్వ‌ర‌లోనే అప్ప‌గించ‌నున్నారు. ఇక వాట‌ర్ మెట్రో బోట్ స‌ర్వీసుల‌ను పెంచ‌డం వ‌ల్ల అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో సేవ‌ల‌ను పెంచ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ బోట్ల‌కు ర‌ద్దీ ఏర్ప‌డింద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త బోట్లు వ‌స్తాయ‌న్న ప్ర‌క‌ట‌న‌తో ప‌ర్య‌ట‌కులకు మెరుగైన సేవ‌లు అందే అవ‌కాశం ఉంది.

న‌గరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ..

ప్రస్తుతం, కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ కొచ్చి న‌గరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ.. ఆరు మార్గాల్లో సేవలను నిర్వహిస్తోంది. కొత్త బోట్ల రాకతో మ‌రిన్ని సేవ‌ల‌ను పెంచే అవ‌కాశం ఉంది. దీంతోపాటు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ర్యాట‌కుల‌కు స‌రిప‌డా బోట్లు లేక‌పోవ‌డం వ‌ల్ల ర‌ద్దీ ఏర్ప‌డుతోంది. అనేక టెర్మినల్స్ వద్ద పొడవైన క్యూల‌లో టూరిస్టులు నిల‌బ‌డి గంట‌ల కొద్దీ ఎదురుచూస్తున్నారు.

ఎర్నాకులం బోట్ జెట్టీ ప్రారంభమైన తర్వాత...

నూతంగా వ‌చ్చిన బోట్ల‌ను మట్టంచెరి, విల్లింగ్‌డన్ ద్వీపం ప్రాంతంలో సేవ‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని వాట‌ర్ మెట్రో అధికారులు చెబుతున్నారు. "ఎర్నాకులం జెట్టీ ప్రాంతంలో టెర్మినల్ నిర్మాణం కోసం తాము ఇప్పటికే టెండర్ ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. ఎర్నాకులం బోట్ జెట్టీ ప్రారంభమైన తర్వాత తాము మట్టంచెరి నుంచి సర్వీసును ప్రారంభిస్తామ‌ని అధికారులు తెలిపారు.

కొచ్చి వాటర్ మెట్రో త్వరలో మట్టంచెరి నుంచి విల్లింగ్‌డన్ ద్వీపానికి సేవలను ప్రారంభించనుంది. ఎర్నాకులం జెట్టీ వద్ద కొత్త టెర్మినల్ నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్ జారీ చేశారు. ఇది పూర్తి చేస్తే మట్టంచెరికి సేవలు అక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి.

Thahawur Rana: ఇండియాకు ముంబయి ఉగ్రదాడి సూత్రధారి.. ఎంత క్రూరుడంటే.. వీడి హిస్టరీ ఓ మిస్టరీ!
Thahawur Rana: ముంబయి నగరంపై 2008లో జరిగిన ఉగ్రమూకల దాడి గుర్తుకు తెచ్చుకుంటే ప్రతి భారతీయుడి మనసు చలించిపోతుంది. ఈ ఘటనలో 170 మంది పౌరులు మృతి చెందారు. అలాంటి ఘాతుకానికి ఓడిగట్టిన, దాడులు జరిపేందుకు ప్లాన్‌ చేసిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ కీలక నాయకుడు తహవూర్‌ రాణా భారత్‌కు తిరిగొస్తున్నాడు. ఇప్పటి వరకు అమెరికా జైల్లో శిక్షణ అనుభవిస్తున్న అతన్ని భారత్‌కు అప్పగించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది. గురువారం ఉదయానికి తహవూర్‌ రాణా ఇండియాకు తీసుకొస్తున్నట్లు భద్రతాదళాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రముఖ నగరాల్లో ఎక్కడా అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక తహవూర్‌ రాణా చరిత్ర చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. భయంకరమైన తీవ్రవాదిని భారత్ ఏం చేస్తుందంటే..

ముంబయి నగరంపై 2008లో జరిగిన ఉగ్రమూకల దాడి గుర్తుకు తెచ్చుకుంటే ప్రతి భారతీయుడి మనసు చలించిపోతుంది. ఈ ఘటనలో 170 మంది పౌరులు మృతి చెందారు. అలాంటి ఘాతుకానికి ఓడిగట్టిన, దాడులు జరిపేందుకు ప్లాన్‌ చేసిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ కీలక నాయకుడు తహవూర్‌ రాణా భారత్‌కు తిరిగొస్తున్నాడు. ఇప్పటి వరకు అమెరికా జైల్లో శిక్షణ అనుభవిస్తున్న అతన్ని భారత్‌కు అప్పగించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది. గురువారం ఉదయానికి తహవూర్‌ రాణా ఇండియాకు తీసుకొస్తున్నట్లు భద్రతాదళాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రముఖ నగరాల్లో ఎక్కడా అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక తహవూర్‌ రాణా చరిత్ర చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. భయంకరమైన తీవ్రవాదిని భారత్ ఏం చేస్తుందంటే..

ముంబయిలోకి నవంబర్‌ 26, 2008లో పాకిస్తాన్‌కి చెందిన లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన సుమారు 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంగుండా ముంబయికి వచ్చి నగరంలోని అనేక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపారు. ముందుగా తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, నరిమన్ హౌస్, కామా హాస్పిటల్, లియోపోల్డ్ కేఫ్ వంటి ప్రాంతాల్లో భయంకరమైన ఆయుధాలతో గ్రనేడ్లు, బాంబులతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా మారణహోమం జరిగింది. సుమారు 175 మంది ప్రాణాలు కోల్పోగా.. 600 మందికి పైగా తీవ్రంగా గాయపడ్దారు. సుమారు 60 గంటలపాటు దాడులుపాటు భారత ఎన్‌ఎస్‌జీ కమాండోలు తొమ్మిది మంది తీవ్రవాదులను అంతం చేశారు. కసబ్‌ను మాత్రం పట్టుకుని ఉరితీశారు.

ముంబయి దాడులకు వెనుకుండి ప్లాన్‌ చేసింది, ప్రోత్సహింది మొత్తం తహవూర్‌ రాణా అని నిఘావర్గాలు తేల్చాయి. అతన్ని పట్టుకునేందుకు అప్పటి నుంచి భారత్‌ విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే.. అమెరికా అతన్ని పట్టుకుని అక్కడి జైళ్లో ఉంచింది. పాకిస్థాన్‌ సంతతికి చెందిన కెనడా భారతీయుడు అయిన తహవూర్‌ వ్యాపారవేత్త. ఈక్రమంలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)లో రాణా యాక్టివ్‌ మెంబర్‌గా ఉన్నాడు. ముంబయిలో ఏయే ప్రాంతాలను లక్ష్యం చేసుకోవాలి. ఎలా టార్గెట్‌ రీచ్‌ కావాలని అన్న ప్రణాళిక రాణాదే. దీంతోపాటు పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి అనేక అంతర్గత పత్రాలను అందించడంలో రాణా పాత్ర ఉంది. ఇక పాకిస్థాన్ ఐఎస్‌ఐ సంస్థతో కూడా రాణా కలిసి పనిచేసి ఉగ్రవాదులు భారత్‌కు క్షేమంగా చేరుకోవడానికి సహాయపడ్డాడు.

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చొరవతో తహవూర్‌ రాణాను అక్కడి సిబ్బంది భారత్‌కు పంపుతున్నారు. 2020 నుంచి అతన్ని అప్పగించాలని భారత్‌ కోరుతున్నా.. చట్టపరమైన చిక్కులతో అది సాధ్యపడలేదు. ఇక రాణాను ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పగిస్తానని ఒప్పుకున్నారు. అయితే.. తనకు భారత్‌ వెళ్లేందుకు ఇష్టం లేదని అమెరికాలో ఉంటానని రాణా అగ్రరాజ్యం సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేసుకున్నారు. దీన్ని అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 64 ఏళ్ల రాణా లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఇప్పటి వరకు ఉంటున్నాడు.

ఇండియాకు రావడం తనకు ససేమిరా ఇష్టం లేదని రాణా చెబుతున్నాడు. భారత్‌కు వస్తే తనను చిత్రహింసలకు గురిచేస్తారని అమెరికా కోర్టులను ఆశ్రయించాడు. అయినా అక్కడ ఫలితం లేకపోవడంతో ఎట్టకేలకు భారత్‌ బలగాలు అతన్ని తీసుకొస్తున్నాయి. ఇప్పటికే భారత అధికారుల బృందం అమెరికా వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన పనులన్నీ పూర్తి చేసేసింది. ఈరోజు రాత్రికి లేదా బుధవారం రాణా వస్తాడని అధికారులు చెబుతున్నారు.

రాణాతోపాటు అనేకమంది నేరగాళ్లను భారత్‌కు అప్పగిస్తామని ట్రంప్‌ తెలిపారు. రాణాను భారత నిఘా, దర్యాప్తు అధికారుల ప్రత్యేక బృందంతో కలిసి తీసుకొస్తున్నారు. ఆయన్ని ప్రత్యేక విమానం ద్వారా న్యూఢిల్లీ చేరుకునే ముందే ఓ గుర్తు తెలియని ప్రదేశంలో ఆపుతారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండియాకు వచ్చిన తర్వాత రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. తొలుత న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసి అతన్ని జైల్లో పెట్టనున్నారు.

విమానాల్లో ఎండు కొబ్బరి నిషేధం ఎందుకు...?
విమానాల్లో ఎండు కొబ్బరిని ఎందుకు నిషేధించారో తెలుసా.  నిషేధం వెనుక కారణాలు ఏమిటి..?

విమాన ప్రయాణం సురక్షితమైన , సాఫీగా సాగేలా కొన్ని నియమాలు ఉంటాయి. అందులో భాగంగా.. ప్రయాణీకులు తమ లగేజ్ తో పాటు  నిషేధిత వస్తువులకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలి.

విమానయాన సంస్థలు ప్రయాణీకుల భద్రతను తీవ్రంగా పరిగణిస్తాయి, అందుకే అవి మండే వస్తువులు, ఆయుధాలు మరియు ప్రమాదకరమైన పదార్థాలు వంటి కొన్ని వస్తువులను నిషేధించాయి.

ఆశ్చర్యకరంగా, ఎండు కొబ్బరిని  కూడా విమానాల్లో  నిషేధించారు. దీనిలో ఉండే ఆయిల్ కంటెంట్ కారణంగా అది మండే స్వభావంతో ఉంటుంది కనుక.  ఇది అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తుంది. దాంతో కొబ్బరి  నిషేధిత వస్తువుల జాబితాలో చేరింది.

ప్రయాణీకులు నిషేధిత వస్తువుల గురించి తెలుసుకోవాలి, వీటిలో ఔషధాలు, కొన్ని జంతువులు, చట్టవిరుద్ధమైన పదార్థాలు , ఆశ్చర్యకరంగా, ఎండు కొబ్బరి లాంటివి మరికొన్ని ఉన్నాయి.

బంగారం, మొక్కలు, రసాయనాలు, పుస్తకాలు, కొన్ని ఔషధాలు మరియు ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులకు విమాన ప్రయాణానికి అనుమతులు మరియు సరైన డాక్యుమెంటేషన్ అవసరం.

సమస్యలు లేని అనుభవాన్ని నిర్ధారించుకోవడానికి, ప్రయాణీకులు విమానాల్లో నిషేధిత వస్తువులకు సంబంధించి విమానయాన మార్గదర్శకాలను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఇండియాలో అత్యంత ధనిక దేవుడు ఎవరు..? భారీ ఆదాయం వస్తున్న దేవాలయాలు ఇవే..?
భారత దేశం హిందూ సంసృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు.. ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు ఆధ్యాత్మికతకు ప్రతీకలుగానిలిచాయి. కాగా అందులో అత్యంత సంపద కలిగి.. ఆదాయం కలిగిన గుళ్లు కూడా ఉన్నాయి. ఇండియాలో అత్యంత ధనిక దేవాలయాల గురించి చూస్తే..?

రిచ్చెస్ట్ టెంపుల్స్ లిస్ట్ చూస్తే... ముందుగా గుర్తుకు వచ్చేది... తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఆలయం. ఆంధ్రప్రదేశ్‌ లో గల ఈ దేవాలయం  ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన మరియు ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది. తిరుమల కొండల నడుమ 16 ఏకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ గుడి.. 10వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక  ఈ ఆలయంఆదాయం ఏటా 15 00  నుంచి 2 000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచన.. రోజు ఈ ఆలయాన్ని  50,000లకు పైగా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ఇక 3 లక్షల కోట్ల నికర విలువ కలిగిన ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో  ఒకటిగా నిలిచింది. విలువైన  కానుకలు,  భక్తుల నుండి వెంట్రుకలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ మొత్తం, వివిధ టిటిడి ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలుగా వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంటుంది.

ఇక ధనిక దేవాలయాల్లో జగన్నాథ పురి ఆలయం  కూడా  ఉంది. ఒడిశాలో ఉన్న ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. దేవాలయానికి వచ్చే ఆదాయంతో పాటుగా ఈమధ్యనే గుడిలో ఉన్న రహస్య గదుల ద్వారా.. అత్యంత విలువైన సంపదను బయటకు తీయ్యడం జరిగింది. అంతే కాదు లోపల తెరవాల్సిన గదులు కూడా ఇంకొన్ని ఉన్నట్టు చెబుతారు. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యకతలు కూడా ఉన్నాయి. నిత్యం వేల మంది దర్శించుకునే ఈ దేవాలయానికి వందల కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. 30 వేల ఎకరాల భూమి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక నేల మాళిగల ద్వారా వేల కోట్ల సంపదను కలిగి ఉన్న దేవాలయంగా ప్రసిద్ది చెందింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం దగ్గరలో గల ఈ ఆలయం.. 120,000 కోట్ల ఆస్తులతో  ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా నిలిచింది.  బంగారు విగ్రహాలు, వజ్రాలు ,వెండి,  పచ్చలు, పురాతన వస్తువులు ఇలా వేల కోట్ల సంపద ఈ దేవాలయం నేల మాళిగలో ఉంది. కొంత వరకూ బయటకు తీసినా..ఇంకా కొన్ని గదులు తెరవలేదు. ఆ గదులకు నాగ బంధం ఉండటంతో.. వాటిని తీయడానికి వెనకడుగు వేస్తున్నారు.

ఇక ధనిక దేవాలయాల్లో గోల్డెన్ టెంపుల్ కూడా ఒకటి. పంజాబ్ రాష్ట్రంలో  అమృత్‌సర్ పట్టనంలో ఉన్న  గోల్డెన్ టెంపుల్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ  దేవాలయాల్లో ఒకటి.  400 కిలోల బంగారంతో ఈ దేవాలయానికి  తాపడం చేయించారు. అందుకే దీన్ని గోల్డెన్ టెంపుల్ గా పిలుస్తారు. ఈ గుడి వార్షిక ఆదాయం 500 కోట్లకు పైనే ఉంటుందని అంచన.  ఐదవ సిక్కు గురువు గురు అర్జన్ సహాయంతో ఈ మందిరం నిర్మించబడింది. గురునానక్ ఇక్కడ ఆలయం నిర్మించకముందు ద్యానం చేసేవారట. 1581లో నిర్మాణం స్టార్ట్ అయ్యి.. ఎనిమిది ఏళ్ళకు కంప్లీట్ అయ్యిందని చెపుతారు. ప్రారంభమైంది.

ఇక అందరు భక్తితో కొలిచే షిర్డీ సాయిబాబా వారి ఆలయం కూడా ధనిక ఆలయమే. మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజూ 30,000 మంది వరకూ భక్తులు వస్తుంటారు. 1922 లో నిర్మించబడిన ఈ ఆలయానికి ఆదాయం కూడా ఎక్కువే. సాయిబాబా వారు  కూర్చున్న  సింహాసనం దాదాపు 100  కిలోల బంగారంతో చేయబడిందట. దాదాపు 400 కోట్ల విరాళాలు.. నగదు, చెక్కులు, బంగారం, ఇతర ఆదాయాలు చూసుకుంటే.. 500 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇక  ఆలయ ట్రస్ట్ ద్వారా సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.  రెండు ఆసుపత్రులను నిర్వహించడంతో పాటు.. ప్రతిరోజు దాదాపు లక్షమంతి భక్తులకు అన్న ప్రసాదం అందిస్తుంది షిరిడి ట్రస్ట్.

ఇక గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం  కూడా అత్యంత సంపద కలగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో మొదటిది ఉద్భవించిన ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ది చెందింది. ఈ ఆలయానికి  ఎంత సంపద ఉంది అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ..ఈ ఆలయానికి 300 కిలోల బంగారం వివిధ రూపాల్లో ఉన్నట్టు సమాచారం.  1700 ఎకరాల భూమితో సహా వివిధ రూపాల్లో  ఆస్తులను కలిగి ఉందట సోమనాథ్ ఆలయం.

వైష్ణో దేవి ఆలయం హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి. 5,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం వైష్ణో దేవిగా పూజించబడే దుర్గాదేవికి అంకితం చేయబడింది. 108 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటైన ఈ మందిరానికి గత రెండు దశాబ్దాలలో  1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి మరియు రూ. 2,000 కోట్ల నగదు విరాళాల రూపంలో వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక ముంబయ్ లో ఎంతో ఫేమస్ సిద్ధివినాయక దేవాలయం.   రెండు శతాబ్దాల నాటి ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. ఆలయ ప్రధాన మూల విరాట్ కు నాలుగు కిలోల బంగారు నగలు ఉన్నాయి. ఆలయానికి  125 కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రోజువారి ఈ ఆలయానికి 30 లక్షల ఆదాయం వస్తుందట.  ఇక్కడ కొలువైన గణపతి దేవుడు.. విశిష్ట లక్షణం కలిగి ఉంటాడు.. ఇక్కడి వినాయకుడి తొండం కుడి వైపుకు వంగి ఉంటుంది. విగ్రహానికి నాలుగు చేతులు ఉన్నాయి.

భారత్ పై కూడా బంగ్లా దేశ్ తరహా కుట్రలు.. సవాళ్ళను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది..?
దేశాన్ని అస్థిరపరిచే  విధానాలకు భారత్ దూరం.. అలాంటి లక్ష్యంతో పనిచేసే విదేశీ జోక్యాలను అడ్డుకోవడంతో.. ఇండియా  బంగ్లాదేశ్ లాంటి పరిస్థితిని నుంచి విజయవంతంగా తప్పించుకోగలిగింది. అయితే భారత్ ను కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టాలని బయట నుంచి అనేక శక్తులు పనిచేస్తున్నా.. వారిని కూడా భారత్ విజయవంతంగా నివారించింది.

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మరియు భారత సైన్యం  తూర్పు కమాండ్ ADG నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రీసెంట్ గా ప్రకటించారు. సమస్యాత్మక దేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు, హిందువులు మరియు ఇతర మైనారిటీ వర్గాల భద్రతను ఎప్పటికప్పుడు పర్యావేక్షించడానికి  ఈ కమిటీ బంగ్లాదేశ్‌ సైన్యంతో కలిసి పనిచేయనున్నట్టు తెలుస్తోంది.

బంగ్లాదేశ్ లోని పరిస్థితుల దృశ్య... ఇండియాపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది. ఇలాంటి  సవాళ్లను ఎదుర్కోవడంలో భారతదేశం సాధించిన విజయంపై నిపుణులు అంచనా వేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ (IPCS)లో సీనియర్ ఫెలో అయిన అభిజిత్ అయ్యర్ మిత్ర, భారతదేశం యొక్క బలమైన విదేశాంగ విధానం గురించి.. అలాగే దేశానికి నష్టం చేసేవారికి నిధులు రాకుండా నిధులపై కఠినమైన నియంత్రణను సూచించారు.

బంగ్లాదేశ్ లో ఇలాంటి పరిస్థితికి అక్కడ అరాచక శక్తులను బయట  నుంచి పెంచి పోషిస్తున్న దేశాలే కారణం కావడంతో.. ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా  చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని సంస్థలు తమ స్వార్ధం కోసం భారతదేశాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నాయని, అయితే ప్రభుత్వ దృఢమైన వైఖరి వల్ల ఇలాంటివి ఎన్ని వచ్చిన ఎదుర్కో గలమంటున్నారు. అలాంటి సంస్థలకు నిధులు అందకుండా చేస్తే.. వాటి పెరుగుదల ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక బంగ్లాదేశ్ లో హిందువుల జీవనంపై నిపుణులు ప్రమిత్ పాల్ చౌధురి ఆందోళణ వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ లోని హిందువులు 1971 నుండి రాజకీయ ‌- మతపరమైన దాడులను ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో కొంత మంది హిందువులను లక్ష్యంగా చేసుకోవడం.. అక్కడి హిందూవులలో అభద్రతా భావం పెంచుతుందన్నారు. అంతే కాదు 1971 మారణహోమం సమయంలో బెంగాలీలను బంగ్లాదేశ్ లో నిర్మూలించాలన్న ఉద్దేశంతోనే అల్లర్లు జరిగాయని.. దానికోసం పాకిస్తాన్ సైన్యం అనేక రకాల  వ్యూహాలు పన్నిందన్నారు.

ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న  అశాంతి.. మరోసారి అలాంటి పరిస్థితులకు ఆజ్యంపోసిందన్నారు. ఇండియాలో కొన్ని భారీ నిరసనలను ఈ ప్రభుత్వం సులభంగా ఫేస్ చేసింది. రీసెంట్  ఇయర్స్ లో   వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు.. భారీ ఎత్తున జరిగిన అల్లర్లను కూడా భారతదేశ ప్రభుత్వం సులభంగా ఫేస్ చేసింది. ఈ విషయంలో విదేశీ శక్తులు ఎంత ప్రయత్నించినా.. భారత్ ను అస్థిరపరచలేక పోయారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నదని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి మరియు జాతీయ భద్రతకు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని పలువురు అంగీకరిస్తున్నారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్
సీపీఆర్ చేసి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన జవాన్

బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం
బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్ గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్ కు వరించిన అదృష్టం

వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మా
వివేకానందుని సన్నిధిలో ప్రధాని మోదీ ధ్యానం.. అప్పుడు ఉతర భారత్.. ఇప్పుడు దక్షిణ భారత్.. నరేంద్ర మోదీ ప్లాన్ మామూలుగా లేదు..

తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..
తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఎన్నికల ప్రచారం ముగియడం.. కౌంటింగ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈసందర్భంగా తిరుమలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

కోతికి సీపీఆర్ చేసి బ్రతికించిన కానిస్టేబుల్.... కామెంట్ల తో హోరెత్తిస్తున్న నెటిజన్లు..
కళ్ళ ముందు మనుషులు చనిపోతున్నా పట్టించుకోరు కొంత మంది. కాని ఓ కోలి ప్రాణం కాపాడం కోసం సీపీఆర్ చేశాడు ఓ కానిస్టెబుల్. అతను చేసిన పనికి దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

విమానంలో బాంబు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పరుగులు పెట్టిన ప్యాసింజర్.. చివరకు ఏమయ్యిందంటే..?
ఒక విమానం గాలిలో ఎగిరింది.. ఎగిరీ ఎగరగానే ఆ విమానంలో బాంబ్ ఉందంటూ ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తం అయిన టీమ్.. ఎమర్జెన్సీ లాండింగ్ చేసి.. ఫ్యాసింజర్స్ ను దించేశారు.. బాంబ్ ఉందని తెలియగానే ప్రయాణికులు పరుగులు పెట్టారు.. చివరకుఏమయ్యిందంటే..?

రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం... అయినా తగ్గని కాంగ్రెస్ నేత...
కాంగ్రేస్ నేత రాహుల్ గాందీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ సభకు వెళ్లగా.. ఆ స్టేజ్ కుంగి పోయింది. కూలిపోయే స్థితిలో ఉన్న ఆ స్టేజ్ నుంచి భయపడకుండా.. ప్రజలకు అభివాదం చేశారు రాహుల్.